11, ఆగస్టు 2022, గురువారం

సమస్య - 4160

12-8-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాలుష్యము మేలుఁ గూర్చుఁ గద మనుజులకున్”
(లేదా...)
“కాలుష్యంబది హెచ్చెనేని బహు సౌఖ్యంబిచ్చు మర్త్యాళికిన్”

47 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. శార్దూలవిక్రీడితము
      మాలిన్యంబది పంచభూతముల నింపంగన్ బ్రమాదమ్మగున్
      మేలున్గూర్చెడు చర్యలన్ ప్రభుత మన్నింపన్ విచారించి యా
      మూలాగ్రమ్ముగ 'జాగరూకతలు' ,నిర్మూలింపగన్ సృష్టిలోఁ
      గాలుష్యంబది, 'హెచ్చెనేని' బహు సౌఖ్యంబిచ్చు మర్త్యాళికిన్

      తొలగించండి
    2. శ్రీమతి సీతాదేవి గారికి
      కందం
      గాలియు శబ్ధము నీరును
      మాలిన్య రహితమనంగ మనుగడ సాగున్
      గూలఁగ నెంచుము నన్నిట
      కాలుష్యము, మేలుఁగూర్చుఁ గద మనుజులకున్

      తొలగించండి
    3. శ్రీమతి సీతాదేవిగారికి ధన్యవాదములు. సవరించారు.

      తొలగించండి
    4. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. నేలను నీటిని స్వనమును
      గాలిని మలినంబుసేయ గ్రమ్మును రోగాల్
      తాలిమితో దొలగించగ
      కాలుష్యము, మేలుగూర్చుగద మనుజులకు

      తొలగించండి
  3. హాలాహలమునుఁ దూగును
    గాలుష్యము, మేలుఁ గూర్చుఁ గద మనుజులకున్
    దాలిమి యనునది జగతిని
    బాలిసులకు నైన గాదె పరమో ధర్మః

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. **సమస్య**
      (కాలుష్యము మేలు గూర్చు గద మనుజులకున్)
      ===
      **కందపద్యము**
      *కాలమహిమయకటా!కలి*
      *కాలమునవినీతి,కల్తి, కాలుష్యమయెన్*
      *పాలకులే తగ్గింతురు*
      *"కాలుష్యము; మేలుగూర్చుగద మనుజులకున్"*
      ===
      **చెన్నమాధవుని భాస్కర రాజు**

      తొలగించండి
  4. చాల పెరిగిపోయెను గద
    కాలుష్యము ; మేలుఁ గూర్చుఁ గద మనుజులకున్
    మాలిన పదార్థముల నను
    కూలముగ నమర్చినట్టి గోతుల బూడ్చన్

    రిప్లయితొలగించండి
  5. మేలేవిధమ్మునొసగును
    కాలుష్యము? మేలుఁ గూర్చుఁ గద మనుజులకున్
    నేలపయిన భూరుహములు
    కాలుష్యముదూరమైన గాలియు జలమున్

    రిప్లయితొలగించండి
  6. చాలా హానిని కూర్చును
    కాలుష్యము,మేలుగూర్చుగద మనుజులకున్
    హేలగ తరువులు పెంచిన
    గాలినొసంగుచు.హితమిడు కాయంబునకున్

    రిప్లయితొలగించండి
  7. కాలుష్యంబది హెచ్చెనేని బహు సౌఖ్యంబిచ్చు మర్త్యాళికిన్
    బాలా! యేమనిఁ బల్కు చుంటివి యహా భావాతి రిక్తంబుగాఁ
    గాలుష్యంబది చేయు రోగిగ నికన్ గాంతార వాసంబునున్
    గాలుష్యంబును బారఁద్రోలవలె నాకాశంబు దాటంగ గన్

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    చాల కీడొనర్చును నీరు గాలి నింగి
    నేలఁజేరి *కాలుష్యము;మేలు గూర్చు
    గద మనుజులకున్*పెంచ వృక్షములు, మరియు
    వ్యర్థముల రూపుమాప ప్రపంచమందు.

    రిప్లయితొలగించండి
  9. కాలుని కూపము భువిలో
    కాలుష్యము, మేలుఁ గూర్చుఁ గద మనుజులకున్
    మాలిన్యమేమి సోకని
    గాలియు నుదకము వసతియు గలిగిన ప్రజకున్

    రిప్లయితొలగించండి
  10. శార్దూలము
    ఆలోచించుడు వ్యాధులుంబ్రబలు నౌరా!పంచభూతంబులన్
    *కాలుష్యంబది హెచ్చెనేని;బహుసౌఖ్యంబిచ్చు మర్త్యాళికిన్*
    శ్రీలంగూర్చును వృక్షరాజములహో!శీఘ్రంబుగా పెంచి,ని
    ర్మూలింపంగను వ్యర్థముల్ సతతమారోగ్యంబు సిద్ధింపదే.

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లో' ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "గాలిని నేలను జలమున" అనండి.

      తొలగించండి
    2. చాలిక చేయకు ధరణిని
      కాలుష్యము! మేలుఁ గూర్చుఁ గద మనుజులకున్
      గాలిని నేలను జలమున
      వీలుగ రసనపు వృథాలవి కలుపకున్నన్

      తొలగించండి
  12. గాలియు నీరు చెడ నగు ను
    కాలుష్య ము : మేలు గూర్చు గద మను జుల కున్
    చా లిన విధముగ నీరము
    గాలియు లభియించి నపుడు గమ్మని వగుచున్

    రిప్లయితొలగించండి
  13. ఆలోకింపగనీ భువిన్ జనులు తామస్వస్థతన్ బొందరే
    కాలుష్యంబది హెచ్చెనేని? బహు సౌఖ్యంబిచ్చు మర్త్యాళికిన్
    మాలిన్యంబు లవారితంబులగుచో, మాన్యంబుగా మిత్రమా
    కాలుష్యంపు నివారణం బొదవు మార్గంబుల్ విచారించుమా!

    రిప్లయితొలగించండి

  14. మేలుకొనగ వలయు జనులు
    మేలొనరించెడు తరువుల మిక్కుటముగ నీ
    నేలను పెంచిన తగ్గును
    కాలుష్యము, మేలుఁ గూర్చుఁ గద మనుజులకున్.


    కాలంబయ్యది మారె మానవుడు దుష్కార్యార్థ చిత్తంబుతో
    మాలిన్యంబును ద్రుంచు మ్రానులను సమ్మానింపకన్ గూల్చిరే
    సాలమ్ముల్ భువి నాటకున్నను వినాశమ్మేగదా ధాత్రికిన్
    “కాలుష్యంబది హెచ్చెనేని , బహు సౌఖ్యంబిచ్చు మర్త్యాళికిన్?

    రిప్లయితొలగించండి
  15. శా.

    కాలాతీతము శత్రుపాలకులచే గాపాడు విస్రంభమున్
    కైలాసమ్ము తొలంగె భారత సహన్ గాంచంగ నాటంకమున్
    శూలిన్ విష్ణుని బ్రహ్మదేవు గొలువన్ జోద్యంబు ధర్మాంధ్యమౌ
    *కాలుష్యంబది హెచ్చెనేని బహు సౌఖ్యంబిచ్చు మర్త్యాళికిన్*.

    .. డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.
    ........

    సహ = భూమి
    శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టిక

    సం. వి. ఆ. స్త్రీ.

    రిప్లయితొలగించండి
  16. ఆలస్య మింకఁ జేయక
    యీ లోకమున వసియించు నెల్లరు దీక్షన్
    మేలుగ నిర్మూలించినఁ
    గాలుష్యము మేలుఁ గూర్చుఁ గద మనుజులకున్


    కాలుం జేరఁగ రాజ మార్గములు లోకం బందు జీవించు నా
    భీలోగ్ర క్రిమి కీట కాదు లవి దుర్భేద్యంబు లెవ్వారికిం
    గాలుష్యం బగు వాని కాలయము నిక్కం బెంచఁగాఁ గాన ని
    ష్కాలుష్యం బది హెచ్చె నేని బహు సౌఖ్యం బిచ్చు మర్త్యాళికిన్

    రిప్లయితొలగించండి
  17. చాలా హానిని కూర్చును
    కాలుష్యము,మేలుగూర్చుగద మనుజులకున్
    హేలగ తరువులు పెంచిన
    గాలినొసంగుచు.హితమిడు కాయంబునకున్
    [

    రిప్లయితొలగించండి