4, సెప్టెంబర్ 2023, సోమవారం

సమస్య - 4523

5-9-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తప్పులం జెప్పువాఁ డుపాధ్యాయుఁ డనఁగ”
(లేదా...)
“తప్పుల్ సెప్పు వివేకహీనుఁడె యుపాధ్యాయుండు ముమ్మాటికిన్”

33 కామెంట్‌లు:

  1. బ్రతుకు తెరువును చూపించు భవ్యమైన
    విద్యలం జెప్పు, వలసిన విజ్ఞత నిడుఁ
    గొల్లలుగ లోకమున చేయఁ గూడనివగు
    తప్పులం జెప్పువాఁ డుపాధ్యాయుఁ డనఁగ.

    చెప్పున్ శాస్త్రములెన్నియో విపులవాక్చిత్రంబులన్ జూపుచున్
    విప్పున్ మర్మములెన్నియో సులభసంవేద్యంబుగా నిచ్చలున్
    దప్పుల్ సెప్పు వివేకహీనుఁడె? యుపాధ్యాయుండు ముమ్మాటికిన్
    మెప్పుల్ వొందెడి దైవతుల్యుఁడు గదా మీరెల్ల మ్రొక్కం దగున్.

    రిప్లయితొలగించండి
  2. బాలగోపాలుడెంతటివాడునైన
    గురువుసాందీపువిద్యనుకోరుకొనెను
    నిలుపసద్ధర్మభావంబు, నిజమునరసి
    తప్పులన్జెప్పువాడుపాధ్యాయుడనగ

    రిప్లయితొలగించండి
  3. పిల్లలైన తెలిసినట్టి పెద్దలైన
    తప్పు జేసిన వారికి తగిన రీతి
    మంచి చెడు వివరించి సమయము నెరిగి
    తప్పులం జెప్పువాఁ డుపాధ్యాయుఁ డనఁగ.

    రిప్లయితొలగించండి
  4. ఎప్పుడడిగినఁ విషయము చెప్పు వాడు
    చెప్పినతరి వారిని పరీక్షించు వాడు
    నొప్పిదములను గొనియాడి యోర్మితోడ
    తప్పులం జెప్పువాఁ డుపాధ్యాయుఁ డనఁగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పుల్ దిద్దుచు నేర్పుచుండు నెపుడున్ తర్కించు నైపుణ్యతన్
      జెప్పున్ శిష్యులకున్ యథావిధి సదాచేయూత నందించుచున్
      దప్పుల్ సెప్పు వివేకహీనుఁడె? యుపాధ్యాయుండు ముమ్మాటికిన్
      దిప్పల్ దప్పగ జేయువాడు వటువున్ దీర్చున్ గదా చక్కగా!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. భావి పౌరులు గా జేసి భవిత యందు
    సమయ సందర్భ మెరిగియు చతురు డగుచు
    జేయ రానట్టి పనులను జెప్పి వారి
    తప్పులo జెప్పు వాడు పా ధ్యాయు డన గ

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    గురువె బ్రహ్మయు విష్ణువు పరమ శివుఁడు
    ఆ పరబ్రహ్మ యాతఁడే యందురుగద
    నేర్పుచుండియు విద్యలు నీవు చేయు
    తప్పులంజెప్పు వాఁడుపాధ్యాయుఁడనగ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలము
      గొప్పల్సెప్పుట లేదు నేను,గురువుంగొల్వందగున్ నిత్యమున్
      జెప్పున్ విద్యలలో రహస్యములు విశ్లేషించి;విద్యార్థియే
      తప్పుల్ సెప్పు, వివేక హీనుఁడె యుపాధ్యాయుండు?ముమ్మాటికిన్
      ఒప్పుల్ సెప్పియు తీర్చిదిద్దుగద యోహో!యంచు కీర్తింపగా.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  7. శిష్ట కార్యాచరణమది శ్రేష్ఠమంచు
    దురిత కార్యములను గూర్చి యెరుక పరచి
    కువలయమ్మున నవిజేయ గూడదంచు
    తప్పులం జెప్పువాఁ డుపాధ్యాయుఁ డనఁగ.


    తప్పున్ దప్పని జెప్పుచున్ మకురునంతర్వాణిగా దిద్దగన్
    జెప్పున్ నీతులనెన్నియో కథలుగా శిష్యుండ్ర కున్ నేస్తమై
    యొప్పౌ మార్గము చూపువాడతడె నద్యోజాత తుల్యుండిలన్
    తప్పుల్ సెప్పు వివేకహీనుఁడె? యుపాధ్యాయుం డు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  8. కప్పన్మాయయుగాంచరేజనులుతాకర్తల్గభావించుచున్
    తప్పుల్జెప్పువివేకహీనుడెయుపాధ్యాయుండు? ముమ్మాటికి న్యాయము
    విప్పున్గుట్టునువిజ్ఞుడైయతడువాగ్విన్నాణమున్జూపుచున్
    మెప్పున్గోరనిమాధవుండుగనుడీ! మీరెల్లభావ్యంబగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర 'న్యాయము' ఎందుకు? దాని వల్ల గణభంగం కూడా.

      తొలగించండి
  9. ముమ్మాటికిన్
    న్యాయము డిలేట్చెయ్యాలి

    రిప్లయితొలగించండి
  10. ముందుకాలపు నేతల పొందుజేయ
    తన విధియని దలచి చిన్న తనము నుండి
    తరగతిననున్న శిష్యుల తలపులందు
    తప్పులం జెప్పువాఁ డుపాధ్యాయుఁ డనఁగ

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి
    శిష్యకోటి కజ్ఞానపు చెల్లుచీటి
    గురువులొసగంగ సాధ్యము వరమనంగ
    హితమొనర బోధనల, సవరించు కొనఁగ
    తప్పులం, జెప్పువాఁ డుపాధ్యాయుఁ డనఁగ

    శార్దూలవిక్రీడితము
    తప్పుల్జేయుచు మూర్ఖవాదనలతోఁ దర్కించు నజ్ఞానమై
    గొప్పల్ నేర్పెడు తత్వమున్ గురువులో గుర్తింపకే, దూరియున్
    దుప్పట్లో చరవాణి గాంచుఁ గుతి సంతోషించు శిష్యాళికిన్
    తప్పుల్ సెప్పు వివేకహీనుఁడె యుపాధ్యాయుండు ముమ్మాటికిన్!

    రిప్లయితొలగించండి
  12. చదువుసంధ్యలు నేరిపి శ్రద్ధ జూపి
    తెలివితేటల గదియించి తీర్చిదిద్ది
    వరల సన్మార్గగామిగా వటువు చేయు
    తప్పులం జెప్పువాఁ డుపాధ్యాయుఁ డనఁగ

    రిప్లయితొలగించండి
  13. శార్దూలము:
    చెప్పంజూడడు పొల్లుమాటలెపుడున్ శిష్యాళికిన్ దాలిమిన్
    తప్పొప్పుల్ విపులీకరించి దెలుపున్ దానెన్నడున్ గేలిగా
    తప్పుల్ సెప్పు వివేకహీనుఁడె? యుపాధ్యాయుండు ముమ్మాటికిన్
    మెప్పుంబొందుచునెల్లవారు బొగడన్ మేల్గూర్చు విజ్ఞుండుగా

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    సమయ నజ్ఞాన తిమిరమ్ము ఛాత్రులందు
    వారి భవితకు దోహద పడువిధముగ
    పాఠముల బోధ చేయుచు, వారు చేయు
    తప్పులంజెప్పు వాడుపాధ్యాయు డనగ.

    రిప్లయితొలగించండి
  15. తే॥ దైవమనిరి యాచార్యుని తత్వ మెఱిఁగి
    విజ్ఞతను బెంచి యధిక వివేకమొసఁగి
    బాల బాలికల భవితఁ బరచ వారి
    తప్పులం జెప్పు వాఁడుపాధ్యాయుఁడనఁగ

    శా॥ తప్పుల్ సెప్పు వివేక హీనుఁడె, యుపాధ్యాయుండు ముమ్మాటికిన్
    జెప్పున్ విజ్ఞతఁ బెంచు విద్యఁ గనఁగన్ శ్రేయంబు విద్యార్థులున్
    మెప్పున్ గోరకఁ దీర్చిదిద్దు భవితన్ మేధావులన్ జేయుచున్
    గొప్పల్ బోడు ఫలమ్ముఁ గోరడు భువిన్ గోవిందుఁడే యాతఁడున్

    రిప్లయితొలగించండి
  16. తప్పుల్ సెప్పు వివేకహీనుఁడె; యుపా
    ధ్యాయుండు ముమ్మాటికిన్
    తప్పుల్ సెప్పడు, గొప్పభావనల వి
    ద్యాబోధన న్జేయునే
    తప్పుల్గుర్తెరుగంగ మార్గమును సం
    ధానించి విద్యార్థికిన్
    ౘొప్పున్గూర్చెడి జీవన క్రమము సం
    శోభిల్ల శ్రేయంబుగన్!

    రిప్లయితొలగించండి