5, ఆగస్టు 2022, శుక్రవారం

సమస్య - 4154

6-8-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చరణముల్ దెగి నటియించె చక్కనమ్మ”
(లేదా...)
“చరణంబుల్ దెగి నాట్యమాడె నటియే సభ్యుల్ ప్రశంసింపఁగన్”

16 కామెంట్‌లు:

 1. నటన యందున గలయట్టి నలువ వలన
  చరణముల్ దెగి నటియించె చక్కనమ్మ
  కృత్రిమంబగు గాళ్ళను గూర్చ గాను
  నాశిసు లిడుదు నామెకు హర్ష మొదవ

  రిప్లయితొలగించు
 2. తేటగీతి
  నాట్యవిద్యలో నటరాజు నైపుణిఁగొని
  భారతామృతోత్సవ వేదిఁ బాలుగొనుచు
  మేనుపుల్కలౌ భావాన గానమందుఁ
  జరణముల్ దెగి, నటియించె చక్కనమ్మ!

  మత్తేభవిక్రీడితము
  నిరతిన్ దా నటరాజు నెమ్మిఁగొని చిందింపంగ కౌశల్యమున్
  భరతాంబా యమృతోత్సవంపు ఘనతన్ బాల్గొంచు భక్త్యాత్మయై
  సురలున్ ధారగఁ బూలవానఁగురియన్ సొంపారుగానంబునన్
  జరణంబుల్ దెగి, నాట్యమాడె నటియే సభ్యుల్ ప్రశంసింపఁగన్

  రిప్లయితొలగించు
 3. చరణంబుల్ సరి క్రొత్తవై కృతకమౌసాకారమౌరీతిగా
  వరవడ్రంగుడుఁ జేయగా నతుక నాభాసంబునై యొప్పగా
  చరణంబుల్ దెగి నాట్యమాడె నటియే సభ్యుల్ ప్రశంసింపఁగన్
  గరమున్ మోడ్తును నామెకున్మిగుల సాగై దేహమింపారగన్

  రిప్లయితొలగించు

 4. నాట్యమన్న నిష్టమటంచు నారి సుధయె
  కాలమది కాటువేసిన గ్రక్కతిల్ల
  దయ్యె కృత్రిమ పాదమున్ దాల్చి యపుడు
  చరణముల్ దెగి నటియించె చక్కనమ్మ


  కరుణన్ వీడిన కాలమయ్యది తనన్ గాటేసినన్ ధైర్యమున్
  పిరమౌనాట్యము వీడబోననుచు తా బింకమ్ముతో నోషధీ
  ధరుడందింపగ కృత్రిమమ్మయిన పాదంబొక్కటిన్ దాల్చుచున్
  జరణంబుల్ దెగి నాట్యమాడె నటియే సభ్యుల్ ప్రశంసింపఁగన్.

  రిప్లయితొలగించు
 5. కాలు గోల్పోయి నన్ గాని కష్ట పడియు
  నేర్చుకొనె తాను నాట్యమ్ము నీరజాక్షి
  చరణము ల్ తెగి నటి యించె చక్క నమ్మ
  యనుచు పొగడరి ప్రేక్షకుల్ హర్ష మొదవ

  రిప్లయితొలగించు
 6. పొరుగు పురము జనిననాటి ముప్పు నందు
  చరణముల్ దెగి ; నటియించె
  చక్కనమ్మ
  దరిమిల నమర్చి నట్టి పాదముల తోడ ,
  పుర జనులు దానిగని కడుముదము నొంద

  రిప్లయితొలగించు
 7. ఆటవెలది
  నాట్యవేదికపయి నటియించుచుండగా
  నకట!క్రిందఁబగిలినట్టి గాజు
  ముక్కలుండ*చరణముల్ దెగి నటియించె
  చక్కనమ్మ* నెత్రు చుక్కలు పడ.

  రిప్లయితొలగించు
 8. అభినయమ్మున నామెకునామె సాటి
  హావభావముల్ జూపెడు నబ్బురముగ
  నామె ధరియించి కృత్రిమ యవయవములు
  చరణముల్ దెగి, నటియించె చక్కనమ్మ

  రిప్లయితొలగించు
 9. కాలు పోయినన్ ధైర్యమ్ము కోలుపోక
  నరక యాతన భరియించి నాట్యమాడి
  సుధ నిలిచె సుస్థిరంబుగ విధినెదిర్చి
  చరణముల్ దెగి నటియించె చక్కనమ్మ

  రిప్లయితొలగించు


 10. మరువన్ జాలని చిత్రమే యదిర హేమామాలినిన్ గోరె గ
  బ్బరుసింగా ఖలునాయకుండు కడు పాపాత్ముండు క్రూరాత్ముడై
  పరచెన్ సీసపు వక్కలాస్థలములో భామన్ నటించంచనన్
  జరణంబుల్ దెగి నాట్యమాడె నటియే సభ్యుల్ ప్రశంసింపఁగన్.

  రిప్లయితొలగించు
 11. రిప్లయిలు
  1. తేటగీతి
   చిత్ర చలన నిడివిని సంక్షిప్త పరచ
   మధుర సంగీత సాహిత్య మలరి సాగు
   పాట పాటకు పోటియౌ, పాటలందు
   చరణముల్ దెగి, నటియించె చక్కనమ్మ

   తొలగించు
 12. సరిరారెవ్వరు హావభావ గరిమన్ శాస్త్రీయ నృత్యంబునన్
  పరమోద్దీప్తవిలాస విస్ఫురణమా పద్మాక్షి విన్యాసముల్
  వరమై యొప్పగ కృత్రిమావయవముల్, పాపం బవార్యంబుగా,
  చరణంబుల్ దెగి, నాట్యమాడె నటియే సభ్యుల్ ప్రశంసింపఁగన్

  రిప్లయితొలగించు
 13. తేటగీతి
  కూచిపూడి నాట్యంబున కోరి జేసె
  పళ్ళెరము పయిన తరంగ పదము లన్ని
  రుధిరమోడె పాదములన, వ్యధను బొంద
  చరణముల్ దెగి నటియించె చక్కనమ్మ.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించు
 14. బాల్యమందుననేర్చి నా బాలికకిల
  నాట్యమే ప్రాణమై గొప్ప నాట్యగత్తె
  యైప్రదర్శనలిడతరి యచటి పాట
  చరణము లు తెగి నటియించె చక్కనమ్మ

  రిప్లయితొలగించు