21, అక్టోబర్ 2023, శనివారం

సమస్య - 4565

22-10-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవులు ధర్మనాశకులు సంఘమ్మునందు”
(లేదా...)
“కవులన ధర్మనాశకులు గారె సమాజమునందుఁ జూడఁగన్”

15 కామెంట్‌లు:

  1. శివమనునది భ్రాంతి యనుచు జీవితమున
    సర్వ సుఖముల బొందుటే సవ్య మిలను
    ప్రాత పద్ధతి విడు మది రోతయను కు
    కవులు ధర్మనాశకులు సంఘమ్మునందు.

    రిప్లయితొలగించండి
  2. నవయుగ సృష్టికర్తలుగ నవ్యపథమ్ముకు బాట వేయుచున్
    యువతను దిద్ది తీర్తుమని యుద్ధరణమ్మది భ్రాంతి యంచు నీ
    యవనిని సౌఖ్యసాధనమె యగ్రియమంచు చెప్పునట్టి కా
    కవులన ధర్మనాశకులు గారె సమాజమునందుఁ జూడఁగన్.

    రిప్లయితొలగించండి
  3. స్వేచ్చ పేరిట‌ సంస్కృతి చెరచివేసి‌
    వింత‌ యోచనలనునింపి‌ వెగటు‌ పెంచి‌
    బేధ‌ భావంబు‌ జనులలో‌ పెంచునట్టి‌
    కవులు ధర్మనాశకులు సంఘమ్మునందు”

    సంఘ‌ హితమున‌ సాహిత్య‌ సేవచేయు‌
    కవులు‌‌ ధర్మనిరతులు‌ సంఘమ్మునందు‌
    వెర్రి‌ తనమును‌ జనులలో‌ పెంచునట్టి
    కవులు ధర్మనాశకులు సంఘమ్మునందు

    రిప్లయితొలగించండి
  4. వక్ర మార్గము జూపించు వచన కవిత
    ల వలన బెడ దారి ని బట్టు యువ త గాంచి
    పలికె నొక్కడీ రీతిని బాధ తోడ
    కవులు ధర్మ నాశకులు సంఘ మ్ము నందు

    రిప్లయితొలగించండి
  5. నవసమాజనిర్మాతలనంగభువిని
    *కవులు, ధర్మనాశకులు సంఘమ్మునందు”*
    ధర్మమునకుహానినిగూర్చుతలపుతోడ
    నియమములనుమరచుచవినీతిపనుల
    నాచరించెడివారలటండ్రుబుధులు

    రిప్లయితొలగించండి
  6. తే॥ సత్కృతులు వ్రాసి సమసమాజమనకు కృషి
    సల్పు కవులు ధర్మ పరులు కల్పనలను
    హింస నేగదోయు వ్రాతల ధ్వంసమరయు
    కవులు ధర్మ నాశకులు సంఘమ్ము నందు

    చం॥ రవమున రమ్య సౌరభము రంజిలఁ జేయచు భావ సంపదల్
    భవితను దీర్చి దిద్దుటకు ప్రాభవ మొప్పఁగఁ జూపఁ గల్గినన్
    జవిఁగొను, విప్లవమ్మనుచు చక్కఁగ హింసను బోధ సల్పెడిన్
    కవులన ధర్మనాశకులు గారె సమాజమునందుఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  7. నేడు యువకుల మనసుల నిరవధికము
    సంగమున యుక్తమగు మార్పు సలుపుటన వి
    రాగమును బెంచు కవితల రచన జేయు
    కవులు ధర్మనాశకులు సంఘమ్మునందు

    రిప్లయితొలగించండి
  8. ధర్మ రక్షణ దక్షులై దనరునట్టి
    ధన్యజీవులు సుకవులు ధరణియందు
    సంఘ విద్రోహమెసగొల్ప సాయపడు కు
    కవులు ధర్మనాశకులు సంఘమ్మునందు

    రిప్లయితొలగించండి
  9. కవులన ధర్మ రక్షకులుగారె సమాజమునందు దక్షతన్
    కవనములందు సర్వహితకారక ధర్మువు లుగ్గడించి సం
    శ్రవమగురీతి నెల్లరకు సమ్ముదముం బొనరించువారు, కా
    కవులన ధర్మనాశకులు గారె సమాజమునందుఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    సమ సమాజము స్థాపింప శపథమూని
    నేర్చినట్టి పాండిత్యము గూర్పనొప్పు
    నుగ్రవాదమ్ము రేపంగ నూతమిచ్చు
    కవులు ధర్మనాశకులు సంఘమ్మునందు

    చంపకమాల
    కవనము నేర్చి సంఘమునఁ గ్రమ్మిన జాడ్యములంతరింపఁ బా
    టవమున మేల్చికిత్సలనడంచెడు గుళ్కెల రీతి సాహితిన్
    స్తవములనందగన్ మలచ ధన్యము జన్మము! నుగ్రవాదపున్
    గవులన ధర్మనాశకులు గారె సమాజమునందుఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  11. క్రొత్తదనమని చాటుచు రిత్తదనము
    ధర్మమార్గాన్ని విడనాడి తప్పుదారి
    నడచికొరగాని రచనల నడరుచున్న
    కవులు ధర్మనాశకులు సంఘమ్మునందు

    కవనపు కర్తలైన హితకారులు సత్కవులందురే జనుల్
    భవితకు మార్గదర్శనపు బాధ్యత మోయుచుఁ వ్రాయుచుందురే
    చవుకగ కుత్సితంబరయఁ సఖ్యత త్రెక్కొనజేయు దుష్టులౌ
    కవులన ధర్మనాశకులు గారె సమాజమునందుఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి


  12. చం.

    నివురును గూడి నాస్తికులు నేర్వక మెచ్చక వేద ధర్మమున్
    దెవు లప సవ్య దిక్కు మది ధీటుగ దల్చి వితండ వాదముల్
    రవములతో విమర్శలిడి రక్షణకై చనుటన్యధర్మమున్
    *గవులన ధర్మనాశకులు గారె సమాజమునందుఁ జూడఁగన్.*

    ... డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

    రిప్లయితొలగించండి