19, అక్టోబర్ 2023, గురువారం

సమస్య - 4563

20-10-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రసికు లొప్పని పద్యమే రమ్యమనిరి”
(లేదా...)
“రసికుల్ మెచ్చని పద్యమే నిలిచె సర్వశ్రేష్ఠమై వింతగన్”

13 కామెంట్‌లు:

  1. తే.గీ:
    సరస మెరుగని వారలే చాల మంది
    సరళమగు భాషలోకైత జక్క దనము
    మెచ్చకుండిరి చాదస్తమెతగుననుచు
    రసికులొప్పని పద్యమే రమ్యమనిరి.

    రిప్లయితొలగించండి
  2. పద్య రచన పై యింగము ప్రజలనడుగ,
    సంధి యతి ప్రాస నియమము సాగ నట్టి
    రసికు లొప్పని పద్యమే రమ్యమనిరి,
    జడులు దమకర్థమయి కొనసాగు ననుచు

    రిప్లయితొలగించండి

  3. నిలువదు కలకాలమ్మిల నిక్కముగను
    రసికు లొప్పని పద్యమే ,రమ్యమనిరి
    వ్యాకరణము సంధిసమాస యతనిగూర్చి
    చక్కగా వ్రాయుపద్యమే జగతిలోన.

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    దెసల రసపుష్టి మెత్తురు రసికులవని!
    నడక నవరసహీనమై నాణ్యమగునె?
    సద్రసమె కవిత్వమగుచు సాగ, నెవరు
    రసికు లొప్పని పద్యమే రమ్యమనిరి?

    రసపుష్టిన్ ద్విగుణీకృతమ్మయినవే రాణింప కావ్యమ్ములన్
    మిసిమిన్ గల్గిన భావమే మెరయగన్ మిర్మిట్ల దివ్యమ్ముగన్
    రసమేమూలమనన్ కవిత్వమునకున్ సర్వామోదమై యెప్పుడే
    రసికుల్ మెచ్చని పద్యమే నిలిచె సర్వశ్రేష్ఠమై వింతగన్?

    రిప్లయితొలగించండి
  5. పామరుల భంగి మెల్గె డు పౌరు లొ కట
    కాంచి యవ ధానమును దాము కమ్మ ననుచు
    రసికు లొప్పని పద్యమే రమ్య మనిరి
    వినిన పండిత వర్యుడు విస్తు పోయె

    రిప్లయితొలగించండి
  6. తే॥ సకల జనులకు నర్థమై సరళమైన
    పద్యము మెరయఁగఁ గఠిన పదములొంది
    భావ యుక్తమైన జనులు వలదనుచును
    రసికు లొప్పని పద్యమే రమ్యమనిరి

    మ॥ విసుగున్ బొందఁగ మానవాళి తమదౌ విద్వత్తు కేమాత్రమున్
    బొసఁగన్ జాలకఁ గష్టమౌ పదములన్ బూరించ సంక్లిష్టమై
    మసలంగన్ వలదీ కవిత్వమనుచున్ మానంగ వాచించుటన్
    రసికుల్ మెచ్చని పద్యమే నిలిచె సర్వశ్రేష్ఠమై వింతగన్

    రిప్లయితొలగించండి
  7. ఆధునికులు మెచ్చరు పద్యమంచు పలుక
    నేమి? యతులు ప్రాసలతోడ నింపుగాను
    విలసితమగు చుండ గనుచు భేషనగను
    రసికు, లొప్పని పద్యమే రమ్యమనిరి.


    అసహాయుండ్రకు మేలుగూర్చనిది పద్యంబంచు వాక్రుచ్చుచున్
    బసయే యుండదు పద్యమందనుచు బొప్పండ్రెంత వాదించినన్
    వసుధన్ బద్యమె వాసికెక్కెను గదాప్రాసల్ యతుల్, భేషనన్
    రసికుల్, మెచ్చని పద్యమే నిలిచె సర్వశ్రేష్ఠమై వింతగన్.

    రిప్లయితొలగించండి
  8. మధుర మంజుల కోమల మనెడు రీతి
    కుదిరిన పలు పద్యములను చదివినతరి
    సరసులొసగుచు మెండగు శ్లాఘనంబ
    రసికు లొప్పని పద్యమే రమ్యమనిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రసరమ్యంబగు కూర్పుతోడ విధిగా రాణించుకావ్యాలకై
      కొసరించన్ దగు యోర్మి తోనరయగా కోకొల్లలౌ గ్రంథముల్
      పసలేనట్టివి మిక్కుటంబగుపడన్ వాపోయె స్త్రీలోలురౌ
      రసికుల్ మెచ్చని పద్యమే నిలిచె సర్వశ్రేష్ఠమై వింతగన్

      తొలగించండి
  9. పద్య వైభవ మెరుగని బాలిశులకు
    నెటుల కవివర్యు చాతురి యెరుకఁ బడును?
    రసవిహీనమై యజ్ఞుడు వ్రాసినట్టి
    రసికు లొప్పని పద్యమే రమ్యమనిరి

    రిప్లయితొలగించండి
  10. రసరమ్యంబగు పద్య మాధురులతో రాజిల్లు కావ్యంబులన్
    వెసనంబట్టుల సంలిఖించిన కవుల్ పేరొంద, నేడక్కటా
    రసముంబల్కని పేలవంపు పదజాలంబుల్ ప్రసంధిల్లునా
    రసికుల్ మెచ్చని పద్యమే నిలిచె సర్వశ్రేష్ఠమై వింతగన్

    రిప్లయితొలగించండి
  11. మ.

    హసమున్ గృష్ణుడు గోపకాంతలకు నూహాతీతమౌ వేధమున్
    రుసుమే లేదని భార్యలందరు వడిన్ రోదించి ప్రార్థించెడిన్
    కసటున్ దెల్పుచు శంకరాభరణ సంఘంబందు వైనంబుగా
    *రసికుల్ మెచ్చని పద్యమే నిలిచె సర్వశ్రేష్ఠమై వింతగన్.*

    రిప్లయితొలగించండి