15, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4559

16-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానముఁ జేయువార లల్పులె కనఁగన్”
(లేదా...)
“అవధాన మ్మొనరించు వార లకటా యల్పుల్ గదా చూడఁగన్”

19 కామెంట్‌లు:

  1. అవగాహన లేకుండనె
    యవలీలగ కవితలల్ల యత్నించెడివా
    రవధానులు గారెరుగక
    నవధానముఁ జేయువార లల్పులె కనఁగన్”

    రిప్లయితొలగించండి
  2. వ్యవధియ లేక వలసినవి
    ధవునకు సంతతికిని నిరతంబు సకలమున్
    సవరించు స్త్రీలఁ బోల్చఁగ
    నవధానముఁ జేయువార లల్పులె కనగన్

    రిప్లయితొలగించండి
  3. జవమున పద్యము లల్లుచు
    నవధానము జేయు వార లల్పులె? కనగన్
    భువిలో విబుధులు మెచ్చ గ
    ప్రవిమల వి ఖ్యాతి నంది రాణిం త్రు కదా!

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. అవిరళకృషితో శ్రద్ధగ
      నవధానము జేయువార లల్పులె? కనగన్
      జవనాశ్వమువలె వడిగల
      కవనముతో నొప్పువారు కవులే ఘనులే!

      తొలగించండి
    2. వివరింపంగ వధాన సత్క్రియలలో విద్వత్తునే చాటగా
      కవులుత్సాహముతోడవత్తురుగదా గాంభీర్యముప్పొంగగా
      నవధాన మ్మొనరింపగా సరసులై నత్యంత నైపుణ్యత
      న్నవధాన మ్మొనరించు వార లకటా యల్పుల్ గదా చూడఁగన్

      తొలగించండి
  5. అవిరళమగుకృషి సలుపగ
    నవధానము జేయనేర్చి‌, యార్జన యందున్
    చవిచూపకుండి నందున
    యవధానముఁ జేయువార లల్పులె కనఁగన్

    రిప్లయితొలగించండి
  6. కందం
    వివరంపు పద్ధతినెఱిఁగి
    స్తవనీయముగ నొనరింప సత్పండితులున్
    కవనము ధారయు కొరవడ
    నవధానముఁ జేయువారలల్పులె కనఁగన్

    మత్తేభవిక్రీడితము
    వివరంబెంచియు పద్ధతిన్ దెలిసి జీవింపంగ నవ్వేదిపై
    స్తవనీయంబగ వేడ్కఁజూడ బుధులున్ ధన్యంపు కృత్యమ్మగున్
    గవనమబావిరియౌచు ధార కరువై కంగారు కంగారుగా
    నవధానమ్మొనరించు వార లకటా యల్పుల్ గదా చూడగన్

    రిప్లయితొలగించండి
  7. కవనపు రణరంగమ్మున
    జవమున పద్యమ్ము లల్లు సత్క్రియ తో సం
    శ్రవమును పొందుచు ఘనమౌ
    యవధానముఁ జేయువార లల్పులె కనఁగన్.

    (అల్పులు తక్కువమంది)



    జవమున్ బద్యము లల్లుచున్ జదువరుల్ సంధించెడిన్ ప్రచ్ఛకున్
    స్తవనీయంబగు నుత్తరమ్ములనిడెడిన్ సామర్థ్యమున్ గల్గి సం
    శ్రయమున్ బొందెడు క్రీడలో గనగ కౌశల్యమ్ముతో ప్రస్తుతం
    బవధాన మ్మొనరించు వార లకటా యల్పుల్ గదా చూడఁగన్.

    (అల్పులు =అల్పసంఖ్యాకులు)

    రిప్లయితొలగించండి
  8. వ్యవధానమ్ము నొసంగక
    నవధానిని పృచ్ఛకాళి యవరోధించన్
    కవనామృతమును బంచుచు
    నవధానముఁ జేయువార లల్పులె కనఁగన్?

    రిప్లయితొలగించండి
  9. అవధానమ్మును నిర్వహించుటనగా యాటంచు నీవెంతువా
    వ్యవధానమ్ము వధాని తాఁగొనక సద్యస్ఫూర్తితో పద్యముల్
    చవులూరంగ వధానమందు వెసఁ దా సంధించగా నెవ్విధిన్
    యవధానమ్మొనరించు వార లకటా యల్పుల్ గదా చూడఁగన్?

    రిప్లయితొలగించండి
  10. కం॥ కవులన్ మేటిగ కైతల
    నవధానముఁ జేయు వారలల్లుదురు గదా
    భువిని ప్రజలు మెచ్చ నెటుల
    నవధానముఁ జేయు వారలల్పులె కనఁగన్

    మ॥ కవులన్ మేటిగ నొక్కసారిగ యనేకంబైన పూర్ణంబులన్
    జవులూరించెడు రీతిగాఁ జదువు సంస్కారమ్ముతోఁ జేయుచున్
    భువిలో నొప్పుచు నుండనెట్లనెదవో పూత్కారి సంతానమున్
    “నవధానమ్మొనరించు వారలకటా యల్పుల్ గదా చూడఁగన్”

    ఫణీంద్రరావు గారికి ధన్యవాదములు చవి కన్నడలో సవి గా చాలా యెక్కువగా వాడినా నేను చెవి యనుకున్నాను

    రిప్లయితొలగించండి
  11. కవులైన వారలెల్లరు
    నవధానులుగారు ,భాష యందున నెంతో
    నవిరళ పాటవ ముండక
    అవధానము సేయువారలల్పులె కనగన్

    రిప్లయితొలగించండి
  12. అవగాహన లేకుండగఁ
    నవధానముఁ జేయువార లల్పులె కనఁగన్
    బైవివరణ యిచ్చుట బో
    యవధానము చేతకాని యల్పుని మాటల్

    రిప్లయితొలగించండి
  13. అవధాన మ్మొనరించు వార లకటా యల్పుల్ గదా చూడఁగాఁ
    నవధానంబది చూడగానిలను మాయాజా లంబేగదా యంటివా ?
    యవధానంబులు సేయ రాక మదిని యట్లాడన్ నోరెట్లు వచ్చెంజుమీ
    యవధానంబులు సేయువారలిక దైవాంశ సంభూతు లే నేర్వుమా

    రిప్లయితొలగించండి
  14. మ.

    కవిగా నుత్పలమాల, సీసము లతో కైతల్ సమర్థించెడిన్
    స్తవముల్ పొందుచు పద్య పూరణలు స్వేచ్ఛాఛందమున్ జెప్పెడిన్
    హవణింపున్ గనుసైగతో హితులు సాహాయ్యమ్ము జేయంగనే
    *అవధానమ్మొనరించు వార లకటా యల్పుల్ గదా చూడఁగన్!*

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    వ్యవధానము లేకుండగ
    నవలీలగ పూర్తిచేయు నద్భుత ప్రతిభన్
    కవనమ్మున చూపు ఘనులు
    నవధానముఁ జేయువార లల్పులె? కనగన్.

    రిప్లయితొలగించండి
  16. ప్రవిమల మతితోసభలో
    చవులూరించెడివిధముగచక్కగనటనే
    వ్యవధానమ్మును గొనకయె
    *"అవధానముఁ జేయువార లల్పులె కనఁగన్”*?

    రిప్లయితొలగించండి