13-10-2023 (శుక్రవారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... “మనుజున కొక భార్య మంచిదగునె” (లేదా...) “మనుజున కొక్క భార్య యన మంచిది కాదని యంద్రు పండితుల్”
కనుమరుగయ్యె శాంతి,తన కయ్యములే యిక నాదు జీవనం బను దురవస్థ వచ్చె, మరి భార్యలు పల్వురు నున్న వారలే ఘనముగ కొట్టుకొంద్రు నను కయ్యము నుంచియు కాచినట్లె గా మనుజున కొక్క భార్య యన మంచిది కాదని యంద్రు పండితుల్
ఘనమగు పాలకుల్మరియుకావ్యపుకర్తలకాలవాలమై వినయముజూపపోషకులబెన్నిధిజేరుచునుద్యమించుచున్ ప్రణవముతోడనిల్చుచుశుభంబులనెంచుచు నంకితంబుతో మనుజున కొక్క భార్య యన మంచిది కాదని యంద్రు పండితుల్ కొరుప్రోలురాధాకృష్ణ రావు
యుద్ధములు చెలరేగుచు నుద్ధృతముగ,
రిప్లయితొలగించండిపురుషులెందరొ చని పోగ మిగులు
వారు పెండ్లాడ దగుబహు భార్యల నిల
మనుజున కొక భార్య మంచిదగునె
ఆటవెలది
రిప్లయితొలగించండిసతియనంగనొప్పు షట్కర్మలొనరింప
నార్గురమరినట్టి యతివయౌచు
నటులఁగాక యామెయందున జూడగన్
మనుజున కొక భార్య మంచిదగునె?
చంపకమాల
తనరఁగ జీవితాన పతి దారయొనర్పగ నారుసేవలన్
మనవలె నామె యందుఁదగ మానినులార్గరు సౌమ్యమొప్పఁగన్
బెనఁగొన నామె యార్గురిని పెన్మిటికొప్పును గాక వారిలో
మనుజున కొక్క భార్య యన మంచిది కాదని యంద్రు పండితుల్!
గీతబోధసేయు గిరిధరునరయగ
రిప్లయితొలగించండినష్టభార్యలున్న నష్టమేమి?
నీమముచెడకుండు రామచంద్రునిరీతి
మనుజున కొక భార్య మంచిదగునె?
వనమును వీడనాడి వనవాసము దాటిన వేళ పాండవుల్
తొలగించండిపనిగొనఁ సత్యసంధ తమ పక్కము నుండగ నిబ్బరంబునన్
గొనిరట మత్స్యదేశమున కొల్వులు గుట్టుగ నొక్క భార్యతో
మనుజున కొక్క భార్య యన మంచిది కాదని యంద్రు పండితుల్
మగువ లెందరున్న మగనికేమి ఫలము
రిప్లయితొలగించండిమనుజున కొక భార్య మంచిదగునె
యనుచు నడుగ నేల ? నందరికి దెలియు
దానియందు నున్న తంటయెంతొ
మగని చిత్త మెరిగి మసల నుండ గ వలె
రిప్లయితొలగించండిమనుజన కొక భార్య :: మంచి దగునె
పలువురు సతు లున్న బాధ పడుట మిన్న
యనుచు దెలియ లేరు మనుజు లిలను
అమ్మ శాసనంబె యనుసరణీయంబు
రిప్లయితొలగించండితప్పు కాదు వినుడు తమ్ములార!
యాజ్ఞసేని యొకతె యర్థాంగి మనకింక
మనుజున కొక భార్య మంచిదగునె?
జననియె యానతిచ్చెనిక సందియ మేల? సుతుండ్ర కద్దియే
యనుసర ణీయమౌనుకద! యంగన ద్రోవది భార్యయౌ పృథా
తనయులమైన యేవురకు తల్లినియోదన ముల్లఘించుచున్
మనుజున కొక్క భార్య యన మంచిది కాదని యంద్రు పండితుల్.
చం.
రిప్లయితొలగించండివినయము నేక పత్ని రఘువీరుడు రాముని మాట త్రేతలో
ఘనముగ నష్టభార్యలకు గారమె కృష్ణుడు ద్వాపరమ్మునన్
కనకము రొక్కమున్ గలి యుగంబున శిష్టిగ సేకరించెడిన్
*మనుజున కొక్క భార్య యన మంచిది కాదని యంద్రు పండితుల్.*
కనుమరుగయ్యె శాంతి,తన కయ్యములే యిక నాదు జీవనం
రిప్లయితొలగించండిబను దురవస్థ వచ్చె, మరి భార్యలు పల్వురు నున్న వారలే
ఘనముగ కొట్టుకొంద్రు నను కయ్యము నుంచియు కాచినట్లె గా
మనుజున కొక్క భార్య యన మంచిది కాదని యంద్రు పండితుల్
॥ ఒక సతిని ధరణిని యూరడించు విధముఁ
రిప్లయితొలగించండిగనక సతమతమ్ము గాఁగఁ బదుగు
రేల వింత ప్రశ్న యేల తెలిసి యిట్లు
మనుజున కొక భార్య మంచిదగునె?
చం॥ తనకు విడాకులిమ్మనుచు దార ఘనమ్ముగఁ బోరు సల్పుటన్
వినుటయు నేఁడు మిక్కుటము వింతయుఁ గాదనిఁ దెల్సి పూరుషుల్
గనఁగను భార్య సంతసము గారముఁజూపి, యసత్య మియ్యదే
"మనుజన కొక్క భార్య యన మంచిది కాదని యంద్రు పండితుల్"
దేశ కాల పరిస్థితుల కనుగుణంగా నండి
ఆటవెలది
రిప్లయితొలగించండిధర్మబద్ధ కామ మర్మము మోక్షపు
మార్గ మిడును మహిన మానవులకు
కలియుగమ్ములోన కనగ శుభముగూర్చు
మనుజున కొక భార్య మంచిదగునె.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఇంటవెలుగు నింప యిల్లాలు చాలదా
రిప్లయితొలగించండిమనుజున కొక భార్య, మంచిదగునె
యాటబొమ్మలటుల యబలల భావించి
కొంటెతనముఁ జూపి వెంటఁ బడఁగ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఘనమగు పాలకుల్మరియుకావ్యపుకర్తలకాలవాలమై
రిప్లయితొలగించండివినయముజూపపోషకులబెన్నిధిజేరుచునుద్యమించుచున్
ప్రణవముతోడనిల్చుచుశుభంబులనెంచుచు నంకితంబుతో
మనుజున కొక్క భార్య యన మంచిది కాదని యంద్రు పండితుల్
కొరుప్రోలురాధాకృష్ణ రావు
ఘనమగు పాలకుల్బరగ కావ్యపుకర్తలు సిద్ధహస్తులై
రిప్లయితొలగించండిననయము రాజరాజులకు నక్కునజేఱుచు భావదీప్తియౌ
ప్రణవముతోడనిల్చుచుశుభంబులనెంచుచు నంకితంబుతో
మనుజున కొక్క భార్య యన మంచిది కాదని యంద్రు పండితుల్
కొరుప్రోలురాధాకృష్ణ రావు
అనవరతంబు కాపురమునందు ప్రశాంతత పాదుగొల్పగన్
రిప్లయితొలగించండిమనుజున కొక్క భార్యయన మంచిది, కాదని యంద్రు పండితుల్
యనువు సపత్ని పోరు గృహమందున శాంతి విఘాతమౌ విధిన్
పనిగొని యగ్నిఁ దూకు శలభమ్మగు జీవనమట్టి భర్తకున్
డా బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిపరమ పావ నమగు భారత దేశాన
“మనుజున కొక భార్య, మంచి దగునె”*
దాని కాల రాచి తరుణులనేకుల
పెండ్లి యాడ నెంచ వెర్రి కాదె
ఘనగుణ శాలి శాంతమును గల్గియు
రిప్లయితొలగించండిగేహము సక్కదిద్దెడున్
మనుజున కొక్కభార్యయన మంచిది ,
కాదని యంద్రు పండితుల్
కనగ ననేకమున్న గడు కష్టము
బాలగు సౌతులందున
న్ననయము బోరు జర్గుకద యా
తగవున్ భరియించ శఖ్యమే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
మన పవిత్ర సంస్కృతి ననుసరించగ
మనుజున కొక భార్య మంచిదగునె
పుడును, కాదని పలువురిని పెండ్లాడగా
నెంచ వలదు మనకు మంచి కాదు.