1, ఆగస్టు 2022, సోమవారం

సమస్య - 4150

2-8-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మృదు మధురోక్తులొసఁగునొకొ మేలెన్నటికిన్”
(లేదా...)
“మృదు మధురోక్తు లెన్నఁడును మేలొన గూర్చవు తిట్టఁగా వలెన్”

19 కామెంట్‌లు:


  1. ముదమగు శిల్పము జెక్కగ
    వదలక నులిదెబ్బ వలయు ప్రస్తరమునకున్
    బుధునిగ మార్చగ వెకలికి
    మృదు మధురోక్తులొసఁగునొకొ మేలెన్నటికిన్.

    రిప్లయితొలగించండి
  2. కందం
    కదనము గూర్చెడు తలపున
    నదనుకు సంధి యనుపేర నరి శౌర్యమ్మున్
    బదునుగ హరి పలికి గెలిచె
    మృదు మధురోక్తులొసఁగునొకొ మేలెన్నటికిన్?

    చంపకమాల
    కదనమె కౌరవాధముల గర్వమడంచెడు సాధనమ్ముగా
    నదునుకు సంధిపేర హరి యా పృథ సూనుల శౌర్యమెంచుచున్
    బదునుగ, ధార్తరాష్ట్రుఁడట భండనమెంచఁగఁ జేసి నెగ్గెనే!
    మృదు మధురోక్తు లెన్నఁడును మేలొన గూర్చవు తిట్టఁగా వలెన్!

    చంపకమాల
    సదనము నందు పూజ్యుఁడని చక్రిని పాండవులాదరింపగన్
    వదలక నిందలున్ శతము వాగుచు నా శిశుపాలుడంతమై
    సదమల స్వామి సన్నిధికిఁ జప్పున జేరెను! వైరభక్తితో
    మృదు మధురోక్తు లెన్నఁడును మేలొన గూర్చవు తిట్టఁగా వలెన్!

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. పదుగురు మెచ్చిన రీతిగ
    మృదువుగఁ దాఁ బలుకునెడల మెచ్చుదురవనిన్
    కదలించ వారి మనముల
    మృదు మధురోక్తులొసఁగునొకొ, మేలెన్నటికిన్

    రిప్లయితొలగించండి
  5. పదుగురికి హాని సల్పుచు
    హృదయములో విషము గల్గి హీనుని వోలెన్
    మెదలె డు వారిన్ మార్చగ
    మృదు మధు రోక్తు లొసగు నొకొ మేలెన్నటి కిన్

    రిప్లయితొలగించండి

  6. ముదితలు మెచ్చు భూషణము ముష్టికు ఘాతము తిన్నదే కదా
    వదలక వేయుదెబ్బలకు ప్రస్తరమైనను శిల్పమౌ విధిన్
    బుధునిగ మార్చనెంచినను మూర్ఖుని జేరుచు నోజ్జ పల్కెడిన్
    మృదు మధురోక్తు లెన్నఁడును మేలొన గూర్చవు, తిట్టఁగా వలెన్.

    రిప్లయితొలగించండి
  7. పదముల యందు మధువొలక
    మది కది యానంద మొసగుమనుజులకెల్లన్
    సదమలమతితోగొన నా
    మృదుమధురోక్తులొసగునొకొమేలెన్నటికిన్

    రిప్లయితొలగించండి
  8. పదవి యొసగిన ట్టి నిషా
    కుదియక , మంచి చెడు లెంచకుండని రీతిన్
    వదరెడి వానికి చెప్పగ
    మృదు మధురోక్తులొసఁగునొకొ మేలెన్నటికిన్

    రిప్లయితొలగించండి
  9. చదువుము తండ్రి బాగుగను శాస్త్రము లన్నియు నేర్పు పెంపునన్
    ననగను మొండి వైఖరిని నాదర మీయక బాలు
    డుండుచో
    మృదు మధురోక్తు లెన్నఁడును మేలొన గూర్చవు తిట్టఁగా వలెన్
    నదియ సుమార్గ మేరికినినైనను లోకము తీరునంతయే

    రిప్లయితొలగించండి
  10. కందము
    కుదురుగ నుందుర పిల్లలు?
    *మృదుమధురోక్తులొసఁగునొకొ?మేలెన్నటికిన్*
    చదువులు చెప్పెడు గురువులు
    బెదిరించియు నేర్పవలయు విద్యాబుద్ధుల్.

    చంపకమాల
    బెదరక నిండ్ల దూరుచును వెండియు,బంగరు నోట్లకట్టలున్
    ముదమున దొంగిలించుటయెముఖ్యప్రవృత్తిగ నెంచు దొంగకున్
    *మృదుమధురోక్తులెన్నడును మేలొనగూర్చవు తిట్టగావలెన్
    పదుగురుఁగూడి కొట్టవలె బాధ్యత యేమిటొ
    చెప్పగావలెన్.

    రిప్లయితొలగించండి
  11. కందం
    విదితుడుగాక నవిదుతుడు
    విదితుడ గానని యెఱుగుట విషయము నందున్
    ఇదమిత్థమె వైధేయుడు
    మృదు మధురోక్తులొసఁగునొకొ మేలెన్నటికిన్

    రిప్లయితొలగించండి
  12. పదవుల నొందిన పిమ్మట
    నధములు దుర్నీతితోడ నార్జన సలుపన్
    పదనుగ ఖండింపని యెడ
    మృదు మధురోక్తులొసఁగునొకొ మేలెన్నటికిన్

    రిప్లయితొలగించండి
  13. పెదవులతో మాట్లాడును
    యెదలో విషభాండముండు నెగయుచుఁ బొగలన్
    మదినిండిన మచ్చరమున
    మృదు మధురోక్తులొసఁగునొకొ మేలెన్నటికిన్

    రిప్లయితొలగించండి
  14. పదునగు శాపమంది శిశుపాలుడు పుట్టెను భూతధాత్రిపై
    మెదల విముక్తియే మదిని మీఱిన మాటల లాడి శౌరిపై
    కదలెను మృత్యుకౌగిటికి, కాంచగ చెచ్చెర విష్ణులోకమున్
    మృదు మధురోక్తు లెన్నఁడును మేలొన గూర్చవు తిట్టఁగా వలెన్

    రిప్లయితొలగించండి
  15. కందం
    పదుగురు నచ్చని మెచ్చని
    మృదుమధురోక్తులొసగునొకొ? మేలెన్నటికిన్.
    అదలించి జెప్ప మేలగు
    మృదు కవిత రచనలజే సునృతముల్ బలుకన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  16. పదముల యందు మధువొలక
    మది కది యానంద మొసగుమనుజులకెల్లన్
    సదమలమతితోగొన నా
    *మృదుమధురోక్తులొసగునొకొమేలెన్నటికిన్*


    చదువులు నేర్వక సరిగా
    కుదురుగ నుండని సుతులకు కూరిమి తోడన్
    వదలక తల్లియు చెప్పెడి
    “మృదు మధురోక్తులొసఁగునొకొ మేలెన్నటికిన్”


    నిదురయుతిండియున్ విడిచి నిత్యమునా చరవాణి మోజులో
    చదువుల పట్ల శ్రద్ధ నిలచక్కగ చూపక తిర్గు చుండగన్
    వదలక తల్లితండ్రులునువాసిగ చెప్పెడు మంచి కూర్చుయా
    “మృదు మధురోక్తు లెన్నఁడును మేలొన గూర్చవు తిట్టఁగా వలెన్”

    రిప్లయితొలగించండి
  17. పదిలముగా నుండ వలెను
    ముద మీయఁగ నెంచి నిన్ను బొగడుచుఁ బలుకన్
    వదలక నిరంతరమ్మును
    మృదు మధు రోక్తు లొసఁగు నొకొ మే లెన్నటికిన్


    సదమల డెంద మూని నిజ సఖ్యము గోరుచు నప్రియమ్ములన్
    బెదరక పల్క సత్యములు పెన్నిధు లౌదురు వార లెన్నఁగా
    నెదురుగ నుండి నీకు ముద మీయ నిజాప్రియు లెల్లఁ బల్కు నా
    మృదు మధు రోక్తు లెన్నఁడును మేలొనఁ గూర్పవు తిట్టఁగా వలెన్

    రిప్లయితొలగించండి
  18. సదమల సత్ప్రవర్తన యశమ్మొన గూర్చును, పల్కులందునన్
    బొదవెడు నమ్ర భావనము బొల్పుగ జేయును బుద్ధిశాలిగన్,
    హృదయమునందు కల్మషము నెంతయు నిల్పెడు నల్పబుద్ధికిన్
    మృదు మధురోక్తు లెన్నఁడును మేలొన గూర్చవు తిట్టఁగా వలెన్

    రిప్లయితొలగించండి