26, సెప్టెంబర్ 2023, మంగళవారం

దత్తపది - 202

27-9-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
"ఆట - పాట - బాట - మాట"
పై పదలతో వినాయక నిమజ్జనోత్సవాన్ని వర్ణిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

30 కామెంట్‌లు:

  1. ఆట యాడెడు వారును,పాటబాడు
    వారును గదలి వెడలిరి బాట పైన
    ఎండ మాటను మరచి పోయి గణపతి ని
    మజ్జనమ్ము జేయ దలచి మడుగు వైపు.

    రిప్లయితొలగించండి
  2. ఆటలాడుచునాట్యమాడుచునందునందునగూడుచున్
    పాటబాడుచుభవ్యరీతులపావనంబగునామమున్
    బాటలందునబారుదీరుచుపార్వతమ్మకుపుత్రుతో
    మాటలాడునిమజ్జనంబునమట్టిగాంచగవిఘ్నమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పార్వతమ్ము కుపుత్రుతో (కు = చెడ్డ)' అనే అపార్థానికి అవకాశం ఉంది. "పార్వతీ ప్రియ పుత్రుతో" అందామా?

      తొలగించండి
  3. ఉ.

    *ఆట* లతోడ హిందువులు హాస్యము నొందుచు గంతువెట్టుచున్
    *పాట* లు పాడుచున్ సుముఖు భక్తిని వేడుచు బృందగానమున్
    *బాట* ల నుత్సవంబు గుమి బాంధవ మిత్ర జనావళిన్ గనన్
    *మాట* లు గేయ రత్నములు మాన్య గణేశ నిమజ్జనార్థమున్.

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. ఆటవిడుపున పిల్లలు హాయినొంద
      భళిర బాజాబజంత్రీల పాటల వెను
      వెంట బాటపట్టెనుగద విఘ్నహారి
      మాటలాడక మునుగ నిమజ్జనమున

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. ఆటల నాడుచు గణపతి
      పాటలు బాడుచును సాగె బాట జనంబుల్
      మాటలు జేజే యన ప్రతి
      నోట,నిమజ్జనముగడుమనోరంజనమై

      తొలగించండి
  6. ఆటలాడుచు పిళ్ళారి కభిషవమున
    కూడిన ప్రజ పాటల నందు కొనుచు దరల
    బాట కిరువయిపుల నున్న భఠ్తజనుల
    మాటలందు నతని గూర్చి మననమేను

    రిప్లయితొలగించండి
  7. ఉ॥ పాటలఁ బాడి కొల్చుచును బ్రార్థనఁ జేసిరి విఘ్ననాయకున్
    బాటను బట్టిరప్పుడిఁక భవ్యము గాను నిమజ్జనమ్ముకై
    యాటల నాడుచున్ దొరవి యంచుకు చేర్చిరి మూర్తులన్నిటిన్
    మాటలు కట్టిపెట్టుచును మన్నన తోడను నీట వీడఁగా

    దొరవి కొలను

    రిప్లయితొలగించండి
  8. భక్త గణములు పాటలన్ బాడుచు దగు
    రీతి నాటల నాడుచు ప్రీతి తోడ
    బాట లందున జేరియు మాట మంతి
    తో ని మజ్జ న ములు వక్ర తుండు ని కగు

    రిప్లయితొలగించండి
  9. మాటన్ పార్వతికిచ్చి మూషకరుడే క్ష్మాజేరగా నెంచుచున్
    బాటన్ బట్టెను మూషకమ్ము పయి గాబాగూబిగన్ ధాత్రికై
    యాటంకమ్ములు దీర్చు పాటవముతో నంబా సుతుండిప్పుడే
    మాటన్ తప్పక సాగుచుండె నదిగో మందాకినిన్ గల్వగన్

    రిప్లయితొలగించండి
  10. ఆటలు వాద్య ఘోషణము లంబరమంటఁగ నుత్సవంబునన్
    పాటలు పాడి నర్తనము భక్తజనావళి సల్పుచుండగా
    బాటలు నిండిపోయినవి బారులు తీరిన విగ్రహాలతో
    మాటలలోనఁ జెప్ప తరమౌనె గణేశ నిమజ్జనంబులన్

    రిప్లయితొలగించండి
  11. మత్తకోకిల:
    ఆటలాడుచు భక్తులందరు ఆఖువాహను గొల్చుచున్
    పాటలందున భక్తిభావముపాటవమ్ముగ జూపుచున్
    బాటలన్పరిపాటిగా గణపయ్య చెల్వఁపు యాత్రతో
    మాటకందని యార్తితోడ నిమజ్జనమ్మునుఁ జేసిరే

    రిప్లయితొలగించండి
  12. కందం
    సుమబాలలు నాటాడఁగఁ
    బ్రమదలు వెనకయ్యఁ గూర్చి పాటలు వాడన్
    శ్రమమాట మఱువ పురుషులు
    నిమజ్జనపు బాట రంగునీళ్లమయమ్మౌ

    రిప్లయితొలగించండి
  13. ఆటలు మోదమొప్ప జనులందరు

    నాడుచు, విఘ్నహర్తకున్

    పాటలు బాడుచున్ సకల బాటల

    వెంటను సాగిపోయి యా

    కోటి వరాల దేవుడిని కొల్చి ని

    మజ్జన సేయువేళలో

    నోటను రావుమాటలు మనో

    హర దృశ్యము గాంచినప్పుడున్

    రిప్లయితొలగించండి
  14. మ. కో. ఆట పాటలతో వినాయక! హాయి కల్గెను స్వామి! నీ
    మాటనున్ జవదాటకుండగ మంచి బాటను సాగగా
    మాట నీయగ నుంటి మయ్య! నిమజ్జనమ్మగు వేళలో
    లోటు జేసిన సైపి, తప్పుల, లోన నెంచక బ్రోవుమా!

    రిప్లయితొలగించండి
  15. డా. బల్లూరి ఉమాదేవి
    అమ్మ యొడిని పుట్టి ఆటలన్నో యాడి
    అమ్మ పాట మాట లాలకించి
    కాలమును గడిపిన గణపతి తానేటి
    బాట పట్టె గనుడు వసుధ నేడు
    [

    *బాట*ల పైన తీరుచును బారులు గానటువేడ్క మీరగన్
    పేటలునెల్లదాటుచును ప్రేమగ *మాట*ల నాడుచున్ వడిన్
    *పాట*లుపాడుచున్జనులుభక్తిగ మ్రొక్కుచుసాగిరెల్లరున్
    *ఆట*లనాడుచున్నిపుడుహాయిగవిఘ్నవినాయకున్విడన్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పాడుచున్ భక్తి పాటలు పరవశముగ
    నన్నిటికి ముందు చేయు కోలాటములును
    బాట ప్రక్క హారతులిడు వనితలుండి
    మాటకందని రీతిలో మనుజ తతియు
    వెంట రాగ గణపతిని వేగ పంపె
    నీటి లోనికిన్ సెలవయ్య నేటికనుచు.

    రిప్లయితొలగించండి