11, సెప్టెంబర్ 2023, సోమవారం

సమస్య - 4529

12-9-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భాస కాళిదాసులు దెల్గువారలె కద”
(లేదా...)
“భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే”
(అయ్యగారి కోదండ రావు గారికి ధన్యవాదాలతో...)

31 కామెంట్‌లు:

  1. ప్రతిమ వాసవదత్తయుపసనుజూప
    అమరెశాకుంతలంబునునయ్యెతెలుగు
    దేవభాషయుతెలుగింటతేజముడిగె
    భాసకాళిదాసులుతెల్గువారలెగద

    రిప్లయితొలగించండి
  2. భావ మైనను మధురమౌ భాషనైన
    చతురు లై తెల్గు లెబలికించగలరుగద,
    ఆధునిక యుగమున కవులందభినవ
    భాస కాళిదాసులు దెల్గు వారలెకద.

    రిప్లయితొలగించండి
  3. "భాసకాళిదాసులు దెల్గు వారలె కద"
    యంచు దెలియక పల్కుదు రంతె కాని
    వార లిరువురు సంస్కృత భాషయందు
    వాసి గాంచిన కవివరుల్ వసుధయందు


    రిప్లయితొలగించండి
  4. నాటకము సూసెడు కవిమిత్రుల సంభాషణ:

    తేటగీతి
    "ఇంద్రలోకమున కవిసమ్మేళనమన
    నాటకముగూర్చి నారలు నవ్యరీతి
    పాత్రలందు సంస్కృతమును వల్లెవేయు
    భాస కాళిదాసులు దెల్గువారలె కద?"

    ఉత్పలమాల
    "వేసవి నాటకోత్సవపు వేదికపై కవిసంగమంబునన్
    భాసుర కావ్యకర్తలను బాత్రలఁ జేసిన నాటకంబునన్
    వేసము లందునన్ జెలగి వేడుక జేసిన పాత్రధారులౌ
    భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే!"

    రిప్లయితొలగించండి
  5. వాసవదత్తగాథయటపంచెనుతెల్గునప్రేమమాధురిన్
    వాసినిగాంచెవీరుడనువాదముజేసియుకాళిదాసునే
    గాసినిగాంచలేదుతెలుగాయదిశంభునియర్జునిన్గనిన్
    భాసుడుకాళిదాసుమఱిభారవిగాంచగతెల్గువారలే

    రిప్లయితొలగించండి
  6. ఉ.

    హాసముతోడ నాటికలు హాయిని గొల్పెడి భాస కల్పనల్
    భాసిలె గాళిదాసు కవి భారవి, సంస్కృత భాషలో బుధుల్
    *భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి, యెంచఁగఁ దెల్గువారలే*
    ప్రాసల కట్టు, ప్రాస యతి, పద్యములందు ప్రవేశపెట్టెడిన్.

    రిప్లయితొలగించండి

  7. ఎన్నగను మనవారుకాకున్ననేమి
    వ్యాస వాల్మీకిభారవి భానుడు మఱి
    భాస కాళిదాసులు , దెల్గువారలె కద
    నన్నయ తెనాలి రామకృష్ణాది కవులు.


    ఆ సుర శారదాంబ చరణాంబుజముల్ విడనట్టి వారలై
    భాసురమానమైన కవి పండిత శ్రేణిని యగ్ర గణ్యులై
    వాసి యశస్సుగల్గి జనవంద్యులటంచు జనాళి మెచ్ఛెడిన్
    భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే!?

    రిప్లయితొలగించండి
  8. భాసిల దేవనాగరి వి
    పంచికపై వినిపించె కావ్యముల్
    భాసుడు, గాళిదాసు మఱి
    భారవి; యెంచగ దెల్గువారలే
    వ్రాసె ప్రబంధ కావ్యములు
    ప్రాకటి నొప్పగ సంస్కృతి ప్రభా
    భాసితమౌచు వర్ధిలగ
    వాణి సమర్చన జేసిరెందరో!

    రిప్లయితొలగించండి
  9. తే॥ సంస్కృతమరయకఁ దెలుఁగు సరళ మగున
    తెలుఁగు సంస్కృత పదములు వెలుఁగు పగిది
    యొకటె యనుచు నుడివిరఁట యుత్సుకతను
    భాస కాళిదాసులు దెల్గు వారలె కద

    ఉ॥ వ్రాసినఁ దెల్గు సంస్కృతము భాసిలు చుండవె యొక్క రీతిగన్
    వ్రాసిరి యాంధ్రమందునను వాసిగ సంస్కృత కావ్యరాజముల్
    వ్రాసిన కావ్యముల్ జదివి భావన మీరఁగఁ బల్కిరెల్లరున్
    భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గు వారలే

    మేము BSc లో భాస విరచిత ప్రతిమా నాటకము కాళిదాసు కుమారసంభవము (6-7 సర్గలు) బాణుని కాదంబరి (Abridged version) చదువుకున్నామండి.

    రిప్లయితొలగించండి
  10. కనక దుర్గను నిత్యము గాంచుచుండి
    కృష్ణవేణి తటి నిలిచి కృతులవ్రాయు
    విజయవాడలో నున్నట్టి వివిధ కవుల
    భాస కాళిదాసులు దెల్గువారలె కద

    రిప్లయితొలగించండి
  11. తెలుగు కవులు రచించిరి తెలుగులోన
    నాటకాలను హృదయాలఁ మీటునటుల
    వేష ధారులఁ గాంచిన వేదికపయి
    భాస కాళిదాసులు దెల్గువారలె కద!

    భాసురమైనకావ్యములు ప్రస్తుతమైనవి తెల్గువారిచే
    కాసుల కోర్కెలేక పలు కావ్యములంగొని నాటకంబులన్
    వ్రాసిరి పాత్రపోషణము రంజిలజేసిన పాత్రధారులౌ
    భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే

    రిప్లయితొలగించండి
  12. మూల మైనట్టి భాషగా మోహనంపు
    సంస్కృతo బర యగవెల్గి సౌరు మించ
    తె ల్గు సంపన్న మై యుండ దివ్యు లైన
    భాస కాళి దాసులు దెల్గు వార లె గద

    రిప్లయితొలగించండి
  13. వేసము జూచి నీవునను వెంగలివిత్తుగ నెంచబోకు సే
    దోసిలిబట్టి కావ్య గుణదోషములెల్లను జుర్రుకొంటి నా
    భాసముగా కవిత్వమును వ్రాసిన సత్కవివర్యు లందునన్
    భాసుఁడుఁ గాళిదాసు మఱి భారవి యెంచఁగఁ దెల్గువారలే

    రిప్లయితొలగించండి
  14. తెలుగు సాహితీ విభవము తెలుసు నాకు
    పద్యకవులనౌపాసన బట్టినాను
    భాసమానమౌ కావ్యముల్ వ్రాసినట్టి
    భాస కాళిదాసులు దెల్గువారలె కద

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కావ్యములను రచించిన గాని సంస్కృ
    తమున నాడు కీర్తి గడించి తనరినట్టి
    భాస కాళిదాసులు దెల్గువారలె గద
    నన్నయాది కవుల వోలె మన్ననొందె.

    రిప్లయితొలగించండి
  16. భాసిల దేవనాగరిని
    వ్రాసిరి విస్తృత కావ్యరాజముల్
    భాసుడు, గాళిదాసు మఱి
    భారవి; యెంచగ దెల్గువారలే
    వ్రాసి ప్రబంధ కావ్యములు
    ప్రాకటి నొప్పగ సంస్కృతి ప్రభా
    భాసితమౌచు వర్ధిలగ
    వాణి సమర్చన జేసిరెందరో!

    రిప్లయితొలగించండి