5, డిసెంబర్ 2021, ఆదివారం

సమస్య - 3922

6-12-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముసుగు దొంగలై చరియింత్రు పుడమి జనులు”
(లేదా...)
“ముసుగులు దాల్చు దొంగలటు భూజనులెల్లఁ జరింతు రెల్లెడన్”

37 కామెంట్‌లు:

 1. మసకనుబారెసత్యమునుమాయలమర్మమునేర్చిరేగదా
  వలగోనిపల్కుమాటలనువాస్తవమించుకలేదుత్రవ్వగా
  విసమునుదాల్చిమానసమువిందులుణజేయగసిగ్గులేదులే
  ముసుగులుదాల్చుదోంగలటుభూజనులెల్లజరింతురెల్లడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వలగొని.. విందులు జేయగ' టైపాటు.

   తొలగించండి
 2. అరయధ్రుతరాష్ట్రుకౌగిలియందుచెలిమి
  బందియయ్యెనుకలియుగభారతమున
  మంచిమిత్రుడుకరువయ్యెమాయవలన
  ముసుగుదోంగలైజరియింత్రుపుడమిజనులు

  రిప్లయితొలగించండి

 3. తెలివిగల దర్శకుడొకండు తెలుగు లోన
  గరడిముచ్చుల జీవితగాథ యనుచు
  చిత్రమొక్కటి తీసె నా సినిమ యందు
  ముసుగు దొంగలై చరియింత్రు పుడమి జనులు.

  రిప్లయితొలగించండి

 4. పసగల దర్శకుండొకడు పాటవమెంతయొ చూపి తెన్గులో
  న సినిమతీసె నందు జననాథుడు దుర్మతి కాగ, వానితో
  కసటును పొందిరంచు ప్రతికారము తీర్చుకొనంగ నెంచుచున్
  ముసుగులు దాల్చి దొంగలటు భూజను లెల్లఁ జరింతు రెల్లెడన్.

  రిప్లయితొలగించండి
 5. కొత్త రోగముగ కరోన కుదుపు చుండ
  భయము నొందుచు నుండెడు ప్రజలు సతము
  ముసుగు దొంగలై జరియింత్రు పుడమి జనులు
  దూరముగ నుంద్రు తాము హుషారు నొంద

  రిప్లయితొలగించండి
 6. తేటగీతి
  మాంసమన్నది విషమంచు మఱచి చెలఁగి
  మెక్కిగబ్బిలమ్ముల కుక్కనక్కలాది
  చిక్కి కోవిడుకిల మూసి ముక్కు మూతి
  ముసుగు దొంగలై చరియింత్రు పుడమి జనులు!

  చంపకమాల
  విసమను మాంసమున్ వినక విజ్ఞుల మాటను కప్ప గబ్బిలాల్
  మెసవుచు కోవిడన్ గ్రిమికి మేదిని జిక్కుచు ముక్కుమూతులన్
  దిసలను బేధముల్ మఱచి దేవుని సాక్షిగ మూయ మూతులన్
  ముసుగులు దాల్చు దొంగలటు భూజనులెల్లఁ జరింతు రెల్లెడన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏

   సవరించిన చంపకం :

   చంపకమాల
   విసమను మాంసమున్ వినక విజ్ఞుల మాటను కప్ప గబ్బిలాల్
   మెసవుచు కోవిడన్ గ్రిమికి మేదిని జిక్కుచు ముక్కుమూతులన్
   దిసలను బేధముల్ మఱచి దేవుని సాక్షిగ మూయ వింతగన్
   ముసుగులు దాల్చు దొంగలటు భూజనులెల్లఁ జరింతు రెల్లెడన్!

   తొలగించండి
 7. చెప్పె శ్రీశ్రీ యె నరజాతి గొప్ప తనము
  పిప్పి చేయుచు, పీడించు ప్రియులగు తన
  వారినైన, కాసులకునై ప్రాకులాడి,
  ముసుగు దొంగలై చరియింత్రు పుడమి జనులు

  రిప్లయితొలగించండి
 8. విసముచిమ్ముచు కోవిడు వెతలు గూర్చ
  వసనములునేడు మారెను మసనములుగ
  విస్తరణ నిరోధించంగ విసపు పురుగు
  ముసుగు దొంగలై చరియింత్రు పుడమి జనులు

  రిప్లయితొలగించండి
 9. శత్రు సైన్యంబు తిరిగెడు జాడలెంచ
  గూఢచర్యంబు సల్పుచు కొంతదళము
  ముసుగు దొంగలై చరియింత్రు; పుడమి జనులు
  శాంతి సౌభాగ్యములతోడ సంచరించ

  రిప్లయితొలగించండి
 10. క్రొవ్విడి వెంకట రాజారావు:

  భూ ధృవమ్ము లందంతట పొదలు చుండి
  సతము తుహిన బిందువులదోడ సాగు చలిని
  తట్టుకొను రగ్గులను దాల్చి దారులందు
  ముసుగు దొంగలై జరియింత్రు పుడమి జనులు.

  రిప్లయితొలగించండి
 11. పంటకు కనీస మద్దతు వస్నమును లులి
  బరచి కృషికుల వంచించ పాల క గుమి
  ముసుగు దొంగలై చరియింత్రు ; పుడమి జనులు
  వారి నెదిరించి పోరుట ప్రథమమగును

  రిప్లయితొలగించండి
 12. విసమునుచిమ్మి మానవుల వేసటపెట్టుచు వెక్కిరించుచున్
  మసనములట్లు గీములను మార్చెడు పాడు కరోన యుద్ధతిన్
  వెసనణగించు సాధనము వేరొకటన్నది లేక నిచ్చలున్
  ముసుగులు దాల్చు దొంగలటు భూజనులెల్లఁ జరింతు రెల్లెడన్

  రిప్లయితొలగించండి
 13. తేటగీతి

  కలికి!హేమంత వేళల చలిపులికిని
  త్రస్తులై పోయి,యాపాద మస్తకంబు
  కంబళిని కప్పుకొంచు సుఖంబుగాను
  ముసుగు దొంగలై చరియింత్రు పుడమి జనులు.

  చంపకమాల

  దెసలను మార్గశీర్షమున తీవ్రముగా హిమమెల్ల కప్పగా
  వెసఁజలిమంటఁజేరుదురు వెచ్చదనంబును కోరుచుండియున్
  ముసరెడు చల్లగాలులకు భూరి భయంబును జెంది యక్కటా!
  ముసుగులు దాల్చు దొంగలటు భూజనులెల్ల చరింతురెల్లెడన్.

  రిప్లయితొలగించండి
 14. రిప్లయిలు
  1. విసమును దాచి పైఁ గృతకవేషములన్ ధరియించి నర్మకృత్
   హసనము వెల్వరించి నెఱి నర్మిలి
   జూపుచు, నూటికొక్కరన్
   పొసగదు కాని స్వార్థపరిపూర్ణనిజాకృతి కప్పిపుచ్చుచున్
   ముసుగులు దాల్చు దొంగలటు భూజనులెల్లఁ జరింతు రెల్లెడన్

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
  2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 15. దొసగులు పెట్టి యందరిని దూరుచు నుండు పరాయి దేశమే
  విసమును గ్రక్కు వైరసును విశ్వము నంతయు నంపి నొంచగా
  బుసనిడు పాము రీతిగను పొక్కు నొసంగు కరోన నాపగా
  ముసుగులు దాల్చు దొంగలటు భూజనులెల్లఁ జరింతు రెల్లెడన్

  రిప్లయితొలగించండి
 16. దిగులు తొలఁగించి దరిసేర్చు దిక్కు లేక
  బ్రతుకు తెరువింత కనలేక వంత నంది
  కడుపు దినమెల్లఁ జెలరేఁగి కాలుచుండ
  ముసుగు దొంగలై చరియింత్రు పుడమి జనులు


  దెస నరయంగ లేక యిల దీన జనావలి మున్గెఁ జింతలో
  వెస నిట చిన్ని కీటకము విశ్వము సర్వము నాక్రమింపఁగాఁ
  బస చెడ దర్పహీను లయి ప్రాణ భయమ్మున సంతతమ్మునున్
  ముసుగులు దాల్చు దొంగ లటు భూజను లెల్లఁ జరింతు రెల్లెడన్

  రిప్లయితొలగించండి
 17. చంపబూనుపరిసరాల జాడయందె
  ముసుగు దొంగలై చరియింత్రు,పుడమి జనులు
  వంతు వారిగ కాపలా వైచు కొనుచు
  ముసుగు దొంగల చేష్టలు పొక్కజేయు

  రిప్లయితొలగించండి
 18. విసమును గ్రక్కుచుండుచును వేగము తోడను గీటకంబు రా
  ముసుగులు దాల్చు దొంగలటు భూజనులెల్ల జరింతురెల్లెడన్
  నసువు లనంగ దీపియెగ హా పరికింపగ నేరికైననున్
  ముసుగులు దాల్చజేరదటమోమును గప్పిన సేమమయ్యెడన్

  రిప్లయితొలగించండి
 19. తే.గీ//
  రాత్రివేళల మాన్యులు రాక్షసులుగ
  ముసుగు దొంగలై చరియింత్రు, పుడమి జనులు l
  విశ్వసించియు నిత్యము విసుగుజెంది
  భీతిజెందుచు నిద్రింత్రు భీరులగుచు ll

  రిప్లయితొలగించండి