18, ఆగస్టు 2022, గురువారం

సమస్య - 4166

19-8-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శంకరుం డెత్తె హరి చెప్ప స్వర్ణగిరిని”
(లేదా...)
“శంకరుఁ డెత్తె నా కనకశైలము మాధవు వాంఛ దీరఁగన్”

26 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 2. శంకరుం డెత్తె హరి చెప్ప స్వర్ణగిరిని
  గప్ప లన్నియు నేగెను గగన మునకు
  భూమి దిరుగును మనచుట్టుఁ బుణ్య పురుష!
  వీనిఁ బూరించ చెప్పుడు విధము నెటులొ?

  రిప్లయితొలగించండి
 3. తేటగీతి
  దుష్ట త్రిపురాసురులఁ బట్టి దునుము కతన
  వసుధ రథముగా మార నే బాణమగుదు
  నారి యాదిశేషుండౌ ననంగ విలుగ
  శంకరుం డెత్తె హరి చెప్ప స్వర్ణగిరిని

  స్వర్ణగిరి : మేరుపర్వతము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   సంకటకారకుల్ రయమె చంపగదే! త్రిపురాసురుల్ హరా!
   జంకునెరుంగఁ బోరనఁగ, క్ష్మాతలి స్యందన, మాది శేషుడున్
   బింకపు నారియౌను, నను పీలువు జేయుమటన్న వింటిగన్
   శంకరుఁ డెత్తె నా కనకశైలము మాధవు వాంఛ దీరఁగన్!

   కనకశైలము : మేరుపర్వతము

   తొలగించండి
 4. శంకరుఁ డెత్తె నా కనకశైలము మాధవు వాంఛ దీరఁగన్
  శంకరు వాస మా కనక శైలము, నెత్తుట యేమి? భావ్యమే
  శంకలు గల్గఁ జెప్పగను సంచిత పుణ్యము లొక్కసారిగా
  నంకము వీడి వోవునిఁక నాశ్రిత లోకము చింతనొందగన్

  రిప్లయితొలగించండి
 5. అంకము సేరి శైలసుత యడ్గెను భర్తను
  గారవంబునన్
  కొంకక దీర్చగా వలయు కుందుని యిష్టము
  నాదు కోర్కనున్
  పొంకము మీర నీ బలము బొందుగ
  జూపుమటంచునడ్గగా
  శంకరుడెత్తె నా కనక శైలము మాధవు
  వాంఛ దీరగన్

  రిప్లయితొలగించండి
 6. గరళమున్ గ్రోల నెవ్వరు శిరము‌నెత్తె,

  నంది కెవరు చెప్ప నసురు తుంది జీల్చె,

  కనక నగమని దేనిని జనులు బలుకు

  శంకరుడెత్తె,హరి చెప్ప,స్వర్ణ గిరిని

  తుంది = పొట్డ. (గజాసురుని పొట్ట)

  రిప్లయితొలగించండి
 7. చేరి ర చ్చో ట దైత్యులుచెడు ను సేయ
  వారినం తము సేయంగ వారి జాక్షు
  డైన శ్రీహరి శివుని కానతీయ
  శంకరుండెత్తె హరి చెప్ప స్వర్ణ గిరిని

  రిప్లయితొలగించండి
 8. తారకుని పుత్రుల మధుసూదనుడు చంప
  దలచి, వైనమెంచి శివుని దరిని జేరి,
  విపుల రథముగ, శేషుఁడు వింటినారి,
  బాణముగ మేరుగిరి బడబాగ్ని గురియ,
  శంకరుం డెత్తె హరి చెప్ప స్వర్ణగిరిని.

  రిప్లయితొలగించండి

 9. శివుని యానతి గైకొని శ్రీధరుండు
  కాలకూటమ్ము ధరియించె కంఠమందు
  శంకరుం డెత్తె హరి చెప్ప స్వర్ణగిరిని
  యనుచు వాగెనే బాలసుండతివ తోడ


  లంకణముండె నాతడు జ్వరమ్మని వైద్యుడు చెప్పినంత నా
  పంకజ నాభుడన్న కడు భక్తిని గల్గిన మేటి భక్తు డి
  ఱ్ఱంకులతోడ కూరుకగ రాతిరి స్వప్నము గాంచె
  నందులో
  శంకరుఁ డెత్తె నా కనకశైలము మాధవు వాంఛ దీరఁగన్.

  రిప్లయితొలగించండి
 10. దుష్ట రక్కసుల వడిగ దునుమ నెంచ
  పుడమి తల్లియె రథమయ్యె భూరి గాను
  పద్మనాభుండె యరుదెంచ బాణముగను
  శంకరుండెత్తె హరిచెప్ప స్వర్ణ గిరిని

  రిప్లయితొలగించండి
 11. ఆటవెలది
  త్రిపురములను గూల్చిదేవతలను బ్రోవ
  నారి శేషుఁడమ్ము శౌరి కాగ
  భండనమున*శంకరుండెత్తె, హరిచెప్ప
  స్వర్ణగిరిని*దివ్య చాపమట్లు.

  రిప్లయితొలగించండి
 12. ( శంకరు , హరి స్నేహితులు )

  పద్మనాభుని దర్శించు ప్రస్తవమును
  శంకరుండెత్తె ; హరి చెప్ప , స్వర్ణగిరిని
  జొచ్చి కనకాచలపతిని చూచిరపుడు
  యిరువురి యితము సమకూరె నిమ్ముగాను

  రిప్లయితొలగించండి
 13. చదువనైతి పురాణముల్సదయులార!
  హరుని మామకు మామయేహైమనగమ
  ని యనగ వినియుంటి నెపుడు నేనెరుంగ
  శంకరుం డెత్తె హరి చెప్ప స్వర్ణగిరిని!

  రిప్లయితొలగించండి
 14. ఉ.

  వంకర రీతిగా వరము పట్టుట తారక పుత్ర పట్టణాల్
  కింకర తుల్యులై సురలు కేలును మోడ్చిరి, చంపగా విధిన్
  కంకర భూమియే రథము గ్లౌ రవి చక్రములైరి, శేషునిన్
  *శంకరుఁ డెత్తె నా కనకశైలము, మాధవు వాంఛ దీరఁగన్.*

  రిప్లయితొలగించండి
 15. ఉత్పలమాల
  శంకరులీలలంబొగడ శక్యమె యేరికినైన సత్కవీ!
  జంకకఁగూల్చెగా త్రిపుర సంస్థిత దైత్యుల నారి శేషుఁడై
  బింకము జూపగా శరము విష్ణువు కాగ,ధనుస్సు గా బళీ!
  *శంకరుఁడెత్తెనా కనకశైలము మాధవు వాంఛదీరగన్.*

  రిప్లయితొలగించండి
 16. స్వర్ణగిరిని తాదర్శించి స్వప్నమొకటి
  గాంచి దైవాజ్ఞ మేరకు కట్టనెంచి
  యచిరకాలమున్ గుడినేర్పరచి ధ్వజమును
  శంకరుం డెత్తె హరి చెప్ప స్వర్ణగిరిని

  (శంకరుడు-శంకరాచార్యుడు)

  రిప్లయితొలగించండి
 17. కొంకక శంకరుండు హరికోరగ గ్రోలెను కాలకూటమున్
  బింకముగా మురారి తన పిన్నతనంబున నెత్తె శైలమున్
  శంకయొకింత గల్గె మదిఁ సత్యము దెల్పుడు నిక్కువంబుగా
  శంకరుఁ డెత్తెనా కనకశైలము మాధవు వాంఛ దీరఁగన్?

  రిప్లయితొలగించండి
 18. తేటగీతి
  పరమ శివుడు కనక సభా భవన మందు
  కొలువు దీరి యుండగ కోరె కోర్కె సురలు
  వల్లె యనుచు త్రిశూలపు వాడి మొనన
  శంకరుండెత్తె హరి జెప్ప స్వర్ణ గిరిని.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 19. శంకకు తావు లేని కడు శాంతము గొన్న మహేశు జూడగా
  నంకన లందజేయ జగమంతయు బ్రహ్మయు మెచ్చు చుండగా
  కంకణ ధారుడై మహిత గౌరిని జేరుచు వేయ మాలనున్
  శంకరు డెత్తె, నా కనక శైలము, మాధవు వాంఛ దీరగన్

  రిప్లయితొలగించండి
 20. ఏడ శంకరుండు రమేశుఁ డెక్కడ కన
  కాద్రి యెక్కడ యెత్తెడు కార్య మెద్ది
  రిత్త గిర లివి మునిఁగితె మత్తు నందు
  శంకరుం డెత్తె హరి చెప్ప స్వర్ణ గిరిని


  లంక యనంగ వెల్గెడిని రాక్షస రాజ్యపు రాజవర్యుఁ డా
  సంగర దుర్జయుండు ఘన శక్తుఁడు వీరుఁడు సర్వ దేవతా
  సంకట కారకుండును దశప్రవ రాస్యుఁడు సేవి తాద్రిజా
  శంకరుఁ డెత్తె నా కనక శైల ముమా ధవు వాంఛ దీరఁగన్

  రిప్లయితొలగించండి
 21. శంకయు దీర్చు మంచు హరి శంకరునే దశకంఠు శక్తినిన్
  జంకును లేక నీశుకడ జక్కగ నిమ్మన నాత్మలింగమున్
  పెంకితనంబునన్ వలదు బెట్టగ పాదమనంచు నందియున్
  అంకిత మూఢభక్తినను నాగిరి నెత్తెను రుద్ర గానమున్
  పంకజనాభుడే దిరిగి ధర్మము గావఁగ రాముడంశమున్
  శంకరుడెత్తె నాకనక శైలము మాధవు వాంఛదీరగన్ !

  రిప్లయితొలగించండి
 22. హరిత శంకర దంపతులనుఁగు బిడ్డ
  బంగరపుకొండ యందురు పావురముగ
  పాలకైనేడ్వ నాబిడ్డ పట్టుబట్టి
  శంకరుండెత్తె హరి చెప్ప స్వర్ణగిరిని

  రిప్లయితొలగించండి