19, డిసెంబర్ 2021, ఆదివారం

సమస్య - 3936

20-12-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మగువలెల్ల మానిరి ధనుర్మాస పూజ”
(లేదా...)
“మగువల్ పూజలు సేయ మానిరి ధనుర్మాసమ్మునన్ భీతితోన్”

54 కామెంట్‌లు:

BMahalakshmi చెప్పారు...

చల్లనీళులస్నానంబుసరియుకాదు
వల్లమాలినచలిపులిపంచఁజేరె
బ్రహ్మఘడియలమెలకువభంగమయ్యె
మగువలెల్లమానిరిధనుర్మాసపూజ

విరించి చెప్పారు...


సతము రాశుల మార్చుచు సంచరించు
పూర్ణమసుడు కదలితాను పుష్యమందు
మకరరాశిలోనను సంక్యమణము జెంద
మగువలెల్ల మానిరి ధనుర్మాసపూజ.

BMahalakshmi చెప్పారు...

అగుగానర్ధమురాత్రియేనతివకున్యానంబులాప్టాపులో
వగలన్జెందుచువారిజాక్షిఘనతన్భావింపనుద్యోగియై
పగబట్టెన్గదచంద్రుడున్గనగనీపాపంబుసంఘంబుదే
మగువల్పూజలుసేయమానిరిధనుర్మాసమ్మునన్భీతితో

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

కొత్త వేరియెంటు కు జంకి కోమలు లు దమ
గృహములకు పరి మిత మయి కీడ గునని
మగువ లెల్ల మానిరి ధను ర్మాస పూజ
లనిరి వైద్యనిపుణు లి ప్పు డ దియె నిజము !

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
నిత్యముపవాస దీక్షల నీరజాక్షుఁ
గొలతుమన్నను గోవిడు సలుపుచుండ
భుక్తి రోగనిరోధక శక్తిఁ బొంద
మగువలెల్ల మానిరి ధనుర్మాస పూజ


మత్తేభవిక్రీడితము
వగపై తాముపవాసముండఁ దగదన్ వైద్యంపు నాదేశమై
దిగులున్ గూర్చు కరోననడ్డుననుచున్ దీటైన నాహారమున్
మిగులన్ రోగనిరోధకమ్మునకునై మేల్గొంచు నిర్ణిష్ఠమై
మగువల్ పూజలు సేయ మానిరి ధనుర్మాసమ్మునన్ భీతితోన్

విరించి చెప్పారు...



జగతిన్ గోవిడు వ్యాప్తిచెందెనని వ్యాసాలెన్నియో కాంచుచున్
వగచేకాలము దాపురింప జనులే ప్రాణాలు కాపాడు కో
వగ సామాజిక దూరమే వలయునన్ వార్తల్ ప్రసారంబవన్
మగువల్ పూజలు మానిరి ధనుర్మాసమ్మునన్ భీతితోన్.

పెనగలూరు శివ ప్రసాదరాజు చెప్పారు...

చంటి గాడుబుట్టె,పెరిగె నింటి వెలుగు
నంటు ముట్టులనిరి పొరుగాడవారు
సంప్రదాయము పాటించి సదరు గృహపు
మగువలెల్ల మానిరి ధనుర్మాస పూజ.

sitharamayya solasa చెప్పారు...

మొన్నటి వరకు కార్తీకపు దివియలను
తులసి ముందర వెలిగించి , నెల ముగియగ
మగువలెల్ల మానిరి ; ధనుర్మాస పూజ
మొదలిడెదరు భక్తిగ విష్ణుమూర్తి పయిన

M.B.G.TILAK చెప్పారు...

సంధ్యవేళల చలిలోన స్నానమాడి
పూజ సల్పెడు యలవాటు పూజ్యమాయె
ఇంటి బాధ్యతల్ కొలువులు రెంటితోడ
మగువలెల్ల మానిరి ధనుర్మాస పూజ

KATAKAM చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

చెడ్డదగు కరోనయె మార్పుచెంది నిపుడు
హానికర యొమిక్రానయి యడరు నంత
కూడు కీడుకు భయమంది కోవెలందు
మగువలెల్ల మానిరి ధనుర్మాస పూజ.

Raja Rao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

మిగులన్ కీడొనరించి లోకమున కడ్మిన్ జూపి సోమించుచున్
తెగులై ప్రబ్బినదా కరోన తనదౌ తీరున్ యొమిక్రాను యై
నిగిడించన్నలరారు నాపదల నన్నింటిన్ మదిన్ దల్చుచున్
మగువల్ పూజలు సేయ మానిరి ధనుర్మాసమ్మునన్ భీతితోన్.

Raja Rao చెప్పారు...

కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

మహిళలంత ఘనముగ నీ మాస మందు
పాశురమ్ముల నింపుగ పాడుచుంద్రు
చెడు కరోన గూర్చెడి బాధ చేత నిపుడు
మగువ లెల్ల మానిరి ధనుర్మాస పూజ.

Raja Rao చెప్పారు...

కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

సొగసౌనట్లుగ నిర్వహింతు రిలలో శోభాయమానంబుగా
భగవథ్యానము ప్రీతితో తరుణు లింపారంగ నీమాసమున్
నెగులున్ గూర్చు కరోనయే నడరగా నిస్సత్తువే క్రమ్మగా
మగువల్ పూజలుసేయ మానిరి ధనుర్మాసమ్మునన్ భీతితోన్.

కంజర్ల రామాచార్య. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

మాసములకెల్ల రారాజు మార్గశిరము
మగువలొనరించెదరు ధనుర్మాస వ్రతము
'కోవిడాసురు' విలయమ్ము కోలుమసఁగ
మగువలెల్ల మానిరి ధనుర్మాస పూజ

కంజర్ల రామాచార్య. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కానన్+అనలమ్ము' అన్నపుడు యడాగమం రాదు. 'వచ్చిందనన్'.. 'ఒచ్చిందనన్' అనరాదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చెంది యిపుడు'అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Rama Murthy Duvvuri చెప్పారు...

గడచి పోయిన యంతనే కార్తికంబు
దీపదానోపవాసాల దీక్షలింక
మగువ లెల్ల మానిరి ,ధనుర్మాస పూజ
లందు లగ్నమైరి హరినె యాత్మ నిలిపి.

అగుదున్ మార్గశిరంబు మాసముల నేనంచున్
నరుంగూర్చియున్
భగవద్గీతను జెప్పె కృష్ణుఁడని సద్భక్తిన్
శుచి స్నాతులై
మగువల్ పూజలు సేయ, మానిరి ధనుర్మాసంబునన్
భీతితోన్
మగవారున్ పిశితాశనంబు మరియున్
మద్యంబు సేవించుటల్.

A.Satyanarayana Reddy చెప్పారు...

జగతిన్ గ్రమ్మ కరోన వేగముగ విశ్వాసమ్ముతో పూజ లే
ము గుడిన్ చేయగ జాలమంచు మది సంపూర్ణమ్ముగా నెంచుచున్
తగదంచున్ కమలాక్షు దర్శనము నిర్ధారించగా పెద్దలున్
మగువల్ పూజలు సేయ మానిరి ధనుర్మాసమ్మునన్ భీతితోన్

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా🙏

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

జగతిన్ భీతియువాయు వేగమున
నన్ సర్వత్ర వ్యాపించె గా
నగు రానట్టి కరోన వైరసతిగా
నాశంబు గావించెడిన్
పగలున్ రాత్రులు మానవాళి
యసువుల్ వర్జించిరిద్ధాత్రిలో
మగువల్ పూజలు సేయ మానిరి
ధనుర్మాసమ్మునన్ భీతితో

subbarao చెప్పారు...

రాష్ట్రమంతటను గరోన రహిని మించ
మగువ లెల్ల మానిరి ధనుర్మాసపూజ
బ్రతికి యుండిన దినవచ్చు బలుసు చిగురు
గృహము దాటక యుంటయే క్షేమమనుచు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

నిష్ఠ సెలగంగఁ బూజించి నిత్య మత్య
ధిక మయిన భక్తితో దేవ దేవుని మఱి
యంత మయిన నా మాసము సంతసమున
మగువ లెల్ల మానిరి ధనుర్మాస పూజ


మగఁడే నారికి గొప్ప దైవ మగుఁ దా మాన్యుండు పూజార్హుఁడే
మగనిం ద్రోసి ముకుందుఁడే తమను సంపాదింప నేతెంచినం
దెగు నంచున్ భయ మంది డెందమునఁ బాతివ్రత్య మా శంకతో
మగువల్ పూజలు సేయ మానిరి ధనుర్మాసమ్మునన్ భీతితోన్

KATAKAM చెప్పారు...

ధన్యవాదములార్యా....
సరిచేసినాను
ఉత్పలమాల:
గగనమ్మందున వృశ్చికమ్ముమొదలున్ కాలోరగమ్ముందనన్
దిగులుల్హెచ్చగ వారివీరినడగన్ తీరొక్క తీర్జెప్పిరే
పొగకానన్ననలమ్మదటంచు భయమున్ పోగాల మేవచ్చెనా?
“మగువల్ పూజలు సేయ మానిరి ధనుర్మాసమ్మునన్ భీతితోన్”
--కటకం వేంకటరామశర్మ.

subbarao చెప్పారు...

జగతిన్ బాఱగ యాకరోన రుజ యాశాంతంబు దీవ్రంబుగా
మగువల్ పూజలు సేయమానిరి ధనుర్మాసమ్మునన్ భీతితోన్
చిగురుల్ భక్షణ జేసియైననిక యీజీవంబు నిల్పందగున్
నగజా!మమ్ముల జూడుమాదయను నాయక్ష్మంబు రాకుండగన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

Aravalli Sreedevi చెప్పారు...

చలి పులిగ మారి వణుకుచు సైపలేక
నిత్య పూజలు సలుపగా నృత్యగతులె
భక్తి మంత్రము చదువగా శక్తిలేక
మగువ లెల్ల మానిరి ధనుర్మాస పూజ!!

Aravalli Sreedevi చెప్పారు...

పగవైరంబుల పూనినట్లు చలి ప్రాభవమ్ము జూపంగనే
దిగులన్ బెంచ
,గచేతనత్వములే దీర్గంబులై క్రుంగగా
పగలున్ రేయని దోచవే మదిని ఏ ప్రాభాతముల్ దెల్వకన్
మగువల్ పూజ సేయ మానిరి ధనుర్మాసమ్మునన్ భీతితోన్ !!

Surya చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Surya చెప్పారు...

రగులన్ కోవిడు దేశమందు జనులున్ లక్షింపకన్ ముందుగా
తెగువన్ జూపిన గాని బట్టెనకటా తీవ్రంబుగా జాడ్యమై
తగు మార్గంబికనింటనుండుడనగా దర్శింపకన్ కోవెలన్
మగువల్ పూజలు సేయ మానిరి ధనుర్మాసమ్మునన్ భీతితోన్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

మాసములయందుశ్రేష్టముమార్గశిరమ
టంచు కొందరు పూజలు నాచరించ
ఈచలినితాళలేమంచు నింక వృద్ధ
మగువలెల్ల మానిరి ధనుర్మాస పూజ”*

పాడురోగము జగతిని వచ్చి చేర
పూజలనజనులచ్చట భూరి గాను
చేరుదురటంచు నెంచుచు చిత్తమందు
మగువ లెల్ల మానిరి ధనుర్మాస పూజ