10-8-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చేఁప కొంగను దినుచుండెఁ జెట్టు పైన”
(లేదా...)
“చేఁప బకమ్ముఁ బట్టుకొని చెట్టునఁ జేరి భుజించెఁ గాంచుమా”
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1765112733703420"
crossorigin="anonymous"></script>
తేటగీతి
రిప్లయితొలగించండిదీవి చెంతన జేరిన తిమిని మింగు
చేఁప కొంగను దినుచుండెఁ, జెట్టు పైన
నిలిచి వింత జూచెడి కాకి నివ్వెరపడె
బతుకు జీవుడా గండము పాయె ననుచు
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పాయె' అనడం వ్యావహారికం. "గండము వదలె ననుచు" అనవచ్చు కదా!
ధన్యవాదాలు గురువు గారు
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండికొంగ చేపను దినుచుండె కొమ్మపైన
వినుచు వ్రాయమనుచుఁజెప్ప వెధవ! నీవు
పలువురు గురుని నిందింప వ్రాసితె! యెట
చేఁప కొంగను దినుచుండెఁ జెట్టు పైన?
ఉత్పలమాల
చూపుచు పాటవమ్ము వినసొంపుగ పాఠము సెప్పునొజ్జకై
యోపికఁ జూపియున్ వెదుక నొప్పియుఁ దెచ్చితివిట్టి శుంఠనే!
దాపున నుండి వింటినయ తానటఁ జెప్పెడు నీతిచంద్రికన్
"చేఁప బకమ్ముఁ బట్టుకొని చెట్టునఁ జేరి భుజించెఁ!" గాంచుమా!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి🙏🙏🙏
తొలగించండిచేఁప కొంగను దినుచుండెఁ జెట్టు పైన
రిప్లయితొలగించండిజంద్రుఁ డుదయించె దూర్పునఁ జల్లగాను
నమెరికా తల క్రిందులై యవనిఁ గ్రుంగె
నేమి జెప్పుదు కలికాల మిదియ సామి!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడా.బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండివారి యందున సతతమ్ము వాసముండు
వనమునందుగోమాయువు పట్టి వడిగ
గాంచుచుండెనిదంతయు కాకి యొకటి
*“చేఁప కొంగను దినుచుండెఁ జెట్టు పైన”*
పద్యం బాగున్నది. భావం బోధ పడలేదు.
తొలగించండిజూలరి పరచిన వలలో సమకొనె నొక
రిప్లయితొలగించండిచేఁప , కొంగను దినుచుండెఁ
జెట్టుపైన
కూర్చొని గృహిణి వండిన కూడు నందు ,
చేపను గొనిపోయె నతడుచెట్టు దిగి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జాలరి' టైపాటు. "చెట్టు దిగియు" అని ఉండాలి కదా!
🙏🏽
తొలగించండిచేఁప బకమ్ముఁ బట్టుకొని చెట్టునఁ జేరి భుజించెఁ గాంచుమా
రిప్లయితొలగించండియూపున నుంటివే రమణ! యొప్పని మాటలు బల్కుచుంటివే
యీపగిదిన్ దురాగతపు టీసును గూడిన మాటలొప్పునే?
చేపల వాసమున్నరయ చెర్వుల,గుంటల నీటిలో గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాపముహెచ్చెనెల్లెడల వారణచేసెడివచ్చునెప్పడో
రిప్లయితొలగించండిదాపునచేరిమిత్రులటు,తాపము కూర్చుచు ద్రోహబుద్ధితో
నాపదలొందచేయ,గనినత్యధికమ్మయె వేదనమ్మెదన్
చేఁప బకమ్ముఁ బట్టుకొని చెట్టునఁ జేరి భుజించెఁ గాంచుమా”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండివింత దృశ్యములను వీక్షించి తిని నేను
వలకుఁజిక్కకుండ తెలివిగాను
కొలను నుండె *చేఁప;కొంగను దినుచుండె
చెట్టు పైన*పిల్లి చీల్చుకొనుచు.
విరుపుతో చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిచేపల మోసపుచ్చియును చెర్వునఁబట్టి బకంబు నిత్యమున్
దాపున బండపైనిడి నిదానముగా భుజియించుచుండగా
చేపలమ్రింగు నాబకపు చేష్టలు టక్కరి నక్క గాంచియున్
జేప,బకమ్ముఁబట్టుకొని చెట్టునఁజేరి భుజించె గాంచుమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపెద్ద దైన కొలనులోన పెరుగుచుండె
రిప్లయితొలగించండిపలురకాల జలచరాలు బలిసినదొక
చేఁప కొంగను దినుచుండెఁ జెట్టు పైన
కోతి గమనించె దానిని భీతితోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్స్య మనగనే మొకొ? బకమని పిలుతురు
రిప్లయితొలగించండిదేనిని?,"భుజించు చుండె"కు తెలుపు మితర
పదము,"తరువు పైన"కువేరు పదము చెప్పు,
చేప,కొంగను,తినుచుండె, చెట్టుపైన
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ.మా.
రిప్లయితొలగించండిఓపగలేని దాహముల నూతము సైతము గత్తిరించగా
నీ పగలెంత దారుణము లివ్విధి మారె తరంబుజూడగా
గోపము శత్రువై బ్రతుకుఁ గూల్చుచు నాశము సేయురీతిగన్
*జేఁప బకమ్ముఁ బట్టుకొని చెట్టునఁ జేరి భుజించెఁ గాంచుమా*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువు గారు 🙏🙏
తొలగించండిచేప కొంగను దిను చుండె చెట్టు పైన
రిప్లయితొలగించండిననుచు తారుమారు గ చెప్పె నర్భ కుండు
వినిన వారందరును గాంచి విస్తు పోయి
గేలి సేసిరి వానిని కించ పరచి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహవ్వ! యేమనుచుంటిరో యార్య తమరు?
రిప్లయితొలగించండికొంగ చేపను దినుటెరుగుదుమ దెటుల
చేఁప కొంగను దినుచుండెఁ జెట్టు పైన!
పొంతనేలేని మాటలు వింతగొలిపె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆ పరమాత్ముడెవ్వరి పరాగమమెట్లు లిఖించునో గదా
రిప్లయితొలగించండిద్వీపవతీ తరంగముల దేలుచు నాడుచు నుండినంతలో
పాపమయో ప్రవాహమటు వంకకు పారగ నొడ్డు జేరెనా
చేఁప, బకమ్ముఁ బట్టుకొని చెట్టునఁ జేరి భుజించెఁ గాంచుమా
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిచేపను బట్టగా బకమచేతనమట్టుల నొంటికాలిపై
రిప్లయితొలగించండితాపసివోలె నిశ్చలత తమ్మలయింటను వేచియుండగన్
పాపమొకింతసేపటికి ప్రక్కకు నీదుచు జేరినంత పెన్
చేఁప, బకమ్ముఁ బట్టుకొని చెట్టునఁ జేరి భుజించెఁ గాంచుమా
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిబల్లిదున కోగిరం బగు బక్క జీవి
రిప్లయితొలగించండిడేగ యొక్కటి వినువీధి నేఁగుచుండ
నింపుగ నరసి మున్నారగింపఁ బడఁగఁ
జేఁప కొంగను దినుచుండెఁ జెట్టు పైన
పాపముఁ బుణ్యముం దలఁపఁ బాడియె యాఁకట మ్రగ్గు చుండఁగాఁ
బాపనిఁ గాంచఁ దల్లి చను పాలవి శీఘ్రమ చేఁపు రీతిగా
నేఁపున గృధ్ర రాజమున కెక్కవయై కట క్షుత్పిపాసలే
చేఁప బకమ్ముఁ బట్టుకొని చెట్టునఁ జేరి భుజించెఁ గాంచుమా
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి అభినందనలు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదొంగ జపము చేయుచు నట కొంగ మ్రింగె
రిప్లయితొలగించండిచేఁప, కొంగను దినుచుండెఁ జెట్టు పైన
నుండి జారిన నొకపెద్ద కొండచిలువ
సృష్టి ధర్మమును గనిన చిత్రమేను.
చాపము పట్టినట్టి ఘన శాంతనవుండను నిల్వరింపగా
ద్రౌపది భ్రాతనిల్చెనరధమ్మున గాంచగ గాలకంఠుడై
యా పగతుండఁ గాంచగనె యస్త్రము లన్ విడె నాపగేయుడే
చేఁప బకమ్ముఁ బట్టుకొని చెట్టునఁ జేరి భుజించెఁ గాంచుమా