28, సెప్టెంబర్ 2023, గురువారం

సమస్య - 4544

29-9-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్యామోహము లేని నరుఁడు యశముం గనునే”
(లేదా...)
“యశముం బొందఁగ శక్యమే నరునకున్ వ్యామోహమే లేనిచో”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

19 కామెంట్‌లు:

  1. ఏమాత్రము ధనకాంక్షయు,
    సామాన్యులతో తగు పరిచయమును లేకన్,
    సామాజిక స్పృహ,పదవీ
    వ్యామోహము లేని నరుఁడు యశముం గనునే”

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్మ:

      కందం
      ఏమిది యర్జున రణమున
      ధీమతి వైరాగ్య మందఁ దేలునె జయమున్?
      భీమరమున గెల్పొందెడు
      వ్యామోహము లేని నరుఁడు యశముం గనునే?

      మత్తేభవిక్రీడితము
      కుశలంబెంచని కౌరవేయులిడగన్ క్షోభన్ సఖా! మీరహ
      ర్నిశలున్ సైచిన దుఃఖమున్ మరచితే? నేడిట్లు వైరాగ్యమై!
      దిశలన్ దక్కిన కీర్తులేమగును సందేహింపకే గెల్చెడున్
      యశముం బొందఁగ శక్యమే నరునకున్ వ్యామోహమే లేనిచో?

      తొలగించండి
  3. మామకమనుభ్రాంతినిగను
    నీమానిసిజగతియందు, నిజమారయగా
    ధీమంతుడునైపదవీ
    పదవీవ్యామోహములేనినరుడుయశమున్గనునే

    రిప్లయితొలగించండి
  4. నీమము పాటించుచునే
    పామరులందునను గూడ వలసిన వాటిన్
    ఆమోద మొందుటందున
    వ్యామోహము లేని నరుఁడు యశముం గనునే

    రిప్లయితొలగించండి
  5. ఏ మేమియు నాశ పడక
    ధీమా గా సేవ లందు స్థిర చిత్తు o డై
    నీమము తో మెల గుచు ధన
    వ్యామోహ ము లేని నరుదు యశముం గనునే!

    రిప్లయితొలగించండి
  6. వశమేపార్థుడ! వైరిగెల్వగనునేభావంబులేకన్మదిన్
    కుశలంబేయదిసృష్టిలోగనగ, నీకోపంబధర్మంబుపై
    విశదంబైజనువిజ్ఞుకంతయునునీవిన్నాణమున్జూపుమా
    యశమున్బొందగశక్యమేనరునకున్వ్యోమోహమేలేనిచో

    రిప్లయితొలగించండి
  7. కం॥ సామాన్యముగా నాశలు
    ప్రామాణికమై తరుమఁగఁ బ్రాభవ మొందున్
    నేమముగ కష్ట పడఁగను
    వ్యామోహము లేని నరుఁడు యశముం గనునే!

    మ॥ పశువుల్ వక్షులు సర్వదా కనఁగ సంభావించుఁ గష్టమ్మునే
    నిశితంగా పరికించగా నరులకున్ నేమంబుతో సాధనన్
    వశమౌ కీర్తియుఁ గాంచ సాధనను సంప్రాప్తించు వ్యామోహమే!
    యశముం బొందఁగ శక్యమే నరునకున్ వ్యామోహమే లేనిచో!

    రిప్లయితొలగించండి
  8. నీమములన మమకారము
    సామాన్యులపైన దృష్టి సచ్ఛీలతయున్
    బ్రేమయు శ్రద్ధా భక్తులు
    వ్యామోహము లేని నరుఁడు యశముం గనునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిశితత్వంబునువీడి నీరసముతో నెక్కొంద్రుగా మూఢులే
      వశమౌనా యశమే విచేతనముతో వర్తించు మేధావికిన్
      విశదంబయ్యెను కీర్తి లభ్యతఁ గనన్ విస్పష్టమౌమోహమే
      యశముం బొందఁగ శక్యమే నరునకున్ వ్యామోహమే లేనిచో

      తొలగించండి
  9. వశమే యీధర సర్వ సౌఖ్యములతో
    నానందమేపారగా
    కుశలంబొప్పమహోన్నతంబుగ గడున్
    గూర్మిన్ సదా మెల్గినన్
    దిశలన్ దిర్గిన నేమి, దక్కదు సుమీ
    ధీ విద్యపై నిత్యమున్,
    యశమున్ బొందగ శక్యమే , నరునకున్
    వ్యామేహమేలేనిచో

    రిప్లయితొలగించండి
  10. తామసి యననజ్ఞానము
    భామమె విజ్ఞానమంచు వచియించిన తా
    నేమాత్రము చదువులపై
    వ్యామోహము లేని నరుఁడు యశముం గనునే?



    వశమౌనే కురుసేనలన్ రణమునన్ పాలార్చగా నంచు నా
    శశి భృత్తిచ్చిన మేటి శస్త్రమది యా శైవాస్త్రమే యుండగా
    త్రసనమ్మెందుకు ధర్మమున్ ధరణిలో స్థాపించ కాంక్షించుమా
    యశముం బొందఁగ శక్యమే నరునకున్ వ్యామోహమే లేనిచో.

    రిప్లయితొలగించండి
  11. కందం
    ఏమని చెప్పగ దగుఁ ధన
    మే మూలము జగతిని యను మెలకువ నెఱయన్
    సామాన్యు డనియె సంప
    ద్వ్యామోహము లేని నరుడు యశముం గనునే.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  12. ఏమోహము లేకుండఁగ
    నేమియు సాధించనగునె యెవ్వనికేనిన్
    కామిత సిద్ధికివలసిన
    వ్యామోహము లేని నరుఁడు యశముం గనునే

    రిప్లయితొలగించండి
  13. శశిసూర్యుల్ వినువీధి తారలును నాశంబొంద నందాక స
    ద్యశముంబొందగ జూతురెల్లరును సత్కార్యమ్ములన్ సల్పుచున్
    వశమౌ కీర్తియు గౌరవంబిలను సద్వ్యాపారముల్ సల్పగన్
    యశముం బొందఁగ శక్యమే నరునకున్ వ్యామోహమే లేనిచో

    రిప్లయితొలగించండి
  14. కామము క్రోధము లోభము
    నామికతో మదము మోహ మపరాగంబున్
    సేమం బొదవని విషయ
    వ్యామోహము లేని నరుడు యశముం గనునే!



    వశముం జేయుచు శాస్త్ర మర్మములు జూ
    పంగోరి రీ విశ్వమున్
    విశదం బందగ జేయ నేడిటను దీ
    పించెన్గదా రోదసిన్
    నిశలందు న్బగలున్శ్రమించి రిట రా
    ణించంగ సాకారమై....
    యశముం బొందఁగ శక్యమే? నరునకున్! వ్యామోహమే లేనిచో!

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కామము నందాసక్తితొ
    నీమములన్ విడిచిపెట్టి నిర్లక్ష్యముగా
    నేమాత్రము మోక్షముపై
    వ్యామోహము లేనినరుడు యశముంగనునే?

    రిప్లయితొలగించండి
  16. కామమునందునమునుగుచు
    నేమములన్నియునువిడిచి నిర్లజ్జితుడై
    క్షేమమునుకూర్చువిషయ
    *"వ్యామోహము లేని నరుఁడు యశముం గనునే”*

    రిప్లయితొలగించండి