2, ఆగస్టు 2022, మంగళవారం

సమస్య - 4151

3-8-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బ్రహ్మదేవుని సృజియించె వాగ్వధూటి”
(లేదా...)
“చతురాస్యున్ సృజియించె వాణి సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్”

28 కామెంట్‌లు:

  1. తేటగీతి
    పలుకులమ్మఁగ గొలువంగ భక్తిమీర
    సృష్టి విద్యార్థులకునెల్ల శ్రేయమనుచు
    మురిసి గురువు నొక్కనియందు హరిహరులను
    బ్రహ్మదేవుని సృజియించె వాగ్వధూటి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభవిక్రీడితము
      నుతులన్ గొల్వ సరస్వతీ జననిఁ దా నుద్యుక్తురాలౌచు నీ
      క్షితిపై బోధనఁజేయగన్ గురునకున్ శ్రీకారమున్ జుట్టుచున్
      హితమందింపఁగ నొజ్జలో నమరగా నిచ్ఛించి శ్రీశున్ హరిన్,
      జతురాస్యున్ సృజియించె వాణి సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. చక్కనైనట్టి బోధతో చతురత గురు
    బ్రహ్మ దేవుని సృజి యించె :వాగ్వధూ టి
    వీక్షణంబున నబ్బెను విద్య లనుచు
    చెప్ప దొడగెను చెలులకు శిష్యుడొకడు

    రిప్లయితొలగించండి
  3. ఆద్యురాలైన లలితాంబ యణువు నుండి
    బ్రహ్మదేవునిసృజియించె,వాగ్వధూటి
    చదువుల చెలిగా వాసిగాంచగను బ్రహ్మ
    పరిణయంబాడె దివిజులు బలుక శ్రుతులు

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    బ్రహ్మదేవుని సృజియించె వాగ్వధూటి
    మామ హరి తన నాభిక మలము నుండి
    బ్రహ్మ సృష్టికి, హరి పరి పాలకునిగ,
    నీల కంఠుడు లయముకు నిలచి రంత.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి

  5. శ్రుతులున్ శాస్త్రపురాణసంచయము సుశ్లోకంపునాయమ్మయే
    చతురాస్యున్ సృజియించె,వాణిసకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్
    జతురత్వంబున బెండ్లియాడినది దాసాకారమౌనట్లు గా
    సతమున్ గల్గగ సంతసంబు,మది నుత్సాహంబునుప్పొంగగా

    రిప్లయితొలగించండి

  6. జ్ఞానమొసగుచు లోకాన మానవులను
    మాన్యులను జేయ దలచుచు మహిని తాను
    గురువతడె విష్ణు వతడేను హరుడతండె
    బ్రహ్మదేవుని సృజియించె వాగ్వధూటి.


    ప్రతిఘుండొక్కని పండితుండనుచు విశ్వాసమ్ముతో కూతుకున్
    బతిగా జేయగనేమి భార్యతెలుపన్ బంతమ్ముతో గొల్వగా
    నతనిన్ మెచ్చుచు కాళిరూపమున తానా మూర్ఖునిన్ సాహితీ
    చతురాస్యున్ సృజియించె వాణి సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్.

    రిప్లయితొలగించండి
  7. ఆటవెలది
    శ్రీవిభుండు *బ్రహ్మ దేవుని సృజియించె,
    వాగ్వధూటి*వాని భార్య యయ్యె
    కొలుచు వారికెల్ల కొంగుబంగారమై
    నటనమాడు వారి నాల్కమీద.

    రిప్లయితొలగించండి
  8. కమలలోచనుఁడగు హరి కమలభవుని
    బ్రహ్మదేవుని సృజియించె, వాగ్వధూటి
    బ్రహ్మజిహ్వాగ్రమందున బరగ నిలిచి
    సృష్టి కార్యము సలుపుట కిష్ట పడెను.

    రిప్లయితొలగించండి
  9. స్వీకరించె పతిగ లోక సృష్టి జేయు
    బ్రహ్మదేవుని ; సృజియించె వాగ్వధూటి
    పలురకములైన భాషల బలు నెలవుల
    జీవనము జేయు వారల జిహ్వ లందు

    రిప్లయితొలగించండి
  10. మత్తేభము
    అతి చాతుర్యము దైవలీలఁగన సృష్ట్యాదిన్ మహావిష్ణువే
    *చతురాస్యున్ సృజియించె;వాణి సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్*
    పతిగాఁబొందియు వాని మోముల సదా వాసించుచుండున్ గదా!
    నుతియించందగు వాంఛితార్థములకై నోరార సద్భక్తితోన్.

    రిప్లయితొలగించండి
  11. గట్టు దేవర తననాభి కమలమందు
    బ్రహ్మదేవుని సృజియించె; వాగ్వధూటి
    పద్మభవునికి గృహిణిగ బాసటాయె
    పలుకుజిలుకుల కొల్కిగ పరిఢవిల్లె

    రిప్లయితొలగించండి
  12. తే.గీ:భాష లేకుండ తత్త్వమ్ము బలుకు టెట్లు?
    నామరహితతత్త్వమునకు నామము లిడి
    శివుని,శక్తిని,సిరిని కేశవుని మరియు
    బ్రహ్మదేవుని సృజియించె వాగ్వధూటి.
    (వాగ్దేవత ఐన వాణి పేర్లకి అందని తత్త్వానికి ఫేర్లని సృజించింది.ఆ పేర్లే త్రిమూర్తులు,వారి భార్యలు.ఈ పేర్లన్నీ భాషాసృష్టి మాత్రమే.)

    రిప్లయితొలగించండి
  13. మ:అతిదారిద్ర్యము నందు మ్రగ్గు తరి నష్టైశ్వర్యముల్ గూర్చు మం
    త్రతతిన్ బ్రాహ్మణు డొక్క డిచ్చె నవి నే ధ్యానించి గట్టెక్కితిన్
    మతిలో సంతస మంది పల్కితిని యో మంత్రప్రదాతా నినున్
    చతురాస్యున్ సృజియించె వాణి, సకలైశ్వ ర్య ప్రదున్ బ్రహ్మనున్
    (మంత్రాలు ప్రసాదించిన బ్రాహ్మణుణ్ని బ్రహ్మ అని ప్రశంసించినట్లు.సరస్వతి అలాంటి బ్రాహ్మణుణ్ని చూపించింది అని.)

    రిప్లయితొలగించండి
  14. ప్రళయ కాలము నందున బాహుభేది
    బ్రహ్మ దేవుని సృజియించె,వాగ్విధూటి
    సతిని చేయ వారి వలన జగతి యందు
    శ్రీశునాజ్ఞచేత సకల సృష్టి యయ్యె

    రిప్లయితొలగించండి
  15. అంగనల నంబుజాక్షుల నరసి నంత
    నంగజు నెదిరింపఁగ బ్రహ్మ కైన వశమె
    యాతతమ్ముగ నెద మోహ మావహింప
    బ్రహ్మ దేవుని సృజియించె వాగ్వధూటి

    విత తానుగ్రహ నిగ్రహ ప్రకర సద్విద్యా ప్రవీణుండు నా
    తత కారుణ్య విలోకనుండు హరి దా దాక్షిణ్య మేపార సం
    తత లోకప్రభవైక కార్యమునఁ దాతన్ నిల్ప శ్రీనాథుఁడే
    చతురాస్యున్ సృజియించె వాణి! సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్

    రిప్లయితొలగించండి
  16. అతులంబా హరి లీలలెన్నగను తానాదిన్ పిసాళమ్ముగా
    చతురాస్యున్ సృజియించె, వాణి సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్
    పతిగా గైకొని జిహ్వపై నిలిచి పెంపారంగతా సృష్టికిన్
    పతికిందోడుగ నిల్చెనీ పుడమిపై భవ్యంబులీ కృత్యముల్

    రిప్లయితొలగించండి