23-9-2023 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్”(లేదా...)“తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ”
నిరతము దానము జేయుచుచరితము నెరుగకనె భ్రష్ఠ చరితుల కివ్వన్చెరతురు లోకము వారలుతరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'చరితము నెరుగకయె' అనండి.
అరయక శంభుడుభస్మాసురునికివరమీయనసువుస్రుక్కగపాఱెన్పరుగిడెరక్షకువిష్ణువుతరతమభావమ్ముజూచిదానమిడవలెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరయగ దానమిడునతనికరములు పుచ్చుకొను వాని కైపై నుండన్దొర యనుకొనవచ్చు గనుకతరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్
చరితను గనుగొని మిక్కిలిసరియగు నిర్భాగ్యునకునుసన్మతితోడన్నిరుపేదకు పాత్రునకునుతరతమ భావమ్ము జూచిదానమిడవలెన్
కందంసురపతి కొమరునిఁ గావఁగపరుగున దానమ్ము గొనె కవచకుండలముల్వెరువక నిడి కర్ణుఁడొరిగెతరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్చంపకమాలసురపతి కావ పుత్రుని, యశోధన శోభితు దానకర్ణునిన్బరుగున మారువేషమున పంచన జేరియుఁగోర తొడ్గునున్వెరువక తా నొసంగి రణవేదినిఁ గూలెను నిస్సహాయుఁడైతరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
నిరతము మద్యము గ్రోలగ పరులను ధన మీయ గోరి ప్రాధేయపడన్దిరముగ. యోచించి యపుడుతరతమ భావమ్ము జూచి దాన మిడ వలె న్
ధరణిని పాత్రత నెరుగకనెరపిన దానమ్మదిగన నీచుల పాలై సురభికి వేశ్యల పాలౌ తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్.ఎరుగక జేయు దానమది హీనుల కింపును గూర్చు గాదె యీవరి దరి జేరి చేతకుడు వామము పొందిన నా పణమ్ము తోసురభిని గ్రోలు దుష్టులగు శుండల జేరుచు నుంద్రు కావునన్ దరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ.
అరయగ భారతావనిని యత్యధికుల్నిరు పేదలుందురేసరియగు వారి నెన్నుకొని సాయముసేయుట యోగ్య కార్యమౌనిరతము బాధతో నెపుడు నిక్కమునల్గెడు పేదవారికిన్తరతమ భావముంగని వదాన్యలు దాన మొసంగ యుక్తమౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.'భారతావనిని నత్యధికుల్...'
అరయకమేలోకీడోత్వరపడిదానమొనొసగకతగునో గాదోనరయుచువచ్చిన వారల*“తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సవరణలు వాట్సప్ లో చూడండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కం॥ అరయఁగ నపాత్ర దానమువెరవక మూర్ఖునకుఁ గరపు విద్యయుఁ గనఁగాధరలో చేటును బడియవతరతమ భావమ్ముఁ జూచి దానమిడవలెన్చం॥ అరయ నపాత్ర దానమున యాపద హెచ్చగు నిచ్చు వారికేసరగున రాజకీయమున సజ్జనులన్ గని యెన్న కున్నచోమరవకు కష్టనష్టములు మాన్య జనాళికిఁ దప్ప వయ్యరోతరతమ భావముం గని వదాన్యులు దాన మొసంగ యుక్తమౌ
మరొక పూరణచం॥ సురపతి కోర కర్ణుఁడును శుక్రుని బోధను వీడి నాతఁడున్వెరవక దాన మీయఁగను వీడఁగ వచ్చెను జూడఁ బ్రాణమేనరియ నపాత్ర దానమున హానినిఁ బొందుటఁ గాంచఁ దోచెనేతరతమ భావముం గని వదాన్యులు దాన మొసంగ యుక్తమౌ
మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మొదటి వృత్తంలో 'దానమున నాపద...' అనండి. రెండవ వృత్తంలో 'వీడి యాతఁడున్' అనండి.
ధన్యవాదములండి
త్వరపడి దానములొసగుటసరికాదని చెప్పనగును చరితను గనినన్సరియగు విచక్షణముతోతరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్అరయని సంప్రదానమున హానిని పొందెను దానకర్ణుడేవరములొసంగ సంకటము వచ్చెనుగా బలిచక్రవర్తికేత్వరపడు దానమే దొసగు తప్పిదముల్ వెత పెట్టకుండగాతరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ
గురుకుల మాణికంబు బలు కూకలు బెట్టగ నూరడింపగన్వరగురుడేగె కాననము వాగురవానికడన్నహో మహత్తర గురుదక్షిణంబడిగె తా ప్రియ శిష్యుడు పార్థుకోసమైతరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌవాగురవాడు = నిషాదుడు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నిరతము జూదగృహమ్ములఁదిరుగుచు ధనమెల్లనొడ్డి తిరిపరి యగు జూదరికిన్ దానమపాత్రముతరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్
నిరతము జూదశాలలకు నెట్టన నేగుచు నిల్లుఁ గాంచకన్దిరుగుచు నెల్లవారలను దేబరిగొట్టుగ నాశ్రయించు నావెరువక బిచ్చమెత్తుకొను వెంగలికిచ్చు ధనమ్ము వ్యర్థమౌతరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ
అరయగ నార్తులౌ ప్రజల నాదుకొనన్ మదిలో గణించుచున్ జెఱుపగ వారి వేదనను శీఘ్రమె సాయము గూర్చు నంతలో యురుకున సాగి పోవక నియోగ విధానము లెంచి వానిలోతరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ
చం.పిరుదుల దాటు కీల్జడను పెంపుగ పువ్వుల కూర్పు నేర్పుగాతురిమి సుగంధ వృష్టి నిడి తూపులు మన్మథ కామితార్థముల్సరసకు రాని భార్య గని సౌరభ భాగ్యము శాంతి కాములై *తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ.*
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. పరులకు గౌరవ మిడవలె తరతమ భావమ్ముఁ జూచి; దాన మిడవలెన్సరియగు పాత్రత నెంచుచునిరుపేదల కందరికిని నేర్పుగ సిరులన్.
నిరతము దానము జేయుచు
రిప్లయితొలగించండిచరితము నెరుగకనె భ్రష్ఠ చరితుల కివ్వన్
చెరతురు లోకము వారలు
తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చరితము నెరుగకయె' అనండి.
అరయక శంభుడుభస్మా
రిప్లయితొలగించండిసురునికివరమీయనసువుస్రుక్కగపాఱెన్
పరుగిడెరక్షకువిష్ణువు
తరతమభావమ్ముజూచిదానమిడవలెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅరయగ దానమిడునతని
రిప్లయితొలగించండికరములు పుచ్చుకొను వాని కైపై నుండన్
దొర యనుకొనవచ్చు గనుక
తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచరితను గనుగొని మిక్కిలి
రిప్లయితొలగించండిసరియగు నిర్భాగ్యునకును
సన్మతితోడన్
నిరుపేదకు పాత్రునకును
తరతమ భావమ్ము జూచి
దానమిడవలెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిసురపతి కొమరునిఁ గావఁగ
పరుగున దానమ్ము గొనె కవచకుండలముల్
వెరువక నిడి కర్ణుఁడొరిగె
తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్
చంపకమాల
సురపతి కావ పుత్రుని, యశోధన శోభితు దానకర్ణునిన్
బరుగున మారువేషమున పంచన జేరియుఁగోర తొడ్గునున్
వెరువక తా నొసంగి రణవేదినిఁ గూలెను నిస్సహాయుఁడై
తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండినిరతము మద్యము గ్రోలగ
రిప్లయితొలగించండిపరులను ధన మీయ గోరి ప్రాధేయపడన్
దిరముగ. యోచించి యపుడు
తరతమ భావమ్ము జూచి దాన మిడ వలె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధరణిని పాత్రత నెరుగక
రిప్లయితొలగించండినెరపిన దానమ్మదిగన నీచుల పాలై
సురభికి వేశ్యల పాలౌ
తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్.
ఎరుగక జేయు దానమది హీనుల కింపును గూర్చు గాదె యీ
వరి దరి జేరి చేతకుడు వామము పొందిన నా పణమ్ము తో
సురభిని గ్రోలు దుష్టులగు శుండల జేరుచు నుంద్రు కావునన్
దరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఅరయగ భారతావనిని యత్యధికుల్
రిప్లయితొలగించండినిరు పేదలుందురే
సరియగు వారి నెన్నుకొని సాయము
సేయుట యోగ్య కార్యమౌ
నిరతము బాధతో నెపుడు నిక్కము
నల్గెడు పేదవారికిన్
తరతమ భావముంగని వదాన్యలు
దాన మొసంగ యుక్తమౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'భారతావనిని నత్యధికుల్...'
అరయకమేలోకీడో
రిప్లయితొలగించండిత్వరపడిదానమొనొసగకతగునో గాదో
నరయుచువచ్చిన వారల
*“తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసవరణలు వాట్సప్ లో చూడండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ అరయఁగ నపాత్ర దానము
రిప్లయితొలగించండివెరవక మూర్ఖునకుఁ గరపు విద్యయుఁ గనఁగా
ధరలో చేటును బడియవ
తరతమ భావమ్ముఁ జూచి దానమిడవలెన్
చం॥ అరయ నపాత్ర దానమున యాపద హెచ్చగు నిచ్చు వారికే
సరగున రాజకీయమున సజ్జనులన్ గని యెన్న కున్నచో
మరవకు కష్టనష్టములు మాన్య జనాళికిఁ దప్ప వయ్యరో
తరతమ భావముం గని వదాన్యులు దాన మొసంగ యుక్తమౌ
మరొక పూరణ
తొలగించండిచం॥ సురపతి కోర కర్ణుఁడును శుక్రుని బోధను వీడి నాతఁడున్
వెరవక దాన మీయఁగను వీడఁగ వచ్చెను జూడఁ బ్రాణమే
నరియ నపాత్ర దానమున హానినిఁ బొందుటఁ గాంచఁ దోచెనే
తరతమ భావముం గని వదాన్యులు దాన మొసంగ యుక్తమౌ
మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి వృత్తంలో 'దానమున నాపద...' అనండి.
రెండవ వృత్తంలో 'వీడి యాతఁడున్' అనండి.
ధన్యవాదములండి
తొలగించండిత్వరపడి దానములొసగుట
రిప్లయితొలగించండిసరికాదని చెప్పనగును చరితను గనినన్
సరియగు విచక్షణముతో
తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్
అరయని సంప్రదానమున హానిని పొందెను దానకర్ణుడే
వరములొసంగ సంకటము వచ్చెనుగా బలిచక్రవర్తికే
త్వరపడు దానమే దొసగు తప్పిదముల్ వెత పెట్టకుండగా
తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురుకుల మాణికంబు బలు కూకలు బెట్టగ నూరడింపగన్
తొలగించండివరగురుడేగె కాననము వాగురవానికడన్నహో మహ
త్తర గురుదక్షిణంబడిగె తా ప్రియ శిష్యుడు పార్థుకోసమై
తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ
వాగురవాడు = నిషాదుడు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినిరతము జూదగృహమ్ములఁ
రిప్లయితొలగించండిదిరుగుచు ధనమెల్లనొడ్డి తిరిపరి యగు జూ
దరికిన్ దానమపాత్రము
తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిరతము జూదశాలలకు నెట్టన నేగుచు నిల్లుఁ గాంచకన్
రిప్లయితొలగించండిదిరుగుచు నెల్లవారలను దేబరిగొట్టుగ నాశ్రయించు నా
వెరువక బిచ్చమెత్తుకొను వెంగలికిచ్చు ధనమ్ము వ్యర్థమౌ
తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅరయగ నార్తులౌ ప్రజల నాదుకొనన్ మదిలో గణించుచున్
రిప్లయితొలగించండిజెఱుపగ వారి వేదనను శీఘ్రమె సాయము గూర్చు నంతలో
యురుకున సాగి పోవక నియోగ విధానము లెంచి వానిలో
తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ
చం.
రిప్లయితొలగించండిపిరుదుల దాటు కీల్జడను పెంపుగ పువ్వుల కూర్పు నేర్పుగా
తురిమి సుగంధ వృష్టి నిడి తూపులు మన్మథ కామితార్థముల్
సరసకు రాని భార్య గని సౌరభ భాగ్యము శాంతి కాములై
*తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ.*
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
పరులకు గౌరవ మిడవలె
తరతమ భావమ్ముఁ జూచి; దాన మిడవలెన్
సరియగు పాత్రత నెంచుచు
నిరుపేదల కందరికిని నేర్పుగ సిరులన్.