20-8-2022 (శనివారం)కవిమిత్రులారా,'పాలు - పెరుగు - వెన్న - నేయి' ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూశ్రీ కృష్ణుని స్తుతిస్తూ స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
వెన్న దొంగగఁ దాఁవచ్చివేడు కొనెను రాజ్య భాగపు సగ పాలు రమ్యము గను బి లిచి వారికి నే యిమ్ము పెంపు తోడననుచు రాయబారిగఁగోరె నచ్యుతుండు
ఆర్యా! పెరుగును ప్రసాదింప ప్రార్థన.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'పెరుగు' ?
కందంమురిపాలు పంచి జననికి,వరమై పెరుగుచు సఖులకు, భగవద్గీతన్నరునకు నీవెన్న జగద్గురునిగనే యిలఁ గొలుతుము గోపకిశోరా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తే.గీ.వాసుదేవుడు భక్తుల పాలు ప్రియముపేర్మితో కృష్ణు బూజింప పెరుగు చిత్తువెన్నడించు రూపు తళుకు బెళుకు, దాసభజన సేయునే యిక్కట్ల పరమపదము.
నమస్సులు
కొలచినను చాలు పాపాలు తొలగిపోయి పెరుగు బుణ్యంబటంచును విశ్వసింత్రుగాదె, నీదులీలలవెన్న నాదుతరమె బాపు మంటినే యిడుముల పరమ పురుష.
సలుపు విన్నపాలు వినుచు చక్క నయ్యయావసరాలకు పెరుగుచు నాదుకొనుచునెట్టి తావెన్న డైనను గట్టి గానుపిలువగానే యి టుల వచ్చి నిలుతు ననును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'యవసరాలకు' టైపాటు.
పాపాలు పెరుగుటం గనితాపసులే వేడుకొనగ ధరణిని గావన్,రూపాల వెన్నని దలఁతు,గోపాలుడి నే యిల నిజ గురువుగ గొలుతున్.
వాసుదేవుడుశిశుపాలుని చక్రము తోడ జంపె పెరుగదోషరాశికంసహరునిపనులు కావెన్న నేరముల్గొలువనేయిడునటగొప్పవరము
వరముగ నందునింట మురిపాలు యశోదకుఁ బంచి కృష్ణుడేపెరుగు చు జూపె లీలలను పెంపుగ గోకులమందు విందుగన్సరగున రండు కృష్ణునకు సల్పగ పూజల వెన్న శక్యమే!సరవిని భక్తితో గొలువ సాధుజనాళిని గాచు నేయి లన్
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారూ🙏🏻
తేటగీతిఆలమందలు మేపు గోపాలురెల్లనందునింటిలో పెరుగుచున్నట్టి చిన్నికృష్ణు మహిమలవెన్నక క్రీడలాడయమునఁగాళియునే యిట్టె హతమొనర్చె.
మురిపాలు దేవకి యిడగపెరుగుట తో గోపికలకు పెరిమి నిడితివేకొర జూపవు నీవెన్నడునిరతము నిన్నే తలచుచునే యిపు డుండన్
ముద్దు మురిపాలు నీయొక్క మోజు తీర్చపెరుగుచుంటివి రేపల్లె పరవశింపవేణుగానము వీడవీవెన్నడైనచూడ నొప్పునే యికనీదు చోర కళని
పావన చరణ స్మరణ తాపాలు దొలగుపెరుగు ప్రేమభావన, నిండు విశ్వమంతనీవెయను సత్యము, కలుగునే యితరపుబ్రేప్సలు మదిని నీరూపు వెన్నడించ?
సతమునిన్నేయిడుములను చంపమనుచువేడెదను భక్తి నీపైన పెరుగు చుండెతలచ నీవెన్నడున్ చూపవలుకను గిరిధరుడ,విన్నపాలును విని కరుణ జూపు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కం.పెరుగును పుణ్యఫలంబులు,తరుగును పాపాలు నిన్ను తలచిన తృటిలో!హరి!నీదయ నేయిడుములు,దరిజేరవు భక్తులకిల ధాతవు కృష్ణా!!
వెన్నదొంగ నెడి బిరుదు వేడుకాయె కోప తాపాలు నీకేవి కొంటె కృష్ణ వేడుకొన్న భామ వినదు వేడికోలు పెరుగునే యిల దా నెమ్మి బ్రేమ పంచ వేలయాటలు జూపిన వేణునాథ
శిశుపాలు తప్పులు పెరుఁగుభృశమ్ము తా వెన్న కుండనే యిడ నిందల్ శశివదన నీకు నిచ్చితి వి శార్ఙ్గి వీక్షించి ముక్తి వెన్నుఁడ ప్రణతుల్
గోపాలుని మురళీ నాదోపాసన తీపెరుగుట దుష్కరమైనన్పాపాలకు తావెన్నడు మాపాలిట గల్గనీదు తానే యిలలోన్
తే.గీ.పాలు ద్రాగగ నల్లరి పాలు హితులుపెరుగును చిలికి దాచగ పెరుగు మృగణవెన్న గోరుచు నుట్టికై వెన్నడించెనేయి కలిమికై కృష్ణునే యియ్యకొనుము.
అద్భుతము 🙏🏻
వెన్న దొంగగఁ దాఁవచ్చివేడు కొనెను
రిప్లయితొలగించండిరాజ్య భాగపు సగ పాలు రమ్యము గను
బి లిచి వారికి నే యిమ్ము పెంపు తోడ
ననుచు రాయబారిగఁగోరె నచ్యుతుండు
ఆర్యా! పెరుగును ప్రసాదింప ప్రార్థన.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పెరుగు' ?
కందం
రిప్లయితొలగించండిమురిపాలు పంచి జననికి,
వరమై పెరుగుచు సఖులకు, భగవద్గీతన్
నరునకు నీవెన్న జగ
ద్గురునిగనే యిలఁ గొలుతుము గోపకిశోరా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ.
రిప్లయితొలగించండివాసుదేవుడు భక్తుల పాలు ప్రియము
పేర్మితో కృష్ణు బూజింప పెరుగు చిత్తు
వెన్నడించు రూపు తళుకు బెళుకు, దాస
భజన సేయునే యిక్కట్ల పరమపదము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినమస్సులు
తొలగించండి
రిప్లయితొలగించండికొలచినను చాలు పాపాలు తొలగిపోయి
పెరుగు బుణ్యంబటంచును విశ్వసింత్రు
గాదె, నీదులీలలవెన్న నాదుతరమె
బాపు మంటినే యిడుముల పరమ పురుష.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసలుపు విన్నపాలు వినుచు చక్క నయ్య
రిప్లయితొలగించండియావసరాలకు పెరుగుచు నాదుకొనుచు
నెట్టి తావెన్న డైనను గట్టి గాను
పిలువగానే యి టుల వచ్చి నిలుతు ననును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'యవసరాలకు' టైపాటు.
పాపాలు పెరుగుటం గని
రిప్లయితొలగించండితాపసులే వేడుకొనగ ధరణిని గావన్,
రూపాల వెన్నని దలఁతు,
గోపాలుడి నే యిల నిజ గురువుగ గొలుతున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాసుదేవుడుశిశుపాలుని చక్రము
రిప్లయితొలగించండితోడ జంపె పెరుగదోషరాశి
కంసహరునిపనులు కావెన్న నేరముల్
గొలువనేయిడునటగొప్పవరము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివరముగ నందునింట మురిపాలు యశోదకుఁ బంచి కృష్ణుడే
రిప్లయితొలగించండిపెరుగు చు జూపె లీలలను పెంపుగ గోకులమందు విందుగన్
సరగున రండు కృష్ణునకు సల్పగ పూజల వెన్న శక్యమే!
సరవిని భక్తితో గొలువ సాధుజనాళిని గాచు నేయి లన్
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురువుగారూ🙏🏻
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిఆలమందలు మేపు గోపాలురెల్ల
నందునింటిలో పెరుగుచున్నట్టి చిన్ని
కృష్ణు మహిమలవెన్నక క్రీడలాడ
యమునఁగాళియునే యిట్టె హతమొనర్చె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమురిపాలు దేవకి యిడగ
రిప్లయితొలగించండిపెరుగుట తో గోపికలకు పెరిమి నిడితివే
కొర జూపవు నీవెన్నడు
నిరతము నిన్నే తలచుచునే యిపు డుండన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిముద్దు మురిపాలు నీయొక్క మోజు తీర్చ
రిప్లయితొలగించండిపెరుగుచుంటివి రేపల్లె పరవశింప
వేణుగానము వీడవీవెన్నడైన
చూడ నొప్పునే యికనీదు చోర కళని
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపావన చరణ స్మరణ తాపాలు దొలగు
రిప్లయితొలగించండిపెరుగు ప్రేమభావన, నిండు విశ్వమంత
నీవెయను సత్యము, కలుగునే యితరపు
బ్రేప్సలు మదిని నీరూపు వెన్నడించ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసతమునిన్నేయిడుములను చంపమనుచు
రిప్లయితొలగించండివేడెదను భక్తి నీపైన పెరుగు చుండె
తలచ నీవెన్నడున్ చూపవలుకను గిరి
ధరుడ,విన్నపాలును విని కరుణ జూపు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం.
రిప్లయితొలగించండిపెరుగును పుణ్యఫలంబులు,
తరుగును పాపాలు నిన్ను తలచిన తృటిలో!
హరి!నీదయ నేయిడుములు,
దరిజేరవు భక్తులకిల ధాతవు కృష్ణా!!
రిప్లయితొలగించండివెన్నదొంగ నెడి బిరుదు వేడుకాయె
కోప తాపాలు నీకేవి కొంటె కృష్ణ
వేడుకొన్న భామ వినదు వేడికోలు
పెరుగునే యిల దా నెమ్మి బ్రేమ పంచ
వేలయాటలు జూపిన వేణునాథ
శిశుపాలు తప్పులు పెరుఁగు
రిప్లయితొలగించండిభృశమ్ము తా వెన్న కుండనే యిడ నిందల్
శశివదన నీకు నిచ్చితి
వి శార్ఙ్గి వీక్షించి ముక్తి వెన్నుఁడ ప్రణతుల్
గోపాలుని మురళీ నా
రిప్లయితొలగించండిదోపాసన తీపెరుగుట దుష్కరమైనన్
పాపాలకు తావెన్నడు
మాపాలిట గల్గనీదు తానే యిలలోన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే.గీ.
రిప్లయితొలగించండిపాలు ద్రాగగ నల్లరి పాలు హితులు
పెరుగును చిలికి దాచగ పెరుగు మృగణ
వెన్న గోరుచు నుట్టికై వెన్నడించె
నేయి కలిమికై కృష్ణునే యియ్యకొనుము.
అద్భుతము 🙏🏻
తొలగించండి