24, సెప్టెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4541

25-9-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాతికి రత్నమ్ము రమణి ప్రాప్తంబయ్యెన్”
(లేదా...)
“రాతికి రత్నమున్ రమణి ప్రాభవమొప్పఁగ లభ్యమయ్యెఁ బో”
(వేలూరి శివరామశాస్త్రి గారి శతావధాన సమస్య)

12 కామెంట్‌లు:

  1. జాతరజేసిప్రసేనుడు
    చేతనగోల్పడమణిగనచేరెనుగుహనా
    త్రాతగభల్లూకునకున
    రాతికిరత్నమ్మురమణిప్రాప్తంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  2. ఆతడు పరమానందుడు
    పూతాత్ముడుగాన జాంబవునితో నభిసం
    పాతము వలనన్ గంసా
    రాతికి రత్నమ్ము రమణి ప్రాప్తంబయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రీతిగ పాలుపిండి శశి బింబముఁ జూచిన కారణంబునన్
      ఘాతుక కారకుండనుచు కల్గిన నిందలు చంగలింపగా
      పాతకహారి ఘోరముగ భల్లముతో కలహింప హైహయా
      రాతికి రత్నమున్ రమణి ప్రాభవమొప్పఁగ లభ్యమయ్యెఁ బో

      తొలగించండి
  3. కందం
    ఘాతక తారకుఁ దునిమెడు
    జేతను గన సురలు వేడ, చేతోభవునిన్
    భూతిగఁ జేసిన మదనా
    రాతికి రత్నమ్ము రమణి ప్రాప్తంబయ్యెన్

    ఉత్పలమాల
    ఘాతక తారకాసురుని గర్వమడంచు కుమారునొందఁగన్
    భూతగణాధిపున్ సురలు మ్రొక్క నపర్ణను పత్నిగాగొనెన్
    భూతిగఁ జేసి పువ్విలుతు ముక్కనుసామియె! కాంచ మన్మథా
    రాతికి రత్నమున్ రమణి ప్రాభవమొప్పఁగ లభ్యమయ్యెఁ బో!

    రిప్లయితొలగించండి
  4. ఆతత శౌర్యము జూపగ
    భీతిగ నా జాంబ వంతు ప్రేమగ మణి నిన్
    గూ తు నొసంగగ గంసా
    రాతికి రత్నమ్ము రమణి ప్రా ప్తం బ య్యె న్

    రిప్లయితొలగించండి
  5. చౌతిని చంద్రుజూచె నిజ సౌధమునన్ విధి వక్రమొందగన్
    నీతిని వీడి సాత్రజితు నిందను మోప శమంతకంబు తా
    భాతిని తెచ్చె భవ్యతతి వైణవపాణియె కంస పూతనా
    రాతికి రత్నమున్ రమణి ప్రాభవమొప్పగ లభ్యమయ్యె బో

    రిప్లయితొలగించండి
  6. భుతేశుని దపమందున
    చేతో భవుడా‌తనిపయి చిలుకుని వేయన్
    చేతనము కలుగగ పురా
    రాతికి రత్నమ్ము రమణి ప్రాప్తంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  7. ఆతడు జాంబవు నభిసం
    పాతమ్మున గెలువగ నప వాదది తొలగన్
    ఖ్యాతియు పెరుగుచు కంసా
    రాతికి రత్నమ్ము రమణి ప్రాప్తంబయ్యెన్.



    నీతిని వీడి రత్నమును నేడు హరించితి వన్న నిందతో
    ఖ్యాతికి మచ్చ వచ్చెనని కక్కస మందున నేగి తల్కమం
    దాతడు జాంబవంతునట యావహమందున గెల్వ దానవా
    రాతికి రత్నమున్ రమణి ప్రాభవమొప్పఁగ లభ్యమయ్యెఁ బో.

    రిప్లయితొలగించండి
  8. ఆతత దీప్తుల రత్నము
    త్రాతగ శ్రీకృష్ణమూర్తి రాజునకీయన్
    ప్రీతిగదురుకొనగ మురా
    రాతికి రత్నమ్ము రమణి ప్రాప్తంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  9. ప్రీతిగ జాంబవంతుడొగిఁ బేరిమిఁ గూతును రత్నమీయగా
    నాతత దీప్తివంతమగు నామణినిం గొని కృష్ణమూర్తియున్
    త్రాతగ రాజుకీయ తన తప్పిదమున్ గ్రహియించినన్ మురా
    రాతికి రత్నమున్ రమణి ప్రాభవమొప్పఁగ లభ్యమయ్యెఁ బో

    రిప్లయితొలగించండి
  10. కం. యాతులు సురలు మథించఁగఁ
    బ్రీతిని క్షీరాబ్ధిఁ బుట్టు విష మాయెఁ బురా
    రాతికిఁ బిమ్మట దైత్యా
    రాతికి రత్నమ్ము రమణి ప్రాప్తంబయ్యెన్.

    ఉ. ఆతత శక్తినిన్ సురలు నా దితిపుత్రులు పాలసంద్రమున్ బ్రీతి మథించఁగా విషము వెల్వడ ముందు గ్రహించె నప్పురా
    రాతి, జనించెఁ గౌస్తుభము లక్ష్మియుఁ బిమ్మట, మించు కైటభా
    రాతికి రత్నమున్ రమణి ప్రాభవమొప్పఁగ లభ్యమయ్యెఁ బో.

    రిప్లయితొలగించండి