21, ఆగస్టు 2022, ఆదివారం

సమస్య - 4169

22-8-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆలి కుచముఁ గోసి తినియె నానందముగన్”
(లేదా...)
“ఆలి కుచమ్ముఁ గోసి తినె నా పతిదేవుఁడు మోదమందుచున్”

35 కామెంట్‌లు:

  1. కందం
    పోలయ పొలమునఁ జల్దినిఁ
    జాలదనుచుఁ గూరఁ బులుపు సమయస్ఫూర్తిన్
    రాలుప రసమ్ము చెట్టున
    నా లికుచముఁ గోసి, తినియె నానందముగన్!

    ఉత్పలమాల
    ఆలి ప్రియానువర్తిని స్వయాన పొలమ్మునఁ జల్దిఁ బంచగన్
    మేలుగఁ దోచి వేపుడుల మించిన నాకలి స్వీకరించుచున్
    చాలదు యందు పుల్పని రసమ్మును పిండగ ప్రక్క చెట్టుపై
    యా లికుచమ్ముఁ గోసి, తినె నా పతిదేవుఁడు మోదమందుచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వృత్తంలో 'చాలదు+అంచు, చెట్టుపై+ఆ' అన్నపుడు యడాగమం రాదు. "చాల దటంచు... చెట్టుపై నా..." అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:

      ఉత్పలమాల
      ఆలి ప్రియానువర్తిని స్వయాన పొలమ్మునఁ జల్దిఁ బంచగన్
      మేలుగఁ దోచి వేపుడుల మించిన నాకలి స్వీకరించుచున్
      చాలదటంచు పుల్పని రసమ్మును పిండగ ప్రక్క చెట్టుపై
      నా లికుచమ్ముఁ గోసి, తినె నా పతిదేవుఁడు మోదమందుచున్!

      తొలగించండి

  2. వాలికి తారేమగు? రత
    తాలికి వకుళేమి యిచ్చె? దధిజము గని గో
    పాలుండు చేసె నేమిటి?
    ఆలి, కుచముఁ గోసి, తినియె నానందముగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తార+ఏమగు, వకుళ+ఏమి' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి

  3. ఆలిని వెంట తోడ్కొని విహారము కేగ వనాంత రమ్మునన్
    సాలపు శ్రేణులన్ గనుచు సంతస మందిన యింతి భర్తతో
    మేలగు కాయలంచు నవి మిక్కిలి శ్రేష్ఠమటంచు చెప్పగా
    నా లికుచమ్ముఁ గోసి తినె నా పతిదేవుఁడు మోదమందుచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విహారమున కేగ' అనడం సాధువు. "విహారము జేయ" అనవచ్చు.

      తొలగించండి
  4. ఆలియు బిడ్డ తోడుత విహారము కైజని నాటతోటలో
    నాలిగొనంగ జేసి, కడు నాటల పాటల దేలియాడగా
    నాలతి సేయ భార్య, పతి హాళిన బ్రాకుచు చెట్టు పైకి, తా
    నా లికుచమ్ముఁ గోసి తినె నా పతిదేవుఁడు మోదమందుచున్.

    లికుచము- గంగరేగు పండు
    ఆటతోట - వనము
    ఆలిగొను - పరిహసించు
    ఆలతిసేయు - రాగాలాపన చేయు
    హాళి - ఉత్సాహము (ఆం.భా)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విహారమునకై జని' అనడం సాధువు. "విహారమునం జని/విహార మొనర్చుచు..." అనండి.

      తొలగించండి
  5. మేలను విత్తును నాటగ
    నేలను మొలకెత్తి యెదిగె నిమ్మతరువుగా
    మ్రోల నిలచి తానెంచిన
    నా లికుచముఁ గోసి తినియె నానందముగన్

    రిప్లయితొలగించండి
  6. అలియు కోర,నిడపతియు
    నాలికుచమునుగోసితినియె నానందముగన్
    చాలాయటంచు నడుగగ
    చాలికవలదనిపలికెను సంతోషముతో

    రిప్లయితొలగించండి
  7. ఉ.

    వ్రాలిన వక్షముల్ నలత వైద్య పరీక్షను రాచపుండుగా
    పాలక వైద్యుడౌ పతియె ప్రార్ధన జేయుచు శస్త్రవైద్యమం
    *దాలి కుచమ్ముఁ గోసి, తినె నా పతిదేవుఁడు మోదమందుచున్*
    గ్రోలుచు బండ్లసారమును గోరుచు దేవుని భక్తి తోడుతన్.

    .. డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

    రిప్లయితొలగించండి
  8. పాలు గుడిచె కూన పురుటి
    యాలి కుచముఁ గోసి , తినియె నానందముగన్
    మాలిమితో నిడిన చరపు ,
    వాలెము జరుగునిది యెల్ల బాలకు లందున్

    రిప్లయితొలగించండి
  9. కోయు = పువ్వులు లోనగువాని గిల్లు ( ఆం. భా )

    రిప్లయితొలగించండి
  10. కందము
    బాలరసాలము,దానిమ
    శ్రీలిడు బత్తాయి, జామ,రేగుఫలంబుల్
    చాలగ నుండిన,పండిన
    యా,లికుచముఁగోసి తినియె నానందముగన్.

    ఉత్పలమాల
    బాలరసాలసాల వనపంక్తుల,దానిమ,నిమ్మ తోటలన్
    శ్రీలిడునట్టిజామ,కదళీతరు శోభిత నవ్య వాటికన్
    హేల విహారముల్ సలిపి యింతినిఁగూడియు డస్సి వేడ్కతోన్
    ఆ,లికుచమ్ముఁగోసి తినె నాపతి దేవుఁడు మోదమందుచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "వేడ్కతో నా లికుచమ్ము..." అనండి.

      తొలగించండి
  11. చాలీ చాలని దినుసులు
    పేలవముగ నుండ పులుపు ,బీరును రుచితోన్
    మిళితముగల భూరుహమగు
    నా,లికుచముఁగోసి తినియె నానందముగన్

    రిప్లయితొలగించండి
  12. ఆలును బిడ్డలున్ గలిసి యందముఁ గల్గెడు తోటలోనికిన్
    మేలగు నోగిరంబునకు మెల్లగఁబోవుచు దాపునంగల యా
    బాలరసాలముల్ గలుగు బచ్చని తోటకు దక్షిణ పార్శ్వమంబునౌ
    నా,లికుచమ్ముఁగోసి తినె నా పతిదేవుఁడు మోదమందుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ, మూడవ పాదాలలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. ఆలును బిడ్డలున్ గలిసి యందముఁ గల్గెడు తోటలోనికిన్
      మేలగు నోగిరంబునకు మెల్లగఁబోవుచు దగ్గరుండు నా
      బాలరసాలముల్ గలుగు బచ్చని తోటను జూచినంతఁదా
      నా,లికుచమ్ముఁగోసి తినె నా పతిదేవుఁడు మోదమందుచున్

      తొలగించండి
  13. ఆలిచనెను పుట్టింటికి
    హేలగ హాలను చవిగొన హెచ్చె తమకమే
    నాలుక తమి దీర్చుకొనఁగ
    నా లికుచముఁ గోసి తినియె నానందముగన్

    రిప్లయితొలగించండి
  14. ప్రేలుచు మద్యము మత్తున
    మేలము లాడుచు నొకండు మేదిని లోనన్
    దా లిమి వీడియు బలుకుచు
    "నాలి కుచము గోసి తినియె నానంద ము గన్ "

    రిప్లయితొలగించండి
  15. మేలుగ వీరుండు క్రియా
    శీలుండు తన పగ తీర స్వీయాస్త్రములన్
    లీలగ రణమున రిపు రా
    జాలి కు చముఁ గోసి తినియె నానందముగన్

    [కు చమువు = దుష్ట సైన్యము]


    చాల భరించి దార యిడ సంకటముల్ సతతమ్ము నిర్దయన్
    ‌మే లన నంత రాత్మ కడు మెత్తని బియ్యపు పిండి తోడనే
    యాలి పయిం గరం బలిగి యందముగా సతి బొమ్మ సేసి తా
    నాలి కుచమ్ముఁ గోసి తినె నా పతి దేవుఁడు మోద మందుచున్

    రిప్లయితొలగించండి
  16. కూలికి పోయి కట్టెలను గొట్టుచు నుండగ
    నాకలేయగన్
    దాలక కాననంబుగల తర్వుల పండ్లను
    వెద్కుచుండగా
    మేలిమి రేగు చెట్టొకటి మిక్కలి పండ్లును
    నిండి యుండగా
    నా లికుచంబు గోసి తినె నాపతి దేవుడు మోదమొందుచున్

    రిప్లయితొలగించండి
  17. :
    : డా బల్లూరి ఉమాదేవి


    “ఆలి కుచముఁ గోసి తినియె నానందముగన్”
    (లేదా...)
    “ఆలి కుచమ్ముఁ గోసి తినె నా పతిదేవుఁడు మోదమందుచున్"



    నీలగళునకేమగు సతి
    బాలుడెచటనుండి గ్రోలుపాలుతెలుపుమా
    లీలగ మామిడి ఫలమును
    యాలి,కుచమ్ము,కోసితినియె నానందముగన్

    ఆలయమందుచెట్టుగనియామొలకన్ వడినాటి తోటలో
    తాలిమితోడ నీటినటు తప్పక పోయుచు నుండ కాయలున్
    మేలిమికాంతితోడమిరుమిట్లను గొల్పగసాగి ప్రేమతో
    నాలికుచమ్ముగోసితినెనాపతిదేవుడు మోద మందుచున్

    రిప్లయితొలగించండి

  18. కట్టెలను గొట్టబోయెను గాననమున
    నాకలేయగా నటునిటు నరయుచుండ
    బదిరి చెట్టొకటి కనబడె బండులున్న
    యా లికుచంబు గోసితినియె నానందముగన్

    రిప్లయితొలగించండి
  19. ఆలినిఁ బుట్టినింటి కడ కంపియు నొంటిగ నింటి యందునన్
    హేలగఁ నీలవేయుచును హెచ్చిన సంతస ముప్పతిల్లగా
    లీలగ హాలపాత్ర గొని రెచ్చిలి త్రాగుచు వ్యంజనమ్ముగా
    నా లికుచమ్ముఁ గోసి తినె నాపతి దేవుఁడు మోదమందుచున్

    రిప్లయితొలగించండి