20, ఆగస్టు 2022, శనివారం

సమస్య - 4168

21-8-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పగఁబట్టిన వాఁడె మధుర భావుకుఁ డిలలోన్”
(లేదా...)
“పగఁబట్టిన వాఁడె సుభావుకుఁడౌ”

48 కామెంట్‌లు:

  1. చం.వరసుగుణాలవాలుడ!కృపాలుడ!భీకరపాపరూపులై
    పెరుగునిశాటులన్ యమునివీటికిఁబంచెడి వాసుదేవుడా!
    వరదుడ!వేణుమాధవుడ!భక్తులకాదరువెన్న నీవెగా!
    యిరవుగ నిల్చునే యిడుమలెవ్వి నినుందలపన్ ముకుందుడా!
    ....చంద్రమౌళి రామారావు, బాపట్ల.

    రిప్లయితొలగించండి
  2. (అభిమన్యుని వధకు ప్రణాళిక రచించు సందర్భంలో సుయోధనునితో దుశ్శాసనుడన్నట్లు)

    ఒగి సైంధవుఁడుండగనో యనుజా
    వగపేలకొ నీకిక! పాండవులన్
    దగ నల్వురి గెల్చు ప్రతాపుడుగా
    పగఁబట్టిన వాఁడె సుభావుకుఁడౌ!

    రిప్లయితొలగించండి

  3. జగమున శత్రవు నైనను
    తగురీతిగ బుద్ధి జెప్పి దయచూడతగున్
    నగుదురు సజ్జను లిట్లన
    పగ బట్టిన వాడె మధుర భావుకుడిలలోన్

    రిప్లయితొలగించండి
  4. కందం
    తిగకన్నుల వేల్పన నా
    భగీరథుఁడు వేడినంత, వసుధకు దింపన్
    సిగబరచు స్థాణువు సురా
    పగఁబట్టిన వాఁడె మధుర భావుకుఁ డిలలోన్

    తోటకము (తొలి ప్రయత్నము)

    తిగకన్నుల వేల్పును దిక్కని సా
    క్షిగ వేడగ భక్తి భగీరథుఁడున్
    సిగఁజాచియు స్థాణువు, చింద సురా
    పగఁ బట్టిన వాఁడె సుభావుకుఁడౌ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరొక ప్రయత్నము:

      కందం
      వగలొలుక నను వరూధినిఁ
      బిగికౌగిటఁ బొదవలేవ ప్రియముగఁ బ్రవరా!
      మగువ వలచిరాన్ మురిపిం
      పగఁ బట్టిన వాఁడె మధుర భావుకుఁ డిలలోన్!

      తోటకము
      వగలాడి వరూధిని వన్నెలతో
      బిగికౌగిలిడన్ గొనవే ప్రవరా?
      సొగసందగఁ జేగొనుచున్ మురిపిం
      పగఁ బట్టిన వాఁడె సుభావుకుఁడౌ!

      తొలగించండి
    2. మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. పగఁబట్టిన వాఁడె సుభావుకుఁడౌ
    పగఁ బట్టుట మంచిదె భావ్యమయౌ
    సెగ వోలెను బాధను జేయు సుమా
    పగ జోలికిఁ బోకుము భావినిసూ

    రిప్లయితొలగించండి

  6. తగదని చెప్పిన నేమి వి
    సుగని తలచకుండ సంధి సూత్రంబుల నె
    ల్ల గురువులు ముదమ్మున నే
    ర్పగఁ బట్టిన వాఁడె మధుర భావుకుఁ డిలలోన్.

    రిప్లయితొలగించండి
  7. మగువవిరహమును సైపక
    పగతునిగా దలచి పంచబాణుని దూరున్
    సెగలను జిమ్మును శశియని
    పగఁబట్టిన వాఁడె మధుర భావుకుఁ డిలలోన్

    రిప్లయితొలగించండి
  8. తోటకము//

    గగనాంతరరోదసికై ఖగరాట్
    సుగమంబుగ వేగె వసున్ సుధనే
    తెగువన్ గొనె గద్రువ తెమ్మనగా
    *పగఁబట్టిన వాఁడె సుభావుకుఁడౌ.*

    రిప్లయితొలగించండి
  9. పగలింటిదొరను గురువుగ
    తెగనమ్ముచు విద్య లెల్లఁ దిరముగ నేర్చెన్
    సెగకోర్చి హనుమ, ఖగుఁ నా
    పగఁ బట్టిన వాడె మధుర భావుకుఁ డిలలో.


    రెండవ ప్రయత్నం

    మొగుడూ పెళ్ళాల నడుమ
    నిగురము చెడకుండ నెపుడు నితరేతరమున్
    దగ వేర్పడ, మచ్చర మా
    పగఁబట్టిన, వాఁడె మధుర భావుకుఁ డిలలోన్

    రిప్లయితొలగించండి
  10. డా.బల్లూరి ఉమాదేవి

    మగనాలినికురుసభలో
    నెగతాళినిచేయవానినిమ్ముగదునుమన్
    తగుసమయమునకువేచుచు
    పగపట్టినవాడె మధురభావుకుడిలలోన్




    రిప్లయితొలగించండి

  11. మొగమాటము జూపక మోదముతో
    సుగమంబగు పద్యపు సూత్రములన్
    బగలెల్ల బుధానులు, వారట నే
    ర్పగఁ బట్టిన వాఁడె సుభావుకుఁడౌ.

    రిప్లయితొలగించండి
  12. నగరము నందున గొలిచెడు
    భగవానుని దూలనాడు భావము జూపన్
    తగవు నెరుంగని పిన పా
    పగ , బట్టిన వాఁడె మధుర భావుకుఁ డిలలోన్

    రిప్లయితొలగించండి
  13. మరొక పూరణ

    తగవునుచేయుచుసతతము
    దిగులును పెంచంగ గనుచు తేకువ తోడన్
    జగతిన రిపులను చంపగ
    పగబట్టినవాడెమధురభావకుడిలలోన్


    రిప్లయితొలగించండి
  14. తోటకము (స,స,స,స 9 యతి)

    మగువా మదనున్ గనుమా విసరెన్
    పగవాడయిపూవుల బాణములన్
    వగపున్ గలుగన్ మనపై ననుచున్
    పగఁబట్టిన వాఁడె సుభావుకుఁడౌ

    రిప్లయితొలగించండి
  15. మృగముల బ గిదిగమెలగెడు
    పగతుర నరికట్టదలచి పంతము తోడన్
    మగటిమి తో నిడుముల బా
    పగ బట్టినవాడె మధుర భావుకుడిలలోన్

    రిప్లయితొలగించండి
  16. నగముంబలె బుస గొట్టును
    బగఁ బట్టినవాడె,మధుర భావుకుఁ డిలలోన్
    మగువను సంతస బఱచెడు
    మగవాఁ డే గద యరయగ మాన్యుఁడు నౌగా

    రిప్లయితొలగించండి
  17. కందము
    నగవులు,వయ్యారంబులు
    తెగవలపులుఁజూపి ప్రేమ దేవత తానై
    మగఁడా!రమ్మని కేల్ చా
    పగఁ,బట్టిన వాఁడె మధురభావుకుఁడిలలోన్.

    తోటకము
    నగవుల్,కనుసైగలు నర్మములున్
    బిగువుల్,వలపుల్,కడుబింకములున్
    తెగఁజేయుచు హేలగ స్త్రీ చెయి చా
    పగఁబట్టిన వాఁడె సుభావుకుఁడౌ.

    రిప్లయితొలగించండి
  18. మగువను తనకౌగిలిలో
    బిగబట్టినవాని మనసు ప్రేమను బంచున్
    మగనిగ తనవలపునుచూ
    పగఁబట్టిన వాఁడె మధుర భావుకుఁ డిలలోన్

    రిప్లయితొలగించండి
  19. సిగమాడక పూజను చేయుమనన్
    భగవానుని దూరెడు భావమునున్
    తగు రీతిని దిట్టక దామస పా
    పగ , బట్టిన వాఁడె సుభావుకుఁడౌ

    రిప్లయితొలగించండి
  20. శ్రీ కంది శంకరయ్య మాష్టరుగారికి నమస్సుమనస్సులు.ధన్యవాదములు.🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  21. వగపది హెచ్చెను స్వామీ
    నిగమాగమవేద్య యనుచు నిష్టగ కొలువన్
    నగధరుడటు పదములు చూ
    పగ పట్టిన వాడె మధురభావుకుడిలలోన్

    రిప్లయితొలగించండి
  22. మగువ మధు రాఖ్యను భృశ
    మ్ముగ నీ వెఱుఁగుదు కద పరిపూర్ణముగా నెం
    చఁగ శంక తోడ నీ పయిఁ
    బగఁబట్టిన వాఁడె మధుర భావుకుఁ డిలలోన్

    తోటకము.
    సెగ వోలెఁ జెలంగును జేరఁగ న
    క్కగృహమ్ము నసూయయె కాఱియ పె
    ట్టగ డెందమునం దకటా యతఁడా
    పగఁబట్టిన వాఁడె సుభావుకుఁడౌ

    రిప్లయితొలగించండి
  23. కందం
    భగవద్భక్తుల గాథల
    భగవంతుఁడె కూర్చుమనఁగ భాగవతమ్మున్
    దగు భక్తి ఘంటము లిఖిం
    పగఁ బట్టిన వాఁడె మధుర భావుకుఁ డిలలోన్!

    రిప్లయితొలగించండి