13, సెప్టెంబర్ 2023, బుధవారం

దత్తపది - 201

14-9-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ధార - ధారణ - ధైర్యము - ధిషణ
పై పదాలను ప్రయోగిస్తూ
అవి లేనివాడు చేసే అవధానం ఎలా ఉంటుందో
స్వేచ్ఛాచందంలో చెప్పండి.

17 కామెంట్‌లు:

  1. ధార లేనిది పద్యంబుతలప విసుగు
    ధారణంబునకుంటిన తాడనంబె
    ధైర్యమెంచనిపలుకులతప్పులుండు
    ధిషణజూపనియవధానిదిక్కులెన్ను

    రిప్లయితొలగించండి
  2. ధారగకవిత జెప్పెడి ధైర్యమేది,
    ధారణను జూడగ వెకిలి దనము దోచు,
    ధిషణయును స్వల్ప మైననేతీరుగ కవి
    కఠిన యవధానముల జేయగల్గునకట!

    రిప్లయితొలగించండి
  3. పద్య ధారను కురిపించు వాడు కాదు
    గొప్పదైనట్టి ధారణ కూడ లేదు
    ప్రశ్న లెదురొడ్డు ధైర్యముఁ ప్రజ్ఞ లేదు
    ధిషణలేదాయె నవధాన తృప్తిలేదు

    రిప్లయితొలగించండి

  4. ధిషణ కరువైన యవధాని తీరు తెలుప
    వశమె? ధార ధారణ లేని పండితునకు
    ధైర్యము విలోల మగుచుండ తనువు వణుక
    పండిత సభయదియె రసాభాసమగును.

    రిప్లయితొలగించండి
  5. ధారయొకింత లేని యవధాని యొనర్చెడి పద్య పూరణల్
    పూరణలేని చప్పనగు బూరెల కైవడి నుండుగాదె తా
    ధారణ చేయజాలని వధానిని మెచ్చరు విజ్ఞులెవ్వరున్
    ధారయు ధైర్యమున్ ధిషణ ధారణలేక వధాన మెట్లగున్?

    రిప్లయితొలగించండి
  6. ఉ॥ ధారయె లేని పద్యముల తాకిడి మోదము నొందఁ గల్గునా
    పూరణఁ జేయఁగన్ ధిషణ పుష్టిగ లేక వధానమొప్పునా
    యోరిమి ధైర్యమున్ గనక నోపఁగఁ జాలక పృచ్ఛకాళినిన్
    ధారణ హీనమైన యవధానముఁ జేయ నభాసు పాలెగా

    రిప్లయితొలగించండి

  7. సీ.

    ఎవ్వని వాక్కున నిముడవు సంధులు
    గీర్వాణ భాషను కెంపు కళలు
    ఎవ్వని పద్యమ్ము లెఱుకచేయు గుణము
    సొంపునిచ్చు విధిని సులభమెద్ది
    ఎవ్వని శైలిని నెదను వణకు పుట్టు
    నుపమాన పద్ధతి నొప్పులేదు
    ఎవ్వని పదముల యేర్పాటు జిగిబిగి
    అర్థ తాత్పర్యమ్ము లలవి గాదె

    తే. గీ.

    అతని యవధానమున ధార యంత మొందె
    ధిషణ లేని కవిత్వమ్ము దిమ్మరీడు
    పద సమూహాల ధారణ పతనమయ్యె
    తగ్గె ధైర్యము కవికి శ్రోతలకు గూడ.

    ... డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

    రిప్లయితొలగించండి
  8. ధార లేనట్టి పద్యాలు దగని వగుచు
    ధారణ యు లేని సమయానధరణి యందు
    కోరి యున్నట్టి దిషణ కుదరకున్న
    ధరణి నొనరించ డ వధాని ధైర్యముగను

    రిప్లయితొలగించండి
  9. పృచ్ఛకులకు జవాబిడు విధము నందు
    ధార,ధారణ ధిషణలు దప్పి యుండ
    ధైర్యముగ రాముడన నవధాని దెలిపె
    "రరర రాముడు తమ్మడు రావణునికి"

    రిప్లయితొలగించండి
  10. ధారగ పద్యము లల్లక
    ధారణ కొరవడిన వాడు ధైర్యము లేకన్
    కోరిన దిష ణ ము నుండక
    ధారుణి నొనరింప డే వధా నమ్ము లిలన్

    రిప్లయితొలగించండి
  11. ధార నందడు పద్య ప్రధాన మదియ
    ధారణమ్మున నుడువగ తారుమారు
    ధైర్యమును పుంజుకొనలేడు తగిన విధము
    ధిషణ కొరవడ నవధాని దిక్కులరసె!

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    ధార కొరవడ కుంటి పద్యమ్ము వెలయు
    ధారణము వీడ మొదటి పద్యమ్ము రాదు
    రాజిలునె ప్రయోగములు ధైర్యమ్ము వీడ
    ధిషణ కొరవడ చతురిమ తేలిపోవు

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ధార లేనట్టి వాడవధాని యెట్లు?
    ధారణము ప్రధానమ్మవధాన మందు ధైర్యమున్ గోలుపోయి నద్దాని చేయ
    లేకయె ధిషణ కొరవడి రిక్కల గనె.

    రిప్లయితొలగించండి