27, సెప్టెంబర్ 2023, బుధవారం

సమస్య - 4543

28-9-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మదరాసున కెంత దవ్వు మామా చెన్నై”
(లేదా...)
“నయమొప్పన్ మదరాసు పట్టణము చెన్నై కెంత దవ్వో కదా”

18 కామెంట్‌లు:

  1. ముదుసలి యెరుగును చక్కగ
    మదరాసును, పేరుమారె మరుతరములక
    య్యది చెన్నై, మనసులలో
    మదరాసున కెంత దవ్వు మామా చెన్నై.

    రిప్లయితొలగించండి
  2. చదివిన పుస్తక మందున
    నెదురగు నామములనుగని నేర్చుకొనుటకై
    కుదురుగ జిజ్ఞాసువడిగె
    మదరాసున కెంత దవ్వు మామా చెన్నై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భయచిత్తుండయినన్ బరీక్ష గెలిచెన్ వాగ్బాణముల్ తార్కొనన్
      రయమున్ మౌఖికమైన వాక్యములనే లక్షింపగా నెంచినన్
      దయనీయంబగురీతి ప్రశ్నలిడిరే తామెంచుకొన్నట్టివే
      నయమొప్పన్ మదరాసు పట్టణము చెన్నై కెంత దవ్వో కదా

      తొలగించండి
  3. కం॥ మదరాసు పేరు మారుట
    విదితముఁ గాని యొక నరుఁడు విషయ మరయకన్
    సదమదమగుచు నడిగె నఁట
    మదరాసున కెంత దవ్వు మామా చెన్నై

    రిప్లయితొలగించండి
  4. చదివినయాంగ్లమునందున
    చెదరగద్రావిడపదములుచేదైయుండెన్
    కుదిరెనుభాషయువిడివడ
    మదరాసునకెంతదవ్వుమామాచెన్నై

    రిప్లయితొలగించండి
  5. మొదల పురమునకు జేరిన
    విదేశ బేహారులటుల పేరును మార్ఛన్
    నది తెలియకనడిగె నిటుల
    "మదరాసున కెంత దవ్వు మామా చెన్నై”

    రిప్లయితొలగించండి
  6. మదరాసని కొందరనఁగ
    కుదురుగ చెన్నైయని మరికొందరు పిలువన్
    పదఁపడి వెంగలి యడిగెను
    మదరాసున కెంత దవ్వు మామా చెన్నై

    రిప్లయితొలగించండి
  7. మదరాసు పేరు మారెను
    గద యని యడుగగ నొకండు గదురుచు నేరా
    వెధవా!యదియును దెలియద
    మదరాసు న కెంత దవ్వు మామా చెన్నై?

    రిప్లయితొలగించండి
  8. భయమెంతన్గనెభావిజీవితమునాభాసంబుసాజంబులో
    రయమున్జూపెగభాషలన్నియునువేర్పాటున్ముదంబంచునున్
    జయమున్స్వేచ్ఛయుగోరెజాతులునువేజాడల్నిల్పెనామంబులో
    నయమొప్పన్మదరాసుపట్టణముచెన్నైకెంతదవ్వోగదా

    రిప్లయితొలగించండి
  9. ఇద్దరు మిత్రుల సంభాషణ:

    కందం
    రొదలేల భాగ్యనగరి క
    యిదరాబాదనఁగ దూరమెంతని చెవిలో?
    మొదట దెలుపుమిది వినుచున్
    మదరాసున కెంత దవ్వు మామా! చెన్నై?

    మత్తేభవిక్రీడితము
    పయనంబందున నా తలన్ దినెడు నీ ప్రశ్నాలిఁ జాలించుచున్
    దయజూపన్నను హస్తినాపురికి మాదౌ దిల్లి దూరమ్ము నీ
    కయి నన్ గోరితె? జెప్పుమయ్య మును నాకై నీ విలాసంబనన్
    నయమొప్పన్ మదరాసు పట్టణము చెన్నై కెంత దవ్వో కదా?


    రిప్లయితొలగించండి

  10. మదనానందా శ్రమమది
    మదరాసున కెంత దవ్వు, మామా చెన్నై
    వదలక నెప్పుడు బయటకి
    కదలని నీకా గృమమదె కైలాసంబౌ.


    వయసైపోయిన వృద్ధుడప్పుడెపుడో బ్రత్కన్ విదేశమ్ముకున్
    బయనంబై బహు కాలమైన పిదపన్ వచ్చెన్ విదేశమ్ముకై
    నయగారమ్మున వ్రాసియుండెనట చెన్నైయంచు, తానడ్గెనే
    నయమొప్పన్ మదరాసు పట్టణము చెన్నై కెంత దవ్వో కదా.

    రిప్లయితొలగించండి
  11. మ॥ నయమా నామము మార్చుచున్ జనఁగ నన్యాయంబు గాదా కనన్
    బయనంబైన విదేశ పౌరులకుఁ దెల్పంగా నసౌకర్యమే
    భయమున్ బొంది విదేశ పౌరుఁడడిగెన్ బాల్ వోక నీరీతిగన్
    నయమొప్పన్ మదరాసు పట్టణము చెన్నై కెంత దవ్వో కదా!

    చాలా కష్ట పడిన పిదప ఇంతమాత్రమే కుదిరందండి

    రిప్లయితొలగించండి
  12. కందం
    ఎదురుగ నిలిచిన రైలున
    మదిరత్రాగిన మధుకర మధురాపుర వా
    శిఁ దడిసి హితవరి నడిగెను
    మదరాసున కెంత దవ్వు మామా చెన్నై.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  13. ప్రియమారన్ మదరాసు పట్టణమునున్ వీక్షింప నా మిత్రుఁడే
    పయనంబాయెను, మార్గమధ్యమున సాంబారన్నమున్ సాపడన్
    దయనీయంబుగ చిత్తమందు నిరవొందన్ భ్రాంతి తానిట్లనెన్
    నయమొప్పన్ మదరాసు పట్టణము చెన్నై కెంత దవ్వో కదా

    రిప్లయితొలగించండి
  14. కందము
    ఇదిగో!కలకత్తాకును
    మదరాసునకెంతదవ్వు?మామా!చెన్నై
    ముదమొనఁగూర్చును,సరిగమ
    పదని స్వరముల్ పలికెడి బహుకీర్తనలన్.

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    చదువేమి రాని కుఱ్ఱడు
    మదరాసున తిరుగుచుండి మామనె యడిగెన్
    అది యిది యొకటని తెలియక
    మదరాసున కెంత దవ్వు మామా చెన్నై?

    రిప్లయితొలగించండి
  16. పదపదమని తొందరిడగ
    నదరాబదరాగ నిచటి కరుదెంచితినే
    మొదటిది తెలుపుము తీరుగ
    మదరాసున కెంత దవ్వు మామా చెన్నై.

    రిప్లయితొలగించండి