6, మార్చి 2022, ఆదివారం

సమస్య - 4012

7-3-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లోకులకు సత్కవిత్వము లోకువ గద”
(లేదా...)
“లోకులు పిచ్చి వ్రాఁతలని లోకువ సేయరె సత్కవిత్వమున్”

34 కామెంట్‌లు:

విరించి చెప్పారు...


సంస్కృతాంధ్ర సమ్మిళితమౌ సాహితీ కృ
తులవి పండిత వర్గమ్మె తెలచ నేమి
వ్యాకరణమన్ననెఱుగని పాల్లకులగు
లోకులకు సత్కవిత్వము లోకువ గద.

sitharamayya solasa చెప్పారు...

సంధి, యతి ప్రాస లొప్పగ జనుల కేమి
యర్థము దెలియ నట్లుగ నాలిఖించు
చుండ , దానికి ఫలితముచొప్ప డంగ
లోకులకు సత్కవిత్వము లోకువ గద

BMahalakshmi చెప్పారు...

కూడుగుడ్డకుకొఱగాదుకూతమిగులు
వాస్తవంబునుగనలేకవనరుచుండు
వంతలేరీతిదీరునువాక్కుతోడ
లోకులకుసత్కవిత్వములోకువగద

BMahalakshmi చెప్పారు...

పేకలమేడలట్టులనుపేర్చినశబ్దమహేంద్రజాలమున్
ఆకలికేకలన్గలిపియాగినిసేయనహోయనంగనా
లోకనజేయకుందురుగలోలతభావసమున్నతిన్మదిన్
లోకులుపిచ్చివ్రాతలనిలోకువసేయరెసత్కవిత్వమున్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

ఆధునికతయే ముఖ్య మం చ నెడు వారు
నేటి కవితల చదువంగ నీస డించు
లోకులకు సత్కవిత్వ ము లోకువ గద
యనుచు కవి వరుడొకడు దా నార్తి కుందె

sarada చెప్పారు...

తేటగీతి
కావ్యములన కొందరు తమ కవితలందు
మలినశృంగార వర్ణన మాను జేయ
దలచి రంత జనావళి తప్పు గానె,
లోకులకు సత్కవిత్వము లోకువ గద.

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.

విరించి చెప్పారు...


ప్రాకృతమందు నగ్రసర పండితశ్రేణి రచించినట్టి యా

ప్రాకటమైన కావ్యముల బ్రాజ్ఞులు భేషని ప్రస్తుతించినన్

వ్యాకరణమ్మెఱుంగని యవ్యక్తులు పామరులైన యజ్ఞులౌ

లోకులు పిచ్చివ్రాఁతలని లోకువ జేసిరి సత్కవిత్వమున్.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
మంచిదన్నది మదిలోనఁ గొంచెమైనఁ
బుట్టినప్పటినుంచియు ముదము కాని
దోషమా దేవునికెరుక! దుర్మతులగు
లోకులకు సత్కవిత్వము లోకువ గద!

ఉత్పలమాల
శ్రీకరుఁ బంకజాక్షుని, విశేష కవిత్వ సుధాస్రవమ్మునన్
బ్రాకట భక్తవత్సలత, రాక్షస సంహరణాదిలీలలన్
జేకొని పోతనార్యుడు రచింపఁగ భాగవతమ్ము ద్రష్టలౌ
లోకులు పిచ్చి వ్రాఁతలని లోకువ సేయరె సత్కవిత్వమున్!

( ద్రష్టలైన లోకులు భాగవత సత్కవిత్వమును లోకువ సేయరను భావము)

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

ఈ కలి కాలమందు గవు లెల్ల కవిత్వము
వ్రాయబూనియున్
ప్రాకటమొప్పగా వచన భావ కవిత్వము
గొప్పదందు రీ
శ్రీకర హృద్య పద్యముల చెల్వమెరుంగని
మందబుద్ధలౌ
లోకులు పిచ్చి వ్రాతలని లోకవ చేయరె
సత్కవిత్వమున్

M.B.G.TILAK చెప్పారు...

నవరసయుతము నాలోచనాభరితము
ననుభవైకవేద్యము గదా నవకవనము
మంచి చెడులకు భేదము లెంచలేని
లోకులకు సత్కవిత్వము లోకువ గద

Yajnesh చెప్పారు...

కైకొని ధర్మరక్షణము గావ్యము లెన్నియొ వెల్వరించ, న
స్తోకచరిత్రులౌ ఋషులు; సూక్ష్మ మెఱుంగని యట్టి ప్రాణులున్,
దీకుల మున్గి యెల్లెడల దీప్తుల గానని మందబుద్ధులౌ
లోకులు పిచ్చి వ్రాఁతలని లోకువ సేయరె సత్కవిత్వమున్?

తీకులు -బంధనములు, తీపులు

Rama murthy చెప్పారు...

పండితుని కష్టమెఱుగును పండితుండు
బిడ్డ నొప్పు లెఱుంగునె? గొడ్డురాలు
విద్య నేర్వక తిరిగెడు వెంగళులగు
*లోకులకు సత్కవిత్వము లోకువగద.*

శ్రీకరమౌ చమత్కృతులు,శ్లేషలు,శయ్యలు ప్రాసరీతులున్
పాకములౌర!ఛందములు వ్యాకరణాదులెఱుంగు పాండితీ
లోకము మెచ్చు సత్కవితలోని గుణంబులు ,వెంగళప్పలౌ
*లోకులు పిచ్చివ్రాతలని లోకువ సేయరె సత్కవిత్వమున్.*

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని ప్రశస్తమైన పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మంచి పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

M.B.G.TILAK చెప్పారు...

🙏

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

సాహితీ విభవమ్మునాస్వాదనమ్ము
సలుపజాలక రోయుచు సత్కవులను
కించపరచెదరేలనో క్షితిని జూడ
లోకులకు సత్కవిత్వము లోకువ గద

అపర్ణ గాడేపల్లి చెప్పారు...

తే.గీ.
మూసలోబడి బ్రతుకు వ్యామోహమందు
కొట్టుమిట్టాడు నంత నగోచరమగు
గ్రంథ రచనలఁ జూడక గర్వపడెడు
*లోకులకు సత్కవిత్వము లోకువ గద*

ఉ.మా.
పాకము నొందినట్టి పరిపక్వత జెందిన గ్రంథమాలికల్
వేకువ కాంతులన్బరచి వృద్ధియె శోభిలు బోధసేయగన్
చీకటి దిక్కు నుండగను, జిక్కుచు మాయకు మోహమందునన్
*లోకులు పిచ్చి వ్రాఁతలని లోకువ సేయరె సత్కవిత్వమున్*

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

subbarao చెప్పారు...

లోకులకు సత్కవిత్వము లోకువగద
కవిత సారము దెలియక కపట మతిని
పలుకు చున్నది రమ,కవిత్వ మరయగను
లోకువ యెపుడు గాదుగ లోకులకిల

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

శోకమునుండిపుట్టెనొక శ్లోకము భావనజేసి చూడనా
శ్లోకమునాందియైనదొక లుబ్దకునిన్ మహితాత్ముజేయ నీ
లోకమునందు కావ్యములలోని రసాంబుధి నోలలాడకే
లోకులు పిచ్చి వ్రాఁతలని లోకువ సేయరె సత్కవిత్వమున్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

శబ్దముల భావ మెఱుఁగక చాలు నంచు
నర్థము గ్రహింప సుంతయు నలవి గాక
పామర జన సందోహ నివాస మందు
లోకులకు సత్కవిత్వము లోకువ గద


శాక విహీన పక్వ పల సన్నిభ దుష్కర నారికేళ పా
కైక కఠోర శబ్ద సుదురాప నిగూఢ నిజార్థ సంగ్ర హా
ర్థాకలన వ్యధైక భరి తాత్ములఁ గూడిన యట్టి భూమిలో
లోకులు పిచ్చి వ్రాఁతలని లోకువ సేయరె సత్కవిత్వమున్

subbarao చెప్పారు...

లోకులు పిచ్చివ్రాతలని లోకువ సేయరె సత్కవిత్వమున్
లోకులు గాకులే యనెడు లోకపు మాటను నమ్మబల్కిరే
లోకువ జేయగా దగదు,లోకులు నేర్వరు దాని సారమున్
శ్రీకరమయ్య!వ్రాయునెడ చెల్వగు,సంపదలిచ్చు నెప్పుడున్

BMahalakshmi చెప్పారు...

ధన్యవాదములండిగురువుగారు

Sistla Sharma చెప్పారు...

ఆకలిగొన్ననే రుచిగ
నందెద రందరు భోజనమ్మిలన్
చీకటి దాట నోపగను
చేకొను దీపము వెల్గునందగన్
ప్రాకట భావమున్ గన వి
భాత కవిత్వము గోరు .... లేనిచో
లోకులు పిచ్చి వ్రాఁతలని
లోకువ సేయరె సత్కవిత్వమున్!