12, ఆగస్టు 2022, శుక్రవారం

సమస్య - 4161

13-8-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సూర్యుఁ డెక్కెను సైకిలు సోముఁడు గన”
(లేదా...)
“సూర్యుఁడు సైకిలెక్కఁ గని చొక్కముగా శశి నవ్వె మెచ్చుచున్”

43 కామెంట్‌లు:

 1. వార్తా కథనాల ఆధారంగా...

  తేటగీతి
  వెంట నడుచుచు నమ్మిన బంటువలెను
  రాజశేఖరున్ సేవించి ప్రముఖుడయ్యె
  నేత చని దశాబ్దము దాటె నేడదేల
  సూర్యుఁ డెక్కెను సైకిలు సోముఁడు గన?

  ఉత్పలమాల
  ఆర్యుని రాజశేఖరున కద్భుత సేవకుడంచు లోకులున్
  కార్యము లన్నిటన్ వెనుక గాంచిరి చిత్రములందునన్నిటన్
  జర్యకు కారణమ్ములవి సాంతము తోచవు నేడదేలనో
  సూర్యుఁడు సైకిలెక్కఁ గని చొక్కముగా శశి నవ్వె మెచ్చుచున్?

  రిప్లయితొలగించండి
 2. చిత్రకారుని బొమ్మను సేక రించి
  మిత్రుఁ డొక్కఁడు జెప్పె,నో మిత్ర వర్య!
  చిత్రమియ్యది చూడుము శీఘ్రముగను
  సూర్యుఁ డెక్కెను సైకిలు సోముఁడు గన .

  రిప్లయితొలగించండి

 3. నడకలను నేర్పినట్టి కూనయత గాడు
  వడిగ పరుగులు తీయుచున్ బాఠశాల
  కరుగ మిత్రుల తో గూడి యంగ భవుడు
  సూర్యుఁ డెక్కెను సైకిలు సోముఁడు గన

  రిప్లయితొలగించండి
 4. ఏకచక్రంపు రథముపై నెంతదనుక
  ప్రతి దినమ్ము నేఁ జేతును పయనమనుచు
  విసుగు జనియింప మదిలోన వెతను జెంది
  సూర్యుఁ డెక్కెను సైకిలు సోముఁడు గన

  రిప్లయితొలగించండి


 5. శౌర్యము గల్గినట్టి పరిచారకు డొక్కడు చాలునంచు నా
  కార్యములెల్ల దీరునని కర్మకరుండను గోరి చూడగా
  భార్యకు బంధువొక్కడట పాటవమున్ గనుమంచు వెంటనే
  సూర్యుఁడు సైకిలెక్కఁ గని చొక్కముగా శశి నవ్వె మెచ్చుచున్.

  (శశి యజమాని సూర్యుడు పనికొరకు వచ్చినవాడు)

  రిప్లయితొలగించండి
 6. కమల మిత్రులందు నొకడు కమలము విడి
  ‘తెలుగు దేశ’ మందున జేరె దెగువ జూపి
  బాలు డొకడు దానిని గని పలికె నిటుల
  “సూర్యుఁ డెక్కెను సైకిలు సోముఁడు గన”

  కమల మిత్రుడు —బి. జె.పి మిత్రుడు
  సోముడు —- చంద్రబాబు

  రిప్లయితొలగించండి
 7. (నందమూరి తారక రామారావు గారు తెలుగు దేశం పార్టీని స్థాపించి సైకిల్ గుర్తుతో పోటీకి దిగిన సందర్భమును గుర్తు తెచ్చుకొని...)

  తెలుగు నేలను జన్మించి తెలుగు గుండె
  లనలరించి తెలుగునాట రాజకీయ
  మందు తనముద్ర వేయగ నందమూరి
  సూర్యుఁ డెక్కెను సైకిలు సోముఁడు గన

  సోముడు - చంద్ర బాబు

  రిప్లయితొలగించండి
 8. సూర్యున కేకచక్ర రథ చోదకుడై దనరారు కాశ్యపిన్
  చౌర్యముఁజేసియైననొక సైకిలుఁ దెమ్మని యానతీయగా
  ధైర్యముఁజేసి సైకిలును తస్కరుడై గొనిదెచ్చి నంతటన్
  సూర్యుఁడు సైకిలెక్కఁ గని చొక్కముగా శశి నవ్వె మెచ్చుచున్

  రిప్లయితొలగించండి
 9. తేటగీతి
  పాఠశాలకుఁజనుటకై 'బాలరామ
  *సూర్యుఁడె'క్కెనుసైకిలు;సోముఁడు గనఁ*
  బడగ నెక్కించుకొనియెను వానినతఁడు
  చేరిరిద్దఱు బడికిని శీఘ్రముగను.

  ఉత్పలమాల
  సూర్యుఁడు చంద్రుడున్ పుడమిఁజూడ దలంచియు మానవాకృతిన్
  ధైర్యముతోఁజరించునెడ దప్పిక హెచ్చియు కాళ్ళు నొప్పిడన్
  *సూర్యుఁడు సైకిలెక్కగని చొక్కముగా శశి నవ్వె,మెచ్చుచున్
  సూర్యుని వెన్కఁగూర్చొనియు చోద్యములందిలకించె బాపురే!

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. ఆర్యులు సెప్ప నమ్మితిని హాస్యము గాఁగని పించె నియ్యదిన్
  సూర్యుఁడు సైకిలెక్కఁ గని చొక్కముగా శశి నవ్వె మెచ్చుచున్
  చౌర్యముఁ జేసిరే పటము చాలును జెప్పుట యిట్టి మాటలన్
  సూర్యుఁడు సోము లిద్దరును సోదర తుల్యులు గాదె? మిన్నునన్

  రిప్లయితొలగించండి
 14. కార్యము చక్కబెట్టుటన కంజము చిహ్నము వారు చేసెడిన్

  చర్యలు నచ్చలేదనుచు సైకిలు గుర్తును నెంచినందునన్

  పర్యవ సానమెం చుకొని పక్షము మారగ దల్చె గావునన్

  సూర్యుఁడు సైకిలెక్కఁ గని చొక్కముగా శశి నవ్వె మెచ్చుచున్

  శశి — చంద్రబాబు

  రిప్లయితొలగించండి
 15. ప్రతిదిన మెవడు దివినెక్కె రాత్రి వెడల?
  చిత్తుగా కాంగ్రెసోడిన చిహ్న మేది?
  ఎవడుగన నిశిని కలువ లెగయు మురిసి?
  సూర్యుఁ డెక్కెను; సైకిలు; సోముఁడు గన

  రిప్లయితొలగించండి
 16. స్వార్థ మన్నది పెరిగె నీ వసుధ యందు
  పద వు లాశించి చేరుట పాడి యయ్యె
  పార్టి మారుట గాంచియు బాలు డనియె
  "సూర్యుడెక్కెను సైకిలు సోముడు గన "

  రిప్లయితొలగించండి

 17. ఆర్యులు నాద్యులే, విధివిధానము సాగును వేదశాస్త్రమున్
  సూర్యుడు చంద్రుడంచు మరి సూక్ష్మము జెప్పిరి రేబవళ్ళనిన్
  పర్యవసానమెద్ది గన పధ్ధతి సాగును ప్రొద్దు గ్రుంకుటన్
  సూర్యుడు సైకిలెక్క గని, చొక్కముగా శశి నవ్వె, మెచ్చుచున్
  కార్యము నింక నాది నిశి గాచెద బొమ్మిక నొంటిచక్రమున్

  రిప్లయితొలగించండి
 18. సూర్యునకు మంచి మిత్రుఁడు సోముఁ డుర్వి
  నొక్క దిన మందు నిర్వురు నుత్సహించి
  చనఁ దలంచిరి యాత్రకుఁ జక్కఁగాను
  సూర్యుఁ డెక్కెను చక్రము సోముఁడు గన


  చర్యల దేవతా వరులు శ్రద్ధ వహింతురు మిక్కుటమ్ముగా
  నార్యుఁ డనూరుఁ డౌర సమయమ్మున కప్పుడు రాక యున్నచోఁ
  గార్య నిమగ్నతం దనరి క్రన్నన వాహన రాజ మన్యమున్
  సూర్యుఁడు చక్ర మెక్కఁ గని చొక్కముగా శశి నవ్వె మెచ్చుచున్

  రిప్లయితొలగించండి
 19. తెల్లవారకముందెతా తేరుపైకి
  బడికినేగవడివడిగ బాలుడెక్కె
  తార లగుపించె గగనాన తీరు గాను
  సూర్యుడెక్కెనుసైకిలు :సోముడు గన

  రిప్లయితొలగించండి
 20. _*ఆర్యుడు = ఆర్యుడు అను పేరు గల నటుడు;*_
  _*రాజు = శశి అను పేరు గల నటుడు.*_

  ఉ.

  ఆర్యుడు నాటకంబు విని యర్కునిగా నటనంబు రాజుతో
  సూర్యుని యేడుగుర్రములు సుందరయానము సాలభంజికల్
  కార్యము సైకిలై తిరుగ గష్టము వేదికపై సహించుచున్
  *సూర్యుఁడు సైకిలెక్కఁ గని చొక్కముగా శశి నవ్వె మెచ్చుచున్.*

  .... డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

  రిప్లయితొలగించండి