12, సెప్టెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4530

13-9-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విస్కి బాటిలును దెఱచె విష్ణుమూర్తి”
(లేదా...)
“విస్కీబాటిలు విష్ణుమూర్తి దెఱచెన్ విశ్వేశ్వరుం డూఁకొనన్”
(అయ్యగారి కోదండ రావు గారికి ధన్యవాదాలతో...)

29 కామెంట్‌లు:

 1. పక్షివాహనుడంతనుపాలుద్రావ
  కుక్షిలోననుద్రిప్పగాకుమిలెనయ్యొ
  వెజ్జుడంతనుజెప్పగావింతమందు
  వి స్కిబాటిలునుదెఱచెవిష్ణుమూర్తి

  రిప్లయితొలగించండి
 2. రాత్రి విందుకు వచ్చెను రామ మూర్తి,
  విస్కి బాటిలును దెఱచె విష్ణు మూర్తి,
  మంచు ముక్కలు దెచ్చెను మదన మూర్తి
  పేర్లు మంచివె వారలు బెట్టు కొనిరి.

  రిప్లయితొలగించండి
 3. వమ్ము జేసెను మిత్రుడే నమ్మకమును
  ముంచె వ్యాపర సంస్థను మోసగించి
  దిక్కు తోచక యప్పుల దిగులువెరుగ
  విస్కి బాటిలు దెరచెను విష్ణు మూర్తి

  రిప్లయితొలగించండి
 4. ఆస్కారంబునులేనినిందలనిశాస్త్ర జ్ఞుల్తగన్జూపిరే
  చూస్కోవారిదిసోయగంబునిలలోనెచ్చోటన్శివానందమే
  నిష్కామంబుగమానవాళిఘనతన్నేర్వంగపానంబునే
  విస్కీబాటిలువిష్ణుమూర్తిదెఱచెన్విశ్వేశ్వరుండూకొనన్

  రిప్లయితొలగించండి
 5. విష్ణు వేషంబు దాల్చిన విభుదు డొకడు
  పాత్ర ముగిసిన తరువాతవాంఛ తోడ
  విస్కి బాటీలు దె ఱ చెను విష్ణు మూర్తి
  మిత్రు లకు బోసి తానును మ్రింగె కొంత

  రిప్లయితొలగించండి
 6. క్రీడ లందున గెలుపొంది కేకపెట్టి
  పండుగ జరుప నెంచిన వారిజట్టు
  లోన నిశ్చయంబాయెను గాన తాను
  విస్కి బాటిలును దెఱచె విష్ణుమూర్తి

  బాస్కెట్బాలున పొందియున్న విజయంబానందమందించగా
  చేస్కుందామిట పండుగంచు తమలో శేషాద్రి సూచించగా
  వేస్కుందామని జట్టు సభ్యులనగా వెన్వెంటనే తృప్తిగా
  విస్కీబాటిలు విష్ణుమూర్తి దెఱచెన్ విశ్వేశ్వరుం డూఁకొనన్

  రిప్లయితొలగించండి
 7. తేటగీతి
  ఔర!చెలికాండ్ర ముచ్చటల్ ఘోరము కద!
  "చికెను"బిరియాని దెచ్చెను శ్రీనుగాడు
  వేడి వేడి పకోడీలు 'విస్సు'తెచ్చె
  విస్కి బాటిలు దెఱచెను విష్ణుమూర్తి.

  శార్దూలము
  కాస్కో పందెమటంచు పేక కలిపెన్ కామేశుగాడంతటన్
  చూస్కో యీ బిరియాని పొట్లమనుచున్ సూరయ్య ప్రేలంగ,చు
  క్కేస్కోగా తలకెక్కు తిమ్మిరనుచున్ క్రీడా వినోదంబుతో
  విస్కీ బాటిలు విష్ణుమూర్తి దెఱచెన్ విశ్వేశ్వరుండూకొనన్.

  రిప్లయితొలగించండి

 8. మేటి యందగాడతగాడు నాటకమున
  విష్ణు పాత్రను ధరియించు పెద్ద నటుడు
  వేష ధారణ చేసిన పిదప నచటె
  విస్కి బాటిలును దెఱచె విష్ణుమూర్తి.  నిష్కాలుష్యపు లాభమున్ దెలుపుచున్ నే తీయనాచిత్రమే
  యాస్కారున్ గెలిపించె, నీవడుగగా యానంద మున్ దెచ్చితిన్
  బిస్కత్తుల్ వలదంచు చెప్పగనె మార్ద్వీకమ్మిదో యంచనన్
  విస్కీబాటిలు విష్ణుమూర్తి దెఱచెన్ విశ్వేశ్వరుం డూఁకొనన్.

  రిప్లయితొలగించండి
 9. తాను మెచ్చిన నేతను దప్పుబట్టి
  యన్నెముగ వాని జెరశాల నంపినంత
  నొదవు శోకము నెంతయు నోపలేక
  విస్కి బాటిలును దెఱచె విష్ణుమూర్తి

  రిప్లయితొలగించండి
 10. తే॥ విష్ణుమూర్తి విశ్వేశ్వర వెఱ్ఱి సఖులు
  తప్ప తాగి వాగుట వారి తత్వమెపుడు
  విస్కి బాటిలును దెఱచె విష్ణుమూర్తి
  తాగి యిరువురు నల్లరి బాగఁ జేయ

  శా॥ హస్కుల్ గొట్టుచు నేఁడు విస్కిఁ గొనుటే యామోదమై పోయెరో!
  విస్కీత్రాగుచు నేఁడు మానవులు సంప్రీతిన్ గనంగానిటుల్
  విస్కీ మక్కువ విష్ణుముర్తి సఖుఁడౌ విశ్వేసుకున్ హెచ్చెరో
  విస్కీబాటిలు విష్ణుముర్తి దెఱచెన్ విశ్వేశ్వరుం డూకొనన్

  (ఇచట విష్ణుమూర్తి విశ్వేశ్వర మానవులు సఖులండి. Online నిఘంటువులో విస్కికి ముందు పెట్టగలిగిన గురులఘువులేవీ కనపడలేదండి)

  రిప్లయితొలగించండి
 11. విష్ణుమూర్తి భార్య వెడలె విజయవాడ
  తల్లిదండ్రులు మెదలఁగ తలపులందు
  సందు దొరకగ హితులతో విందు జేయ
  విస్కి బాటిలును దెఱచె విష్ణుమూర్తి

  రిప్లయితొలగించండి
 12. ఆస్కారం బొదవన్ మదీయ గృహమందానాటి రాత్రంబునన్
  విస్కీబాటిలు విష్ణుమూర్తి దెఱచెన్ విశ్వేశ్వరుం డూఁకొనన్
  తీస్కున్నానొక పెగ్గు నంత నటకేతెంచంగ నాపత్నియే
  విస్కీ త్రాగిన మత్తువీడె నకటా వేధించగా తిట్లతో

  రిప్లయితొలగించండి
 13. రాస్కెల్ నా ప్రియ మిత్రుడొచ్చెయిపుడే
  రంగోను వెళ్ళెప్పుడో
  కాస్కర్ మక్కువతోడ మేమరిగియున్
  కావేరి హోటల్కుమా
  భాస్కర్ స్నేహితుతో గలసియున్
  ప్రహ్లాదమేపారగా
  విస్కీబాటలు విష్ణు మూర్తి తెరచెన్
  విశ్వేశ్వరుండూకొనెన్.

  రిప్లయితొలగించండి
 14. శా:ఇస్కాన్ మందిర మందు నాటకము నం దే భ్రష్టుడో కొద్దిగా
  వేస్కుందా మని పల్కగా నటు లటన్ వేషమ్ములన్ జూడకే
  "నైస్"కానిమ్మన, సూత్రధారుడు మహానందము తో సై యనన్
  విస్కీబాటిలు విష్ణుమూర్తి దెఱచెన్ విశ్వేశ్వరుం డూఁకొనన్

  రిప్లయితొలగించండి
 15. తే.గీ:వేల్పులే నటు లెల్లరు వేది పైన
  తెరల మాటున వ్యసనమ్ము దీర్చుకొనిరి
  నారదుడు రమ్ము గ్రోలుచు నాట్య మాడె
  విస్కి బాటిలును దెరచె విష్ణు మూర్తి

  రిప్లయితొలగించండి
 16. తేటగీతి
  భృగువు రొమ్ము పైనన్ దన్ను వెగటు సీను
  దర్శకేంద్రుడు వివరింప తాళలేక
  సన్నివేశము రాణించు సరళినెంచి
  విస్కి బాటిలును దెఱచె విష్ణుమూర్తి

  శార్దూలవిక్రీడితము
  ఆ స్కంధంబున మౌనియౌ భృగువు విన్యాసంబనన్ రెచ్చి యం
  ఘ్రిస్కంధంబును జాపి రొమ్ముపయినన్ శ్రీవారిఁ దాడింపగా
  నాస్కందింపక యాదరించుహరి యాహార్యాన జీవింపగన్
  విస్కీబాటిలు విష్ణుమూర్తి దెఱచెన్ విశ్వేశ్వరుం డూఁకొనన్

  (విశ్వేశ్వరుఁడు: దర్శకమహాశయుని నామధేయము)

  రిప్లయితొలగించండి
 17. శా.

  ఆస్కారమ్ముగ తండ్రి సొమ్ము గొనగా హార్దమ్ముతో విద్దె, చూ
  వే, స్కందోలపు విష్ణుమూర్తి బుధుడై విశ్వేశ్వరాఖ్యుంగనెన్
  శ్రీ స్కందాగ్రజ సంప్రసాదము గొనెన్ శ్రేయస్సు నుత్తీర్ణతన్
  *విస్కీబాటిలు విష్ణుమూర్తి దెఱచెన్ విశ్వేశ్వరుం డూఁకొనన్*

  రిప్లయితొలగించండి

 18. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  సతియు పుట్టింటి కేగిన సమయమందు
  మందుతో చేసుకొందము విందటంచు
  తరుణ మిదె యని మిత్రులందరిని పిలిచి
  విస్కి బాటిలును దెఱచె విష్ణుమూర్తి.

  రిప్లయితొలగించండి