3, ఆగస్టు 2022, బుధవారం

సమస్య - 4152

4-8-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కొనుము ధరామర హితమనుకొని మాంసమ్మున్”
(లేదా...)
“కొనుమో భూసుర మద్య మాంసముల సంకోచమ్ము లేకుండగన్”

23 కామెంట్‌లు:

  1. కందం
    వినుమది మేలగు కూరలు
    కొనుము ధరామర హితమనుకొని, మాంసమ్మున్
    ఘనమనుకొని కొనకు సుమా
    కన భూసురులకు నిషేధ కారణ మవగన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. కందం
      నినుదీవింపగ పెళ్లికిఁ
      గనుమా! శూద్రులరుదెంచ కమ్మగ వారల్
      దినఁగన్ బంపుచు నన్యులఁ
      గొనుము ధరామర! హితమనుకొని మాంసమ్మున్

      మత్తేభవిక్రీడితము
      కనఁగన్ బెళ్లికి శూద్రులన్ బిలిచి శాకాహారమందించినన్
      నినుకీర్తింపక రచ్చచేయుదురహో నిర్మోహమున్ వీడుచున్
      దనరన్ వారికి వేరుగా వసతులందన్, బంపి వేరొక్కరిన్
      కొనుమో భూసుర! మద్య మాంసముల సంకోచమ్ము లేకుండగన్

      తొలగించండి
  3. వినినది సత్యము గాదను
    కొనుము ధరామర ! హితమనుకొని మాంసమ్మున్
    దినవలె , మన నైవేద్యమె
    మనపయి దయతో భవాని మాతయిడినదే

    రిప్లయితొలగించండి

  4. జనవంద్యుడు భూసురు గాం
    చినమూర్ఖుడొకండసూయచెంది పలికె తా
    జనులెల్లరి ముందిట్టుల
    కొనుము ధరామర హితమనుకొని మాంసమ్మున్.



    జనవంద్యుండగు విప్రునిన్ గనుచు నీర్ష్యాసూయలన్ బొంది కొ
    య్యనగాడార్యుని మొక్కబుచ్చుటొకటే యానందమంచున్ సదా
    యణకమ్మాడెడు వాడు పల్కెనిటులన్ హాస్యోక్తి గాసంతలో
    కొనుమో భూసుర మద్య మాంసముల సంకోచమ్ము లేకుండగన్.

    రిప్లయితొలగించండి
  5. అనెను వరూధిని సతిగాఁ
    గొనుము ధరామర హితమనుకొని, మాంసమ్మున్
    దినలేదెప్పుడు నికపై
    దినగాఁ గోరను నిజమిది తెలియుము దీనిన్

    రిప్లయితొలగించండి
  6. ధనమే ప్రభుత్వ లక్ష్యము
    ఘనముగ విక్రయముసల్పుగద మద్యంబున్
    తిననెంచినచో నంజుకు
    కొనుము ధరామర హితమనుకొని మాంసమ్మున్

    రిప్లయితొలగించండి
  7. కందము
    అనయము శాకంబులనే
    *కొనుము ధరామర!హితమను కొని;మాంసమ్మున్*
    గొనకు,తినకు దృఢమైన ప్ర
    తినఁబూనిచరించుమయ్య! ద్విజవర్యుఁడవై.

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. కొనుమో భూసుర మద్య మాంసముల సంకోచమ్ము లేకుండగన్
      వినగాఁ జోద్యముఁ గాదలంచితిని నీవే యిట్లుబల్కంగనౌ
      గనుమా శారద! భావి జీవితము ముక్కంటైన జేయంగునే
      బనిలేకుండగ వాగబో కుమసుమీ వార్ధక్య మందీవిధిన్

      తొలగించండి
  9. మత్తేభము
    ఘనవ్యాపారముగాఁదలంచుకొని వేడ్కన్ వేలముంబాడి గై
    *కొనుమా భూసుర!మద్యమాంసముల సంకోచంబు లేకుండగన్*
    గొనుమా!లాభము వచ్చు పట్టణములన్ కుగ్రామమందున్ సదా
    తిని త్రాగే జనులెక్కువై కొనగ ప్రీతిన్ నీకు మేలే యగున్.

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. కందం
      ఘన సోయా గింజల గై
      కొనుము ధరామర! హితమనుకొని; మాంసమ్మున్
      తినని జనులకును సమతుల
      మనదగు యశనము బడయగ నవియును చేరున్

      తొలగించండి
  11. మ:నిను నాచారము లేని వాడ వనుచున్ నిందించు సంఘమ్ము,పి
    ల్లను నీ కీయగ సంశయించును గదా!లజ్జించి నే డైన మే
    ల్కొనుమో భూసుర! మద్యమాంసముల సంకోచమ్ము లేకుండగన్
    గొను నీ రంధిని మాను మయ్య యశమున్ గూర్చున్ సదాచారమే.

    రిప్లయితొలగించండి
  12. కం:వినుమా !చిక్కుడు కాయల
    కొనుముధరామర! "హిత"మనుకొని, మాంసమ్మున్
    తినకుము, పేదల మాంస
    మ్మనుచున్ చిక్కుడును బిలుతు రందరు వైద్యుల్.
    (చిక్కుడు లో మాంసకృత్తు లెక్కువ.దానిని పేదల మాంసము అని సైన్స్ లో పేర్కొంటారు.ఓ బ్రాహ్మణుడా!మాంసమే మంచి అనుకోక చిక్కుడు కాయలు తిను.)

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. తినుటకు నిట శాకంబులు
      కొనుము ధరామర హితమనుకొని మాంసమ్మున్
      గొనుయంగడి వేరొక చో
      టునగట్టిరభయమునుఁగొనుడోభూసురుఁడా

      తొలగించండి
  14. తినవలె శాకములనుకొని
    కొనుము ధరా మర హితము గొని :మాంసమ్మున్
    తినుట విడుతు నని ప్రతినగ
    మనవలె విప్రులు సతతము మహిలో గదరా

    రిప్లయితొలగించండి
  15. అనయంబున్ హరి పాదపద్మ భజనం బాధ్యాత్మికంబైన చిం
    తనమున్ ధర్మనిబద్ధ వర్తనములన్ ధన్యంపు సత్సంగ జీ
    వనమున్ గల్గిన సాధువర్తనులకున్ వర్జ్యంబులౌనంచుఁ బే
    ర్కొనుమో భూసుర! మద్య మాంసముల సంకోచమ్ము లేకుండగన్

    రిప్లయితొలగించండి
  16. మును భూ దేవులు మాంస
    మ్మును యజ్ఞావసరముల సమోదము గొనరే
    చని యాగమ్మున కింపుగఁ
    గొనుము ధరామర హిత మనుకొని మాంసమ్మున్


    కను దూరమ్మున నుండు నీ పతనమే కార్యక్షయంబౌ వెసన్
    మనమం దుండదు ధర్మ చింతనము సమ్మానంబు శూన్యం బగున్
    వినమే భ్రష్టున కెట్టి త్యాజ్యములు నీ విశ్వంబు లో లేవనం
    గొనుమో భూసుర మద్య మాంసముల సంకోచమ్ము లేకుండఁగన్

    రిప్లయితొలగించండి
  17. తినుమీ ఫలములు,పాలను
    కొనుము ధరామర హితమనుకొని, మాంసమ్మున్”*
    తినవనుచు నెరిగిదెచ్చితి
    పనసఫలమ్మునుముదమున. భక్షించుమయా

    2.అనయమ్మింటనుపూజలన్ వ్రతములన్ హర్షంబుతో డన్సదా
    ఘనమౌ రీతిగ నాచరిం తువని నాకర్ణించితిన్ పండిదే
    కొనుమో భూసురమద్యమాంసముల సంకోచమ్ములేకుండగన్
    వనితారత్నమునింటశాకములతోవండెన్నిదేసత్యమౌ

    రిప్లయితొలగించండి