8, డిసెంబర్ 2021, బుధవారం

సమస్య - 3925

9-12-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారము గలిగించు గౌరవమును”
(లేదా...)
“కారము ముఖ్యమైనదని కాంచుము గౌరవమందు వేళలన్”

23 కామెంట్‌లు:


 1. వెగటు పుట్టునట్లు వేషంబు లేలరా
  సాంప్రదాయమదియె సంభవిల్లు
  విధము నడుచు కొనుడు విశ్వమందుననలం
  కారము గలిగించు గౌరవమును.

  రిప్లయితొలగించండి
 2. శ్రీకృష్ణుని సంధి వాక్యముల విని దుర్యోధనునితో ధృతరాష్ట్రుడు :

  ఆటవెలది
  సంధి జేయనెంచ సర్వజ్ణుఁ గృష్ణుని
  నాలకించి మంచి నాచరించి
  రాయబారి పైన రారాజ! చూపు సం
  స్కారము గలిగించు గౌరవమును

  ఉత్పలమాల
  కూరిమి సంధి గూర్చ నిట గోకుల కృష్ణుడు దేవదేవుడున్
  జేర సుయోధనా! మిగుల సేమము గూర్చు సుభాషితమ్ములన్
  వారలనాలకించి తగు పంపకమెంచుచు నాచరించు సం
  స్కారము ముఖ్యమైనదని కాంచుము గౌరవమందు వేళలన్

  రిప్లయితొలగించండి
 3. సజ్జనాళిమెచ్చుశాంతముసౌమ్యత
  కార్యసాధనందుకాగఘనుఁడు
  మనిషిభావమందుమర్యాదగనసహ
  కారముగలిగించుగౌరవమును

  రిప్లయితొలగించండి
 4. సత్య సంధు డగుచు సౌమ్య వర్తనమున
  పరుల మేలు గోరు పర హితుండు
  పేద లందు జూపు ప్రేమ యుతపు సహ
  కారము గలిగించు గౌరవమును

  రిప్లయితొలగించండి
 5. మాతృభాష పయిన మనము చూపెడి మమ
  కారము గలిగించు గౌరవమును
  దేశప్రజల యందు తిరుగు లేకుండగ ,
  దెలిసి మసలుమోయి తెలుగు వాడ

  రిప్లయితొలగించండి
 6. సారకధాచమత్క్రుతినిసాధుపదంబులభావమల్లుచున్
  భారములేనిభాష్యమునభాసురసంగతికావ్యమంతటన్
  పారమునంటుపద్ధతినిపండితులౌననవెల్గునింపుసం
  స్కారముముఖ్యమైనదనికాంచుముగౌరవమందువేళలన్

  రిప్లయితొలగించండి

 7. ఓరి వివర్ణుడా! వినర యుక్తము కాదర గుండు, మేనికిన్
  ధారలు కల్గినట్టి దధి దాల్చుట కూడదు వెఱ్ఱివాడవా?
  మారెను కాలమంచిటుల మారితివేమిర కాంచగానలం
  కారము ముఖ్యమైనదని కాంచుము గౌరవమందు వేళలన్.

  రిప్లయితొలగించండి
 8. రిప్లయిలు
  1. సొమ్ములిచ్చి సంతకమ్ముకునై, తప్పు
   జేయ మనుచు మనసు జెరచ బోవ,
   కొలవు నందు డబ్బు కోరబోనను, తిర
   స్కారము గలిగించు గౌరవమును.

   తొలగించండి
 9. భూరి ధనాఢ్యుడున్ మిగుల భూము
  లు మేడులు యున్నవాడు హం
  కారము లేక దీనులకు కష్టముతో
  బ్రతు కీడ్చువారి కే
  పారక దాన ధర్మములు పాయక
  జేసెడు సజ్జనుండ సం
  క్కారము ముఖ్యమైనదని గాంచుము
  గౌరవ మందువేళలన్.

  రిప్లయితొలగించండి
 10. విద్యవలనగల్గు వినయమ్ము మనిషికి
  వినయమునవివేక మొనరుచుండు
  నిన్నిసుగుణములకు నిరవగు హృదయసం
  స్కారము గలిగించు గౌరవమును

  రిప్లయితొలగించండి
 11. ఉపకరించుకార్యముపకారమనబడు
  సర్వజనులహితముసాధ్యపడగ
  చేసిచూపినట్టి చేతవలన నుప
  కారముగలిగించుగౌరవమును

  రిప్లయితొలగించండి
 12. కలిసి పనులు చేయ కలుగును సౌఖ్యము
  జట్టు కట్టి నంత జయము కూరు
  సర్దుబాటు చేసి సాగినంతన్ సహ
  కారము గలిగించు గౌరవమును

  గొర్రె రాజేందర్
  సిద్దిపేట

  రిప్లయితొలగించండి
 13. వీరబలప్రయోగమున విత్తసమీకరణమ్మునన్ వచ
  స్సారవిదగ్ధతన్ గలదె సత్కృతి? నిర్మలదాననీతిమ
  ద్ధీరగుణోన్నతప్రకటధీయుతసన్నుతసత్యవాగలం
  కారము ముఖ్యమైనదని కాంచుము గౌరవమందు వేళలన్.

  మరో పూరణ

  వైరిభటాళి గూల్చ దగు బాహుబలాఢ్యుడ! గాంధి దీక్షతో
  భారతపారతంత్ర్యమును పారగ జేసె, బ్రిటీష్ ప్రభుత్వధి
  క్కారమడంచె మాన్యుడు, జగమ్మున కీర్తి గడించె శీలసం
  స్కారము ముఖ్యమైనదని కాంచుము గౌరవమందు వేళలన్

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. వైరిభటాళి గూల్చ దగు బాహుబలాఢ్యుడు గాంధి దీక్షతో
   భారతపారతంత్ర్యమును పారగ జేసె, బ్రిటీష్ ప్రభుత్వధి
   క్కారమడంచె మాన్యుడు, జగమ్మున కీర్తి గడించె శీలసం
   స్కారము ముఖ్యమైనదని కాంచుము గౌరవమందు వేళలన్

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 14. కారముప్పు పులుపు కూరలకు రుచి ,యోం
  కారమగును మంత్ర మౌర!పురుష
  కారము,యశము,మమకారము,ప్రేమ,సం
  స్కారము కలిగించు గౌరవమును.

  కారము పుల్పునుప్పు సరిగా సమకూరిన
  కూర మెత్తు రోం
  కారము భక్తితో నుడువ కల్గును పుణ్యము
  చిత్తమందహం
  కారము వీడి భూరి సహకారము
  చేయుము వాక్కులో చమ
  త్కారము ముఖ్యమైనదని గాంచుము
  గౌరవమందు వేళలన్.

  రిప్లయితొలగించండి
 15. క్రూరమనస్కులౌ రిపులు కోరియెసంగిన కారణమ్ముతో
  చేరిన కీర్తి సంపదలు చెన్నును గూర్చునె యెంచి చూడగా
  భారత మాత కెప్పుడును బాసట యై చరియించు చిత్త సం
  స్కారము ముఖ్యమైనదని కాంచుము గౌరవమందు వేళలన్

  రిప్లయితొలగించండి
 16. ఆటవెలది
  పండితుడొకడు తన ప్రజ్ఞ జూపగ దలం
  చి యవధానముకు విచిత్ర వేష
  ధారణ నరుదెంచ తలచిరి జనులు వి
  కారము గలిగించు గౌరవమును.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 17. అవసర మగు వేళ లందు నందించినఁ
  దగిన యట్టి రీతి తప్పక పరి
  పాటిగ నిరతమ్ము తోటి వారికి సహ
  కారము గలిగించు గౌరవమును


  వారక స్వీయ కార్యములఁ బన్నుగఁ జూపుచు భాష యందు సం
  స్కారము సేసి యింపుగ నకారణ దుష్ట నిజోగ్ర రోష సం
  హారము నీ ప్రవర్తనము నందుఁ ద్యజించుట సంతతం బహం
  కారము ముఖ్య మైనదని కాంచుము గౌరవ మందు వేళలన్

  రిప్లయితొలగించండి
 18. నిండు మనము తోడ నేరుగ నిడుసహ
  కారముగలిగించు గౌరవమును
  సాటి మానవులకుసాయమొనరజేయ
  సంతసించు దైవమెంత గానొ

  రిప్లయితొలగించండి
 19. వీరయ! నాదుమాటవిను బ్రీతిని జేసెడునట్టి మేటిస
  త్కారము ముఖ్యమైనదని కాంచుము గౌరవమందు వేళలన్
  భారముగా దలంచకను భావిసుతాళికి దీటుగా దగన్
  వేరగు విద్యనేర్వగను వీలును నిమ్ముముతప్పకుండగన్

  రిప్లయితొలగించండి
 20. భారము దైవమందునిచి బాధ్యతలన్నియు చిత్తశుద్ధితో
  తీరుగ నిర్వహించి చనుదేరునవాంతరముల్ సహింపగన్
  కూరిమి నామతిల్లు ననుకూల్యత, చేగొను కర్జమందు సం
  స్కారము ముఖ్యమైనదని కాంచుము గౌరవమందు వేళలన్

  రిప్లయితొలగించండి