30, సెప్టెంబర్ 2023, శనివారం

సమస్య - 4546

1-10-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తిరుమల లడ్డు గడు చేదు తినవలదయ్యా”
(లేదా...)
“తిరుమలలోని లడ్డు గడుఁ దిక్తము నీవు దినంగవద్దయా”

18 కామెంట్‌లు:

  1. వరుసగ‌ దినుచుంటివి గద
    తిరిపెముగ రుచియగు లడ్డు దొరికన దనుచున్
    నరుగదతిగ దిన్న నగును
    తిరుమల లడ్డు గడు చేదు, తినవలదయ్యా”

    రిప్లయితొలగించండి
  2. కుబేరుని తో వారి సతీమణి:

    కందం
    పరిణయమెంచి ఋణంబుగ
    సిరిఁ గైకొని వడ్డినైన చెల్లింపడనన్
    చిరచిరల, శ్రీనివాసుని
    తిరుమల లడ్డు గడు చేదు తినవలదయ్యా!


    చంపకమాల
    పరిణయమెంచి పద్మఁగొన పంకజనేత్రుడు దా ఋణంబుగన్
    సిరిఁగొని వడ్డి నేటికిని చెల్లొనరించగ లేని వాడనన్
    చిరచిర లాడుటన్ మఱచు చింతన లేక పతీశ్వరా మదిన్
    తిరుమలలోని లడ్డు గడుఁ దిక్తము నీవు దినంగవద్దయా!


    రిప్లయితొలగించండి
  3. పరుగునుబెట్టగరుచిగను
    తిరుమల లడ్డు, గడుచేదుతినవలదయ్యా
    వేరుగజేసినదానిని
    తరిగనశోభనుపెరిగినధరతోనెపుడున్

    రిప్లయితొలగించండి
  4. ఆరుదగు మధు మేహ o బుకు
    గురి యై బాధ పడు వాని కొరకై
    వైద్యుం
    డ ర యగ సూచన లొసగె న్
    " తిరుమల లడ్డు గడు చేదు తిన వల ద య్యా!"

    రిప్లయితొలగించండి
  5. వరమది వేంకటేశ్వరుని భవ్య
    ప్రసాదమదెంత తిన్ననున్
    దరగదు తృప్తి , భక్తులును దప్పక
    తిందురు రుచ్యమైన యా
    తిరమలలోని లడ్డు , గడు దిక్తము
    నీవు తినంగ వద్దయా
    తరచుగ రోగ బాధలును దాపుర
    మౌ దిన గొట్లలడ్డులున్.

    రిప్లయితొలగించండి
  6. అరయగవేంకటాధిపునిహస్తమునంటినపాకమాయనన్
    సురలకుమోహనాకృతినిసూడిదయిచ్చినమావిపండుగా
    తిరుమలలోని లడ్డు, గడుఁదిక్తమునీవుతినంగవద్దయా
    మరుగునబడ్డమాధురినిమాయలరంగులపూసలడ్డులన్

    రిప్లయితొలగించండి
  7. అరుదగు తిరుమల లడ్డును
    వరముగఁ గైకొనఁగ నెమ్మి, వలముగ విపణిన్
    పరులమ్మునట్టి నకిలీ
    తిరుమల లడ్డు గడు చేదు తినవలదయ్యా

    రిప్లయితొలగించండి
  8. అరయగ నీ చేతిని గల
    తిరుమల లడ్డు గడు చేదు; తినవలదయ్యా
    నెరవుగ, మధుమేహ నలిన
    శరీర మస్వాస్థ్యమొంద సత్యము గాదే

    రిప్లయితొలగించండి
  9. వరమది భక్త జనాలకు
    తిరుమల లడ్డు,గడు చేదు తినవలదయ్యా
    తరచుగను బయటి కొట్లో
    నిరతము నమ్మబడులడ్డు నిక్కముమిత్రా!

    రిప్లయితొలగించండి
  10. చం.

    నిరుపమ పుణ్య భూతలము నిర్భయ మిచ్చెడు వేంకటేశుడే
    మరుగున బడ్డ భక్తి దయ మానవ నైజము చెడ్డ కాలమున్
    జొరవగ పంపిణీ విధము చోద్యమె యన్య మతస్థులిచ్చెడిన్
    *తిరుమలలోని లడ్డు గడుఁ దిక్తము నీవు దినంగవద్దయా.*

    ... డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

    రిప్లయితొలగించండి
  11. సిరులున్న వారికౌనట
    మరందమాలడ్డు కాని మరిచూడ దిగం
    బరులకు పెరిగిన ధరతో
    తిరుమల లడ్డు గడు చేదు తినవలదయ్యా.


    పరమత పాలెగాండ్లిచట పాలకులై తమ స్వార్థ బుద్ధితో
    విరివిగ పెంచగన్ ధరలు బేహరమయ్యెను దర్శనమ్మదే
    యరయగ విత్త హీనులకు నందని ద్రాక్షగ మారె రంకుడా
    తిరుమలలోని లడ్డు గడుఁ దిక్తము నీవు దినంగవద్దయా.

    రిప్లయితొలగించండి
  12. తిరుమల వనినమ్మబలికి
    విరివిగ విక్రయపరచిన వెన్నడు గనినన్
    సరిపోలనివే నకిలీ
    తిరుమల లడ్డు గడు చేదు తినవలదయ్యా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పరమత మందుచేరి పరిపాలకమండలిఁ జొచ్చి నేటికా
      తిరుమల ధర్మశీలతకు తీరని మచ్చగ నిల్చియుందురే
      విరివిగ దుష్టకార్యములు వెంగలి చేష్టలు వింతగొల్పగా
      తిరుమలలోని లడ్డు గడుఁ దిక్తము నీవు దినంగవద్దయా

      తొలగించండి
  13. కందం
    ఇరువురు మిత్రులు పందెము
    తిరుమల లడ్లను తినుటన తీరుగ వేయన్
    చెరొకటి తిని త్రేన్చియనెను
    తిరుమల లడ్డు గడు చేదు తినవలదయ్యా
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  14. వరముగ వేంకటేశ్వరుని పావన ధామమునందు నిచ్చునా
    తిరుమల లడ్డు గైకొనఁగ దీరును ఖేదము భక్తకోటికిన్
    విరివిగ కొన్నియంగడుల విస్తృతరీతిని కల్తి చేయు నా
    తిరుమలలోని లడ్డు గడుఁ దిక్తము నీవు దినంగవద్దయా

    రిప్లయితొలగించండి
  15. వరమది‌ దొరికి‌న‌ తినవలె‌
    తిరుమల‌ లడ్డు‌, గడుచేదు‌ తినవలదయ్యా‌
    తిరుమల‌ పరువును‌ తీసెడి
    దురితాత్ములు విక్రయించు‌ తొత్తడి‌ సరుకున్‌

    రిప్లయితొలగించండి
  16. ధరహెచ్చినతిందుముకొని
    తిరుమల లడ్డు గడుచేదు తినవలదయ్యా
    పరిశుభ్రతపాటించక
    పరిపరివిధములదినుసులువాడిన లడ్డున్

    రిప్లయితొలగించండి
  17. కం॥ ఎరుగువొ భక్తుఁడ మధురము
    తిరుమల లడ్డు, గడు చేదు తినవలదయ్యా
    తిరుమల ప్రసాదముఁ దినిన
    తరువాత ననువగు తిండి తనరుఁ దెలుపఁగా

    చం॥ తరగని భక్తి భావమున ధన్యతఁ గాంచఁగ స్వీకరించుమా
    తిరుమలలోని లడ్డు, గడుఁ దిక్తము నీవు దినంగ వద్దయ్యా
    అరియ ప్రసాద భక్షణము నాఁకటి బాధలు తీరకున్నచో
    సరియగు భోజనాదులును జాలవ చేదుఁ దినంగ రాదయా!

    రిప్లయితొలగించండి