15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4532

16-9-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పిల్లి సింహము నోడించె విపినమందు”
(లేదా...)
“గెలిచె బిడాల ముద్ధతినిఁ గేసరితో వనిఁ బోరొనర్చియున్”

33 కామెంట్‌లు:

 1. తొల్లి సింహమొకటి పిల్లి తోడ వేసె
  పందె మడవి లోన నినునే పట్టుకుందు
  ననుచు,చెట్టుపై కెక్కెను నవ్వి పిల్లి,
  పిల్లి సింహము నోడించె విపినమందు!

  రిప్లయితొలగించండి
 2. ఆటలాడుట కొఱకొక చోట కూడి
  వనము నందున ప్రాణుల స్పర్థఁ గనగ
  చెట్టునెక్కుట మొదలిడి శీఘ్ర గతిని
  పిల్లి సింహము నోడించె విపినమందు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విలసితమౌను మాధ్యమముఁ వీక్షణఁ జేయగ వింతలెన్నియో
   కలియుగమందునన్ గనగ కల్పిత పాత్రల చేష్టలెన్నియో
   పొలుపున నిర్మితంబయిన పొన్నరి చిత్రమునందు చూడగా
   గెలిచె బిడాల ముద్ధతినిఁ గేసరితో వనిఁ బోరొనర్చియున్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 3. ఆటవెలది
  దేహ బలము కన్న ధీబలమే మిన్న
  యనెడి కథను మున్ను వినమె మనము
  చిన్న చెవుల "పిల్లి సింహము నోడించె
  విపినమందు"నిదియె వింత గాదె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంపకమాల
   నిలిచె శిఖండి యుద్ధమున నేరుగ భీష్ముని ముందు నంత చిం
   తిలి విడనాడె శస్త్రములదే యదనంచును క్రీడి కూల్చగా
   పలికిరి యుద్ధకోవిదులు ప్రస్ఫుటరీతిని యక్కటక్కటా!
   గెలిచె బిడాలముద్ధతినిఁగేసరితో వనిఁబోరొనర్చియున్.

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 4. యుద్ధభూమినిభీష్మునియోధునరసి
  వచ్చినిలచెనుపేడియువైనమెంచి
  విధియువక్రింపతాతయువెనుకనిలచె
  పిల్లిసింహమునోడించెవిపినమందు

  రిప్లయితొలగించండి
 5. మంచి వర్తన గలిగియు మాన్యు డగుచు
  నెన్ని కల లోన ధనికున కెదురు నిలిచి
  గెలిచె నల్పు డై యది గాంచి పలికి రిట్లు
  "పిల్లి సింహము నోడించె విపిన మందు "

  రిప్లయితొలగించండి
 6. చం.

  *గెలిచె బిడాల ముద్ధతినిఁ గేసరితో వనిఁ బోరొనర్చియున్*
  వలదను కౌరవేంద్రు మది వాంఛను ద్రోణుడెరింగి యొప్పగన్
  వలయముగా రథుల్ పెనగ బల్లిదుడౌ నభిమన్యు సంహృతిన్
  విలయముగా ప్రభావితము వెన్నుని బావల గుండెలోడగన్.

  ...డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

  రిప్లయితొలగించండి
 7. శక్తి కంటెను మిక్కలి యుక్తి మిన్న
  పట్టు కొనుమంచు పిల్లి సవాలుసేయ
  సింహమనుసరించగ పిల్లి జెట్టునెక్కె
  పిల్లి సింహమునోడించె విపనమందు.

  రిప్లయితొలగించండి

 8. ఓడెను గద రామారావు నాడు జూడ
  చిత్తరంజ ననెడు వాడి చేతి లోన
  ననుచు విశ్లేషకుండొక డనియె నిటుల
  పిల్లి సింహము నోడించె విపినమందు.  ఇలగన కల్వకుర్తియనె డింపగు స్థానముఁ రామరావనే
  తెలుగు మహానటుండయిన ధీరునీ పైన సవాలు జేయుచున్
  నిలిచిన చిత్తరంజనుడె నెగ్గగ గాంచి వచించి రిట్టులన్
  గెలిచె బిడాల ముద్ధతినిఁ గేసరితో వనిఁ బోరొనర్చియున్.

  రిప్లయితొలగించండి
 9. వనమహోత్సవ వేడుకల్ వార్షికముగ
  జరుపుకొను తరుణమ్మున జరిగె వింత
  పాదపమునెక్కి దిగివచ్చు స్పర్ధయందు
  పిల్లి సింహము నోడించె విపినమందు

  రిప్లయితొలగించండి
 10. అపటువులు కూడి చదరంగమాడ నొకడు
  తప్పుగ తన రాజును ద్రోయ, దాయగాడు
  బంటును నడిపి నీ రాజు బంది యనగ
  పిల్లి సింహము నోడించె విపినమందు

  రిప్లయితొలగించండి
 11. తే॥ చెవులపిల్లి సింహము గుహఁ జేరె నధిక
  జాగు సేసి కథను జెప్పి జాలమల్లి
  సింహమును నీట ముంచఁగ శ్రేయముఁగనె
  పిల్లి సింహము నోడించె విపినమందు

  ఉ॥ విలువలులేని నాయకులు విజ్ఞులఁ బాలనఁ జేయ ధాత్రిలో
  యలుకను బూని సత్య తన యాశలఁ దీర్చఁగ వేయు వేషముల్
  గలహము లాడి భార్య తన కాంతుని గెల్చుటఁ జూడఁ దోచెనే
  గెలిచె బిడాల ముద్ధతినిఁ గేసరితో వనిఁ బోరొనర్చియున్

  రిప్లయితొలగించండి
 12. బలమున తానెమిన్నయయి పాలన సల్పుచునుండె నొక్క జం
  గలమున నెల్ల జంతువుల గర్వమెసంగగ సింగమా వనిన్
  కలగనె బిల్లి స్వప్నమున  గాంచుచునుండగ నెల్ల జంతువుల్
  గెలిచె బిడాల ముద్ధతినిఁ గేసరితో వనిఁ బోరొనర్చియున్

  రిప్లయితొలగించండి
 13. తేటగీతి
  బాల బాలికలకు నీతి పంచనెంచి
  పంచతంత్రము గూర్చిరి పండితాళి
  బావిఁ దననీడ వేరను భ్రమను, చెవుల
  పిల్లి సింహము నోడించె విపినమందు

  చంపకమాల
  విలువల పంచ తంత్రమున విజ్ఞత నేర్వగ బాలబాలికల్
  మలచిరి మేటి గాథలను మాన్యులు నీతుల బోధఁ జేయగన్
  జెలగుచు బావిలో తనదు చిత్రమె వైరిగ నెంచి దూకగన్
  గెలిచె బిడాల ముద్ధతినిఁ గేసరితో వనిఁ బోరొనర్చియున్

  రిప్లయితొలగించండి

 14. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  చిన్న జంతువులను చంపు సింహమునెటు
  లైన యుక్తితో నంతమొందంగ జేయ
  "సింహ రాజ! శత్రువును చూచితిని, రమ్ము!
  నీకు చూపింతునని బావి నీట జూడ"
  మనుచు తెలివితోడను చిన్నదైన చెవుల
  పిల్లి సింహము నోడించె విపినమందు.

  రిప్లయితొలగించండి