1, జులై 2022, శుక్రవారం

సమస్య - 4123

2-7-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్”
(లేదా...)
“భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్”

23 కామెంట్‌లు:

 1. కర్తయు కర్మయు క్రియయును
  భర్తయె గద భార్య కెపుడు పరికింపంగన్
  భర్తకుఁద్రాగుట గలిగిన
  భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్

  రిప్లయితొలగించండి
 2. కర్తగసృష్టికిశివుటును
  వర్తించుచువరములెల్లవడ్డింపంగా
  వర్తనరక్కసుజంపగ
  భర్తయెభారమ్ముగాదెభార్యకునెపుడున్

  రిప్లయితొలగించండి
 3. కందం
  పూర్తిగ సంపాదనతో
  వర్తనమున సద్గణుఁడన ప్రతిపనిలోఁ దా
  కర్తృత్వము నెఱుపు దనుక
  భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్!

  ఉత్పలమాల
  పూర్తిగ బాధ్యతన్ మఱచి పోకిరి వాడయి పేక త్రాగుడుల్
  నర్తనమందునన్ జెలఁగ నాలుగు రూకలునైన రాబడుల్
  ధూర్తుడనంగ తేక యిలు దోచుచు నల్గురు జూచి నవ్వఁగన్
  భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్

  రిప్లయితొలగించండి
 4. ధూర్తుడు త్రాగుబోతు కడు దుర్జన మైత్రిని
  సేయువాడు నే
  మూర్తిని నమ్మనట్టి యతి మూర్ఖుడు
  మిక్కిలి బాధ వెట్టుచున్
  బూర్తిగ కల్లు సారకయి పుస్తె నగల్ తెగ
  నమ్మునట్టి యా
  భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయునేప్పడున్

  రిప్లయితొలగించండి
 5. ధూర్తుఁడు,జూదరి,కడు దు
  ర్వర్తనుఁడై తిరుగుచుండి పవలును రేలున్
  కర్తవ్యము యోచించని
  *భర్తయె భారమ్ము గాదె భార్యకు నెపుడున్.*

  వర్తిలు దుష్ట సంగతుల,వాదములాడుచునుండు,విత్తముం
  బూర్తిగ ఖర్చు సేయు,తలపోయడు బిడ్డలఁగూర్చి యౌర!దు
  ష్కీర్తిని మూటఁగట్టుకొని చిక్కులలోఁబడుచుండునట్టి యా
  *భర్తయె భారమై సతిని బాధలకుంగురిసేయు నెప్పుడున్.
  ------------దువ్వూరి రామమూర్తి.

  రిప్లయితొలగించండి
 6. కర్తయు కర్మయు తానగు
  భర్తయె వ్యసనములజిక్కి పాపాత్ముండై
  పూర్తిగ కష్టమ్ములిడిన
  భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్

  రిప్లయితొలగించండి
 7. వర్తిలెజానకీసతియుబాయకరామునిసద్గుణంబులన్
  కర్తగనాథుడంతటనుకానలయందునకాపురంబనెన్
  నర్తనమీవిధంబహహనారికిదైవమువ్రాసిపెట్టెనే
  భర్తయెభారమైసతినిబాధలకున్గురిసేయునెప్పుడున్

  రిప్లయితొలగించండి
 8. భర్తలు ద్రాగుబోతు లయి బాధ్యత లేవియు సక్రమంబు గా
  వర్తిలు నట్లు జేయకను భారము నంతయు భార్య పైననే
  బూర్తిగ వేయు చుండుచును బోకిరి చేష్టల నోల లాడుచున్
  భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్

  రిప్లయితొలగించండి
 9. భర్తయనుమాటకర్థము
  గుర్తెరుగక మసలుకొనెడు కూళునివలెఁదా
  వర్తిలు చుండగ నికనా
  భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్

  రిప్లయితొలగించండి
 10. భర్తయనంగ భార్యయెడ బాధ్యతబూని నిరత్యయమ్ముగా
  వర్తిలి యామె సౌఖ్యమును వర్ధిలజూచెదడట్లు గాక తా
  ధూర్తునివోలె నిర్దయగఁ దొయ్యలి నారడి వెట్టుచుండనా
  భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్

  రిప్లయితొలగించండి
 11. ధూర్తుల సహవాసము తో
  కర్తవ్యము విస్మరించి కా పురుషుండై
  వర్తన గల్గిన వాడగు
  భర్త యె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్

  రిప్లయితొలగించండి
 12. వర్తనమున నేమియు పరి
  వర్తనమును జూపకుండి పరివా రముపై
  కర్తవ్యము విడనాడెడు
  భర్తయె భారమ్ము గాఁదె భార్యకు నెపుడున్

  రిప్లయితొలగించండి
 13. కర్తవ్యమ్మునె సలుపుచు
  కర్తవ్యముగ నింటి కార్యములు సదా
  భర్తీలుంచక చేసెడి
  భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్

  రిప్లయితొలగించండి

 14. గర్తయె మురియును గద స
  త్కీర్తిని గలిగిన సుమతియె గేస్తుండైనన్
  ధూర్తుడు ధాత్రుడు ఖలుడగు
  భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్.


  కీర్తి విరాజితుండు తన గేస్తుడటంచు జనాళి మెచ్చినన్
  గర్తయె పొంగు వాస్తవము, కాసులె ముఖ్యమటంచు మూఢుడై
  ధూర్తులసామరస్యమున తొత్తులగూడు సురాపుడైనయా
  భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్.

  రిప్లయితొలగించండి
 15. కందం

  కార్తాంతికుడై మదిగని
  కర్తవ్యమెఱగుచు చక్కగా కనుసనలన్
  నర్తన చేయక మసలెడు
  భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్

  (కార్తాంతికుడు:జ్యోతిష్కుడు)

  రిప్లయితొలగించండి
 16. పూర్తిగ నిల్పిమానసము పూరణముల్ బొనరించి నిష్ఠతో
  కీర్తినిఁ బొందుచుండగ స్వకీయపుఁ బ్రజ్ఞ రచించు కైతలన్
  ధూర్త మనమ్మసూయఁ గొన, దూరుచు తప్పుల నెత్తి చూపుచున్
  భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్

  రిప్లయితొలగించండి
 17. కందం
  కర్తయు కర్మయు తానై
  వర్తించెడి సతికి పతియు వాదోడవకన్
  ధూర్తుం డై నడిచెడి, సతి
  భర్తయె భారమ్ము గాదె భార్యకు నెపుడున్
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 18. బల్లూరి ఉమాదేవి
  ధూర్తుల సావాసముతో
  కర్తవ్యము మరచి సతము కానక మంచిన్
  వర్తించుచు త్రాగి తిరుగు
  భర్తయె భారమ్ముగాదె భార్యల కెపుడున్


  కర్తయు తాను చేయదగు కార్యము లన్నియు మాని యెప్పుడున్
  ధూర్తులచేరి త్రాగుచును దూరుచు నెల్లర నింటకూళుడై
  పూర్తిగమారిపోవగను బుద్ధిని చెప్పగనాలకించకన్
  భర్తయె భారమై సతినిబాధలకున్ గురిసేయు నెప్పుడున్

  రిప్లయితొలగించండి
 19. స్ఫూర్తియె జగతికి నార్యా
  వర్తం బెందుండును నిజ భర్త నిరతమున్
  వర్తిల్లుచు రక్షకునిగ
  భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్

  [కాఁడె = కాఁడు గదా]


  వర్తన మందు రక్కసుని భంగిఁ జెలంగుచు సంతతమ్మునున్
  ధూర్తుల వెన్నుఁ గాచుచు నధోగతి పాలొనరించి రుద్రుఁడై
  యార్తి నొసంగి భూ ప్రజకు నంత మెఱుంగని రీతిఁ గ్రూర భూ
  భర్తయె భారమై సతిని బాధలకున్ గురి సేయు నెప్పుడున్

  [సతి = భూనాథుని సతి, భూదేవి]

  రిప్లయితొలగించండి
 20. నర్తన జేయుచును పరమ
  నార్తిగ బాధ్యత నెరింగి నానా విధమున్
  కర్తుత్వము నెరిపెడిని సు
  భర్తయె భారమ్మ గాడె, భార్యకు నెపుడున్

  రిప్లయితొలగించండి
 21. కర్తగ నుండ భయముతో
  వర్తిలుచు కలల జలధిని బ్రతికెడి వాడౌ
  కర్తవ్యం బెఱుగని యా
  భర్తయె భారమ్ము గాడె భార్యకు నెపుడున్!

  రిప్లయితొలగించండి
 22. ధూర్తగుణాతిరేకమున దుర్మతియై చరియించుచుండి గ్రీ
  ష్మర్తుకు దుల్యయౌ కరణి సర్వవిధంబుల మంటబెట్టుచున్
  నర్తన లాడుచున్ సతము నాథుని దూషణ చేయుచున్నచో
  భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్.

  రిప్లయితొలగించండి