2, మార్చి 2023, గురువారం

సమస్య - 4354

3-3-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆముదంబన్న ప్రీతియే యందఱకును”
(లేదా...)
“ఆముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో కెవియన్ ఆచార్య గారి సమస్య)

43 కామెంట్‌లు:

  1. రాముడు వంచి కార్ముకము రమ్య మనోహర
    కోమలాంగినిన్
    భూమిజ జానకీ సతిని భూపతు లెల్లరు జూచుచుండగా
    సామజ రక్షకుండు కడు సంతస మొందగ
    బెండ్లియాడగా
    నాముద మెంత గొప్పదది యందరి మోములు తేజరిల్లగన్

    రిప్లయితొలగించండి
  2. కైకేయితో దశరథ మహారాజు ఖిన్నకంఠుఁడై...

    తేటగీతి
    పట్టమందబోయెడు మన చిట్టితండ్రిఁ
    గానలకునంపజూతువే కైకనీవు?
    రగిలి పోరె ప్రజలు? రాము రాజుగఁ గను
    నా ముదంబన్న ప్రీతియే యందఱకును

    ఉత్పలమాల
    రాముని కానకున్ బనిపి రాజుగ నీ భరతున్ గనంగ కై
    కా! మదినెంచితే? జననిగన్ మును జూపిన రాగమెక్కడే?
    భూమిని పాలితుల్ రగిలి పోవుటతథ్యము, రాజు రాముఁడౌ
    నా ముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్!

    రిప్లయితొలగించండి
  3. ఉదరభాగంబురాచినయుబ్బరంబు
    తొలగితేటనుపడునుగాదోషమణగి
    జిడ్డునైననుఝాడించుచిత్రముగను
    ఆముదంబన్నప్రీతియేయందరకును

    రిప్లయితొలగించండి

  4. తెలుగు పర్యాయ పదముల తెలుపుచుంటి
    రంజన మనగ వేడుక రాధనమది
    సంతసము బాళి పొదలిక జన్య నంద
    యా ముదంబన్న ప్రీతియే , యందఱకును.

    రిప్లయితొలగించండి
  5. నాలుగవ శతా వ ధానాన జాలు వా రె
    చక్క నైనట్టి పూరణ ల్ సరస మతులు
    మేలు. మేలని గొప్పగా మెచ్చు కొనగ
    నా ముదం బన్న ప్రీతియే యందఱ కును

    రిప్లయితొలగించండి
  6. ఉ.

    *ఆ ముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్*
    భామలు రాధికా సహిత వల్లభు జూడగ బారవశ్యమున్
    సామము విందుగా మురళి సాధిత నాదము మత్తునివ్వగన్
    కామిత హస్తమే యభయ కారణమయ్యెను కృష్ణభక్తిచే.

    రిప్లయితొలగించండి

  7. (కైకేయి యలక బూనిన విషయమెరుగని దశరథుడామెయు సంతసించునని యెంచి తన మనసులోని భావనని చెబుతున్నట్లుగా నూహించి....)


    రాముడు లోకపూజితుడు రాజిత సద్గుణ సాంద్రుడాతడే
    క్షేమమొసంగునంచు మనుజేంద్రుని జేయుట యొప్పటంచు నీ
    మోమున తోషణమ్ముగన బోరున వచ్చితి నోయి కైక నీ
    యా ముద మెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్.

    రిప్లయితొలగించండి
  8. సిద్ది చేకూర్చు కేశాల వృద్ధి కొరకు
    చర్మ సౌందర్య రక్షణ సాధనమ్ము
    కీళ్ళ నొప్పిని హరియించు కీలకమ్ము
    ఆముదంబన్న ప్రీతియే యందఱకును

    రిప్లయితొలగించండి
  9. ఆముదాల మురళి గూర్చి యడుగుచుండ,
    నింటి పేరున పిలుచుట హితులకిచట
    వాడుక , నుడువుచుంటి నాపద్ధతిగనె
    ఆముదంబన్న ప్రీతియే యందఱకును

    రిప్లయితొలగించండి
  10. రాముడు విల్లువంచి కడురమ్యముగా గెలుపొందినంతనే
    కాముని బోలు రూపసిని గాంచిన జానకి హర్షమందగా
    రాముడు బెండ్లియాడె ననురాగము గుండియ నుత్సహించగా
    నా ముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్

    రిప్లయితొలగించండి
  11. మోమున హాసరేఖ యనుమోదము గూర్చగ శైవచాపమున్
    రాముడు చేగొనన్ విరిగె రంజిల జానకి మానసంబునన్
    దామమలంకరించె గుణధాముఁడు రాముని కంఠసీమలో
    నా ముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్.

    రిప్లయితొలగించండి
  12. సామము తోడుతన్ బ్రజల సమ్మతిఁ బొందుచు వోట్లు, నేత సం
    క్షేమము గూర్చి మించుచును చెన్నగు పాలనొసంగి, దేశమున్
    రాముని రాజ్యమా యనగ ప్రాకటమౌ స్థితిలోన నిల్పగా
    నా ముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్

    రిప్లయితొలగించండి
  13. ఆముదమొసగు కనులకు నంతులేని
    చలువ, పెంచునుకురులను చానలకును
    గొనగమందుగశుభ్రమౌ కుక్షి,,కాన
    *“నాముదంబన్న ప్రీతియే నందఱకును”*


    మరొక పూరణ

    నేమముతోడతావిడకనిత్యమునద్దమరేయియైనని
    ష్కామముతోడనిచ్చుచునుశంకరులద్భుతమైనయంశముల్
    ప్రేమగగాంచుచున్ కవులు. ప్రీతిగ పూరణ చేసి నంతనే
    నా,ముదమెంత గొప్పదగు నందరిమోములు దేజరిల్లగన్

    రిప్లయితొలగించండి
  14. తే.గీ:గణయతులు లేని వచనపు కవిత యనెడు
    నాముద మ్మన్న ప్రీతియే అందరకును?
    "ఆముదాల మురళి కవితాబ్ధి యిచ్చు
    నా ముద"మ్మన్న ప్రీతియే అందరకును.
    (వచనకవిత ఆముదం లాగా ఉంటుంది.ఆముదాల మురళి గారి అవధానం ఆ ముదాన్ని ఇస్తుంది అంటే అందరికీ ప్రీతియే.)

    రిప్లయితొలగించండి
  15. ఉ:"ఆముద" మన్న నొక్కటియు,"నా ముద" మన్న మరొక్క యర్థమై
    ప్రేమగ సత్చమత్కృతుల విందొనరించ వధాన కేళి లో
    నీ మహితావకాశముల నిచ్చెడు చక్కని శబ్ద మైన యా
    ఆముద మెంత గొప్ప దగు నందరి మోములు తేజరిల్లగన్
    (రెండు అర్థాలకి అవకాశం మిచ్చే "ఆముదము"అనే శబ్దం ఎంత గొప్పది!అది అవధానాన్ని రసమయం చేసింది కదా!)

    రిప్లయితొలగించండి
  16. కలవర మొకింత లేక చక్కఁగ సతమ్ము
    మల విసర్జనమనకుఁ దల్లులకుఁ జంటి
    పిల్లల కొసంగ నుదయంపు వేళ లందు
    నాముదం బన్నఁ బ్రీతియే యందఱకును

    భూమి సురేంద్రు వంశమున భూరి యశస్కరు నింట దీపమై
    క్షేమ కరంపు లగ్నమున శీత మయూఖుని భవ్య వర్ణ మం
    దేమని చెప్ప నొప్పుఁ గుల మింపుగ వర్ధిలఁ గొడ్కు వుట్టఁగా
    నా ముద మెంత గొప్పదగు నందఱి మోములుఁ దేజరిల్లఁగన్

    రిప్లయితొలగించండి
  17. పామరుడైననూచుతలపండితుడెప్పుడువారెవా. యున్నాడు
    తామరసాక్షుడైనసభతథ్యముహర్షమునందుతృప్తిగా
    కోమలకావ్యకన్యకదికోరికగజ్జెనుకట్టియాడెనే
    ఆముదమెంతగొప్పదగునందరిమోములుతేజరిల్లగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  18. కుముదబాంధవు కౌముదుల్ కువలయమున
    జిలుఁగు జలతారు పరదాల చెలువమీయ
    నందనందను దర్శింప నందనమున
    నా ముదంబన్న ప్రీతియే యందఱకును

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.

    ఔషధమ్ముగ పనిచేయు నాముదమ్ము
    తలకు పట్టించగా ౘల్లదనము కలుగు
    కురులు నిగనిగ లాడుచు పెరుగునింక
    త్రాగ పోగొట్టును మలబద్ధకమునంత
    నాడు వాడె సుఖ విరేచనమునకు ప్రజ
    లాముదంబన్న ప్రీతియే యందఱకును.

    రెండవ పూరణము.
    ముదిమి వయసున మనుమలు, ముని
    మనుమల
    సన్నిధానాన గడుపుచు సంతసముగ
    కలసి కొమరులు,కోడళ్లు మెలగుచుండ
    నుమ్మడి కుటుంబ జీవనముల్లసిల్ల
    నా ముదంబన్న ప్రీతియే యందఱకును.

    రిప్లయితొలగించండి