8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4526

9-9-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మన్నుఁ దిన్నవాఁడు మాన్యుఁడయ్యె"
(లేదా...)
"మన్నుఁ దిన్న కొంటెవాఁడు మాన్యుఁడై నుతుల్ గొనెన్"
(మాత గంగాభవానీ శాంకరీ దేవి గారికి ధన్యవాదాలతో...)

24 కామెంట్‌లు:

  1. కన్నబిడ్డ యనుచువానికాంచిపౌరులంతటన్
    చెన్నుమీరతోషమందిచేరిముద్దుజేసిరే
    సన్నుతింపలేముఘనతచందమామదెచ్చుచో
    మన్నుదిన్నకొంటెవాడుమాన్యుడైనుతుల్గనెన్

    రిప్లయితొలగించండి
  2. కన్నులందు కాంతులీను గడసరి యతగాడెరా
    వెన్న దొంగిలించినట్టి పిల్లవాడు కృష్ణుడే
    ఖిన్నుడైన క్రీడి కనిని గీత బోధ సేసెనే
    మన్నుఁ దిన్న కొంటెవాఁడు మాన్యుఁడై నుతుల్ గొనెన్.

    రిప్లయితొలగించండి
  3. పుడమి తాల్పునెత్తి పురజనులన్ బ్రోచె
    వలువ లొసగి పడతి పరువునిలిపె
    క్రీడికి ఖజమందు గీతను బోధించి
    మన్నుఁ దిన్నవాఁడు మాన్యుఁడయ్యె.

    రిప్లయితొలగించండి

  4. గొల్ల భామలెల్ల గోపాలు గొట్టించ
    మన్ను దిన్నడంచు దెలిపినారు
    తల్లి సూచినోరు తా గనె లోకముల్
    మన్నుదిన్నవాడు మాన్యుడగును

    రిప్లయితొలగించండి
  5. వెన్నుడుర్విపైన వెలసెమానవునిగా
    చిన్ననాటినుండి చెంగలించె
    కన్నులెదుటనిల్చి కర్తవ్యమున్ దెల్పి
    మన్నుఁ దిన్నవాఁడు మాన్యుఁడయ్యె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెన్నుడుర్వి పైనఁ బుట్టి విశ్వరూపుఁ జూపెగా
      కన్నుగప్పి మాయమయ్యె కంసమామ రక్షణన్
      చిన్ననాటి చేష్టలెన్నొ చెంగలింప జూపుచున్
      మన్నుఁ దిన్న కొంటెవాఁడు మాన్యుఁడై నుతుల్ గొనెన్

      తొలగించండి
  6. ఆటవెలది
    అవని ధర్మమెంచు హర్యవతారము
    నన్న మాట నొప్పి యమ్మ తెగడ
    నొదుగ నోట జూపి పదునాల్గు లోకాలు
    మన్నుఁ దిన్నవాఁడు మాన్యుఁడయ్యె

    ఉత్సాహము
    అన్న మాట నెంచ బోక హద్దుమీరి నంతటన్
    వెన్నుఁ గూర్చి యమ్మ వద్ద పెంచి చెప్ప నన్నయే
    కన్నడంచు బిల్వ నోటఁ గాంచ జూపి లోకముల్
    మన్నుఁ దిన్న కొంటెవాఁడు మాన్యుఁడై నుతుల్ గొనెన్

    రిప్లయితొలగించండి
  7. వెన్న జున్ను మెక్కి పెక్కు లీలలు జూపి
    చీర లప హరించి చిలిపి తనపు
    చిన్ని కృష్ణుడ య్యు చెరగని చేష్టతో
    మన్ను దిన్న వాడు మాన్యు డ య్యె

    రిప్లయితొలగించండి
  8. మహిమలెన్నొ చూపె నహిపైన నర్తించె
    వెన్న మ్రుచ్చిలించి వేడ్క జూచె
    కొండ కేలనెత్తి గోవులఁ గాపాడె
    మన్నుఁ దిన్నవాఁడు మాన్యుఁడయ్యె

    రిప్లయితొలగించండి
  9. ఉత్సాహము:
    వెన్న మ్రుచ్చిలించినాడు వేణుగాన లోలుడే
    మన్నుతాల్పు కేలనెత్తె మాయలెన్నొ చేసెనే
    కన్నవారి యార్తిఁ బాప కంసునే వధించెనే
    మన్నుఁ దిన్న కొంటెవాఁడు మాన్యుఁడై నుతుల్గొనెన్

    రిప్లయితొలగించండి
  10. మున్ను వెన్న దొంగ పూజ్యుడయ్యె సలిపి
    న్యూన మైన పనిని, నోరు దెరిచి
    చిట్ట‌ డవికి బోయి చిక్కగ వండి యా
    మన్నుఁ దిన్నవాఁడు మాన్యుఁడయ్యె

    రిప్లయితొలగించండి
  11. ఉత్సాహము.

    వెన్న మీగడలను గొనును ప్రియముగా సచివులతో
    మిన్న, గోప బాలురందు, మెసగె మట్టిఁ గృష్ణుడే
    తిన్న వాని నోటఁ గాంచెఁ ద్రిజగముల్ యశోద, యా
    *మన్నుఁ దిన్న కొంటెవాఁడు మాన్యుఁడై నుతుల్ గొనెన్.*

    .... డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

    రిప్లయితొలగించండి
  12. ఆ॥ ఆటలాడు వేళ నతఁడు మన్నుఁ దినఁగ
    నన్న తెలిపినంత నమ్మ కోర
    నోరు చూపఁ గనెను నోటిలో విశ్వము
    మన్నుఁ దిన్నవాఁడు మాన్యుఁడయ్యె

    ఉత్సా॥ వెన్నముద్ద లేల యనుచు వెగటు కలిగెనొ మరి యా
    చిన్ని కన్నఁడు తినె మన్నుఁ జేరి తనదు మిత్రులన్
    విన్న యమ్మ యడుగఁ జూపె విశ్వమంత నోటిలో
    మన్నుఁ దిన్న కొంటె వాఁడు మాన్యుఁడై నుతుల్ గొనెన్

    మరొక పూరణ అండి నేటి స్థితి గతులకు

    ఉత్సా॥ వెన్న ముద్దలేల యనుచు వివిధ రీతులందునన్
    మిన్న గాను ధనము దోచ మేటి రాజకీయమున్
    గన్న వాఁడు పొగడఁ బ్రజలు ఘనుఁడటంచు దోచెరో
    మన్నుఁ దిన్న కొంటెవాఁడు మాన్యఁడై నుతుల్ గొనెన్

    ఉత్సాహము వ్రాయుట ఇదే ప్రథమమండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్య సుగంధి, విచికిలిత (తరళి), ఉత్సాహము అన్ని 7 సూర్య గణాలు 1 గురువు కలిగి యుంటాయండి (విజ్ఞుల ఉవాచ). సమస్య సుగంధి కావున సుగంధే వ్రాయాలా లేక ఉత్సాహము క్రింద కూడ మార్చుకోవచ్చా అన్నది గురువులు శ్రీ కంది శంకరయ్య గారు నిర్ధారించవలయునని అభ్యర్థన

      తొలగించండి
  13. 2వ పూరణ ఉత్సాహము 3 పాదము చివర ఘనుడటంచుఁ దోచెరో, ఁ పెట్టడము మరచి పోయానండి

    రిప్లయితొలగించండి
  14. వెన్న‌ దొంగ‌ వాడు‌ వింతల‌ బుడతడు
    చిత్రమైనవాడు‌ చిలిపివాడు
    తిట్లు‌‌ తిన్న వాడు‌ తిరగలి‌ మొలవాడు
    మన్నుఁ దిన్నవాడు మాన్యుఁడయ్యె.

    రిప్లయితొలగించండి
  15. చిన్నిబాలుడైన వాడు‌చే‌ సెలీల‌ లేమిటో‌!
    వెన్నదొంగ గాను‌ వాడుపే‌రు మోసె‌ నేమిటో‌!
    చిన్ని‌వేలునెత్తి కొండచి‌ త్రమేగ‌ నిల్పుటా!
    మన్నుఁ దిన్న కొంటెవాఁడు మాన్యుఁడై నుతుల్ గొనెన్"

    రిప్లయితొలగించండి
  16. విన్న వించె నొక్క చెలియ వెన్ను
    తల్లితో నిటుల్
    'కన్న మన్ను దిన్న డంచు' గాంచె
    గాని నోటిలో
    పన్నుగాను వెల్గు భువనభాండ
    మెల్ల బాపురే!
    మన్ను దిన్న కొంటె వాడు మాన్యుడై
    నుతుల్ గొనెన్

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    బాలుడైన గోపబాలుర గాచెను
    మన్ను తినగ తల్లి మందలించ
    నోరు తెఱచి చూపె నోట ముల్లోకాలు
    మన్ను తిన్న వాడె మాన్యుడయ్యె.


    రిప్లయితొలగించండి
  18. అన్ని తానె యగుచు నవతార మూర్తిగ
    నెన్ని లీలలందు నిమిడి నాడొ!
    సన్నుతించినారు సన్ముని వర్యులు
    మన్నుఁదిన్నవాడు మాన్యుడయ్యె!

    రిప్లయితొలగించండి