7-9-2023 (గురువారం)
కవిమిత్రులారా,
అంశం - గీతాచార్యుడు శ్రీకృష్ణుని స్తుతి
వృత్తం - చంపకమాల
1వపాదం 1వ అక్షరం 'గు'
2వ పాదం 2వ అక్షరం 'రు'
3వ పాదం 11వ అక్షరం 'దే'
4వ పాదం 13వ అక్షరం 'వ'
లేదా...
పై న్యస్తాక్షరాలను యతిస్థానంలో నిల్పుతూ
తేటగీతి పద్యం వ్రాయండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగొల్లభామలుమెచ్చినగురువునితడు
రిప్లయితొలగించండిఋషులుగాచినపసిడిమేరువుగనుండె
దేవతాదులుమెచ్చినదేవుడితడు
భాసురంబుగకృష్ణుడైవరలుహరియ
(గు)రుతులు సెప్పి యర్జునుఁడు ఘోరరణంబును జేయలేననన్
రిప్లయితొలగించండిమ(రు)వకు క్షాత్రధర్మమును మంచి చెడుల్ వివరింతునంచు సు
స్థిరమగు ధర్మసూక్ష్మముల (దే)శికుఁడైతివి యుద్ధమందు; శ్రీ
ధర! సుజనావనా! కుటిల దాన(వ) నాశక! కృష్ణ! మ్రొక్కెదన్.
కోరి వెన్నది నుటకని గుంభ నముగ
రిప్లయితొలగించండిరుచులు మరిగినీ తోడజే రుదురు గాని
దెలియ రైరివా రలునీవు దేవుడవని
వారి కేమియె రుకనీవె వల్లభుడని.
గురువగునెల్లలోకములగొల్లడునయ్యెగగోకులంబులో
రిప్లయితొలగించండిమరువగరానిమాయలనుమైమరపించెగగొల్లభామలన్
తెరువునుజూపెదీనులకుదేవుడుకృష్ణుడుతానెతండ్రియై
పరుడునుగాడుగాచెడినివచ్చివరంబునునిచ్చుమిత్తుడై
మిత్రుడై
రిప్లయితొలగించండిగొప్ప గీత బోధించిన గురుడ వీవు
రిప్లయితొలగించండిరుజు పథంబును దెల్పి నరుని రణా న
దెగువ జూప పురి గొలిపి దేవ దేవ
భక్త జనులను రక్షించి వరలు కృష్ణ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుల నెదుర నరుడాగ గరుతరమగు
రిప్లయితొలగించండిలోప మదియని తెలిపి తేరునునడుపుచు
ద్విషులపై కలి సలుప నాదేశమునిడి
పార్థునొప్పించి నట్టి దేవ ప్రణతు లివి
క్రోలఁ గీతామృతమిడిన గురుడవీవు
రిప్లయితొలగించండిచెడును రూపార్చు పరమగురుడవునీవు
దివ్యరూపంబుఁ గలిగిన దేవదేవ
భక్తవత్సల రావయ్య వరములీయ
(గు)రువులకేగురుండవట క్రూరులఁ ద్రెక్కొను సూత్రధారివై
తొలగించండిన(రు)లకునీవొసంగితివి న్యాయము ధర్మముఁ దెల్పు గీతనే
తిరుగుచునుండు చక్రమును (దే)శినిఁ నిల్పిన చక్రధారివే
మరువనసాధ్యమౌ భువిని మాధ(వ)! నీసరి ధర్మసూక్ష్మముల్
రిప్లయితొలగించండిగురుతరమైన బాధ్యతది క్షోణిని ధర్మము నిల్పనెంచుచున్
కరుణను వీడి పౌషమున కాపురుషాళిని ద్రుంచమంచు నీ
స్థిరమగు నీదు బోధన యదే కనువిప్పును గల్గజేసె నో
మురహర కైటభాంతక ప్రభో! యవనారి సదా నుతింతు నిన్
పరమ ధర్మమ్ము దెలిపిన గురువువీవు
రణము సాగించు నట్టి తరుణమిదికద
ద్విషుల నిక సంహరంచెద దేవ, నీదు
పదములంటి చేసెదనిదో వందనములు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంపకమాల
రిప్లయితొలగించండిగురుతర బాధ్యతన్ దెలుప గోపకులాధిప! విశ్వరూపమై
నరుడట నాయుధమ్ము గొని నల్వురు మెచ్చ జయమ్ము నందెనే
తెరువును జూపు 'గీత' నిడ దేవుఁడనంగ జగద్గురుండవై
వరమయె నేటికిన్ బ్రజకు భక్తవశంకర నందనందనా!
తేటగీతి
గోప భూషణా! భువి జగద్గురువనంగఁ
బ్రోవఁగ భగవద్గీత నరునకొసంగి
దీనబాంధవా! వీడ సందేహ కోటి
భక్తవత్సలా! నీకేరు వసుధ సాటి!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ గోప బాలుఁడై యిల విశ్వ గురువు వెలిఁగె
రిప్లయితొలగించండిరోమ రోమము పులకించు రుక్మిణీ ప
తినిఁ గొలువఁగాను భక్తితో దేహమునను
బరమ విభుని గొలువ రయ్య వరములిడును
చం॥ గురువును గౌరవించితివి కోరఁగఁ బుత్రునిఁ దెచ్చి యిచ్చుచున్
మరువకు క్షాత్ర ధర్మమని మాలిమిఁ జేసితివంట యర్జునున్
దిరుగుచు గోప బాలుఁడుగ దేవుఁడ వైనను వారి మధ్యలోఁ
గరుణను బ్రోచినాడవఁట కావవ నన్నును గృష్ణ ధాత్రినిన్
మన్నించాలండి ఏకాగ్రత లోపము వలన పదేపదే తప్పులు వచ్చినాయండి
చంపకమాల:
రిప్లయితొలగించండి(గు)రుతరమైన బాధ్యతగ గోపకిశోరుడు కృష్ణమూర్తి తా
న(రు)దగు గీత బార్థునకు నస్త్రములన్ విడనాడ నాజిలో
స్థిరముగ బోధజేసె నొక (దే)శికుడై యవతారమూర్తియై
వరముగ మానవాళికది భాగ్య(వ)శమ్ముగ దక్కెనీ భువిన్
చం.మా.
రిప్లయితొలగించండిగురుతర బాధ్యతన్ నెఱపి గుండెల నింపుచు విశ్వరూపమున్,
గరుణను జ్ఞానసంపదగ గల్పన చేయగ గీతసారమున్,
దెరువునుజూపి పార్థునికి, దేవుడవైతివి లోకమంతటన్!
వరములనిచ్చి ప్రోవుమయ!భక్తవశంకర వేణుమాధవా!
గు)రువుగ నమ్మి భజించితిని గోప
రిప్లయితొలగించండికిశోర రణంబునందు నీ
గు(రు)జన తాత బంధువుల గూల్చగ
నామన సొప్పకుండెడిన్
దెరవును జూపుమంచడిగె (దే)జము
దప్పిన పాల్గుణుండు , శ్రీ
కరుడయినట్టి కృష్ణుడు సగౌర(వ)
మొప్పగ దెల్పెజ్ఞానమున్
గురువటన్ననితడెవిశ్వగురుడనంగ
రిప్లయితొలగించండిరూఢికెక్కి బాపెజనులరుగ్మతులను
తీర్చలేనిదిలనుగురుదేవు రుణము
వందనశతములుగొనుమావాసుదేవ
గురిని చూపించి నడిపించి గురువు గాను
రుజలుబాపబోధించెనరునకు వడిగ
దివ్యమైనగీతనువాసుదేవుడనిని
పరమ పావన పొత్తమైవరలుచుండె
తేటగీతి:
రిప్లయితొలగించండిగోవులను గాచితివి నీవు (గు)ట్టనెత్తి
లోకులకు గీత దెలుపు గు(రు)డవునీవు
దీనులను బ్రోవ రావయ్య (దే)వకిసుత
వందనమ్ము లివియె కరి(వ)రద నీకు
చం.
రిప్లయితొలగించండిగురువు జనాళికే, పరువు కోమలి కృష్ణకు గట్టబెట్టెనే
కురుసభ, రాయబారమున గుంభన రూపము, వ్రాలె కౌరవుల్
తిరము నిరాయుధుండు మొన దేయము పాండవరక్షణన్ వగన్
కరములు జోడ్చి, వేడెదను కష్టము దీర్చవ! శక్తినిచ్చుచున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి"గు, రు, దే, వ " ... న్యస్తాక్షరాలను వరుసగా 1,2,3,4 పాదల యతిస్థానంలో నిల్పుతూ తేటగీతి పద్యం ...
నా ప్రయత్నం...
#తేటగీతి
కూర్మితో దరి జేరగ *గు*రువు వారి
క్రూర గుణముల నడచి ప*రు*వు ను గూర్చి
తెలిపి విద్యను బోధించు *దే*వుడతడు
భక్తిగా శిష్య తతి నేర్వ *వ*లయు నోయి
✍️ తిరివీధి శ్రీమన్నారాయణ