13, ఆగస్టు 2022, శనివారం

సమస్య - 4162

14-8-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కప్పలు సర్పములఁ జంపెఁ గద వెంకప్పా”
(లేదా...)
“మండూకంబులు మట్టుపెట్టెఁ గనుమా మల్లాడి సర్పంబులన్”

46 కామెంట్‌లు:


  1. చెప్పెనుపాధ్యాయుడిటుల
    కప్పలఁ సర్పములు చంపె గద వెంకప్పా
    బొప్పడు తప్పుగ వ్రాసెను
    కప్పల సర్పములు జంపెఁ గద వెంకప్పా.

    రిప్లయితొలగించండి
  2. కప్పలు వేలకు వేలుగ
    నప్పులు గల గొలన నుండ యానందముగా
    నప్పుడుఁ జేరగ నొకఫణి
    కప్పలు సర్పంబులఁ జంపెఁ గద వెంకప్పా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...గొలను నుండ నానందముగా...' అనండి.

      తొలగించండి
    2. కప్పలు వేలకు వేలుగ
      నప్పులు గల గొలను నుండ నానందముగా
      నప్పుడుఁ జేరగ నొకఫణి
      కప్పలు సర్పంబులఁ జంపెఁ గద వెంకప్పా!

      తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జీవన పోరు' దుష్టసమాసం. "జీవన రణమున" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువు గారు.

      కందం
      కప్పలు జీవన రణమున
      కుప్పలుగ నొకపరి జేరి కూరిమి తోడన్
      గొప్ప గ దాడి సలుపగన్
      కప్పలు సర్పములఁ జంపెఁ గద వెంకప్పా
      ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
      ఉండవల్లి సెంటర్.

      తొలగించండి

  4. కొండాటమ్ముఁ హరించినట్టి దొరలన్ కూళుండ్ర భంగింపగన్
    రండో రండితు స్వేచ్ఛ గోరుచును పోరాటమ్ము నే జేయగా
    దండై రమ్మని బిల్వ జేరిరట స్వాతంత్ర్యమ్ము సాధింపగన్
    మండూకంబులు మట్టుపెట్టెఁ గనుమా మల్లాడి సర్పంబులన్.

    రిప్లయితొలగించండి
  5. కందం
    చొప్పడి విడిది గృహమ్ములఁ
    దిప్పలు వెట్ట తి. తి. దే. వధింపఁగ నెంచన్
    జప్పున నెరవేయబడిన
    కప్పలు సర్పములఁ జంపె కద వెంకప్పా!

    శార్దూలవిక్రీడితము
    అండన్ గూడఁగ కౌరవాళికనిలోనల్లాడి కౌంతేయులున్
    మండాటమ్మున మర్మముల్ దెలిసి భీష్మద్రోణులన్ గూల్చిరే!
    జెండాపై కపిరాజుసాక్షిగ హరిన్ సేవించి దైవాంశులై
    మండూకంబులు మట్టుపెట్టెఁ గనుమా మల్లాడి సర్పంబులన్!

    రిప్లయితొలగించండి
  6. మండూకంబులు మట్టుపెట్టెఁ గనుమా మల్లాడి సర్పంబులన్
    మండూకంబులు చిన్న జంతువులుగా మట్టుంగఁ జేయంగనౌ?
    మండూకంబులె చచ్చుఁ దప్పక యికన్ మల్లాడ సర్పంబులున్
    మండూకంబులు భోజ్య వస్తువులు నౌ మర్కంపు జాత్యంతకున్

    రిప్లయితొలగించండి
  7. చొప్పడు నిద్దుర లేమిని
    నొప్పని రీతిగ దలంపు లొద్దిక పడగన్
    నిప్పుడె వచ్చిన కలలో
    కప్పలు సర్పములఁ జంపెఁ గద వెంకప్పా

    రిప్లయితొలగించండి
  8. కుప్పలుగా చెఱువున గల
    కప్పలఁ బాములు తినుటకు కౌతుక మొప్పన్
    చప్పున చేరగ, నొకటయి
    కప్పలు, సర్పములఁ జంపెఁ గద వెంకప్పా!

    రిప్లయితొలగించండి
  9. గొప్పగ పరిశోధించుచు
    ముప్పును దొలగించు మందుఁ బొందెడు కృషిలో
    తప్పని సరియై వైద్యుడు
    కప్పలు, సర్పముల జంపెగద వెంకప్పా!

    తప్పని యెంచక నాల్కకు
    తుప్పు వదల్చగ నెగబడి తురమగ నోటన్
    చప్పున గొని చైనీయులు
    కప్పలు, సర్పముల జంపెగద వెంకప్పా!

    గుండెల్ బిండెడు రీతినిన్ బ్రజల దా ఘోరంబుగా
    దోచగా
    మండే గుండెల స్వేచ్ఛగోరుచు నసామాన్యంపు పోరాటమున్
    దండించెన్ గ నిజామునే జనము పాదాక్రాంతునిన్
    జేయుచున్
    మండూకంబులు మట్టుబెట్టె గనుమా మల్లాడి సర్పంబులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'మండే' అనడం వ్యావహారికం.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువర్యా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
  10. అప్పటివిజయనగరమున
    గొప్పగు వింతలగణితము కుక్కలనచటన్
    చప్పునకుందేళ్ళుతరిమె
    కప్పలు సర్పములఁ జంపెఁ గద వెంకప్పా

    రిప్లయితొలగించండి
  11. ముప్పుల నూహించి యొకడు
    చప్పున రంగమున దూకి శౌర్యము తోడన్
    గుప్పించి యెగిరి నయ్యెడ
    కప్పలు ' సర్పముల జంపె గద వెంకప్పా!

    రిప్లయితొలగించండి
  12. కుప్పించుచు పురుగులఁదినె
    కప్పలు; సర్పములజంపెగద వెంకప్పా!
    తుప్పల నుండెడి ముంగిస
    చప్పున పుట్టలనుదూరి సంబరపడుచున్.

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గ్రంథుల్+ఒప్పంగ' అన్నపుడు యడాగమం రాదు. 'ఒప్పంగ నొకానొక' అనండి. 'ఒక రక కప్పలు' అనడం సాధువు కాదు.

      తొలగించండి
    2. కందం
      చెప్పిరి పరిశోధనమున
      లప్పున మ్రింగగ విషమయ లాలా గ్రంథుల్
      ఒప్పంగ నొకానొక తెగ
      కప్పలు సర్పములఁ జంపెఁ గద వెంకప్పా

      తొలగించండి

  14. తిప్పలు బెట్టుచు నాపై
    గొప్పలు జెప్పుచు వదిగొని కొండాడంగన్,
    ముప్పున బోనాడె, గనుమ....
    కప్పలు సర్పములజంపె గద వెంకప్పా!

    రిప్లయితొలగించండి
  15. నిండారన్ మది కోర్కి తెల్లదొరలన్ నిర్భీతిఁ దోలాడగన్
    తండంబుల్ గదియించ గాంధి తన స్వాతంత్ర్యంపు సంగ్రామమున్
    కొండాటమ్ముగ నెల్లరొక్కటయి సంకోచింపకన్ సల్పగా
    మండూకంబులు మట్టుపెట్టెఁ గనుమా మల్లాడి సర్పంబులన్

    రిప్లయితొలగించండి
  16. శా.

    కొండాడంగ బొలంబు గర్షకునిచే గుప్పించె గండూపదుల్
    దండోపాయము దర్దురంబు లెరుగన్ దండించగా నెర్రలన్
    మొండెంబుల్ బ్రతుకంగ జీవులగుటన్ మోదంబుగా నూతిలో
    *“మండూకంబులు మట్టుపెట్టెఁ గనుమా మల్లాడి సర్పంబులన్”*

    రిప్లయితొలగించండి
  17. ఎప్పుడు సూచిన నింగినిఁ
    గప్పుచు విహరించు చుండి కాఠిన్యమునన్
    గొప్పవి గ్రద్దలు పక్షుల
    కప్పలు సర్పములఁ జంపెఁ గద వెంకప్పా


    దండాకారము తిర్గు చుండి పర మోద్దండుండు దర్పోద్ధతిం
    గొండం తాకలి మ్రగ్గు చుండి వెస సంకోచింపకే మత్త వే
    దండప్రఖ్యుఁడు పక్షి నాథుఁడు గరుత్మంతుండు హర్షింపఁగా
    మండూకంబులు మట్టుపెట్టెఁ గనుమా మల్లాడి సర్పంబులన్

    రిప్లయితొలగించండి
  18. 1. కం//
    గొప్పది పల్నాటి చరిత
    నిప్పులకే చెదలుబట్టు నిజ గాధలనే !
    నొప్పారగ జెప్పునపుడు
    కప్పలు సర్పముల జంపెఁ గద వెంకప్పా !!

    2. కం//
    గొప్పగ రిపులను జంపగ
    చప్పున జలమున రుధిరము జరజర ప్రాకన్ !
    నిప్పులవలె భగ్గుమనగ
    కప్పలు సర్పముల జంపెఁ గద వెంకప్పా !!
    ✍️ Malli Siripuram srisailam.

    రిప్లయితొలగించండి
  19. షండుల్ గారయ పాండవుల్ గనుము రాజా, కారు కూపస్థమౌ
    మండూకంబులు, మట్టుపెట్టెఁ గనుమా మల్లాడి సర్పంబులన్
    చండార్కోపమ తేజితుండు విడి యజ్ఞాతంబు భీభత్సుఁడై
    గాండీవంబు ధరించి యస్త్రములసంఖ్యాకంబు సంధింపగా

    రిప్లయితొలగించండి