17, సెప్టెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4534

18-9-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్”
(లేదా...)
“నగధరుఁ డా సుమాంబకుని నాశ మొనర్చియుఁ బ్రోచె నాతినిన్”
(కడిమెళ్ళ వారి శతావధానంలో కె. రాజన్న శాస్త్రి గారి సమస్య)

31 కామెంట్‌లు:

  1. తెగబడి మదనుడు సంధిం
    చగ బాణమ్మ లిగెనపుడు శంభుడు క్షణిక
    మ్ముగ ఫాలనేత్రముఁ దెఱచె,
    నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్.

    రిప్లయితొలగించండి
  2. తగవునతపసిగనట
    పన్నగధారియనంగుద్రుంచినాతినిబ్రోచెన్
    అగణితయౌదార్యంబున
    పగనెన్నకసతినిజూచిపంచెనుప్రేమన్

    రిప్లయితొలగించండి
  3. కందము
    నగరాజ కుమారి పయిన్
    దెగ మోహము కల్గినంత నివ్వెర పడియున్
    జగతికి లయకారుఁడు,ప
    న్నగధారి యనంగుఁద్రుంచి నాతినిఁబ్రోచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      తగువిధి నేనె పార్వతిని త్ర్యంబకు పత్నిగఁగూర్తునంచు తాన్
      తెగ సుమసాయకంబులనదేపని యెక్కిడ క్రోధమంది,ప
      న్నగధరుఁడా సుమాంబకుని నాశమొనర్చియుఁబ్రోచె నాతినిన్.
      జగములు సంతసిల్లినవి షణ్ముఖుఁడే యుదయించ వారికిన్ .

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. నగరాజతనయ కోరిక
    సుగమంబైతీరునటుల సూనాస్త్రుండే
    ఖగములు విడువగ నాప
    న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెగబడు తారకాసురునిఁ దిన్నగ గెల్వగ లేక కోరగా
      నగజకు ఫాలనేత్రునకు నైక్యతకూర్చగ మీనకేతుడే
      ఖగములు వైచిశంకరుని కన్నుల ముందర గోచరింప ప
      న్నగధరుఁ డా సుమాంబకుని నాశ మొనర్చియుఁ బ్రోచె నాతినిన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. నగజను శంకరునిఁ గలుపఁ
    నగమను లామంత్రణమ్ము నతనుని జేయన్
    వగపునుఁ గూర్చి రతికి ప
    న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్

    రిప్లయితొలగించండి
  6. జగమునఁ గినుకను మదనుని
    భగభగ మంటల దహించె భవుఁడని వింటిన్
    బిగువుగఁ దెలుపవొ యెప్పుడు
    నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్

    రిప్లయితొలగించండి
  7. నగజను రుద్రుని కలుపగ
    వ గవక మదనుడు శరమును వదలిన కినుకన్
    వెగటు న కను దెరచి యు ప
    న్న గ ధారి యనుంగు ధ్రుంచి నాతి ని బ్రో చెన్

    రిప్లయితొలగించండి

  8. నగవైరి యానతివ్వగ
    రగిలింపగ ప్రేమ యెదను రతిపతియే యా
    భగుని తపము జెరచగ ప
    న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్



    మగటిమ గల్గు వాడగు కుమారుని జన్మకు మూలమంచు ప
    న్నగశయనున్ సుతుండు సురనాథుని యానతి నంది నంతనే
    భగుని తపమ్మునా గృధువు భంగమొనర్చగ నాగ్రహించి ప
    న్నగధరుఁ డా సుమాంబకుని నాశ మొనర్చియుఁ బ్రోచె నాతినిన్.

    రిప్లయితొలగించండి
  9. చం॥ సుగమముఁ జేయ, దేవతల సూచన మేరకు బాణ మేయఁగా,
    నగపతి పుత్రికన్ గని తనంతట తానుగఁ బెండ్లి యాడఁగన్
    బిగువును వీడి శంకరుఁడు, భీకరుఁడై చనిఁ గోపగించి ప
    న్నగధరుఁడా సుమాంబకుని నాశమొనర్చియుఁ బ్రోచె నాతినిన్

    రిప్లయితొలగించండి
  10. జగతిని రక్షింప సురల
    తగులము పయి మరుడువేసె దన పూశరమున్
    నగజ పయి మరులు పుట్ట, ప
    న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్

    రిప్లయితొలగించండి
  11. నగజకు నాగభూషణుని నాథుని చేయగబూని నిర్జరుల్
    తగ కుసుమాస్త్రుఁ గోరఁగ నతండతి ధీరతఁ జూపి శూలిపై
    మగటిమి జూపి వేసె కుసుమాస్త్రము నంతట కృద్ధుడైన ప
    న్నగధరుఁ డా సుమాంబకుని నాశ మొనర్చియుఁ బ్రోచె నాతినిన్

    రిప్లయితొలగించండి
  12. సెగనయనున్ భవాని పతి చేయ జనించిన యట్టి పుత్రుడే
    తెగువరియైన తారకుని త్రెక్కొన జేయునటంచు, పల్కనింద్రు డా
    చిగురు ధనుర్ధరుండపుడు చేరి తపమ్మును పాడుచేయ ప
    న్నగధరుఁ డా సుమాంబకుని నాశ మొనర్చియుఁ బ్రోచె నాతినిన్

    రిప్లయితొలగించండి
  13. కందం
    అగచాట్ల మాలినిన్ విని
    మగువగ వలలుండు రేగి మత్స్యాధిపులోన్
    రగిలింపఁ గలిసి, దయగన
    నగధారి, యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్!


    చంపకమాల
    పొగలుచు రాగ మాలిని విముక్తికినై, వలలుండు కీచకున్
    మగువగ నాట్యశాల నొకమాటున వేచియు వచ్చినంతటన్
    రగులగ జేయగన్ గలిపి, ప్రాంగణమందున నిల్వ సాక్షిగన్
    నగధరుఁ, డా సుమాంబకుని నాశ మొనర్చియుఁ బ్రోచె నాతినిన్

    రిప్లయితొలగించండి
  14. అగజపయిమోహమునుకలు
    గగచేసినకంతునిగనికడుకోపముతో
    జగములునివ్వెరబోవగ
    “నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్

    రిప్లయితొలగించండి