15, ఆగస్టు 2022, సోమవారం

సమస్య - 4163

16-8-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలువలు పవలు పూఁచెను గగనమందు”
(లేదా...)
“కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివా సత్కవీ”

36 కామెంట్‌లు:

  1. శశిని గని‌ పూచు పూలేవి,చంద్ర డెపుడు
    రాడు, కమలము లేమాయె రవిని‌ గాంచి,
    మేఘములు చరించు ప్రదేశమేది తెలుపు
    కలువలు, పవలు పూచెను, గగన మందు

    రిప్లయితొలగించండి

  2. చంద్రునిగని విరిసిన పుష్పములవేవి?
    శ్రాహ్వములెపుడు పూచెను రవిని గాంచి?
    తారకములు మెరయునట్టి స్థలమదేది?
    కలువలు, పవలు పూఁచెను, గగనమందు.

    రిప్లయితొలగించండి
  3. పూఁచు రాత్రులు మాత్రమే పూయ వు సుమ
    కలువలు పవలు,పూచెను గగన మందు
    గగన కుసుమాలు నాఁ బడు మృగశిర మొద
    లగు నిరువది యేడునుదార లై వెలుగుట

    రిప్లయితొలగించండి
  4. శా.గుండెల్దీసిన బంటులై బడుగులం గ్రొవ్వెక్కి వేధించు,ప
    ప్పుండల్ మెక్కెడు రీతి జీవ,ధనసర్వస్వమ్ములన్ దోచు దో
    ర్దండోర్జస్వులు రాజులీల్గె మును బాధాతప్తమర్త్యాళిచేన్
    మండూకమ్ములు మట్టుపెట్టెఁగనుమా మల్లాడి సర్పంబులన్.
    ....చంద్రమౌళి రామారావు, బాపట్ల.

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    పుష్పకమున నయోధ్యకు పోవు కతన
    రామచంద్రుని స్తోత్రింప ప్రముఖులెల్ల
    ప్రభునిఁ గాంచిన జానకీ రమణి కనుల
    కలువలు పవలు పూఁచెను గగనమందు!

    మత్తేభవిక్రీడితము
    పులకింపంగను వేచి చూచు ఘడియల్ ముందుండి దేదీప్యమై
    యలరన్ బుష్పకమందయోధ్య పథమై యారామ చంద్రుండటన్
    జెలఁగన్ శ్రేష్ఠులు స్తోత్రరాజములతో సీతమ్మ కన్దోయినన్
    కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివా సత్కవీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. సవరించిన మత్తేభవిక్రీడితము

      మత్తేభవిక్రీడితము
      పులకింపంగను వేచి చూచు ఘడియల్ ముందుండి దేదీప్యమై
      యలరన్ బుష్పకమందయోధ్య పథమై యారామ చంద్రుండటన్
      జెలఁగన్ శ్రేష్ఠులు స్తోత్రరాజములతో సీతమ్మ కన్దోయియన్
      గలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివా సత్కవీ!

      తొలగించండి
  6. రాత్రి యే పూలు వికసించు రమ్య ముగను?
    రవి తనెప్పుడు కన్పించి రహి యొనర్చు?
    తారకలు పూయు నె చ్చో ట తనరు నట్లు?
    కలువలు. పవలు. పూయునుగగన మందు

    రిప్లయితొలగించండి

  7. జలవాహమ్ములు వాయు వర్త్మమున సంచారమ్మునే జేయుచున్
    బలురూపమ్ముల మార్చుచుండ గనుచున్ బ్రాజ్ఞిల్లు డచ్చోటనే
    కలువాకారపు మేఘమొక్కటిని తాగాంచంగనే పల్కెనే
    కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివా సత్కవీ.

    రిప్లయితొలగించండి
  8. కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివా సత్కవీ !
    కలలోఁ జూచితిఁ బూచునట్లు గను నాగాఢాంధ కారంబునన్
    విలసత్కాంచన పుష్పమాదిరిగ వేవేలన్ సరాగాలతో
    నలమెన్నాకస మంతయున్మిగుల యాహాచోద్యమౌగా యనన్

    రిప్లయితొలగించండి
  9. అమెరికా పయనమునకా యతివకన్న
    కలలు సాకార మొందగ గగనయాన
    మందు మరిమరి మురిసిన మగువ కనుల
    కలువలు పవలు పూచెను గగనమందు

    రిప్లయితొలగించండి
  10. రాజకీయ పక్షమొకటి రాష్ట్రమందు
    తమ సభను నిర్వహించెడి తరుణ ము , దమ
    యెరుకయగు పుష్పపు పతాక మెగురవేయ
    కలువలు పవలు పూఁచెను గగనమందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పలుమారుల్లవధానముంజలుప దా భావంబులో నెంచి తా
      నలుపున్ జెందక చేసె యత్నము సదా
      యత్యంత పంతంబుతో
      గెలిచెన్ జేసియు గొప్పగా చివరకున్ గీర్తించ
      విద్వాంసులున్
      కలువల్ బూసె వియత్తలంబున బవల్ గన్గొంటివా సత్కవీ

      తొలగించండి
  11. చెలుని తలపులు చిగురించి చెంగలించ
    కలల గగనానికెగసెను చెలియ మనసు
    వేఁడివేలుపు కరముల వాఁడి తరిగి
    కలువలు పవలు పూఁచెను గగనమందు

    రిప్లయితొలగించండి
  12. ఆటవెలది
    నిశల నమృత కిరణు నింగినిఁగాంచియు
    నలరుబోఁడి! పూచె కొలనులోన
    విపులముగను*కలువలు;పవలు పూచెను
    గగనమందు*రవినిఁగాంచి నళిని.

    రిప్లయితొలగించండి
  13. అలుకన్ బూనిన సత్య కోపగృహమం దావేదనా చిత్తయై
    విలపింపన్దరిచేరి మాధవుఁడు దేవేరీ కటాక్షించినీ
    యలుకన్ మానుమటంచు వేడ సఖితా నానందమున్ బొందగా
    కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివా సత్కవీ

    రిప్లయితొలగించండి
  14. వలువల్ దోచిన గోపబాలుడని యా వన్నెన్ మరీ దెల్పుచూ
    చెలువంబున్ వని యాటపాటలను దోచే మాన,ప్రాణంబులన్
    గలనే గాంచుచు నీవనూహ్యములనే గల్పించి వ్రాసేవులే
    కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివా సత్కవీ!

    రిప్లయితొలగించండి

  15. చెలువంబింతని జెప్పలేను చెలియా జేతల్ మరా బల్కులున్
    కలలున్ మీరియు వింతశోభలును నా గావ్యంపు రూపున్ గనన్
    కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివా సత్కవీ!
    వలదన్ వీడక మారుడేల శరమే వాడిన్ భళా వేసెనో
    ఇలనన్ బూయవు కల్వలేల నహ యా నింతిన్ దరే జేరకన్

    రిప్లయితొలగించండి
  16. తరణినిగనుచునడలుచు తలలువాల్చె
    కలువలు,పవలుపూచెను గగనమందు
    రవినిగాంచకమలములు రయము గాను
    నిత్యకృత్యమిదియటండ్రునింగియందు

    రిప్లయితొలగించండి
  17. తులువన్ రావణు ద్రుంచి స్వస్థలికి సంతోషంబునందేగెడిన్
    కొలువై పుష్పక వాహనంబునటు శ్రీ కోదండ రామాంకమున్
    చెలువంబొప్పుగ దర్శనంబిడె గనన్ సీతన్ ప్రసన్నాక్షినిన్
    కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివా సత్కవీ

    రిప్లయితొలగించండి
  18. చిత్రములు గాలి పటములు సెలఁగి యెగుర
    వేయు చుండఁగ బాలురు విరివి గాను
    వింతఁ జూచు వారికిఁ దోఁచె నంత నిట్లు
    కలువలు పవలు పూఁచెను గగన మందు

    కలలం దైనను మాన వాలి కిలలోఁ గాంచంగ డెందమ్ము ని
    శ్చలమై యుండదు భావ జాలములు సంజాతమ్ములౌ నిత్యమున్
    లలి తాకాశమువోలె స్వాంతము కడున్ రాజిల్ల భావమ్ము లం
    గలువల్ పూఁచె వియత్తలమ్మునఁబవల్ గన్గొంటివా సత్కవీ

    [భావమ్ములు + అన్ = భావమ్ము లన్]

    రిప్లయితొలగించండి
  19. మ.

    ఉలుకంగన్ సవతాలు కద్రువ హయంబుచ్చైశ్శ్రవంబున్ గనెన్
    కలయో వైష్ణవ మాయయో వినత తోకన్ జూసి శ్వేతంబనెన్
    చెలరేగంగఁ గళత్రముల్ మదిని విచ్చేయంగ శుక్లమ్ములౌ
    కలువల్ పూచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివా సత్కవీ !

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.
    (క్రమాలంకారము)

    శశిని గనిన విరియునేవి చక్కగాను
    కమలము లెపుడు పూచె భాస్కరుని గాంచి?
    తారకలు నిశిని మెరయు తావదేది?
    కలువలు; పవలు పూచెను; గగనమందు.

    రిప్లయితొలగించండి