15-10-2023 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు”(లేదా...)“మోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్”
తామసించిన జనులకు తపన గలుగు,ప్రేమ జూపు వారికెపుడు ప్రియము గలుగు,మనసు లోనగలుగుచుండు మాయ నెల్లమోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
దక్కు బాపము దప్పక ధరణి యందుమేసగించిన జనులకు ,బుణ్యమబ్బుమేలు సేసిన నొరులకు మిగులు కీర్తిమానవా !నీతి ధర్మము మరవబోకు.
అక్రమమగుకార్యమ్ముల నాచరించిప్రజలధనమునుదోచెడుపాపులనిట*మోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు*ననెడివిబుధజనులమాటలాలకించు
మోహినిగ మారె దనుజులఁ మోసగింపబలిని వంచింప వచ్చెగా వామనుండుమోసమనునది వర్థిల్లు మొక్కవోకమోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు
మోసము చేయకున్నయెడ పోవును వోట్లని నమ్ముచుందురేమోసము చేయు వారలకు మోదము జక్కొను పెత్తనంబుతోమోసము చేయకున్నయెడ మోక్షపు లభ్యత రూఢికాదుగామోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్
తే॥ హంతకులఁ జోరులంబట్ట నవసరమగు నెన్నియొ కపటోపాయము లెన్నఁ గానుధర్మ సమ్మతమే యిది తరచి చూడమోసగించిన జనులకుఁ బుణ్యమబ్బుఉ॥ మీసముఁ ద్రువ్వి హత్యలను మేటిగ దొంగతనమ్ములన్ ఘనుల్రోసము తోడఁ జేయఁగను రోసిన రక్షణ పంక్తి వారలన్వేసము మార్చి వేగులుగఁ వెంటఁబడిన్ గని పట్టఁగాఁ దగున్మోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్
మరొక పూరణండిఉ॥ మోసముఁ జేసి పాండవులు ప్రోచఁగఁ గృష్ణుఁడు గెల్చిరే యనిన్వేసము వేయకుండఁగను భీష్ముఁడు ద్రోణుఁడు చచ్చువారలా!మోసముఁ జేయ పాడియగు మెచ్చును దైవము ధర్మరక్షకైమోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్
లోక కంటకు లై మహా లుబ్దు లగుచుప్రజల దోచుచు బాధించు వంచకు లనురూపు మాపియు వారి ని రో ధ మునకుమోస గించిన జనులకు బుణ్య మ బ్బు
తేటగీతిధర్మసంస్థాపనార్థము ధర్మరాజుగురువుఁ జంప నశ్వత్థామ కూలెననియుఁజిన్నగ నదికుంజరమనె! జీరి సత్తుమోసగించిన జనులకుఁ బుణ్యమబ్బుఉత్పలమాలవాసిగ ధర్మమే భువిని వర్థిల బూన్చఁగ కృష్ణమూర్తియేరోసియు మార్గమున్ గురువు ద్రోణుని గూల్చగ ద్రౌణి జచ్చెనన్భాషణమెంచి యేనుగుగఁ బల్కెను మెల్లగ, ధర్మరక్షకైమోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్
మోక్ష పథమును చూపెడి మునుల మనుచునాశ్రమాలను నిర్మించి యల్పు లెల్లదొంగ బాబాలు గా మారి దోచుకొనుచు మోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు?వాసుకి భూషణమ్ము తలపైన నభోనది యర్థ కాయమందా సతి నందయంతి గళమందున హాహల మున్న శంభుఁ విశ్వాసముతోడ నాయలరు సాయకు గొల్చి శివాంతరంగమున్ మోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్.(మోసముజేయు = దొంగిలించు)
ముచ్చట పడియు పోలేక బోయితి గద,దారి ఖర్చుల కుంచిన ధనము నంతమోసగించిన జనులకుఁ బుణ్యమబ్బుధరణి కంపించె నాడు నా స్థానమందు
మాట తీపి కల్మషముండు మనసునందుదంభకుని నైజమియ్యది తరచి చూడనెన్ని నదులందు మునిగిన నెవ్విధముగమోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు?
వేసరులై చరించి నిరుపేదల నెత్తురుఁ బీల్చి వారలన్గాసిలజేయు దుర్మతులు గాంతురు మేదినియందు దుర్గతిన్మోసఁపు కార్యముల్ విడచి ముక్తిని పొంద బరిశ్రమించునామోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్
వాసుర యందు బాపములు బాల్పడుమిక్కిలి దుష్ట కార్యముల్మోసము సేయువారలకు, పుణ్యముదక్కును శాశ్వతంబుగావాసము బూరి కొట్టులను బాధలనీడ్చుచు చేయువారికిన్గ్రాసము గట్టు బట్టలను గ్రన్ననజాలి వహించియిచ్చినన్.
తామసించిన జనులకు తపన గలుగు,
రిప్లయితొలగించండిప్రేమ జూపు వారికెపుడు ప్రియము గలుగు,
మనసు లోనగలుగుచుండు మాయ నెల్ల
మోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదక్కు బాపము దప్పక ధరణి యందు
రిప్లయితొలగించండిమేసగించిన జనులకు ,బుణ్యమబ్బు
మేలు సేసిన నొరులకు మిగులు కీర్తి
మానవా !నీతి ధర్మము మరవబోకు.
అక్రమమగుకార్యమ్ముల నాచరించి
రిప్లయితొలగించండిప్రజలధనమునుదోచెడుపాపులనిట
*మోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు*
ననెడివిబుధజనులమాటలాలకించు
మోహినిగ మారె దనుజులఁ మోసగింప
రిప్లయితొలగించండిబలిని వంచింప వచ్చెగా వామనుండు
మోసమనునది వర్థిల్లు మొక్కవోక
మోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు
మోసము చేయకున్నయెడ పోవును వోట్లని నమ్ముచుందురే
తొలగించండిమోసము చేయు వారలకు మోదము జక్కొను పెత్తనంబుతో
మోసము చేయకున్నయెడ మోక్షపు లభ్యత రూఢికాదుగా
మోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్
తే॥ హంతకులఁ జోరులంబట్ట నవసరమగు
రిప్లయితొలగించండినెన్నియొ కపటోపాయము లెన్నఁ గాను
ధర్మ సమ్మతమే యిది తరచి చూడ
మోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు
ఉ॥ మీసముఁ ద్రువ్వి హత్యలను మేటిగ దొంగతనమ్ములన్ ఘనుల్
రోసము తోడఁ జేయఁగను రోసిన రక్షణ పంక్తి వారలన్
వేసము మార్చి వేగులుగఁ వెంటఁబడిన్ గని పట్టఁగాఁ దగున్
మోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్
మరొక పూరణండి
తొలగించండిఉ॥ మోసముఁ జేసి పాండవులు ప్రోచఁగఁ గృష్ణుఁడు గెల్చిరే యనిన్
వేసము వేయకుండఁగను భీష్ముఁడు ద్రోణుఁడు చచ్చువారలా!
మోసముఁ జేయ పాడియగు మెచ్చును దైవము ధర్మరక్షకై
మోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలోక కంటకు లై మహా లుబ్దు లగుచు
రిప్లయితొలగించండిప్రజల దోచుచు బాధించు వంచకు లను
రూపు మాపియు వారి ని రో ధ మునకు
మోస గించిన జనులకు బుణ్య మ బ్బు
తేటగీతి
రిప్లయితొలగించండిధర్మసంస్థాపనార్థము ధర్మరాజు
గురువుఁ జంప నశ్వత్థామ కూలెననియుఁ
జిన్నగ నదికుంజరమనె! జీరి సత్తు
మోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు
ఉత్పలమాల
వాసిగ ధర్మమే భువిని వర్థిల బూన్చఁగ కృష్ణమూర్తియే
రోసియు మార్గమున్ గురువు ద్రోణుని గూల్చగ ద్రౌణి జచ్చెనన్
భాషణమెంచి యేనుగుగఁ బల్కెను మెల్లగ, ధర్మరక్షకై
మోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్
మోక్ష పథమును చూపెడి మునుల మనుచు
రిప్లయితొలగించండినాశ్రమాలను నిర్మించి యల్పు లెల్ల
దొంగ బాబాలు గా మారి దోచుకొనుచు
మోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు?
వాసుకి భూషణమ్ము తలపైన నభోనది యర్థ కాయమం
దా సతి నందయంతి గళమందున హాహల మున్న శంభుఁ వి
శ్వాసముతోడ నాయలరు సాయకు గొల్చి శివాంతరంగమున్
మోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్.
(మోసముజేయు = దొంగిలించు)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముచ్చట పడియు పోలేక బోయితి గద,
రిప్లయితొలగించండిదారి ఖర్చుల కుంచిన ధనము నంత
మోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు
ధరణి కంపించె నాడు నా స్థానమందు
మాట తీపి కల్మషముండు మనసునందు
రిప్లయితొలగించండిదంభకుని నైజమియ్యది తరచి చూడ
నెన్ని నదులందు మునిగిన నెవ్విధముగ
మోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు?
వేసరులై చరించి నిరుపేదల నెత్తురుఁ బీల్చి వారలన్
రిప్లయితొలగించండిగాసిలజేయు దుర్మతులు గాంతురు మేదినియందు దుర్గతిన్
మోసఁపు కార్యముల్ విడచి ముక్తిని పొంద బరిశ్రమించునా
మోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివాసుర యందు బాపములు బాల్పడు
రిప్లయితొలగించండిమిక్కిలి దుష్ట కార్యముల్
మోసము సేయువారలకు, పుణ్యము
దక్కును శాశ్వతంబుగా
వాసము బూరి కొట్టులను బాధల
నీడ్చుచు చేయువారికిన్
గ్రాసము గట్టు బట్టలను గ్రన్నన
జాలి వహించియిచ్చినన్.