21, సెప్టెంబర్ 2023, గురువారం

సమస్య - 4538

22-9-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాతము లేకున్నఁ దనువు వ్రయ్యలు గాదా”
(లేదా...)
“వాతము లేనిచోఁ దనువు వ్రయ్యలగున్ గద వెజ్జు సంగతిన్”
(వేలూరి శివరామశాస్త్రి గారి శతావధాన సమస్య)

19 కామెంట్‌లు:

  1. వాతము వలననె ప్రాణ
    మ్మీతనువున నిలుచును, సతమీ గాలియెలే
    దా, తప్పదు మరణమ్మిక
    వాతము లేకున్నఁ దనువు వ్రయ్యలు గాదా”

    రిప్లయితొలగించండి
  2. కందం
    భౌతిక శరీరమందున
    చైతన్యమునింపు ననఁగ సమతుల్యముగన్
    ధాతువులన పిత్త, కఫము,
    వాతము లేకున్నఁ దనువు వ్రయ్యలు గాదా!

    ఉత్పలమాల
    భౌతిక కాయమందు సమపాళ్లను గూడియు నుండు ముఖ్యమై
    చేతన నింపి ప్రాణులకుఁ జేకురఁ జేయును జీవనక్రియల్
    ధాతువులంచనన్ కఫము, దప్పక పిత్తము చాలినంతగన్
    వాతము లేనిచోఁ దనువు వ్రయ్యలగున్ గద వెజ్జు సంగతిన్

    రిప్లయితొలగించండి
  3. ఊతము నీయని పతిపై
    కాతాళము నొందినట్టి కమలాక్షిదరిన్
    పీతలను గోయునపుడు ని
    వాతము లేకున్నఁ దనువు వ్రయ్యలు గాదా

    నివాతము = అండ

    రిప్లయితొలగించండి
  4. భూతలమందు ప్రానులుకు
    బ్రాణము,నీరము లేనిచో వెసన్
    బ్రేత పురంబు జేరుదురు వేయు
    విధంబులు వీక జేసినన్
    ఘాతక వస్తువుల్లవియు కావలె
    సత్యము జీవజాతికిన్
    వాతము లేనిచో తనువు వ్రయ్యల
    గున్ గద వెజ్జు సంగతిన్

    రిప్లయితొలగించండి
  5. భూతములైదునవాయువు
    చేతోముదమొదువనుండుతెలియనిరూపా
    యతనమునందునపరమై
    వాతములేకున్నతనువువ్రయ్యలుకాదా
    ఆయతనము-దేహము
    పరమై-పరమాత్ముడై

    రిప్లయితొలగించండి
  6. వాతము జీవాధారము
    చేతము నుల్లాసపరచి చేతనమిచ్చున్
    భాతిగ జీవులకు భువిని
    వాతము లేకున్నఁ దనువు వ్రయ్యలు గాదా

    రిప్లయితొలగించండి
  7. ఆతతశక్తిశాలియగునాపరమాత్ముడుతామసాకృతిన్
    భూతములైదునేర్పరచిపూరణజేసెగప్రాణికోటినిన్
    చేతనగల్గిజీవులునుతేజముతోడుతవిస్తరింపగా
    వాతములేనిచోతనువువ్ర
    ్యలగున్గదవెజ్జుసంగతిన్

    రిప్లయితొలగించండి
  8. భూతలమున జీవించుచు
    చైతన్యము గలుగజేయు శక్తి కి మూ లం
    బౌ తత్త్వం బగు చు వెలుగు
    వాతము లేకున్నదనువు వ్రయ్యలు గాదా!

    రిప్లయితొలగించండి
  9. గాతియె సత్తువ నిడునీ
    చేతన మగుకాయమునకు జీవమది నభో
    జాతము చేతన్ నిలుచును
    వాతము లేకున్నఁ దనువు వ్రయ్యలు గాదా


    చేతనమైన కాయమన స్థేమయుతమ్మది ధాత్రియందు నా
    బూతియె నిచ్చు సంహతి, విభూతియె తగ్గిన భీతియేలరా
    యాతువు నిల్పు ప్రాణముల నంచన సత్యమె జీవ కోటికిన్
    వాతము లేనిచోఁ దనువు వ్రయ్యలగున్ గద వెజ్జు సంగతిన్.

    రిప్లయితొలగించండి
  10. ఉ.

    వాతము పిత్తమున్ గఫము వైద్యులు చెప్పెడి లక్షణంబులే
    శాతము వంతులౌ సమము స్వాస్థ్యము దోష నివారణమ్ముగా
    ప్రీతిగ నిద్ర, శక్తి నిడు భిస్సను వద్దని కీలుబొమ్మయై
    *వాతము లేనిచోఁ దనువు వ్రయ్యలగున్ గద వెజ్జు సంగతిన్.*

    ... డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

    రిప్లయితొలగించండి
  11. కం॥ చేతన మొసంగుఁ బ్రాణికి
    భూతలమునఁ గనఁగఁ బంచ భూతములె గదా!
    యాతన దప్పున కొరవడ
    వాతము లేకున్నఁ దనువు వ్రయ్యలు గాదా!

    ఉ॥ చేతనఁ బంచ భూతములు చేర్చును బ్రాణికి ధాత్రిలోఁ గనన్
    యాతన దప్ప గావలయు నన్నియు నీరము నగ్ని వాయువుల్
    ఖాతరఁ జేయకున్న నిలఁ గాంచరు స్వస్థత మానవాళియున్
    వాతము లేనిచోఁ దనువు వ్రయ్యలగున్ గద వెజ్జు సంగతిన్

    వాతము వాయువు గాలి

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు, అమెరికా:

    భూతలమందున వలయును
    వాతము ప్రాణులకునెల్ల బ్రతుకుటకొఱకై
    చేతనమిచ్చెడిదగు నా
    వాతములేకున్న దనువు వ్రయ్యలుగాదా?

    భూతలమందు జీవులను పొందుగనిల్పుచు వారియందునన్
    చేతననిల్వరించి దగు స్ధేమము గూర్చెడి ధాతుసంతతిన్
    బ్రాతిగనించుచున్ సతము రాణనొసంగునదై చెలంగు నా
    వాతములేనిచో దనువు వ్రయ్యలగుంగద వెజ్జుసంగతిన్.

    రిప్లయితొలగించండి
  13. వాతము పిత్తము శ్లేష్మము
    చేతన గలవారికెల్ల క్షేమము గూర్చున్
    యాతన తథ్యము జనులకు
    వాతము లేకున్నఁ దనువు వ్రయ్యలు గాదా

    భూతలమందు వ్యక్తులకు పోయిన తిమ్మన నెంచిచూచు జీ
    వాతృకులే వచింత్రు గద స్వస్థత యుక్తతకై త్రిధాతువుల్
    వాతము పిత్తమున్ గఫము పాయక నుంచును సక్రమంబుగా
    వాతము లేనిచోఁ దనువు వ్రయ్యలగున్ గద వెజ్జు సంగతిన్

    రిప్లయితొలగించండి
  14. శంకరాభరణ వేదికనలంకరించిన సంస్కృతాంధ్ర పండితోత్తమ గణమునకు శిరసా నమస్కరిస్తూ..

    తొలి పరిచయము:
    నా పేరు "కందుకూరి భరత్కుమారాచార్య" మా గురువుగారు "భరతా" యని సంబోధించుటచే "భరతుడు కందుకూరి"యను పేరిట కొనసాగుతున్నాను...
    ఈబ్లాగును యాదృచ్ఛికంగా దర్శించడం జరిగినది.. దాదాపుగా దశాబ్దాధిక కాలంగా నిర్విరామంగా,దిగ్విజయంగా నడిపించుచున్నారని అర్థమగుచున్నది...

    ఇది వ్యాకరణ,ఛంద,అవధాన,భాషా, కవితా,సాహితీ ప్రియులకు మరియు పిపాసులకు కల్పవృక్షము వంటిదని
    అర్థమగుచున్నది ...
    ఇందు నేను చేరడం నా అదృష్టంగా భావిస్తున్నాను,అలాగే క్రమం తప్పకుండా పాల్గొనవలెనని నిశ్చయించుకుంటిని......

    నేను ఈ మధ్యే పద్యవ్యాకరణపై అభ్యాసమునారంభించితిని... తప్పులు మన్నించి తెలియజేయ ప్రార్థన...

    ఇచ్చట..
    నా పద్యప్రయత్నము..

    కం.
    భూతము లైదును గలిగిన
    చేతన గాత్రములమరెను జీవుల మోయన్..
    ఘాతము గలిగిన వేళను
    వాతము లేకున్న దనువు వ్రయ్యలు గాదా!

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. జీతము లక్షలక్షలిల జీవిక సాగగ సాటిలేకయున్
      పాతము లేని కీర్తియు నపార విశేష గృహంబులుండినన్
      సైతము దేహమందు నిట సంవహ వాతకఫాదులందు నా
      వాతము లేనిచో దనువు వ్రయ్యలగున్ గద వెజ్జు సంగతిన్

      తొలగించండి
  16. వాతము జీవరాశుల కవారితమౌ యవలంబమీ భువిన్
    చేతమునందుఁ గూర్చుఁనది చేతన భావము నుల్లసిల్లగన్
    వాతము దేహధారులకు ప్రాణము త్రాణమునిచ్చి గాఁచు నా
    వాతము లేనిచోఁ దనువు వ్రయ్యలగున్ గద వెజ్జు సంగతిన్

    రిప్లయితొలగించండి
  17. చేతన తోడ స్వాస్థ్యమును జేకొని జీవనమందు సాగుచున్
    బ్రీతిని గొల్పగా, కఫము పిత్తములున్ వలె చాలినంతగా
    వాతము లేనిచో దనువు వ్రయ్యలగున్ గద! వెజ్జు సంగతిన్
    జూతము జూతమంచు నిక సుంతయు జాగును సేయఁబోకుమా!

    మాచవోలు శ్రీధరరావు

    రిప్లయితొలగించండి