14, సెప్టెంబర్ 2023, గురువారం

సమస్య - 4531

15-9-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కనక యోగ్యతన్ వరమిచ్చు గరళగళుఁడు”
(లేదా...)
“యోగ్యతఁ జూడకుండ వరమొయ్యన నిచ్చు శివుండు దేవుఁడా”

20 కామెంట్‌లు:

 1. నేటినరుడునునీరీతినేర్పుజూప
  మేత కంటెను మేరువుమేటియయ్యె
  డబ్బువెంటనుమరియాదఠావువెదకె
  కనకయోగ్యతన్వరమిచ్చుగరళగళుడు

  రిప్లయితొలగించండి
 2. కఠినమగు తపమొనర్చి కపట జనులు,
  కోరరాని వరములెన్నొ గోరుచుండ,
  తెలిసి వరమిచ్చు మర్మము దెలియు దనకు
  కనక యోగ్యతన్ వరమిచ్చు గరళగళుఁడు

  రిప్లయితొలగించండి
 3. తేటగీతి
  ఓమ్ నమశ్శివాయ యటంచు నుచితరీతి
  దీక్షతోఁజేయఁదపము పరీక్ష సేసి
  మోదమొందుచు మిక్కిలి ముందు వెనుక
  కనక; యోగ్యతన్ వరమిచ్చు గరళ గళుడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   యోగ్యులె దానవేంద్రులు మహోగ్రతపంబొనరించినంతనే
   యోగ్యతఁజూడకుండ వరమొయ్యన నిచ్చు శివుండు,దేవుఁడా
   యోగ్యులు కాని వారలనహో!మరి భస్మముసేయు, భక్తి వై
   రాగ్యము కల్గువారికి కరమ్ము ముదమ్మున మోక్షమీయడే!

   తొలగించండి
 4. ఘోర తపమొ నర్చె డు వాడు కుజను డై న
  స్వార్థ బుద్ధి తో కోరెడు వరము నైన
  కనక యోగ్యత న్ వరమి చ్చు గరళ గ ళు డు
  తనను భోళా శంకరు డని యనె దరు గద

  రిప్లయితొలగించండి
 5. తనను గూర్చి ఘోరమ్ముగా దపసుజేయు
  నట్టి వారలగుణము దా నరయడెపుడు
  భక్తి శ్రద్ధయు తనపైన ప్రబలమైన
  కనకయె యోగ్యతన్ వర మిచ్చు
  గరుళకంఠు

  రిప్లయితొలగించండి
 6. ఋగ్యజుసామవేదములురూఢిగదెల్సినపండితుండునై
  భాగ్యమునందెరావణుడుపన్నుగశంభునిభక్తిగొల్చుటన్
  మృగ్యమునయ్యెబుద్ధిగదమృత్త్యువువచ్చెనాచకంబుతో
  యోగ్యతజూడకుండవరమొయ్యననిచ్చుశివుండుదేవుడా?

  రిప్లయితొలగించండి
 7. అమరులకుతాను నిరతము హాని కూర్చు
  లోకకంటకుడని కటప్రువు యటంచు
  దెలిసి తపమాచరించినదే తడవుగ,
  కనక యోగ్యతన్, వరమిచ్చు గరళగళుఁడు

  రిప్లయితొలగించండి
 8. హరహర మహదేవా యని యార్తిగాను
  పిలిచి నంతనె కరుణించి పేర్మి తోడ
  ప్రాత వేల్పుల కైనను వాసి గాను
  కనక యోగ్యతన్, వరమిచ్చు గరళగళుఁడు.  భాగ్యము లిచ్చు వాడనుచు ఫాలుని గూర్చి తపమ్ము జేసి వై
  రాగ్యము గోరరైరి ఖలు రక్కస జాతియె దుష్టులైన దౌ
  ర్భాగ్యులు కోరినంతనె కృపారస మందునొసంగు గాదుటే
  యోగ్యతఁ జూడకుండ వరమొయ్యన నిచ్చు శివుండు దేవుఁడా.

  రిప్లయితొలగించండి
 9. కొలది స్తుతికె సంతసమొంది గూఢ మేమి
  గనక; యోగ్యతన్ వరమిచ్చు గరళగళుఁడు
  బీడ గొనిదెచ్చు కొనుచుండు వేలుపతడు,
  పద్మనాభుడతనిని గాపాడు జుండు

  రిప్లయితొలగించండి
 10. భక్తితో కొల్తురసురులు పంచముఖుని
  భక్త సులభుడని తలచి పవలు రేయి
  పరమ శివుడుదయాళువై పరవశించు
  కనక యోగ్యతన్ వరమిచ్చు గరళగళుఁడు

  యోగ్యతలేనివారలకు యోగము నెక్కొన కోర్కెతీరునా?
  యోగ్యతఁ జూడకుండ వరమొయ్యన నిచ్చు శివుండు దేవుఁడా
  మృగ్యముకాదె భాగ్యమని మేకొను వారలు పెక్కురుండగా
  భోగ్యము లౌన శంకరుడు మూర్ఖుల కిచ్చిన కామితంబులే!

  రిప్లయితొలగించండి
 11. ॥ భవుఁడు చిత్తశుద్ధి యొకటె భవ్యమనుచు
  భక్తితోడఁ గొలచినంత వరదుఁడగును
  భక్త సులభుఁడై వరలును బరమశివుఁడు
  కనక యోగ్యతన్ వరమిచ్చు గరళగళుఁడు

  ఉ॥ భోగ్యముఁ గోరి ధ్యానమును బుద్ధిని నిల్పుచుఁ జేసి దైత్యులున్
  భాగ్యము మీరఁ బొంది వర ప్రాభవ మొప్పఁగ దుష్టులై చనన్
  యోగ్యత నెంచకన్ వరమయోగ్యుల కిచ్చుటఁ గాంచఁ దోచెరో
  యోగ్యతఁ జూడకుండ వరమొయ్యన నిచ్చు శివుండు దేవుఁడా

  రిప్లయితొలగించండి
 12. నా ప్రయత్నం ఇలా....
  (అభిమన్యుని మరణం తరువాత ధర్మరాజు శ్రీకృష్ణునితో బాధను వ్యక్తపరచుట)

  ఉ.

  యోగ్యుని చావు వ్యూహమున, యోచన, ద్రోణుని యుద్ధనీతియౌ
  భాగ్యమె? వీర సైంధవుడు పాండవ భంగము జేసె, కృష్ణ! వై
  రాగ్యమె పార్థపుత్ర మృతి? రాజ్యము గోరితి, క్షాత్ర ధర్మమై
  *యోగ్యతఁ జూడకుండ వరమొయ్యన నిచ్చు శివుండు దేవుఁడా?*

  ... డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

  రిప్లయితొలగించండి
 13. యోగ్యులకున్ వరంబులిడ నుద్ధతినొందక నమ్రులౌచు వై
  రాగ్యమునన్ చరించెడు తెరంగును జూతురు ముక్తిఁ గాములై
  యోగ్యుత లేనివారు కడు నుద్దవిడిన్ తపమాచరించగా
  యోగ్యతఁ జూడకుండ వర మొయ్యన నిచ్చు శివుండు దేవుఁడా

  రిప్లయితొలగించండి
 14. భాగ్యము బెంచుమంచు మరి
  వైరుల పీచమడంచమంచు దు
  ర్భాగ్యము నెత్తివేయుమని
  రాక్షస జాతి దపస్సుజేసినన్
  యోగ్యత జూడకుండ వరమొ
  య్యన నిచ్చు శివుండు దేవుడా!
  భాగ్యములిచ్చుశంకరుడు ప్రస్తుతి
  జేతురు భక్తు లందుకే

  రిప్లయితొలగించండి

 15. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  ఘోర తపమొనర్చెడు భక్తు లేరికైన
  శంకరుడు పొంగిపోవుచు జాలి తలచి
  ముందు వెనుకలు చూడక మోదమంది
  కనక యోగ్యతన్ వరమిచ్చు గరళగళుడు.

  రిప్లయితొలగించండి