11-9-2023 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దారులం గొట్టి బ్రతుకుటే తగిన వృత్తి”(లేదా...)“దారుల్ గొట్టి గడించువారలదె సద్వ్యాపారమం చెంచెదన్”
'దారులంగొట్టి బ్రతుకుటే తగిన వృత్తి'కాదు కాదను సజ్జన బోధ వినకబ్రతుకు చున్నట్టి మూర్ఖులు వెతలు తుదకుననుభవింతురు తప్పకీ యవనిలోన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భూరి రాజకీయపదవిఁ దూరి కడకుదారుణముగ ప్రజలసొత్తు చూఱలాడుఘోర వృత్తిని కోరిచే కొనుట కంటెదారులం గొట్టి బ్రతుకుటే తగిన వృత్తి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'పెంచక, ఒందింపక, మ్రింగక' అన్నవి కళలు, ద్రుతాంతాలు కావు.
సవరించిన పూరణ...వీరావేశమునన్ బ్రసంగములతో విద్వేషముల్ పెంచుచున్సారానమ్మి సదా దురాగతములన్ సంప్రాప్తముల్ చేయుచున్ఘోరంబౌ విధినక్రమార్జనముకై గోఁజాడు వారిన్ గనన్దారుల్ గొట్టి గడించువారలదె సద్వ్యాపారమం చెంచెదన్
మోస పూరిత హామీలు చేసి గెలిచిపదవి పొందిన తరువాత ప్రజల సొమ్ముమెక్కు వారల బోల్చగా మేలు గాదెదారులం గొట్టి బ్రతుకు టే తగిన వృత్తి
చదువులందున జూడగ చవటవీవుతొలము నులన్న గిట్టని బొడ్డగీడవీవు కష్టమ్ము కోర్వని పినుగు నీకుదారులం గొట్టి బ్రతుకుటే తగిన వృత్తి.పేరున్ గీర్తిని బొంద సజ్జనునిగా వేషంబు నే దాల్చుచున్ నేరాలెన్నియొ చేయు నాయకులుగా నీచాతి నీచుండ్రిలన్ రారాజై వెలుగొందెడిన్ బ్రెగడలౌ భ్రష్టుండ్ర కన్నన్ గనన్ దారుల్ గొట్టి గడించువారలదె సద్వ్యాపారమం చెంచెదన్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. రెండవ పాదం అర్థం కాలేదు. అందులోను గణభంగం.
మనము పొందిన ప్రగతికి మత్సరమునదిగబడి జెరచు యా పరదేశ కుట్రదారులం గొట్టి బ్రతుకుటే తగిన వృత్తిపుడమి నాదుకొనుట మన పూచి యనుచు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. '...జెఱచు నా పరదేశ..' అనండి.
వైద్యరంగము నేడు వ్యాపారమయ్యెదొళ్లదోపుగ పైకము కొల్లగొట్టిపేదసాదల రక్తముఁ బీల్చు కన్నదారులం గొట్టి బ్రతుకుటే తగిన వృత్తి
శా.చోరుల్ పల్కు కళాప్రసిద్ధి జితమే చోరీ చతుష్షష్టిలోవీరావేశముతోడ చోరకళనే బీరంబుగా జెప్పుచున్ *దారుల్ గొట్టి గడించువారలదె సద్వ్యాపారమం చెంచెదన్*సారాంశంబు, బడాయి, జూదము, విలాసమ్ముల్ సుఖాసక్తముల్....డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.
తే॥ ఘనము రాజకీయ పటిమ గరిమ తోడధనము దోఁచఁగ వీలగు ధర్మమూర్తివలెనరయ నింత కన్నను వసుధ లోనదారులం గొట్టి బ్రదుకుటే తగిన వృత్తిశా॥ పేరున్ బొందగ రాజకీయమున సంప్రీతిన్ బ్రజావాహినిన్జోరున్ జూపుచు గెల్వఁగానగు జనుల్ జూపించు పాటింపుతోదారుల్ జూచి ధనమ్ము దోఁచ నాతఁడే తర్కించుచున్ జూడఁగాదారుల్ గొట్టి గడించు వారలదె సద్వ్యాపార మంచెంచదన్
చిన్న టైపాటు సవరించానండి
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పారావారము హద్దుగా ధనము సంపాదించు నాకాంక్షతోఘోరంబౌవిధి పేదసాదలను సంకోచించకన్ దోచు వ్యాపారంబయ్యెను వైద్యరంగమిపుఁడా పాపంబు కన్నన్ భువిన్దారుల్ గొట్టి గడించువారలదె సద్వ్యాపారమం చెంచెదన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'సంకోచించక' అన్నది కళ. "సంకోచించకే" అనవచ్చు.
సవరిస్తాను గురువుగారూ 🙏
తేటగీతిఒకరి కష్టము దోచుట నొప్ప దగునె?పరుల రక్తము ద్రాగిన పాటి కాదె?పొట్టకూటికి మృగమౌట పుణ్యమౌనె?దారులం గొట్టి బ్రతుకు టే తగిన వృత్తి?శార్దూలవిక్రీడితముపౌరామోదము తోడ గద్దెలమరన్ బాలింపగాఁ దీరియున్నేరమ్మెంచక స్వార్థచింతనమునన్ నిత్యమ్ముగన్ దోచెడున్వారల్ జేసెడు నీచ వంచనల కన్నన్ జూడ రాదారులన్దారుల్ గొట్టి గడించువారలదె సద్వ్యాపారమం చెంచెదన్!
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. దారులం గొట్టి బ్రతుకుటే తగిన వృత్తియనుటనెంతయో పొరపాటు మనుజులకునుకాలు సేతులు బాగుండి కష్టపడక పరుల సంపదకై నాశ పడుట యేల?నంతకన్నను బిచ్చమ్ము నడుగ మేలు.
'దారులంగొట్టి బ్రతుకుటే తగిన వృత్తి'
రిప్లయితొలగించండికాదు కాదను సజ్జన బోధ వినక
బ్రతుకు చున్నట్టి మూర్ఖులు వెతలు తుదకు
ననుభవింతురు తప్పకీ యవనిలోన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభూరి రాజకీయపదవిఁ దూరి కడకు
రిప్లయితొలగించండిదారుణముగ ప్రజలసొత్తు చూఱలాడు
ఘోర వృత్తిని కోరిచే కొనుట కంటె
దారులం గొట్టి బ్రతుకుటే తగిన వృత్తి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'పెంచక, ఒందింపక, మ్రింగక' అన్నవి కళలు, ద్రుతాంతాలు కావు.
సవరించిన పూరణ...
తొలగించండివీరావేశమునన్ బ్రసంగములతో విద్వేషముల్ పెంచుచున్
సారానమ్మి సదా దురాగతములన్ సంప్రాప్తముల్ చేయుచున్
ఘోరంబౌ విధినక్రమార్జనముకై గోఁజాడు వారిన్ గనన్
దారుల్ గొట్టి గడించువారలదె సద్వ్యాపారమం చెంచెదన్
మోస పూరిత హామీలు చేసి గెలిచి
రిప్లయితొలగించండిపదవి పొందిన తరువాత ప్రజల సొమ్ము
మెక్కు వారల బోల్చగా మేలు గాదె
దారులం గొట్టి బ్రతుకు టే తగిన వృత్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచదువులందున జూడగ చవటవీవు
రిప్లయితొలగించండితొలము నులన్న గిట్టని బొడ్డగీడ
వీవు కష్టమ్ము కోర్వని పినుగు నీకు
దారులం గొట్టి బ్రతుకుటే తగిన వృత్తి.
పేరున్ గీర్తిని బొంద సజ్జనునిగా వేషంబు నే దాల్చుచున్
నేరాలెన్నియొ చేయు నాయకులుగా నీచాతి నీచుండ్రిలన్
రారాజై వెలుగొందెడిన్ బ్రెగడలౌ భ్రష్టుండ్ర కన్నన్ గనన్
దారుల్ గొట్టి గడించువారలదె సద్వ్యాపారమం చెంచెదన్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవ పాదం అర్థం కాలేదు. అందులోను గణభంగం.
మనము పొందిన ప్రగతికి మత్సరమున
రిప్లయితొలగించండిదిగబడి జెరచు యా పరదేశ కుట్ర
దారులం గొట్టి బ్రతుకుటే తగిన వృత్తి
పుడమి నాదుకొనుట మన పూచి యనుచు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'...జెఱచు నా పరదేశ..' అనండి.
వైద్యరంగము నేడు వ్యాపారమయ్యె
రిప్లయితొలగించండిదొళ్లదోపుగ పైకము కొల్లగొట్టి
పేదసాదల రక్తముఁ బీల్చు కన్న
దారులం గొట్టి బ్రతుకుటే తగిన వృత్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశా.
రిప్లయితొలగించండిచోరుల్ పల్కు కళాప్రసిద్ధి జితమే చోరీ చతుష్షష్టిలో
వీరావేశముతోడ చోరకళనే బీరంబుగా జెప్పుచున్
*దారుల్ గొట్టి గడించువారలదె సద్వ్యాపారమం చెంచెదన్*
సారాంశంబు, బడాయి, జూదము, విలాసమ్ముల్ సుఖాసక్తముల్.
...డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ ఘనము రాజకీయ పటిమ గరిమ తోడ
రిప్లయితొలగించండిధనము దోఁచఁగ వీలగు ధర్మమూర్తి
వలెనరయ నింత కన్నను వసుధ లోన
దారులం గొట్టి బ్రదుకుటే తగిన వృత్తి
శా॥ పేరున్ బొందగ రాజకీయమున సంప్రీతిన్ బ్రజావాహినిన్
జోరున్ జూపుచు గెల్వఁగానగు జనుల్ జూపించు పాటింపుతో
దారుల్ జూచి ధనమ్ము దోఁచ నాతఁడే తర్కించుచున్ జూడఁగా
దారుల్ గొట్టి గడించు వారలదె సద్వ్యాపార మంచెంచదన్
చిన్న టైపాటు సవరించానండి
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపారావారము హద్దుగా ధనము సంపాదించు నాకాంక్షతో
రిప్లయితొలగించండిఘోరంబౌవిధి పేదసాదలను సంకోచించకన్ దోచు వ్యా
పారంబయ్యెను వైద్యరంగమిపుఁడా పాపంబు కన్నన్ భువిన్
దారుల్ గొట్టి గడించువారలదె సద్వ్యాపారమం చెంచెదన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సంకోచించక' అన్నది కళ. "సంకోచించకే" అనవచ్చు.
సవరిస్తాను గురువుగారూ 🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిఒకరి కష్టము దోచుట నొప్ప దగునె?
పరుల రక్తము ద్రాగిన పాటి కాదె?
పొట్టకూటికి మృగమౌట పుణ్యమౌనె?
దారులం గొట్టి బ్రతుకు టే తగిన వృత్తి?
శార్దూలవిక్రీడితము
పౌరామోదము తోడ గద్దెలమరన్ బాలింపగాఁ దీరియున్
నేరమ్మెంచక స్వార్థచింతనమునన్ నిత్యమ్ముగన్ దోచెడున్
వారల్ జేసెడు నీచ వంచనల కన్నన్ జూడ రాదారులన్
దారుల్ గొట్టి గడించువారలదె సద్వ్యాపారమం చెంచెదన్!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
దారులం గొట్టి బ్రతుకుటే తగిన వృత్తి
యనుటనెంతయో పొరపాటు మనుజులకును
కాలు సేతులు బాగుండి కష్టపడక
పరుల సంపదకై నాశ పడుట యేల?
నంతకన్నను బిచ్చమ్ము నడుగ మేలు.