3, డిసెంబర్ 2021, శుక్రవారం

సమస్య - 3920

 4-12-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పవలు గడచెను గ్రుంకఁడు భానుమూర్తి”
(లేదా...)
“పవలు గతించిపోయినను భానుఁడు గ్రుంకఁడు పశ్చిమంబునన్”

(జంధ్యాల సుబ్బలక్ష్మి గారికి ధన్యవాదాలతో...)

41 కామెంట్‌లు:

  1. వెలిగెసాహితీజగతినివేయివెలుగు
    సిరియువెన్నెలపాటగసీతరామ
    సూర్యచంద్రులుతానైనశోభతోడ
    పవలుగడచెనుగ్రుంకడుభానుమూర్తి

    రిప్లయితొలగించండి
  2. ప్రస్పుటమ్ముగ వినవచ్చె బాలుగళము
    పరవశమ్మున నేపారు పాటతోడ
    భానుమూర్తిగ వెలుగొందు బాలుడతడు
    పవలు గడచెను గ్రుంకఁడు భానుమూర్తి

    రిప్లయితొలగించండి
  3. మధుర గీతాలు పాడిన మాన్య వరుడు
    ఘంటసాల యె రవి వోలె గగన మెక్కె
    పవలు గడచెను గ్రుంకడు భాను మూర్తి
    ప్రజల హృదయాల లో నిల్చి భాస మందె

    రిప్లయితొలగించండి

  4. సాటిలేని వీరులనెల్ల సంగరమున
    ముప్పు తిప్పలు పెట్టెడిన్ ముదుక గాంచి
    ఫల్గునుడు మురభిదునితో పలికెనిట్లు
    పవలు గడిచెను గ్రుంకడు భానుమూర్తి.

    రిప్లయితొలగించండి

  5. కవిదలమందు జీనుడగు గాంగుడు కౌరవ దండనాథుడౌ
    చు వెలిగి శత్రుసేనలకు చుక్కల జూపెడు పాళమందునన్
    ప్రవయుని విక్రమమ్ము గని పాండవ మధ్యము డిట్లు పల్కెనే
    పవలు గతించిపోయినను భానుఁడు గ్రుంకడు పశ్చిమంబునన్.

    రిప్లయితొలగించండి
  6. కవనముఁజేసెగానతఁడుఘాటునసంఘములేచిచూడగా
    పవనమువీచెనయ్యెడనుభావములందుననవ్యరీతులన్
    సవనమునాగలేదుగదసంగమమందినసూర్యుడంబుధిన్
    పవలుగతించిపోయిననుభానుఁడుగ్రుంకఁడుపశ్చిమంబునన్

    రిప్లయితొలగించండి
  7. తేటగీతి

    క్రమ్ము కొన్నవి మేఘాలు గగనమందు
    చీకటిగ మారె మిత్రమ! లోకమెల్ల
    నేను గడియారమును చూచి నాను,సగము
    పవలు గడచెను గ్రుంకడు భానుమూర్తి

    చంపకమాల

    కవివర!రేయియుంబవలు కాంతుల నీనుచు సోమ సూర్యులున్
    దివి నియమంబుఁదప్పక యదేపని క్రుమ్మఱు చుంద్రు,
    తూర్పునన్
    పవలు గతించి పోయినను భానుడు గ్రుంకడు,పశ్చిమంబునన్
    పవలు గతించ భాస్కరుఁడు వ్రాలుట గాంచమె యబ్ధి లోనికిన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆహా! ఎంత కాలానికి అవధాని వర్యుల పూరణలు! ధన్యుడను.
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. నమస్తే శంకరయ్య గారు! ధన్యవాదములు
      నేను అవధానిని కాను .సావధానముగా వ్రాయడానికి
      ప్రయత్నిస్తాను మీ అభిమానానికి ధన్యుడను.

      తొలగించండి
  8. కవుల సంగమ మందున గవిత లువిన
    బవలు గడచెను , గ్రుంకఁడు భానుమూర్తి
    యింకను పడమర దెసన నేల యిటుల ?
    సమయమిక దాటె హాయిగ శయనమొంద

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    భరత ఖండంబు నందున బాగగు విధి
    పవలు గడచెను, గ్రుంకడు భానుమూర్తి
    పశ్చిమ దిశలో తిరముగ పాదుకొనిన
    అమెరికాది దేశమ్ముల నరసి జూడ.

    రిప్లయితొలగించండి
  10. కె.వి.యస్. లక్ష్మి:

    పాట లెన్నియొ వ్రాసెను పసను గలవి
    ఘనుడు వేటూరి సాహితీ గరిమ జూపి
    చిత్రసీమను పాలించె స్నిగ్ధమమర
    పవలు గడచెను గ్రుంకడు భానుమూర్తి.

    రిప్లయితొలగించండి
  11. మండు వేసవి కాలము,మహిని గాల్చ
    పవలు గడచెను, గ్రుంకఁడు భానుమూర్తి
    యుక్క పోతకు నొడలంత యుడికి పోయె
    వేల్పుబోనము చల్లగ వెలగ రాడు.

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    కూల్తునని సైంధవున్ బ్రొద్దు క్రుంకు లోపు
    కదలు కవ్వడికై దాచ కౌరవులట
    హరి సుదర్శనమంపియు నడ్డు కొనఁగఁ
    బవలు గడచెను గ్రుంకఁడు భానుమూర్తి!

    చంపకమాల
    దివమున సూర్యుడుండగనె తేఱుతు సైంధవు నన్న క్రీడికై
    జవమున దాచ కౌరవులు సర్వమెరింగిన పంకజాక్షుడున్
    జివరికి చక్రమున్ బనిపి చిక్కని సూర్యుని కాంతినడ్డగన్
    పవలు గతించిపోయినను భానుఁడు గ్రుంకఁడు పశ్చిమంబునన్!

    రిప్లయితొలగించండి
  13. అవిరళ తేజరూపమున నర్కుని వోలె నిరంతరంబుగన్,
    దివములు రాత్రులన్ ఘన
    యతీంద్రుసుహృత్కమలాకరంబునన్
    శివతరమై ఫలించి కృపసేయగ భక్తఫలప్రదాయుడే
    పవలు గతించిపోయినను భానుఁడు గ్రుంకఁడు పశ్చిమంబునన్.

    రిప్లయితొలగించండి
  14. తే.గీ:మూడు సంధ్యల నర్ఘ్యమ్ము ముగిసె నాకు
    ధ్యానమున నాకు నెంతయో హాయి కలిగె
    “పవలు గడచెను గ్రుంకఁడు భానుమూర్తి”
    నాదు భావాంబరమున నందముల నొలికి
    (మూడు పూటల సంధ్యావందనం లో సూర్యుణ్ని ధ్యానిస్తాడు.అలా ధ్యానించాక రాత్రి ఐనప్పటికి ఇంకా ఆ రూపం భావం లో చెదరదు.)

    రిప్లయితొలగించండి
  15. ప్రశ్నోత్తరి
    భర్త-ఎవరెవ రెట్టు లుండిరని యిప్పుడె బాబుకు ఫోను చేయవే!
    భార్య-పవలున చేతులెం డిపుడు బాబుకు నిద్దుర వచ్చు గాదొకో
    భర్త-ఇవియును నేరవేమి!శమియింపగ సూర్యుడు భారతమ్మునన్
    పవలు గతించి పోయినను భానుడు గ్రుంకడు పశ్చిమమ్మునన్

    రిప్లయితొలగించండి
  16. దీర్ఘ రోగము తోడను జేర వైద్య
    శాలకచ్చట శృతిమించ శర్మ యనెను
    పవలు గడచెను గ్రుంకడు భానుమూర్తి
    యెపుడు వ్రాసెనో యాబ్రహ్మ యెవరి కెఱుక

    రిప్లయితొలగించండి
  17. అలసి దినమంత పనిసేసి చెలఁగి యంత
    నింటి కరుదెంచి తిని యన్న మింత యింక
    భద్ర రీతిని గాఢంపు నిద్ర లోనఁ
    బవలు గడచెను గ్రుంకఁడు భానుమూర్తి


    ఛవి మయ తప్త కాంచన లసద్రథ సూతుఁ డనూరుఁడుండఁగా
    జవ హరి సప్తయుక్తమున సంభ్రమ మొప్పఁగ సత్వరమ్ముగా
    రవి సన నిర్విరామముగ రమ్యపుఁ బ్రాక్తటి భారతమ్మునం
    బవలు గతించి పోయినను భానుఁడు గ్రుంకఁడు పశ్చిమంబునన్

    రిప్లయితొలగించండి
  18. దివమున దిర్గు భాస్కరుడు తీక్ష్ణపు కాంతినిసంచరించుచున్
    బవలు గతించి పోయినను భానుడు గ్రుంకడు పశ్చిమంబునన్
    నవగతమయ్యె జెప్పుదు నహస్కరుడచ్చట యస్తమించకన్
    బవలును రాత్రి కాంతినట భాసిలునట్లుగజేయునెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పశ్చిమంబునన్+అవగతము = పశ్చిమంబున నవగతము..' అవుతుంది. 'అస్తమించక' కళ, ద్రుతాంతం కాదు.

      తొలగించండి
  19. చంపగ ప్రతినచేసెను సవ్యసాచి
    దివముముగియులోపలనుచుదీక్షబూన
    దాగి సైంధవుండు మదిని దలచెతాను
    “పవలు గడచెను గ్రుంకఁడు భానుమూర్తి


    వరుడు తలచెనిటుమది వివాహ మయ్యె
    పంతులిడినట్టిసమయమ్మువచ్చువరకు
    కలవగాలేను వధువును ఖచితమిదియు
    “పవలు గడచెను గ్రుంకఁడు భానుమూర్తి”

    రిప్లయితొలగించండి