3, సెప్టెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4522

4-9-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కందములోఁ బ్రాసయతులు గడు యుక్తమగున్”
(లేదా...)
“ఉత్పలమాలలోనఁ గడు యుక్తము ప్రాసయతిప్రయోగమే”

34 కామెంట్‌లు:


  1. ఇందు చతుర్మాత్రలుగల
    సుందర గణముల కలయిక సొబగుల నిడగా
    నందము పెంచగ నమరును
    కందములోఁ బ్రాసయతులు గడు యుక్తమగున్.

    రిప్లయితొలగించండి
  2. విందులలో మద్యమ్మును,
    అందమునకు శ్రేష్టమైన నారోగ్యమ్మున్,
    మందమగు గాలి సుఖమున,
    కందములో బ్రాసయతులు కడు యుక్తమగున్.

    రిప్లయితొలగించండి
  3. తొందర పడకుండగ నా
    ఛందము బూర్తిగ వినవలె, ఛందస్సులలో
    డెందము పులకీంచుటకై
    కందములోఁ బ్రాసయతులు గడు యుక్తమగున్

    రిప్లయితొలగించండి
  4. డెందముకానందంబగు
    వింధున పులిహోర మిగుల
    ప్రియమును గూర్చున్
    అందముగూర్చును మిక్కిలి
    కందములో ప్రాసయతులు
    గడు యుక్తముగన్

    రిప్లయితొలగించండి
  5. అందము లొలికించు రచన
    చందము వలె నన్న కవికి శాస్త్ర పు ఫణ తుల్
    పొందిక గా కుది రింపగ
    కందము లో ప్రాస యతులు గడు యుక్త మగు న్

    రిప్లయితొలగించండి
  6. అందఁపు నడకల కందము
    నందున ప్రాసయతి చెల్లదందురు విబుధుల్
    సుందరముగనొదగఁ దగును
    కందములోఁ బ్రాస, యతులు గడు యుక్తమగున్

    రిప్లయితొలగించండి
  7. కందువగలకవి పొదుగగ
    చందోనియమాలు విడని సందర్భములో
    నందంబిడుపద్యగతికి
    కందములోఁ బ్రాసయతులు గడు యుక్తమగున్

    రిప్లయితొలగించండి
  8. ఉత్పలమాల బ్రాసయది యుగ్మపు స్థానము నందుజేరగా
    తత్పదమందు గాంచగ సదా దొరయున్ యతి పంక్తి వర్ణమై
    తత్పఠనాభిలాషుల సుధారస మందున తేల్చునట్టి య
    య్యుత్పలమాలలోనఁ గడు యుక్తము ప్రాసయతిప్రయోగమే.

    రిప్లయితొలగించండి
  9. కందము
    అందాలరాశి యింతికి
    హుందాతనమౌర!హొయలు నొప్పిన యట్లే
    ఛందశ్శాస్త్రంబందున
    కందములోఁబ్రాస,యతులు గడు యుక్తమగున్.

    రిప్లయితొలగించండి
  10. చిత్పథ మెల్లవేళలను శ్రేష్ఠముగా విలసిల్లుచుండఁ గిం
    చిత్పర భావనల్ దొరగి చెల్వగు పద్యము వ్రాయఁగాఁ దగున్
    సత్పరిపాక దూరుఁడగు శంఠుఁడు మాత్రమె యొప్పుఁ జెప్పఁగా
    నుత్పలమాలలోన గడు యుక్తము ప్రాసయతి ప్రయోగమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ త్పను ప్రాసగా నిడఁగ నెవ్వరికైనను కష్టమౌను యు
      ష్మత్పదసంపదన్ గొలువఁ జాలఁగ లేనయ భారతీసతీ
      సత్పదమంటి పల్కెదను శాస్త్రవిరుద్ధము క్రింది వాక్యమౌ
      నుత్పలమాలలోన గడు యుక్తము ప్రాసయతి ప్రయోగమే.

      తొలగించండి
    2. ఏందిర పిచ్చెక్కిందా
      మందమ్మా నీదు బుర్ర మన గురువులు చె
      ప్పింది మరిచి గిట్లంటవ
      కందములో బ్రాసయతులు కడు యుక్తమగున్.

      తొలగించండి
  11. ఉత్పలముల్ కనుంగొనగ నుప్పరమందు శశాంక బింబమున్
    తత్పరతన్ వికాసమును తద్దయు నొందెడురీతి పద్యమం
    దుత్పలమాల హృద్యముగ నుండు గణమ్ముల కూర్పు వల్లనీ
    యుత్పలమాలలోనఁ గడు యుక్తము ప్రాస,
    యతిప్రయోగమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      సత్పరిశోధనన్ సలుపఁజాలడు విజ్ఞుడు,నందగత్తెయౌ
      యుత్పలగంధికిన్ పతిగ నొప్పునుగా విరసుండు నక్కటా!
      ఉత్పలమాలలోనఁగడు యుక్తము ప్రాసయతి ప్రయోగమే
      తత్పగిదిన్ వచించుటలు తప్పుగఁదోచవె సత్కవీశ్వరా!

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  12. ఉత్పలమాలలోనఁ గడు యుక్తము ప్రాసయతిప్రయోగమే
    తత్పరిణామమే ఘనము తప్పని ఛందపు రీతులొప్పగా
    సత్పరిపాలనమ్మొసగు చక్కని రాజుల కాలమందు నీ
    లోత్పలమాలలై విరిసె లోకము నందున సత్ప్రయోగముల్

    రిప్లయితొలగించండి
  13. కుందకచెదరకపండిత
    వందితపదగుంభనమునపండునుకవితల్
    చిందిలజేయునురసమును
    కందములోప్రాసయతులుకడుముఖ్యమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ,ఉత్పల పుష్పముల్ సుముని
      యున్నతు నింగని విప్పురేకులన్
      సత్పద పద్యరత్నములు సక్రమ
      రీతిగ వ్రాయువారికిన్
      సత్ఫలితంబు గౌరవము సత్కవి
      వర్యులచేత దక్కు నా
      ఉత్పలమాలలోన గడు యుక్తము
      ప్రాస యతిప్రయోగమే

      తొలగించండి
  14. ఉ.

    తత్పరుడై రచించు కవి దబ్బఱచేయుట ప్రాస కోసమే
    సత్పథమౌను వృత్తముల చాపల చర్యలు చందమిచ్చుటన్
    ఉత్పతనమ్ము లభ్యమయి యూతుల నొందుట తారతమ్యమే
    *“ఉత్పలమాలలోనఁ గడు యుక్తము ప్రాసయతిప్రయోగమే”*

    రిప్లయితొలగించండి
  15. ఉ॥ సత్పథమున్ గనన్ బదవి ఛాయయుఁ బోవఁగ వృద్ధుఁడవ్వఁగన్
    దత్పరుఁడై కవిత్వమును దాల్మిని వ్రాయఁగఁ గోరి సాఁగఁగన్
    మత్పద కూర్పు ప్రాసయతి మైత్రిని యుత్పలమాల యైనచో
    యుత్పలమాలలోనఁ గడు యుక్తము ప్రాస యతిప్రయోగమే!

    రిప్లయితొలగించండి