23, సెప్టెంబర్ 2023, శనివారం

సమస్య - 4540

24-9-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జనులు వొగడరె ముక్కుఁ గోసిన పడఁతిని”
(లేదా...)
“జనులు మనోజ్ఞరూపమని సన్నుతి సేయరె ముక్కుఁ గోసినన్”

36 కామెంట్‌లు:

  1. ముక్కు లావైన నొప్పడు మునివరుడును,
    చక్క నైన ముక్కున్న హెచ్చగును సొంపు
    చేయ వచ్చుము క్కునిపుడు చిన్నగాను
    జనులు వొగడరె ముక్కుఁ గోసిన పడఁతిని.

    రిప్లయితొలగించండి
  2. తే॥ ముక్కు వంకర సవరించ మక్కువఁ గొని
    తనకు శస్త్ర చికిత్సను తగు పగిదినిఁ
    బడతి చేయించు కొనఁగను బద్ధతిఁ గని
    జనులు వొగడరె ముక్కుఁ గోసిన పడతిని

    రిప్లయితొలగించండి
  3. విజ్ఞుడాయెగవైద్యుడువిద్యనరసి
    దేవిశ్రీదేవినాసికతేజమలర
    చక్కబరచెనుదానినిసమతజూచి
    జనులవొగడరెముక్కుగోసినపడతిని

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    ప్రజలు మెచ్చిరి శ్రీదేవి బాల నటిగఁ
    దా కథానాయికగ మారు తరుణమందు,
    శాస్త్ర పద్ధతి సవరించు సరళి వెజ్జు,
    జనులు వొగడరె, ముక్కుఁ గోసిన పడఁతిని

    చంపకమాల
    తనరగ లోకమెల్ల తనదైన మహానట కౌశలాన మ
    న్నన 'సిరిదేవి' బాలనటి నప్పియి, నాయిక యీడునందు మో
    మునలర శాస్త్ర పద్ధతిని పూనియు వైద్యుడు మార్పునెంచఁగన్
    జనులు మనోజ్ఞరూపమని సన్నుతి సేయరె, ముక్కుఁ గోసినన్

    రిప్లయితొలగించండి
  5. చం॥ వినదగు నాదు బల్కుల వివేకముఁ జూపవొ శాస్త్ర విద్యతో
    సరగున ముక్కు వంకరను సర్దఁగ వచ్చు లతాంగి తెల్పగా
    ననువుగ శస్త్ర వైద్యమును హాయిగఁ గాంచవొ యంబుజాననా
    జనులు మనోజ్ఞ రూపమని సన్నుతి సేయరే ముక్కుఁ గోసినన్

    రిప్లయితొలగించండి
  6. ఆమెయభినేత్రి యభినయమందు దిట్ట
    చక్కదనమున రతికిఁ దా సాటియౌను
    ముక్కునొకసుంత సరిచేయ ముచ్చటపడె
    జనులు వొగడరె ముక్కుఁ గోసిన పడఁతిని

    రిప్లయితొలగించండి
  7. జనులును శాశ్వతంబనుచుతల్లడమందిసుఖాభిలాషులై
    కనగనుకామితార్థములుకాంతలుగోరమనోజ్ఞరూపముల్
    అనువుగశస్త్రపద్ధతులనందగజేయగవైద్యులయ్యెడన్
    జనులుమనోజ్ఞరూపమనిసన్నుతిజేయరెముక్కుగోసినన్

    రిప్లయితొలగించండి
  8. మూషక రథునికి రహిగ పూజ జేయు
    పర్వదినమున గుమికూడ, వాడ సీసా
    ముక్కు గోసె నా కొమ, తావి ముసరు కొనగ
    జనులు వొగడరె ముక్కుఁ గోసిన పడఁతిని

    రిప్లయితొలగించండి
  9. చిత్ర సీమ లో ని నటికి చిత్ర మైన
    విధ పు శస్త్ర చికిత్స తో పెరిగి నట్టి
    యందమును జూచి మెప్పుతో నామె గాంచి
    జనులు వొగడరె ముక్కు గోసిన పడతిని

    రిప్లయితొలగించండి
  10. ముక్కువంకర గలదని ముదితయొకతె
    చేసికొనెను శస్త్ర చికిత్స చెలువమాశ
    అందముగ మారినట్టియా యతివగాంచి
    జనులు వొగడరె ముక్కుగోసిన పడతిని

    రిప్లయితొలగించండి
  11. తన యభిమానులెల్లరును తన్మయమొందఁగ హావభావముల్
    పెనగొననామె వెండితెర వేలుపుగా వెలుగొందుచుండె నా
    వనితకు నాసికాగ్రమున వక్రత మాన్పఁగ వైద్యశాలలో
    జనులు మనోజ్ఞరూపమని సన్నుతి సేయరె ముక్కుఁ గోసినన్

    రిప్లయితొలగించండి

  12. మంథి మధ్యన నమరిన మచ్చవోలె
    ననువు గలనటి శ్రీదేవి నాసి కదియె
    యందమునకు విఘాతమటంచు నెంచి
    యింతి శస్త్రచికిత్స చేయించి నంత
    జనులు వొగడరె ముక్కుఁ గోసిన పడఁతిని.


    తనయుని వెంటబెట్టుకుని తండిరి యా నవరాత్రులందునన్
    ఘనముగ పూజలందుకొను కాళి సుతుండగు పర్శు పాణినిన్
    గనగ దలంచి యేగనట గాంచి గజానుని బాలుడిట్లనెన్
    జనులు మనోజ్ఞరూపమని సన్నుతి సేయరె ముక్కుఁ గోసినన్.

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. వినుతినిగొన్న గొప్పనటి వీనియ పల్కుల దివ్యగాత్రి యా
      మనిచెలికాని గెల్చు ముఖ మాన్యత నొందిన మేటితార మో
      మున చిరసుందరంబలర ముక్కును సిరిదేవి మార్పుజేయగన్
      జనులు మనోజ్ఞరూపమని సన్నుతి సేయరె ముక్కు గోసినన్

      ఆమనిచెలికాడు = మన్మథుడు

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  14. ఘనులు వైద్యప్రసిద్దులు కనుగొనిరిట
    సౌష్టవము వృద్ధిచేసెడి శస్త్రవిద్య
    జనులు వొగడరె ముక్కుఁ గోసిన పడఁతిని
    చక్కని చికిత్స పొందిన చంద్రముఖిని

    అనువుగ రూపమున్ మలచి హాయినిగూర్చెడి కార్యదీక్షకుల్
    ఘనముగ వైద్యమందు పరికల్పన చేసిరి శస్త్రకర్మలన్
    గనులకు గోచరంబయిన కమ్మని రూపముఁ గాంచి మెచ్చరే
    జనులు మనోజ్ఞరూపమని సన్నుతి సేయరె ముక్కుఁ గోసినన్

    రిప్లయితొలగించండి
  15. వనిత యొకర్తె నాసికకు వాడని గాయము తాక, వైద్యుడున్
    ఘనముగ చేసి ఆధునిక కాలము మెచ్చు చికిత్స నున్ వెసన్
    గనబడ కుండ మచ్చ పయి కాంతులు చిందెడి నత్తు నంటగా
    జనులు మనోజ్ఞరూపమని సన్నుతి సేయరె ముక్కుఁ గోసినన్

    రిప్లయితొలగించండి
  16. వనితయొకామె యందమును వర్ధిల
    సేయగ చొట్టముక్కునున్
    జనగణ మాన్యతన్గొనిన శస్త్ర చికి
    త్సను జేయు వెజ్జుతో
    దనఘనమైన యిష్టమును దాచక
    తెల్పి చికిత్సపొందగా
    జనులు మనోజ్ఞ రూపమని సన్నుతి
    సేయరె ముక్కు గోసినన్

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ముక్కు పెద్దదిగా నుండ పుట్టినపుడె
    యందమున్ దగ్గె వదనము నందటంచు
    వైద్యునిన్ సంప్రదించ సరైన రీతి
    చేయ శస్త్ర చికిత్సతో చిన్నదయ్యె
    జనులు వొగడరె ముక్కుఁ గోసిన పడతిని.

    రిప్లయితొలగించండి