5, అక్టోబర్ 2023, గురువారం

సమస్య - 4550

6-10-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పీనుఁగను రమించి జాణ పిల్లలఁ బడసెన్”
(లేదా...)
“పీనుఁగనుం రమించి కడుఁ బిల్లలఁ బొందెను జాణ వింతగన్”
(గన్నమరాజు గిరిజామనోహర్ బాబు గారికి ధన్యవాదాలతో...)

15 కామెంట్‌లు:

  1. మానుగమానవకాంతయ
    ఆనకవిజ్ఞానశాస్త్రమరసియుతానే
    పూనికధర్మమునిదియని
    పీనుగనురమించిజాణపిల్లలబడసెన్

    రిప్లయితొలగించండి
  2. తానొకదైవవంచితగదైహికవల్లభుకోలుపోవగా
    ఆనకధర్మపద్ధతినియండమువీర్యముసంగమింపగా
    పూనికతోడగర్భమునుపొందుగదాల్చెప్రయోగశాలలో
    పీనుగనున్రమించిగడుపిల్లలబొందెనుజాణవింతగన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    పీనుగువలె నగుపించెడు
    వీనికెటుల పెళ్లగునని వెటకారమునన్
    మానుగనెదగిన వరు నా
    పీనుఁగను రమించి జాణ పిల్లలఁ బడసెన్!

    ఉత్పలమాల
    పీనుగఁ బోలు రూపమని పిల్లలు పెద్దలు బాల్యమందునన్
    వీనికెటుల్ వివాహమగుఁ బిల్లనొసంగరటంచుఁ దూలిరే
    మానుగ విద్యలన్ బడసి మాన్యుడటంచును బెళ్లిఁ జేయ నా
    పీనుఁగనుం రమించి కడుఁ బిల్లలఁ బొందెను జాణ వింతగన్!

    రిప్లయితొలగించండి
  4. తానాశించకనే యజ
    మానుడు దక్కిన తదుపరి మానిని యెరిగెన్
    దాను నిరర్ధకుడని మను
    పీనుఁగను రమించి జాణ పిల్లలఁ బడసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీనుగ యంచుపిల్తురట పిన్నలు పెద్దలు మారుపేరుతో
      వానిని పెండ్లియాడుటకు భామిని యొక్కతె మొగ్గు చూపగా
      పూనికతోడనా వెలది ముచ్చట తీర్చెను జాగులేక నా
      పీనుఁగనుం రమించి కడుఁ బిల్లలఁ బొందెను జాణ వింతగన్

      తొలగించండి
  5. దీనత తో జీవించుచు
    మేనది యెద గని యతనికి మీనాక్షి గ నౌ
    మానిని తో మను వ య్యె ను
    పినుగను రమించి జాణ పిల్లల బడ సెన్

    రిప్లయితొలగించండి
  6. ఆనాడాతని గనగనె
    మానిని సంకోచ పడక మరులుగొనంగన్
    మానము విడి యా సన్నని
    పీనుఁగను రమించి జాణ పిల్లలఁ బడసెన్

    రిప్లయితొలగించండి
  7. ఏనుగు బోలిన వాడవు
    పీనుగగా మారితివని విహసింపగనా
    ప్రాణసఖునితో ననె నీ
    పీనుఁగను రమించి జాణ పిల్లలఁ బడసెన్.



    వానిది యూబకాయమట వైద్యుడు జేయు చికిత్స తోడ తే
    మ్రానుగ మారిపోయెనని మైత్రుల కూటమి గాంచి వారలే
    యేనుగు పీనుగయ్యెనని హేళన జేయ వచించె నిట్టులీ
    పీనుఁగనుం రమించి కడుఁ బిల్లలఁ బొందెను జాణ వింతగన్.

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. కం॥ మేనిని కోర్కెలు నాశలుఁ
      గానకఁ గుర్చీని యంటి కనపడు స్టీఫెన్
      జాని పతి యోగ్యుఁడని నడ
      పీఁనుగను రమించి జాణ పిల్లలఁ బడసెన్

      ఉ॥ మేనుయు కంపవాతమున మెండుగ కష్టముఁ బెట్టుచుండఁగన్
      గానకఁ గోర్కెలాశలును గాంచుచు నుండెను శాస్త్రశోధనన్
      మేనుల యైక్యతన్ జరిపి మేటిగ నాతని భార్య చక్కగా
      పీఁనుగనుం రమించి కడుఁ బిల్లలఁ బొందెను జాణ వింతగన్

      జాని భార్య (నిఘంటువు సహాయమండి)

      స్టీఫెన్ (కందము) ఆతడు (ఉత్పలమాల) Stephen Hawking, arguably the most intelligent person after Einstein n an outstanding Astrophysicist; unfortunately he didn’t get the Nobel prize. He has 3 children.

      తొలగించండి
    2. మరొక పూరణ

      ఉ॥ కానఁగ భర్తపై మనసుఁ గాంచని భార్యయు సంతుఁ గోరుచున్
      మేనును బంచి పొందఁగను మిక్కిలి దోషము గాద చూడఁగన్
      మానస హీనతన్ గనఁగ మల్లడి గల్గును దోచు నిట్టులన్
      బీఁనుగనుం రమించి కడుఁ బిల్లలఁ బొందెను జాణ వింతగన్


      మల్లడి పరితాపము (నిఘంటువు సహాయమండి)
      భారత దేశములో మగడు నచ్చక పోయినా గత్యంతరము లేక అలాగే నెట్టుకొస్తున్న భార్యల గురించి అండి

      తొలగించండి
  9. ఏనుఁగువోలె కాయమతి యేపుగ నుండఁగ నోపలేని చం
    ద్రానన కోర్కి దీర్చగనతండుపవాసఁపు దీక్ష బూన నా
    యేనుఁగు పీనుగాయె తన యీప్సితమున్ నెరవేర నెమ్మినా
    పీనుఁగనుం రమించి కడుఁ బిల్లలఁ బొందెను జాణ వింతగన్

    రిప్లయితొలగించండి
  10. ఏనుఁగులా తన కాయఁపు
    పీనమ్మును గాంచినంత బెంబేలగునా
    మానినికై జిక్కిన పతి
    పీనుఁగను రమించి జాణ పిల్లలఁ బడసెన్

    రిప్లయితొలగించండి
  11. కాననమున తిరిగెడు కౌ
    పీనుగనురమించిజాణ పిల్లలు బడసెన్
    మానిని యొప్పించుచుతా
    మానుగ నుద్వాహమాడి మహిలో గనుమా

    రిప్లయితొలగించండి