18-8-2022 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము”(లేదా...)“మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్”
మునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము సత్య మదియ గంగను మున్గ చావు వచ్చు మునుగ గంగను వచ్చిన మోక్ష ము,వెసఁమునుగఁ బోదును గాశికి ముదము తోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాప భీతియె లేనట్టి స్వార్థ పరులమగుచు ధనము నార్జింప నక్రమములజేసి కుత్సితులమయి కాశి జని యచటమునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము.
పాపములెపుడుబోవును వారణాశియందు,హరినేమి యడిగెనా యన్నమయ్య,కామిగాకున్న చో మోక్ష గామమెపుడు,మునుగ గంగలో, మోక్షము, బొందలేము
తేటగీతిస్వార్థచిత్తమ్ము పురిగొల్ప పరులఁదోచిధర పరోపకారమునెంచు వరుస మఱచియిరుగుపొరుగు వారలవెంట నరిగి కాశిమునుఁగ గంగలో మోక్షముఁ బొందలేముచంపకమాలపనిగొని దోచుచున్ బరుల, స్వార్థపరత్వము హద్దుమీరుచున్మనక పరోపకారమున నల్గురు మెచ్చెడు రీతి లేదనన్బొనరుచుఁ బిల్వగా నిరుగుపొర్వుల తోడను కాశికేగియున్మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు సేరిరి జాహ్నవీతటిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
వినుమిక మిత్రమా! మిగులవేదన నొందగనేల? నీదరిన్తనువున దాగియున్నదికదా! పరితాపము ద్రోల నాత్మయే!యనువున పాపకర్మములనాహుతి జేసి చెలంగ నేలనో?!మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పూర్వులు నుడివినట్లుగ మూడుమార్లుమునుఁగ గంగలో మోక్షముఁ బొందలేముతెగులు తప్పకుండగ వచ్చు , గల్మషము పెరిగె గద యీకాలమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూడవ పాదం అసంపూర్ణంగా ఉన్నది.
🙏🏽సవరణతోపూర్వులు నుడివినట్లుగ మూడుమార్లుమునుఁగ గంగలో మోక్షముఁ బొందలేముతెగులు తప్పకుండగ వచ్చు దేహమునకు ;కల్మషము పెరిగె గద యీకాలమందు
మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్ వినగను మూర్ఖు లేయనుచు వేమఱు నమ్ముదు నట్టివారినిన్ ననఘులు గంది శంకరుల నానతిఁ జొప్పున గాశి కేగి ,యా గణపతి దండ్రి యౌశివుని గారవ మొప్పగ వేడుకొందు సూ.
అనిశము పాపకార్యముల నాపక చేసెడి స్వార్థచిత్తులే ఘనులగు పండితోత్తములు గంగ మహాత్మ్యము గూర్చి చెప్పగావిని తమ దుష్కృతమ్ములను వీడక కాశికి బోయి గంగలో మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్.
మంచి గుణములు కరవైన మానసమునసత్ప్రవర్తన కనరాదు శాంతి లేదుపరమపథమును జేరగ పరితపించిమునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము
అంతు లేనట్టి పాపము లాచ రించిపరుల సిరిసంపదలనెల్ల వడిగ దోచికపట భక్తి ప్రదర్శించి కాశి కేగిమునుగ గంగలో మోక్షము బొంద లేము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఉ.*మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్*కనికరమున్ సమర్థనము గాంచక శోధన భారతీయులన్గనుచును వారణాసి పుర గంధము నాల్డసు హగ్స్లి వ్యాసమున్మనుచుచు వ్రాసె గర్వమున మన్నన నొల్లక నాంగ్ల భాషలో.....................ఆల్డసు హగ్స్లి...... ఇంగ్లండ్ రచయిత.
చేయ రానట్టి దొసగులు చేయు చుండిద్రోహ బుద్ధి తొ చరియించు దుష్టు లగుచుయాత్ర కై వెళ్లి కాశి లో వేడుకలరమునుగ గంగలో మోక్షము బొందలేము
"బుద్ధితో... యాత్రకై యేగి" అనండి (వెళ్లి అన్నది వ్యావహారికం)
తెలంగాణా రాష్ట్రేతరులైన కవులు క్రింది పూరణము అపార్థం చేసుకోకండి.🙏🙏తెనుగుకు రెండు రాష్ట్రములు, తేలని పోరని నాటి నాయకుల్జనములు నమ్మ బల్కి, తెగ జాణతనమ్మును జూపిరప్డు, పాలనమున దోచవచ్చునని లాఘవ మెంతయొ జూపి, నేడిటుల్మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్.
ఆటవెలదికలుగు గాదె *మునుగ గంగలో మోక్షము,పొందలేము* భూరి పుణ్యములనుకాశికేగకుండ;కాన విశ్వేశ్వరునన్నపూర్ణఁగొలువ నఘముఁదొలగు.చంపకమాలధనకనకంబులన్ సతము దారులఁగాచియు తస్కరించి,కూడని పనులెల్లఁజేయుచును డంబము మీఱగ దొంగభక్తులై*మునిగిన మోక్షమబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీ తటిన్*పనివడి మ్రింగె నక్రములు వారలు స్నానముఁజేయ నక్కటా!
అనయము దుష్ట కర్మలును హత్యలుజేసి గడించి కాసులన్మనుగడ జేయు వారలును మానసమందున బెర్గుచున్న యాఘనమగు పాతకమ్ములును గ్రన్నన దూరమువోయి గంగలోమునిగిన మోక్షమబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీ తటిన్
అడ్డ దారులందునడచి యక్రమముగధనమునార్జించి సతతముదైవమునకుముడుపులను కట్టి కాశిలో మొక్కు దీర్చి మునుగ గంగలో మోక్షము బొంద లేము ".
ధనమె ప్రాధాన్యమనిదల్చి ధరను జనులుమునుపు నేర్చిన సద్గుణములను వీడిఅనుచితమ్మగు కార్యాలు ఆచరించిమునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము
మీ పూరణ బాగున్నది. అభినందనలు."కార్యము లాచరించి" అనండి.
ధన్యవాదములు
కనుమిను గానరాక విషకాంక్షల జాలమునందు మ్రగ్గియున్అనిశము స్వార్థ చింతనతొ అక్రమమార్గములన్ని జొచ్చి యవ్వనముడగంగనెల్ల తమ పాపపు కర్మల భీతి నొందుచున్మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'చింతనతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "చింతనను" అనండి. అలాగే "యౌవనము/జవ్వనము" అనండి. 'యవ్వనము' అనడం సాధువు కాదు.
సూచనలకు ధన్యవాదములు. ముఖ్యంగా "యవ్వనము" పద ప్రయోగంపై.
తేటగీతిసుమతి శతకము చదివిన సుమతులవము!' గీత' గ్రంథముండినను ముక్తిడదదియును!మునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము!చిత్త, వాక్య, కర్మల శుద్ధి చింత లేక!
క్రొవ్విడి వెంకట రాజారావు: కపట చేష్టల నెంచుచు కాసు కొఱకు తోడివారల నెల్లను దుద్దువెట్టి ఘనుల వెంటను గొప్పగా కాశి కేగి మునుగ గంగలో మోక్షము బొంద లేము.
క్రొవ్విడి వెంకట రాజారావు: అనయము తోడివారలకు నర్మిలిబంచెడి కర్తలై కడున్ వినయము జూపి చొక్కిడుచు విత్తము దొంగతనమ్ముజేయుచున్ చని ఘనమైన వేడుకను సల్పుచు నంత్యమునందు కాశిలో మునిగిన మోక్షమబ్బునని మూర్ఖులు జేరిరి జాహ్నవీ తటిన్.
చం.మా.ధనమను మత్తులోబడుచు ధర్మము వీడుచు సంచరించుచున్బనిగొని మోసమార్గమున బాపపు చేష్టల సంగ్రహించుచున్ఘనముగ భక్తి జూపుచును గాశికి బోవగ నందు గంగలోమునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్
అనయము పాపచింతనల నంతము చేతలు దోషయుక్తముల్ధనమును రాజ్యమున్ గొన నధర్మపథమ్మున సంచరింతు వీవొనరగ కీర్తికోసమె సుయోధన! దానము జేతువిట్లగామునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్కంజర్ల రామాచార్య
మును దము సల్పు గర్మలును మున్గగ గంగను వెంటరావనిన్ మనమున భక్తి యీశునకు మాలలు బాలును నీయ కాశికిన్జని నవమాస దీక్షలను జాహ్నవి పూర్ణల విశ్వనాధుకున్ “మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్”కనుగొనలేరు వీడవవి గల్గును గర్మలు సంచితంబులన్
తేటగీతిఎఱుకతో పాపపు పనులు యెగసి పడుచుజేసి ,పాప శమనముకై చేరె కాశిగంగను తలచి ముచ్చట గానె తాముమునుగ గంగలో మోక్షము బొంద లేము.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
అనయము దుష్టమౌ తలపు లందున మున్గుచు, జీవితమ్ములోమునుకొని దౌష్ట్యముల్ సలిపి పొందుచు హ్లాదము మానసమ్ములోకనుగొని నారకమ్ముఁ బడు కష్టములన్ మది, భీతినొందుచున్ మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్
చిత్త శుద్ధి లేక దేవతా చింత లేక భూత దయ లేక కారుణ్య బుద్ధి లేక పాప భీతి లేక యనృత భయము లేకమునుఁగ గంగలో మోక్షముఁ బొంద లేముకని విని నేర నట్టి వగు కార్యము లెన్నియొ ఘోర భంగిఁ దామొనరిచి కీడు నెల్లరకు నుర్వి నొసంగుచు స్వీయ వృద్ధికైకనికర మింత లేకయు సుఖమ్ముగఁ బాపము లెన్ని సేసినన్ మునిఁగిన మోక్ష మబ్బు నని మూర్ఖులు చేరిరి జాహ్నవీ తటిన్
మరొక పూరణడా బల్లూరి ఉమాదేవిమనమునపాడుబుద్ధులునమానుషరీతిగనిండియుండగావినయముచూపునట్టులిలవేషముమార్చుచుసంచరించుచున్జనులనుమోసగించుచునుసాగుదురాత్ములుదల్చుచెల్లరున్మునిగిన మోక్షమబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్
పిన్నక నాగేశ్వరరావు.ధనము నార్జించుటే ధ్యేయమనుచు తలచిపాప కార్యములన్ జేసి స్వార్ధపరులమై చరించి పాపపు భీతి మరచి, వారణాసికేగి శివుని ప్రార్ధనల్ సలుపుచుమునుగ గంగలో మోక్షముఁ బొందలేము.
మునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము
రిప్లయితొలగించండిసత్య మదియ గంగను మున్గ చావు వచ్చు
మునుగ గంగను వచ్చిన మోక్ష ము,వెసఁ
మునుగఁ బోదును గాశికి ముదము తోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపాప భీతియె లేనట్టి స్వార్థ పరుల
మగుచు ధనము నార్జింప నక్రమముల
జేసి కుత్సితులమయి కాశి జని యచట
మునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాపములెపుడుబోవును వారణాశి
రిప్లయితొలగించండియందు,హరినేమి యడిగెనా యన్నమయ్య,
కామిగాకున్న చో మోక్ష గామమెపుడు,
మునుగ గంగలో, మోక్షము, బొందలేము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిస్వార్థచిత్తమ్ము పురిగొల్ప పరులఁదోచి
ధర పరోపకారమునెంచు వరుస మఱచి
యిరుగుపొరుగు వారలవెంట నరిగి కాశి
మునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము
చంపకమాల
పనిగొని దోచుచున్ బరుల, స్వార్థపరత్వము హద్దుమీరుచున్
మనక పరోపకారమున నల్గురు మెచ్చెడు రీతి లేదనన్
బొనరుచుఁ బిల్వగా నిరుగుపొర్వుల తోడను కాశికేగియున్
మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు సేరిరి జాహ్నవీతటిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండివినుమిక మిత్రమా! మిగుల
రిప్లయితొలగించండివేదన నొందగనేల? నీదరిన్
తనువున దాగియున్నదిక
దా! పరితాపము ద్రోల నాత్మయే!
యనువున పాపకర్మముల
నాహుతి జేసి చెలంగ నేలనో?!
మునిఁగిన మోక్ష మబ్బునని
మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపూర్వులు నుడివినట్లుగ మూడుమార్లు
రిప్లయితొలగించండిమునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము
తెగులు తప్పకుండగ వచ్చు ,
గల్మషము పెరిగె గద యీకాలమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదం అసంపూర్ణంగా ఉన్నది.
🙏🏽
తొలగించండిసవరణతో
పూర్వులు నుడివినట్లుగ మూడుమార్లు
మునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము
తెగులు తప్పకుండగ వచ్చు దేహమునకు ;
కల్మషము పెరిగె గద యీకాలమందు
మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్
రిప్లయితొలగించండివినగను మూర్ఖు లేయనుచు వేమఱు నమ్ముదు నట్టివారినిన్
ననఘులు గంది శంకరుల నానతిఁ జొప్పున గాశి కేగి ,యా
గణపతి దండ్రి యౌశివుని గారవ మొప్పగ వేడుకొందు సూ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅనిశము పాపకార్యముల నాపక చేసెడి స్వార్థచిత్తులే
ఘనులగు పండితోత్తములు గంగ మహాత్మ్యము గూర్చి చెప్పగా
విని తమ దుష్కృతమ్ములను వీడక కాశికి బోయి గంగలో
మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమంచి గుణములు కరవైన మానసమున
రిప్లయితొలగించండిసత్ప్రవర్తన కనరాదు శాంతి లేదు
పరమపథమును జేరగ పరితపించి
మునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅంతు లేనట్టి పాపము లాచ రించి
రిప్లయితొలగించండిపరుల సిరిసంపదలనెల్ల వడిగ దోచి
కపట భక్తి ప్రదర్శించి కాశి కేగి
మునుగ గంగలో మోక్షము బొంద లేము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ.
రిప్లయితొలగించండి*మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్*
కనికరమున్ సమర్థనము గాంచక శోధన భారతీయులన్
గనుచును వారణాసి పుర గంధము నాల్డసు హగ్స్లి వ్యాసమున్
మనుచుచు వ్రాసె గర్వమున మన్నన నొల్లక నాంగ్ల భాషలో.
....................
ఆల్డసు హగ్స్లి...... ఇంగ్లండ్ రచయిత.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేయ రానట్టి దొసగులు చేయు చుండి
రిప్లయితొలగించండిద్రోహ బుద్ధి తొ చరియించు దుష్టు లగుచు
యాత్ర కై వెళ్లి కాశి లో వేడుకలర
మునుగ గంగలో మోక్షము బొందలేము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"బుద్ధితో... యాత్రకై యేగి" అనండి (వెళ్లి అన్నది వ్యావహారికం)
తొలగించండితెలంగాణా రాష్ట్రేతరులైన కవులు క్రింది పూరణము అపార్థం చేసుకోకండి.🙏🙏
రిప్లయితొలగించండితెనుగుకు రెండు రాష్ట్రములు, తేలని పోరని నాటి నాయకుల్
జనములు నమ్మ బల్కి, తెగ జాణతనమ్మును జూపిరప్డు, పా
లనమున దోచవచ్చునని లాఘవ మెంతయొ జూపి, నేడిటుల్
మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండికలుగు గాదె *మునుగ గంగలో మోక్షము,
పొందలేము* భూరి పుణ్యములను
కాశికేగకుండ;కాన విశ్వేశ్వరు
నన్నపూర్ణఁగొలువ నఘముఁదొలగు.
చంపకమాల
ధనకనకంబులన్ సతము దారులఁగాచియు తస్కరించి,కూ
డని పనులెల్లఁజేయుచును డంబము మీఱగ దొంగభక్తులై
*మునిగిన మోక్షమబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీ తటిన్*
పనివడి మ్రింగె నక్రములు వారలు స్నానముఁజేయ నక్కటా!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఅనయము దుష్ట కర్మలును హత్యలు
రిప్లయితొలగించండిజేసి గడించి కాసులన్
మనుగడ జేయు వారలును మానస
మందున బెర్గుచున్న యా
ఘనమగు పాతకమ్ములును గ్రన్నన దూర
మువోయి గంగలో
మునిగిన మోక్షమబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీ తటిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅడ్డ దారులందునడచి యక్రమముగ
రిప్లయితొలగించండిధనమునార్జించి సతతముదైవమునకు
ముడుపులను కట్టి కాశిలో మొక్కు దీర్చి
మునుగ గంగలో మోక్షము బొంద లేము ".
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధనమె ప్రాధాన్యమనిదల్చి ధరను జనులు
రిప్లయితొలగించండిమునుపు నేర్చిన సద్గుణములను వీడి
అనుచితమ్మగు కార్యాలు ఆచరించి
మునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కార్యము లాచరించి" అనండి.
ధన్యవాదములు
తొలగించండికనుమిను గానరాక విషకాంక్షల జాలమునందు మ్రగ్గియున్
రిప్లయితొలగించండిఅనిశము స్వార్థ చింతనతొ అక్రమమార్గములన్ని జొచ్చి య
వ్వనముడగంగనెల్ల తమ పాపపు కర్మల భీతి నొందుచున్
మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చింతనతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "చింతనను" అనండి. అలాగే "యౌవనము/జవ్వనము" అనండి. 'యవ్వనము' అనడం సాధువు కాదు.
సూచనలకు ధన్యవాదములు. ముఖ్యంగా "యవ్వనము" పద ప్రయోగంపై.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిసుమతి శతకము చదివిన సుమతులవము!
' గీత' గ్రంథముండినను ముక్తిడదదియును!
మునుఁగ గంగలో మోక్షముఁ బొందలేము!
చిత్త, వాక్య, కర్మల శుద్ధి చింత లేక!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికపట చేష్టల నెంచుచు కాసు కొఱకు
తోడివారల నెల్లను దుద్దువెట్టి
ఘనుల వెంటను గొప్పగా కాశి కేగి
మునుగ గంగలో మోక్షము బొంద లేము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅనయము తోడివారలకు నర్మిలిబంచెడి కర్తలై కడున్
వినయము జూపి చొక్కిడుచు విత్తము దొంగతనమ్ముజేయుచున్
చని ఘనమైన వేడుకను సల్పుచు నంత్యమునందు కాశిలో
మునిగిన మోక్షమబ్బునని మూర్ఖులు జేరిరి జాహ్నవీ తటిన్.
చం.మా.
రిప్లయితొలగించండిధనమను మత్తులోబడుచు ధర్మము వీడుచు సంచరించుచున్
బనిగొని మోసమార్గమున బాపపు చేష్టల సంగ్రహించుచున్
ఘనముగ భక్తి జూపుచును గాశికి బోవగ నందు గంగలో
మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్
అనయము పాపచింతనల నంతము చేతలు దోషయుక్తముల్
రిప్లయితొలగించండిధనమును రాజ్యమున్ గొన నధర్మపథమ్మున సంచరింతు వీ
వొనరగ కీర్తికోసమె సుయోధన! దానము జేతువిట్లగా
మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్
కంజర్ల రామాచార్య
మును దము సల్పు గర్మలును మున్గగ గంగను వెంటరావనిన్
రిప్లయితొలగించండిమనమున భక్తి యీశునకు మాలలు బాలును నీయ కాశికిన్
జని నవమాస దీక్షలను జాహ్నవి పూర్ణల విశ్వనాధుకున్
“మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్”
కనుగొనలేరు వీడవవి గల్గును గర్మలు సంచితంబులన్
తేటగీతి
రిప్లయితొలగించండిఎఱుకతో పాపపు పనులు యెగసి పడుచు
జేసి ,పాప శమనముకై చేరె కాశి
గంగను తలచి ముచ్చట గానె తాము
మునుగ గంగలో మోక్షము బొంద లేము.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
అనయము దుష్టమౌ తలపు లందున మున్గుచు, జీవితమ్ములో
రిప్లయితొలగించండిమునుకొని దౌష్ట్యముల్ సలిపి పొందుచు హ్లాదము మానసమ్ములో
కనుగొని నారకమ్ముఁ బడు కష్టములన్ మది, భీతినొందుచున్
మునిఁగిన మోక్ష మబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్
చిత్త శుద్ధి లేక దేవతా చింత లేక
రిప్లయితొలగించండిభూత దయ లేక కారుణ్య బుద్ధి లేక
పాప భీతి లేక యనృత భయము లేక
మునుఁగ గంగలో మోక్షముఁ బొంద లేము
కని విని నేర నట్టి వగు కార్యము లెన్నియొ ఘోర భంగిఁ దా
మొనరిచి కీడు నెల్లరకు నుర్వి నొసంగుచు స్వీయ వృద్ధికై
కనికర మింత లేకయు సుఖమ్ముగఁ బాపము లెన్ని సేసినన్
మునిఁగిన మోక్ష మబ్బు నని మూర్ఖులు చేరిరి జాహ్నవీ తటిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమరొక పూరణ
రిప్లయితొలగించండిడా బల్లూరి ఉమాదేవి
మనమునపాడుబుద్ధులునమానుషరీతిగనిండియుండగా
వినయముచూపునట్టులిలవేషముమార్చుచుసంచరించుచున్
జనులనుమోసగించుచునుసాగుదురాత్ములుదల్చుచెల్లరున్
మునిగిన మోక్షమబ్బునని మూర్ఖులు చేరిరి జాహ్నవీతటిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
ధనము నార్జించుటే ధ్యేయమనుచు తలచి
పాప కార్యములన్ జేసి స్వార్ధపరుల
మై చరించి పాపపు భీతి మరచి, వార
ణాసికేగి శివుని ప్రార్ధనల్ సలుపుచు
మునుగ గంగలో మోక్షముఁ బొందలేము.