7, అక్టోబర్ 2023, శనివారం

విన్నపం

 కవిమిత్రులకు నమస్సులు.

కొద్ది రోజులుగా మీ పద్యాలను సమీక్షించలేకపోతున్నాను. ప్రతిరోజు సమస్యను షెడ్యుల్ చేయడంలో ఇబ్బంది లేదు. కాని మీ పద్యాలను చదివి స్పందించాలంటే 'గూగుల్ తో సైన్ ఇన్' చేయండి అంటున్నది. దానిని ఎన్నిసార్లు క్లిక్ చేసినా సైన్ ఇన్ చేయలేకపోతున్నాను. అందువల్ల మీ పద్యాలను సమీక్షించడానికి అవకాశం లేకుండా పోతున్నది. మిత్రులలో ఎవరైనా ఈ సాంకేతికమైన ఆటంకానికి పరిష్కారం చూపగలరా? 

సెల్ ఫోన్ లో ఇబ్బంది లేదు. వ్యాఖ్యలు పెట్టగలను. కాని సెల్ ఫోన్ లో టైప్ చేయాలంటే నాకు కష్టం..

4 కామెంట్‌లు:

  1. సర్, సమీక్ష ను బ్లాగులో కాకుండా, ఫేస్ బుక్ గ్రూప్ లో సమస్యాపూరణలిమ్మని, అందులోనే సమీక్షించడం తేలిక కదా.

    రిప్లయితొలగించండి
  2. వయసు రీత్యా ఎన్నో బాధ వుంటాయి గురువుగారుమీకునాకృతజ్ఞతలు మీవల్ల నేను పద్యములతోకాలక్షేపముచేస్తున్నాను మీరుసమీక్షచేయకపోయినాచేసినట్లే భావిస్తానుమీకుసహాయంచేసేపరిజ్ఞానంనాకులేదునావయసు73సంవత్సరాలుఏమీ అనుకోవద్దండి చేతులెత్తినమస్కరించుచున్నాను

    రిప్లయితొలగించండి
  3. స్వప్నమును గాంచితిననుచు శకుని తెలిపె
    నల్లుడు సుయోధనునకు నరుసమందు
    ననిని యరి భయంకరుడు నీ యనుజు డైన
    దుస్ససేను భీముఁడు గని తొలఁగె నడలి.


    రాజ్య సంపద మదమున రమణి నిట్లు
    పరిభ వించితి వీవు నీ యురవు జీల్చి
    రక్తమున్ గ్రోలెదనటంచు రట్టు జేర
    దుస్ససేను భీముఁడు, గని తొలఁగె నడలి.


    కలనే గంటి సుయోధనా! యనుచు నా గాంధారి రాజిట్టులన్
    బలికెన్ సంతసమందుచున్ జరుగెడిన్ ప్రాఘాతమున్ బాండవుల్
    నిలువన్ జాలక వెన్నుజూపగను లౌణిన్ వీడుచున్ వేగమున్
    దొలఁగెన్ భీముఁడు భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్.

    రిప్లయితొలగించండి