8, ఆగస్టు 2022, సోమవారం

సమస్య - 4157

9-8-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యజ్ఞమ్ములు హానిఁ గూర్చు నవని జనులకున్”
(లేదా...)
“యజ్ఞము లెల్ల లోకులకు హానినిఁ గూర్చుటకే తలంచినన్”

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1765112733703420"
     crossorigin="anonymous"></script>

24 కామెంట్‌లు:

  1. ప్రఙ్ఞగ భావనఁజేసితె?
    యజ్ఞమ్ములు హానిఁ గూర్చు నవని జనులకున్
    యఙ్ఞముల గురిచి యటులన
    విఙ్ఞతగాఁ దోచె నీకు వివరణ యిమ్మా

    రిప్లయితొలగించండి
  2. యజ్ఞము లెల్ల లోకులకు హానినిఁ గూర్చుటకే తలంచినన్
    విఙ్ఞత తోడి పల్కులవె? వీనుల కింపుగ లేవు చూడగన్
    యఙ్ఞము లెల్ల లోకులకు నాయువుఁ బెంచును సస్యముల్ వెసన్
    బ్రఙ్ఞను బెంచు రైతులకు బాగుగఁ బండుచు నన్ని వేళలన్

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాని , క్రతువు జాలును
    ప్రజ్ఞ యవసరంబు లేదు పని జరుగ ననన్
    విజ్ఞత జూపక జేసెడి
    యజ్ఞమ్ములు , హానిఁ గూర్చు నవని జనులకున్

    రిప్లయితొలగించండి
  4. విజ్ఞునివలెనటియించు న
    వజ్ఞుండవినీతితోడ పరితాపముతో
    ప్రాజ్ఞుడననుచుసలుపు జల
    యజ్ఞమ్ములు హానిఁ గూర్చు నవని జనులకున్

    రిప్లయితొలగించండి

  5. విజ్ఞానివంచు నమ్మిరి
    యజ్ఞానులు నిన్ను గాంచి యధముడవై నీ
    వజ్ఞానమున పలికితివె
    యజ్ఞమ్ములు హానిఁ గూర్చు నవని జనులకున్.


    విజ్ఞత నిచ్చు శాస్త్రముల పెక్కు పఠించిన భాగ్యవంతునిన్
    యజ్ఞము జేయ బూనితి సహాయము చేయమటంచు కోరగా
    యజ్ఞుడు పల్కెనిట్టుల ప్రయత్నము వ్యర్థము మానుమంచు నా
    యజ్ఞము లెల్ల లోకులకు హానినిఁ గూర్చుటకే తలంచినన్.

    రిప్లయితొలగించండి
  6. ప్రాజ్ఞు లు దెలిపిన రీతిగ
    విజ్ఞులు నొనరింప బూన వే దొక్తంబౌ
    యజ్ఞము సఫ లంబగు నే
    యజ్ఞమ్ములు హాని గూర్చు నవని జనులకున్?

    రిప్లయితొలగించండి
  7. యజ్ఞము సలుపగ మేలగు
    విజ్ఞతతో విశ్వశాంతి వెలయగ ధరలో
    నజ్ఞాన దాయకంబగు
    యజ్ఞమ్ములు హానిఁ గూర్చు నవని జనులకున్

    రిప్లయితొలగించండి
  8. కందం
    విజ్ఞులుగా ఋషులెల్లరు
    ప్రజ్ఞాదులఁ గూర్చి చేయఁ బ్రాయోజితమౌ!
    యజ్ఞత నుడువఁగఁ దగ దే
    యజ్ఞమ్ములు హానిఁ గూర్చు నవని జనులకున్?

    ఉత్పలమాల
    విజ్ఞులు గా ఋషీశ్వరులు వేద ప్రబోధమనంగ వారివౌ
    ప్రజ్ఞల రంగరించి భువి బాగుకుఁ గూర్చ విరుద్ధరీతితో
    నజ్ఞత మించఁగన్ సమిధలన్నిటలో కలితీలవాడినన్
    యజ్ఞము లెల్ల లోకులకు హానినిఁ గూర్చుటకే తలంచినన్

    రిప్లయితొలగించండి
  9. కందం
    ప్రాజ్ఞుల 'నిత్యానంద' ము
    లే జ్ఞాన గతులన, వార లేగియు ;నెరపన్
    విజ్ఞత విహీన మన్మథ
    యజ్ఞమ్ములు హానిఁ గూర్చు నవని జనులకున్

    రిప్లయితొలగించండి
  10. యజ్ఞము సల్పగానెలమి యందరి శ్రేయమునందు బద్ధులై
    విజ్ఞత శూన్యమైన పలు వెంగళులీభువి స్వార్థ బుద్ధితో
    నజ్ఞతబూని జంతుబలి యజ్ఞములందున జేయుచుందురా
    యజ్ఞము లెల్ల లోకులకు హానినిఁ గూర్చుటకే తలంచినన్

    రిప్లయితొలగించండి
  11. ఆజ్ఞప్తులై నృపునిచేఁ
    బ్రాజ్ఞాధ్వరు లత్యధికపు భక్తిఁ జలుపఁగా
    నజ్ఞాను లందు రివ్విధి
    యజ్ఞమ్ములు హానిఁ గూర్చు నవని జనులకున్


    విజ్ఞులు స్వీయ లాభములు పెక్కుల నందఁగఁ బల్కుచుండ్రు దై
    వాజ్ఞ యటంచు యాగముల నత్యధికమ్ముగఁ జేయ మేలు నా
    నజ్ఞులఁ గాంచి యెట్టి ఫల మందిరి యెవ్వరు నిక్క మెంచినన్
    యజ్ఞము లెల్ల లోకులకు హానినిఁ గూర్చుటకే తలంచినన్

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    రాజ్య తంత్రమెఱింగిన రాజ!చేయు
    మయ్య!దాన*యజ్ఞమ్ములు;హానిఁగూర్చు
    నవనిజనులకున్ *రణములు,నందుచేత
    ప్రజలఁబాలింపవలయును ప్రజ్ఞ తోడ.

    ఉత్పలమాల
    విజ్ఞతతో మెలంగుచును వేదములెల్ల పఠించుచుండియున్
    ప్రజ్ఞగలట్టి భూసురులు పద్ధతిగానొనరించ శ్రీలిడున్
    *యజ్ఞములెల్ల లోకులకు;హానిని గూర్చుటకే తలంచినన్*
    అజ్ఞతతోడఁజేయు పనులన్నియెఱుంగవలెన్ క్షితీంద్రులున్.

    రిప్లయితొలగించండి
  13. యాజ్ఞికులిలలో చేయుచు
    యజ్ఞములనులోకసుఖమునాకాంక్షింక్షన్
    ఆజ్ఞానముతోనందురు
    *"యజ్ఞమ్ములు హానిఁ గూర్చు నవని జనులకున్”*

    రిప్లయితొలగించండి
  14. Path Creators Tutorial have experience of 10+ Years in CBSE curriculum. It is the top Online CBSE Class in Kolkata providing teachers with experience of 25+ Years in CBSE Classes. Online Classes in Kolkata provide study materials, video lectures, doubt clearing and teachers available for you always will get the atmosphere of a classroom at home. Path Creator Tutorials offers an excellent team to guide and mentor students who are studying in CBSE Board Class 11th and 12th with the help of CBSE Online Class in Kolkata.

    రిప్లయితొలగించండి