7, సెప్టెంబర్ 2023, గురువారం

సమస్య - 4525

8-9-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గుణవిచారణ ద్వైతమగునొకొ గురుఁడ”
(లేదా...)
“సగుణము నిర్గుణంబని విచారణ సేయుటె ద్వైతమౌనొకో”

33 కామెంట్‌లు:

  1. నాణె మొకటియె నైనను, నటునిటు గల
    రూపు వేరగు నట్లె గురువు కెరుకయె
    గాదె మంచిచెడులిలను గలుగు రీతి
    గుణవిచారణ ద్వైతమగునొకొ గురు(డ

    రిప్లయితొలగించండి
  2. జీవుపరమాత్ముతత్వంబుతెలియుతఱిని
    అద్వితీయంబునౌనుగానరయబుద్ధి
    సమతసాధింపనేకంబుసరిగజూడు
    గుణవిచారణద్వైతమగునొకొగురుడ

    రిప్లయితొలగించండి
  3. అగణితరూపుడాతఁడుననంతుడుదేహిగకానడెయ్యడన్
    అగపడుజూచువారలకునయ్యయివేళలమానసంబులో
    నిగమములందుదాగిననునేర్రపనసాధనచేయవచ్చుగా
    సగుణమునిర్గుణంబుననివిచారణసేయుటెద్వైతమౌనొకో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కనడెయ్యెడన్.. నేర్పున సాధన' టైపాటు.

      తొలగించండి
  4. అగణితమైన తత్వములు హాయికి బాటలు వైచిచూపగా
    జగడములేల జీవనము చక్కగ సాగెడి మార్గమెంచుమా
    విగతములైనచర్చలకు విద్యను దూరము సేయనెంచినన్
    సగుణము నిర్గుణంబని విచారణ సేయుటె ద్వైతమౌనొకో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అగణితంబులౌతత్వము లలరుచుండ
      తత్వములనెంచగాదగుఁ దత్వరుచుల
      నెఱిగి; తత్వ విమర్శన నిత్యమయిన
      గుణవిచారణ ద్వైతమగునొకొ గురుఁడ

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. చెఱసాల పాలైన భక్తరామదాసు ఆవేదన...

    తేటగీతి
    నీదు కోవెల నిర్మింప నేరమనుచు
    ప్రభువు చెణసాల పాల్జేసి రామచంద్ర!
    నీవు నేనొక్కటనుకొన్న నన్నుఁ గనవె?
    గుణవిచారణ ద్వైతమగునొకొ గురుఁడ?

    చంపకమాల
    నగమున పుట్టలో గనియు నాథుడవీవని రామచంద్ర! నే
    నగణిత భక్తితత్వమున నంతరమెంచక గట్ట గోవెలన్
    దగనని బందిగన్ ప్రభుత దండనమెంచెను జాలి జూపుటన్
    సగుణము నిర్గుణంబని విచారణ సేయుటె ద్వైతమౌనొకో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు ప్రణామములు.

      తేటగీతి రెండవ పాదము

      'ప్రభువు చెఱసాల పాల్జేసె రామచంద్ర'

      అని చదువుకొన ప్రార్థన

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  6. ద్వైతమననేమి గాంచగ ద్వంద్వ వాద
    మంచు జీవాత్మ పరమాత్మ యంతరమును
    తెలుపునదనుచు చెప్పిరే పలువురు, మరి
    గుణవిచారణ ద్వైతమగునొకొ గురుఁడ?


    *(రాధ కృష్ణుని తో పలికిన మాటలుగా నూహించి)*

    జగముల నేలువాడ, దధిసారపు మ్రుచ్చుని గోరి గాదె మా
    ళిగవిడి చేరవచ్చితి హరీ! పురుషుండవు నీవు నేను కో
    మగనను భేదమేల మన మధ్యన, గాంచగ నేను నీవనే
    సగుణము నిర్గుణంబని విచారణ సేయుటె ద్వైతమౌనొకో

    రిప్లయితొలగించండి
  7. ఆత్మ రూపాన జీవుల o దణ గి యుండ
    తత్త్వ మెరిగిన వారలీ ధరణి యంద
    దేల యత్నింతు రో కద బేల లగుచు
    గుణ విచారణ ద్వై త మగు నొకొ గురుడ?

    రిప్లయితొలగించండి
  8. రంగు మూలముగ నలుపు రజిత మంచు
    పొడవు పొట్టిగ నిడివిని పొరపు జూప
    నాకృతి పయి గాక మనిషి యంత రముగ
    గుణవిచారణ ద్వైతమగునొకొ గురుఁడ

    రిప్లయితొలగించండి
  9. సమస్యా పూరణ.. నా ప్రయత్నం..

    #తేటగీతి
    నేను మరియు బ్రహ్మము వేరు నిశ్చయముగ
    ననుచు నద్వైత మును వీడి యనుదినంబు
    ధ్యానమున భేద భావపు తలపు తోడ
    గుణవిచారణ ద్వైతమగునొకొ గురుడ

    ✍️ తిరివీధి శ్రీమన్నారాయణ

    రిప్లయితొలగించండి
  10. తే॥ వలదు మీమాంస మనమున భక్తి యున్నఁ
    జేరు జీవాత్మ పరమాత్మ చెంతఁ గనవొ
    తలుప నేల ద్వైతాద్వైత పలు గుణముల
    గుణవిచారణ ద్వైతమగునొకొ గురుఁడ

    చం॥ జగమున జీవనంబు ఘన సాగరమీదుట యొక్కటే యటం
    చు గణనఁ జేసి తెల్పఁగను జోద్యము గాను గుతర్క మేలకో
    సగుణము నిర్గుణంబని విచారణ సేయుటె ద్వైతమౌనొకో
    సుగుణము చాలు జీవునకు శోభగఁ జేరఁగ దైవ సన్నిధిన్

    శ్రీమధ్వాచారి గారు ప్రతిపాదించిన ద్వైత సిద్ధాంతము నమ్ముతున్న మధ్వులు దాదాపు 10-15 లక్షలు కూడ లేరేమో నండి కాకపోతే పురందర కనక దాసరు ఆదిగా గల దాసరు వారి దాసర పదగళు భక్తి తత్వాన్ని బోధిస్తు కన్నడ భాషను సుసంపన్నము చేసాయండి

    రిప్లయితొలగించండి
  11. చం.

    సగుణ మనోహరుండు హరి శాశ్వతరూపుడు ముక్తితత్త్వమున్
    విగతము జీవమే విడువ వెల్గులు బ్రహ్మమునొంద మచ్చికన్
    సుగమము భక్తిమార్గమున సోలుచు సాధన చేయు సేవలన్
    *సగుణము నిర్గుణంబని విచారణ సేయుటె ద్వైతమౌనొకో.*

    రిప్లయితొలగించండి
  12. సగుణ నిర్గుణములను విచారణమ్ము
    ద్వైతమని దెల్పగానిట్లు తగదు నీకు
    జీవుడిని దేవుడిని వేరు చేయునట్టి
    గుణవిచారణ ద్వైతమగునొకొ గురుఁడ

    రిప్లయితొలగించండి
  13. తగదిటు భేద భావనలు దైవముఁ జీవుల వేరుచేయుటల్
    సగుణుడుతానె నిర్గుణుడు సత్యముగా పరమాత్ముడౌను తా
    నగణితమౌ యనుగ్రహము నర్మిలి గాచును జీవజాలమున్
    సగుణము నిర్గుణంబని విచారణ సేయుటె ద్వైతమౌనొకో

    రిప్లయితొలగించండి
  14. వినుము జీవాత్మ పరమాత్మ వేరటంచు
    ద్వైత సిద్ధాంత మీ విధి వాసిగాంచు,
    త్రిగుణ తత్వము మనుజుని తీరు దెలుపు,
    గుణవిచారణ.... ద్వైతమగునొకొ? గురుఁడ!

    రిప్లయితొలగించండి
  15. మిగుల వివాదముల్ దరచు మేకొను
    చుండెను వేల్పు గూర్చి యీ
    జగమున లేదు రూపమని సత్యము
    రూపమునన్నదంచునున్
    తగువులు నిర్గుణుండనియు
    తా సగుణుండని జర్గుచుండెడిన్
    సగుణము నిర్గుణంబని విచారణ
    సేయుటె ద్వైతమౌనొకో

    రిప్లయితొలగించండి