16, సెప్టెంబర్ 2023, శనివారం

సమస్య - 4533

17-9-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవులు చెఱచువారు లోకకళ్యాణమ్మున్”
(లేదా...)
“కవులెల్లం గడు దుష్టచిత్తులు జగత్కళ్యాణవిధ్వంసకుల్”

18 కామెంట్‌లు:


  1. యువతకు హింసపథము తన
    కవనము తోబోధసేసి కాయస్థుని తా
    నవహేళన జేసెడి కా
    కవులు చెఱచువారు లోకకళ్యాణమ్మున్.

    రిప్లయితొలగించండి
  2. కందము
    కవులెల్ల క్రాంతదర్శులు
    నవభావంబుల కవితలు నవరసములతో
    భువి లిఖియింతురు,కుత్సిత
    కవులు చెఱచు వారు లోక కల్యాణమ్మున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభము
      నవభావంబుల క్రాంతదర్శులయివిన్నాణంబుతోడన్ లస
      త్కవితా సేద్యముసేయు సత్కవులు లోకత్రాణపారాయణుల్
      లవలేశంబును లేక పాండితి వృథాలాపంబులంజేయు, కా
      కవులెల్లంగడు దుష్టచిత్తులు జగత్కల్యాణ విధ్వంసకుల్.

      తొలగించండి
  3. కవులకు వలయును ప్రతిభయు
    నవవిష యాస క్తియుతగి నకళా జ్ఞాన
    మ్మవిలోపించిన వారుకు
    కవులు చెఱచువారు లోకకళ్యాణమ్మున్

    రిప్లయితొలగించండి
  4. భువిపై చెడుగును చెఱుగుచు
    భవములు కలిగింతురెపుడు పారంగతులై
    చివరకు కాబోరుకదా
    కవులు చెఱచువారు లోకకళ్యాణమ్మున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవులే ఖండకులై దురాగతములన్ ఖండింత్రు నిర్ద్వంద్వులై
      భువిపై మంచిని పెంచెడివారు సదా పుంఖాను పుంఖాలుగా
      కవనంబుల్ వెలయించు లోకహితులే కారెన్నడున్ రూఢిగా
      కవులెల్లం గడు దుష్టచిత్తులు జగత్కళ్యాణవిధ్వంసకుల్

      తొలగించండి
  5. కవితలనూహలదేలుచు
    నవకములేనిదియనుచునునాగరికముతో
    వివరము తెలియని వారికి
    కవులుచెరచువారులోకకల్యాణమ్మున్

    రిప్లయితొలగించండి
  6. కవనము శ్రేయము గోరుచు
    నవ పథముల జూప వలెను నవ్యత తోడన్
    యువతకు జెడు బో ధించు కు
    కవులు చెరచు వారు లోక కళ్యాణ మ్ము న్

    రిప్లయితొలగించండి
  7. భువిలో నిత్యము జర్గుహింసలును
    సంపూర్ణంగ ఖండించుచున్
    గవితల్ పద్యములాది వ్రాయుదురు
    కుఖ్యాతోగులంగూర్చి యీ
    కవులెల్లం, గడు దుష్ట చిత్తులు జగ
    త్కళ్యాణ విధ్వంసకుల్
    చెవియుంజేర్చరువీరిమాటలుసుమీ
    చిత్రంబుగాదోచెడిన్.

    రిప్లయితొలగించండి
  8. అవసానమెంచ కుండగ
    భువిని వినాశమొనరించు పోడిమి తోడన్
    కవితలు వ్రాసి బలపరచు
    కవులు చెఱచువారు లోకకళ్యాణమ్మున్

    రిప్లయితొలగించండి

  9. అవమానించుచు ధర్మశాస్త్రములనే యగ్రాహ్యునిన్ దూరుచున్
    గవిశ్రేణుల్ రచియించు కావ్యములు సత్కావ్య మ్ము లౌనందురే
    యువతన్ దూబరదిండిగా మలచగా యుద్ఘాటనల్ చేయు కా
    కవులెల్లం గడు దుష్టచిత్తులు జగత్కళ్యాణవిధ్వంసకుల్.

    రిప్లయితొలగించండి
  10. కందం:
    కవనమను గగన మందున
    కవియే భాసిల్లు రవిగ కావ్య రచనలన్
    కవులెన్నడు కారాదు కు
    కవులు, చెఱచువారు లోకకళ్యాణమ్మున్

    రిప్లయితొలగించండి
  11. కం॥ చవిలేని కవిత్వమలమి
    భువిలో బాధ్యత నెరుగకఁ బులుగాకులిలన్
    గవితల సృష్టించెడి ఘన
    కవులు చెఱచు వారు లోకకళ్యాణమ్మున్

    మ॥ చవిగాఁ గ్రాంతియటంచు విప్లవముతో సాధించు సామ్యంబనిన్
    భువిలో బాధ్యత వీడి భవ్యమనుచున్ బోధించి దుశ్చర్యలన్
    భవితన్ మృగ్యముఁ జేయు కైతలను సంభావించుచున్ వ్రాసెడిన్
    గవులెల్లం గడు దుష్టచిత్తులు జగత్కళ్యాణ విధ్వంసకులే

    పులుగాకు ఉపద్రవము (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి
  12. కవి సామాజిక బాధ్యతన్ నెరపి సత్కావ్యమ్ములన్ వ్రాయుచున్
    భవితవ్యమ్మును తీర్చిదిద్దు ప్రజకున్ భావింప నా కావ్యముల్
    రవియున్ తారలవోలె శాశ్వతముగా రాజిల్లు, నన్యంపు కా
    కవులెల్లం గడు దుష్టచిత్తులు జగత్కళ్యాణ విధ్వంసకుల్

    రిప్లయితొలగించండి
  13. నవ భవితను దర్శించరె!
    యవి యివి యని జెప్పుచుండి యాతన లిడునే!
    కవియును కవి భావమెరుగ!
    కవులు; చెఱచువారు; లోకకళ్యాణమ్మున్!

    రిప్లయితొలగించండి
  14. కవులకు , సతతము ప్రజలను
    సవినయ మార్గమున నడవ
    సద్బోధి స్తున్
    కవనాల రచనయే కని,
    కవులు చెరుచువారు కారు లోక కళ్యాణంబున్

    రిప్లయితొలగించండి
  15. కందం
    భువిలో దేశమనఁగ మా
    నవులనకే యుగ్రవాద నడవడిఁ బెరుగన్
    జవసత్త్వమ్ములఁ గూర్చెడు
    కవులు చెఱచువారు లోకకళ్యాణమ్మున్

    మత్తేభవిక్రీడితము
    భువిలో మృత్తిక కాదు మానవులుగా బోధించుచున్ దేశమున్
    స్తవనీయుల్ వెలుగొందిరే సుకవులై సంస్కారమేపారగన్
    శవభాండమ్ముగ సృష్టి మార్చ గనెడున్ సాహిత్యమున్ గూర్చెడున్
    గవులెల్లం గడు దుష్టచిత్తులు జగత్కళ్యాణ విధ్వంసకుల్

    రిప్లయితొలగించండి
  16. అవధానమ్ములు చేసిసు
    కవివరులిలలోనగణిత ఖ్యాతులుకాగా
    కవితారీతులెరుగక కు
    *“కవులు చెఱచువారు లోకకళ్యాణమ్మున్”*

    రిప్లయితొలగించండి